బుక్స్ అండ్ గాళ్‍ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలు బ్లాగు కాదు. ఒక బ్లాగోజినా (Blogozina. Actually Blogozine = Blog + Magazine = Blogozine. But we are fans of the Mandriva Linux, and we named it a Blogozina).
ఇంతవరకూ కేవలం ఒక బ్లాగ్ లాగా నడిచినా magazine కావలసిన లక్షణాలన్నీ దీన్లో కాస్తో కూస్తో ఉన్నాయి. కొందరు ప్రముఖ బ్లాగర్ల చేత వ్రాయించి ప్రచురించిన వ్యాసాలకి బాగా స్పందన వచ్చింది. పుస్తక పరిచయాలు, సరదా విషయాలు, సరదా సంఘటనలూ. మేము నేర్చుకున్న విషయాలు, ఇలా ఎన్నో విషయాలను మా వీలుననుసరించి అందిస్తూ వచ్చాము.
ఇక ముందు కాస్తంత ప్రొఫెషనల్‍గా మరింత చక్కని సమాచారంతో ముందుకు రావాలని పూర్తి magazine గా మల్చే ప్రయత్నంలో వీవెన్ గారిని మా బ్లాగుని webzines జాబితాలో చేర్చమని అడిగితే అలాగే చేర్చారు. అందుకు వీవెన్ గారికి బ్లాగోజినా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఇంతకు మునుపు తెలిపినట్లుగానే ఏరోజుకారోజు విభజించుకుని సమాచారాన్ని అందిస్తాము.
సోమ వారం నాడు సంగీత సాహిత్య అంశాలను, బుధవారం నాడు కళా రంగానికి సంబంధించిన వ్యాసాలు, నా original fiction/articles శుక్రవారం నాడు entertainment క్రింద సినిమా, ఇతర విశేషాలు (వీలుంటే కొత్త సినిమా రివ్యూ/పాటల రివ్యూ), శని వారం నాడు... మా నాన్న గారు అందించే ఆధ్యాత్మికాంశాలు, Dhanaraj Manmadha, నేను అందించే Open source విశేషాలు, అలాగే వారం మార్చి వారం, మా MOTORCYCLE DIARIES, ఏవైనా మిగతా విభాగాలలో మిగిలిన అంశాలనిస్తాము.
ఆదివారం ఆటల మీద ప్రత్యేక విశ్లేషణలు, రాజకీయ సామాజిక విశేషాలు మొదలైనవి. అవసరమైతే, ఆ సందర్భానికి తగిన వ్యాసం అందకపోతే ఆరోజు ఏ వ్యాసం వేయకుండా ఆపుతాము కానీ, వీలైనంతలో there won't be any crap.
అందరికీ దీపావళి, శుభాకాంక్షలు.