BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


హ్మ్!
చాలారోజులైంది ఇది ఆలోచించి. ఆయనతో నా పరిచయం నా ఆలోచనా ధోరణిని క్రొత్త పుంతలు తొక్కించింది. కానీ కాస్తంత అలజడిని నాలో రేకెత్తించింది. ఏమిటీయన తత్వం. అసలు ఆ మనిషి నిజంగానే మారాడా? లేదా ఇది నాభ్రమా? లేదా మళ్ళా పరిస్థితుల్లో మార్పా?
అనంతరామ శర్మ! అసూయకి పర్యాయ పదం. ఒకసారి ఆయనతో నా సంభాషణలో నాకు అసూయ అంటే తెలియదన్నాను. సత్యాన్వేషివి కదా! అన్వేషించు. అన్నారు. ఇందాకన కూచుని అలా ఆలోచిస్తుంటే ఇదే గుర్తొచ్చింది. అప్పుడె నాలోంచీ వెలువడిందా శబ్దం.
హ్మ్!
అంతటి మహా పండితునికి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాన్నే తిరస్కరిమ్చిన వ్యక్తి, ఒక సర్వసఙ్గ పరిత్యాగి అయిన సచ్చితానంద స్వామినే మెప్పించిన ఘనుడు. పురుష సూక్తాన్నే వరుస (బాణీ) మార్చి పాడగలిగే సామర్థ్యం ఉన్న… ఆఁ అద్గదీ ఇప్పుడు దొరికారు. హుర్రే!
***   ***   ***
“నన్నే కీటింగ్ అంటాడా?” అని  వెంకట్ ముందు గర్జించిన ఆయన స్వరం నా చెవులలో ఇంకా మారుమ్రోగుతూనే ఉంది. ఒకసారి కాదు. రెండు సార్లు ప్రయత్నిస్తేనే కానీ ఆయన వాక్ప్రవాహానికి నేను అడ్డుకట్ట వేయలేని పరిస్థితి.
ధాటైన, ధీర గంభీరమైన స్వరం! అది ఒక కీటింగ్ కి ఉండునా? అంతమాత్రాన ఆయన “శంకర శాస్త్రిని Roark తో పోల్చిన ఇతను నన్ను మాత్రం కీటింగ్ తో పోలుస్తాడా!” అని గర్జించిన తీరు ఆయన మనస్తత్వాన్ని కాస్తంత లోతుగా పట్టి ఇచ్చింది. అంతటి మహా (???) పండితుడు ఎవరో ఒక పిలగాడు చెప్పిన మాటకి అంతలా బాధపడటం!!!
హ్మ్!
ఆశ్చర్యమే కదూ. నేనంతలా చెప్పగలిగానా? లేదా ఆయన నేననుకున్న ట్రాప్ లో పడ్డారా? నాకైతే మరొక క్లూ దొరికింది. (ఆ క్లూలను బట్టే నేను ఆయనకి అసూయ కలగటానికి గల కారణాన్ని కనుగొన్నాను) ఆ తరువాత నా లక్ష్యం అసూయ అంటే ఏమిటో అన్వేషించి అర్థం చేసుకుంటం. ఎందరినో అడిగాను. ఎవరూ నాకు అసూయకి మూలం ఇవ్వలేదు. అందుకే నాకు తెలిసినంతలో అసూయని డీకోడ్ చేసే పని పెట్టుకున్నాను. అ-సూ-య. చిత్రమైన మాట. దుర్యోధనుని కాలం నాటి నుంచీ ఈనాటి వరకూ ఆ అసూయ పట్టిన వారంతా పతనమే తప్ప వేరొకటి ఎరుగరు. అంత చెడ్డదా అసూయ? అవునా?
నా దృష్టిలో అసూయంటే నీకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని చూసినప్పుడు నీలో రేగే అలజడి. అవును అంతే కదా! అంటారా? కాదంటాను  నేను. ఆ అలజడిని ఎందుకు మంచి మార్గంలో పెట్టరనేదే నా అనుమానం. నాకున్న పెద్ద డౌట్. నీకన్నా గొప్పవారిని చూసినప్పుడు చేతనైతే వారిని మీంచేలా ఎదగాలనుకోవాలి కానీ వారిని ఎందుకు దెబ్బతీయాలని అనుకోవాలి? ధర్మరాజుని, పాండవులని చూసి దుర్యోధనుడు ఎందుకు అసూయ పడ్డాడు? అదే పాండవులని మించి ఎదిగి (వ్యక్తిత్వంలో), ఒదిగి (మనిషిగా) పెద్దలనీ, ప్రజలనీ మెప్పించేందుకు తన తెలివితేటలనీ, సమయాన్నీ, వనరులనీ వెచ్చిస్తే? భారత యుద్ధమే జరిగేది కాదేమో! అంటే చరిత్రగతిని అసూయ మార్చేసింది.
హ్మ్!
“అంత శక్తివంతమైనదా అసూయ?” అనుకున్నాను. ఇంకా నా అన్వేషణలో మునిగాను. ఒక మిత్రుని అడిగితే తగు మాత్రమైన సమాధానం చెప్పి, అది… Anthropological కారణాలు కూడా ఉన్నాయని చెప్పగా నేనాశ్చర్యపోయాను. అంటే మనిషి మూలంలోనే అసూయ కూడా ఉన్నదా? అని నాకు తట్టిన ఒక మాట. అది నిజమో కాదో? valiDO కాదో నాకు తెలియదు. నీకన్నా పైవారిని చూసి నీకు కలగాల్సిన భావన వారిని మించి ఎత్తుకి ఎదగాలనే కోరిక. అదే వారినణిచేసి నీ పైచేయిని చూపుకోవాలనుకోవటం నీ ఫూలిష్నెస్. నాలుగడుగులు వెనుకకి వేయడమే. నీ నిజమైన ఎదుగుదలని నీవే కుంచింపజేసుకోబూనడం. ఒకరు పతనమైన తరువాత నీవెంత గొప్పవానివైనా, ఆ గొప్ప అసలైన పోటీదారు లేనిదే రాణించదు. మొన్న ఫ్రెంచి గెలిచినFederer లా. (Federer అసూయా పరుడు కాదు. నాడల్ లేనందువల్ల అతని విజయాలకి మచ్చలేకున్నా నాడల్ లేడు అనే భావన మాత్రం అలాగే ఉంటుంది). నాడల్ ఉంటే అనే ప్రశ్న అందరి మదిలోనూ. వింబుల్డనులోనూ అంతే. ప్రత్యర్థిని మించి ఎదగటమే విజేత లక్షణమే కానీ, ప్రత్యర్థిని పడగొట్టి, నీకన్నా క్రింద పడేలా చేసి, లేదా ప్రత్యర్థిని రూపు మాపి, నీవు ఎదగక నేను గెలిచాననుకోవటం… చేతగాని తనానికి పరాకాష్ట. అందుకే ఆయన పీటర్ కీటింగ్. తనకి ప్రత్యర్థి లేకుండా చేసుకోబూనాడు కానీ తాను ఎదగాలనే ఆలోచనని వదిలేశారు.
***   ***   ***
గంగాధారానికి, అనంతరామ శర్మకీ మౌలికమైన భేదం నాకు అవగతం అయింది. అదే… “సంగీతమే ప్రపంచం Vs ప్రపంచమే సంగీతం”
ఎలా?
మళ్ళా కలుద్దాం!
హ్మ్!
అసూయా అనసూయత్వం… హహహ

Posted by గీతాచార్య Sep 16, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!