BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

అర్ధరాత్రి పూట మేలుకుని ఉండటం ఎవరూ కోరుకోని విషయం. అందులోనూ అంతకు ముందు రోజే ఒక అద్వితీయమైన విజయాన్నందున్నాక అలా చేయాల్సి రావటం... ఆశ్చర్యకరమే. కానీ, అద్వితీయమైన విజయమెలా వచ్చింది? ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపి, ఆ విజయాన్నందుకునేందుకు తగిన వ్యూహ రచన చేస్తేనే కదా. అలాంటి విజయాన్ని నిలబెట్టుకోవాలంటే ఎంత శ్రమించాలి? ఎంత స్మార్ట్ వర్క్ చేయాలి? 

మనిషి విజయాన్నందుకునేది భూమి మీదే (A man can hope for a victory only on Earth). చిన్నతనంలో మా తాతగారు చెప్పిన మాట. చూట్టానికి ఫూలిష్ గా ఉంది కదూ. మరొక్క సారి చూడండి. భూమి మీద మనిషి మనుగడ సాగించాలంటే అతనికి నడక ముఖ్యం.  (In order to survive, man should use his feet to run, walk, and even to fight). నడవాలంటే కాళ్ళు నేల మీద ఆనాలి. అంటే మన ఆలోచనలు గాల్లో తేలిపోకూడదు. ఆలోచనలు ఆకాశంలో, ఆచరణలు నేలబారుగా ఉంటే విజయం సంగతలా ఉంచితే చివరికి మనుగడే కష్టమయ్యే స్థితి వస్తుంది. 

అందుకే సాధించిన విజయాన్ని ఆస్వాదించేకన్నా, దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏమి చెయ్యాలనే ఆలోచనతోనే ఆ రాత్రి మేలుకుని ఉన్నాను. 

నీళ్ళ లోతెంతో తెలుసుకోవాలంటే ఒక కాలు చాలు. రెండు కాళ్ళూ పెట్టనవసరం లేదు. 

నేను దిగాల్సిన నీళ్ళు మామూలు పిల్ల కాలువ కాదు. ఒక మహా సముద్రం. ఆ సముద్రాధినేత ఒక గొప్ప వ్యూహకర్త. నాయకుడంటే అతనే అనుకునేంతలా తన జట్టును తీర్చి దిద్దుకున్న మొనగాడు. ఆ సముద్రం పేరే సౌతాఫ్రికా. ఆ నాయకుడు హ్యాన్సీ క్రోన్యే. మ్యాచ్ ఫిక్సింగని ఇప్పుడు జనానికి గుర్తున్నా, దానికి ముందు అతను ఒక సమర్ధ నాయకుడు. ప్రతిభావంతులైన ఆటగాళ్ళను గుర్తించి, వారిని సానబెట్టి ఒక గొప్ప జట్టుని నిర్మించి విజయాలను అలవోకగా సాధించటమెలాగో ప్రపంచానికి చూపిన వాడు.
***   ***   ***

జూన్ 17 1999.
ఎడ్జ్ బాస్టన్,
బర్మింగ్‍హామ్.

చీకట్లు ముసురుకుంటున్నాయి. వాతావరణం అద్భుతంగా ఉంది. చల్లని ఆ సాయంకాలం వేళ ఎవరైనా షికారుకెళ్ళాలనుకుంటారు. హాయిగా ఒక కుర్చీలో సాగిల పడి టీవీ చూస్తూ ఫామిలీతో ఆనందంగా గడపాలనుకుంటారు. కానీ నాకు చమటలు పడుతున్నాయి. ఆలోచనలన్నీ ఒక చోటే కేంద్రీకరించాలి. మరొక్క అరగంట గడిస్తే మేమింకా ఉండాలా, లాక ఇంటికి వెళ్ళాలా అని తేలుతుంది. మాకూ, విజయానికీ మధ్య ఉన్న ఏకైక అడ్డు... లాన్స్ క్లూసెనర్.

పేరు చెపితేనే బౌలర్లు వణికిపోతున్నారు. అటు బౌలింగైనా, బ్యాటింగైనా ఫీల్డింగైనా, ఒక్క ముక్కలో ఆల్రౌండరంటే నిలువెత్తు రూపం. జెఫ్రీ బాయ్‍కాట్ మాటల్లో చెప్పాలంటే ద మోస్ట్ డేంజరస్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ మన్. ఈ టోర్నీ మొదలైనప్పటి నుంచీ కేవలం ఒక్కసారే అతన్ని ప్రత్యర్థి బౌలర్లు ఔట్ చేయగలిగారు. క్రీజులో ఉండి జట్టుని గెలిపించకపోవటమన్నది లేనే లేదు. ఏ కెప్టెనైనా కోరుకునేది అలాంటి ఆటగాడినే. క్రితం మ్యాచుల్లో పాకీస్తాన్ మీద అతను ఆడిన ఆటకు కళ్ళు చెదిరిపోవాల్సిందే. 

సౌతాఫ్రికన్ అభిమానులకతను ఒక హీమ్యాన్. అతను క్రీజులోకి వచ్చేసరికి ఆ జట్టుకు ముప్పై ఒక్క బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు కావాలి. మాకు నాలుగు వికెట్లు కావాలి. షేన్ వార్న్ జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశాడు. నాలుగు వికెట్లు సాధించాడు. వివాదాస్పదమైనా హ్యాన్సీ క్రోన్యేని ఔట్ చేశాడు. క్రోన్యే స్పిన్ బౌలింగుని సమర్ధంగా ఆడగలడనే పేరుంది. అతను డకౌటవటం మాకు కొండంత బలాన్నిచ్చింది. 

                                                         మ్యాచ్ ని మలుపు తిప్పిన వార్నీ

కలిస్ లాంటి నిలదొక్కుకున్న ఆటగాడిని ఔట్ చేసి మాకు ఊపునిచ్చాడు కూడా. అరగంట పావుగంటైంది. క్లూసెనర్ తన ప్రతాపం చాటుతున్నాడు. ఇంతలో బౌచర్ ని మెక్‍గ్రాత్ బౌల్డ్ చేశాడు. వచ్చింది స్టీవ్ ఎల్వర్దీ. నిజంగా వర్దీ ప్లేయర్. సమర్థుడైన సీమ్ బౌలరే కాకుండా కాస్తో కూస్తో బ్యాటును ఝళిపించగలడు. అతన్ని అడ్డుపెట్టుకునే క్లూసెనర్ లీగ్ లో శ్రీలంకను ఓడించాడు. 

పాల్ రైఫిల్ గ్లెన్నీలు అతన్ని రనౌట్ చేయటంతో చివరి పది నిమిషాలకొచ్చింది. కళ్ళ ముందు విజయం. క్లూసెనర్ తో డొనాల్డ్. అతనో ట్రాజిక్ హీరో. విజయంపైన కాస్త ధీమా కలుగుతున్న సమయమది. అతన్ని ఆటలోకి తెస్తే మాకు విజయం ఖాయం. క్లూసెనర్ సిక్స్ కొట్టాడు. సింగిలాపితే డొనాల్డ్ బ్యాటింగ్. కానీ బౌలరెవరు? క్లూసెనర్ అనుకున్నంత పనీ చేసి క్రీజులోకి డొనాల్డ్ ని రానివ్వలేదు. ఎనిమిది నిమిషాలు. 

                                                                   క్లూసెనర్ తప్పిదం

నా ఆలోచనలు వేగంగా సాగుతున్నాయి. పాల్ రైఫిల్ క్రితం ఓవర్లో క్లూసెనరిచ్చిన క్యాచ్ ని వదిలేశాడు. నాలు అతని మెంటాలిటీ తెలుసు. ఆరోజు పొదుపుగా బౌలింగ్ చేసినా రెండు నిమిషాల క్రితం జరిగిన దాన్ని ప్రక్కకు పెట్టి జరగాల్సిన దాన్ని ఖచ్చితంగా చేయలేడు. పైగా క్లూసెనరది సొమ్ముజేసుకుంటే...  

వార్నీ ఓవర్లన్నీ ముగిశాయి. ఇరవై తొమ్మిది పరుగులిచ్చి నాలుగు అమూల్యమైన వికెట్లు సాధించాడు. గ్లెన్నీకి బౌలింగిచ్చే అవకాశం లేదు. మార్క్ కు ఆ సమయంలో బౌలింగివ్వటం (Mark Waugh to bowl means a readymade suicide attempt. He is a spinner, and an offie, Moreover, if Zulu (Lance Klusener) steps outta crease, the match will be finished in a jiffy) మూర్ఖత్వమే అవుతుంది. మిగిలింది మూడీ, డామియెన్ ఫ్లెమింగ్. 

నా ఓటు డామియెక్ కే వేశాను. 1996 world cup semi finals లో చివరి క్షణాల వరకూ విజయపు బాటలో ఉన్న వెస్టిండీస్ ని వార్నీనే దెబ్బతీస్తే, చివరి ఓవర్లో డామియనే ముంచేశాడు. (Fleming's the ice-berg for the Titanic of the Windies). అదే నాకా క్షణంలో గుర్తొచ్చింది. ఆరోజతని బౌలింగ్ ఫిగర్లు బాగా లేక పోయినా ఆ మ్యాచే గుర్తుకు వచ్చి అతనికి బంతి నందించాను. కొన్ని సార్లు సెంటిమెంట్లే మనకు కొండంత బలాన్నిస్తాయి. 

ఆరు నిమిషాలు. డామియెన్ బంతిని విసరటానికి సమాయత్తమవుతుంటే నా కళ్ళ ముందున్నది ఎడ్జ్ బాస్టన్ మైదానం కాదు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. లక్ష్మణ్ శివరామ కృష్ణన్ బౌలింగులో ఔటయ్యి వెనిదిరుగుతున్నప్పుడు నా ఆలోచనలు. ఇక ణేను ఈ స్థాయికి తగనా అని. ఏళ్లతరబడి సాధన చేసి, నా ఆటతీరును మార్చుకుని ఆస్ట్రేలియా జట్టుకు నాయకునిగా ఎదిగి విండీస్ టూర్లో దెబ్బతిని, ప్రపంచ కప్ లో గెలవందే నా కెప్టెన్సీనే కాదు. నా కెరియర్ మొత్తం డోలాయమానంలో పడుతుందే అన్న ఆలోచన. అప్పుడే నాకో ఆలోచన కలిగింది. నేను జూన్ టూ మనిషిని. (Me a June 2 man. Born on June 2. We are special. Yes. We are special). గెలుపు నాదే అని ఒక్కసారి గట్టిగా అనుకుని కళ్ళు తెరిచాను. 

నాలుగున్నర నిమిషాలు. మొదటి బంతి బౌండరీ దాటింది. క్లూసెనర్ కవర్స్ మీదుగా ఆడినా ఆ షాట్ ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. రియల్లీ సూపర్లేటివ్.

ఇక నా ఆలోచనలాపేశాను. We are special... now it's I, Steven Rodger Waugh, am special. అక్కడే నా ఆలోచనలాపేశాను. రెండో బంతి కూడా మాయమైంది ఫెన్స్ వద్దకు. అయినా నా ఆలోచన అక్కడే. ఆరు బంతుల్లో తొమ్మిది పరుగులు కాస్తా నాలుగు బంతుల్లో ఒక పరుగు. 

ఇప్పతికీ నా ఆలోచనలన్నీ ఒకే చోట ఆగి ఉన్నాయి. I am special. నా ఫీల్డర్లందరినీ సర్కిల్లోకి రమ్మన్నాను. నాకు తెలుసు క్లూసెనర్ రిలాక్స్ అయ్యాడు. డొనాల్డ్ ఏడు నిమిషాలున్నా బంతినెదుర్కోలేదు. అతను వామప్ కాలేదు. ఈ సమయంలో క్లూసెనర్ బంతిని పైకి కొట్టలేడు. ఒకవేళ కొట్టినా అది ఎడ్జ్ తీసుకుంటుంది. అమ్దుకే సర్కిల్లో ఫీల్డర్లని పెడితే చాలు.

మరొక విషయం. నా మనసులో భావాలెవరినీ చదవనివ్వను. నన్ను ఐస్ మ్యాన్ అనంటారని మీకు తెలుసు. (You know this is ice man). అలా అందరినీ ముందుకు జరిపేసరికి క్లూసెనర్లో కాస్త ఆలోచన మొదలైంది. అంత వరకూ బంతిని బ్యాటుతో మోఅటమే పనిగా పెట్టుకున్న అతను, అప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఏమాశించి నేను అలా ఫీల్డర్లందరినీ మోహరించానా అని. యుద్ధంలో ఒక్కసారిగా శతృవులు చుట్టుముడితే ఎంతటి యోధుడైనా  కంగారు పడక తప్పదు. ఒక వేళ ఆ చుట్టుముట్టిన వారు ఇంపోజింగు గా ఉంటే అతనికి పరాజయ ఘడియలు మొదలైనట్టే. నా ఆలోచన అదే. అందరినీ రిలాక్స్డ్ గా ఉండమన్నాను. డామియెన్ బంతిని విసిరాడు. మిడాన్లో లీమన్ రనౌట్ ఛాన్స్ ని మిస్ చేశాడు. కారనం రిలాక్స్డ్ గా ఉండటం. 

ఒక్క నిమిషం. ఒకే ఒక్క నిమిషం. నా కెరియర్ ని మార్చి వేసిన ఒకే ఒక్క నిమిషం. నేను లీమన్ని అలాగే కంగారు లేకుండా ఉండమని అన్నా. మార్క్ ని పొజిషన్ మార్చా. క్లూసెనర్ ఈజ్ మార్క్డ్. 

డమియెన్ బంతిని విసిరాడు. అందరూ ఊపిరి బిగబట్టారు. సరైన స్థితిలో లేని డొనాల్డ్ క్లూసెనర్ పిలుపుని అమ్దుకోలేదు. మేమప్పుడే సంబరాలను మొదలు పెట్టినంత పని చేశాము. మార్క్ ఇటు వైపు డొనాల్డ్ క్రీజుని వదలటం గమనించి ఫ్లెమింగ్ కి బంతి నందించ బోయాడు. రనౌట్ మిస్. క్లూసెనర్ డొనాల్డ్ ఒక వైపే ఉన్నారు. డామియెన్ బంతిని గిల్లీకి విసిరాడు. డొనాల్డ్ ఔట్. (Donalduckout without playing a single ball). 

                                                                     Donalduckout

సూపర్ లీగ్ లో పైనుండటం వల్ల మేమే ఫైనల్లోకి. విజయం నా ప్రేయసి. తనకు మాటిచ్చాను. నేను తన చేయందుకుంటానని. మాట నిలుపుకోవటం నా నైజం. I, Steven Rodger Waugh, am special. 

ఆ ఒక్క నిమిషమే నన్ను చరిత్రలోనే అత్యధిక విజయాలందుకున్న కెప్టెన్ గా నిలిపింది. (ఇప్పుడు రికీ ఎక్కువ గెలిచినా నాకన్నా ఎక్కువ మ్యాచులను తీసుకున్నాడు :-))

That one minute still hangs in the history. That made the Australian side formidable.

Yours Truly,

SR Waugh.

This is the silver jubilee post in B&G. Just crossed 25k mark day before yesterday. Done it in four and a half months. So, this is  a special post.


Pictures are taken from cricinfo.com

Posted by గీతాచార్య Feb 14, 2010

Subscribe here