BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

ఔచిత్య స్థాపన గురించి ఏ శ్రీధర్ (క్షీర గంగ బ్లాగర్, ప్రముఖ రచయిత) గారు ఒక వ్యాసాన్ని అందించారు.  వీరి బ్లాగులో పౌరాణిక అంశాల గురించి విలువైన సమాచారాన్నందిస్తున్నారు

***   ***   ***

 ఔచిత్య  స్థాపనని  (జస్టిఫికేషన్మానసిక  బలహీనత  అని   ఉదహరించడం  ఏమైనా  బాగుందా? పిచ్చి పట్టిందా! అని భ్రమించకండి. ఈ ఉదాహరణ ని  గమనించండి.
                               
ఒక  వనమంత్రిరాజ్యంలోని ఒకానొక  సురక్షిత  వన  ప్రదేశానికి  నిరీక్షణకి (షికారుకి) వెళ్లాడుఆ  క్షేత్ర వనాధికారి అతనికి అన్ని సదుపాయాలు  చేసాడు. గెస్టు హౌస్ లోని  గదులన్నీ అందంగా అలంకరింప బడ్డాయి. రాత్రి  విందుకి ఎన్నో  కోళ్లు’  బలికాబడ్డాయి. మంత్రిగారికి  అతనితో  వచ్చిన బలగానికి విదేశీ  మద్యం  సరఫరా చేయబడింది మర్నాడు  తెల్లవారి  అల్పాహారంతో  పాటు  టీఇవ్వడం  జరిగింది. మంత్రిగారు  బయలు  దేరే  ముందు  వనాధికారిని  బిల్  అడిగాడు.
                               
వనాధికారి  స్తబ్థుడయ్యాడు.  “” అదేమిటి  సార్అలా  అడుగుతారుబిల్  మీరు  పే  చేయడం ఏమిటి సార్? మీ సేవలో ఏదైనా పొరపాటు జరిగితే  క్షమించండి  సార్ !......”  అంటూ  నీళ్లు  నమిలాడు.
                           
 ఆ  నసుగుడు  చూసి  మంత్రి గారికి  కోపం వచ్చింది. " ఏం ? వేషాలేస్తున్నావా? రాత్రి  విందుకి  మందుకి బిల్ తీసుకోకుండా నన్ను కొనేద్దామనా ! నీ  ఉద్దేశం? “ అంటూ  కేకలేసాడు.
                             
వనాధికారి  చిక్కులో పడ్డాడు. “అవేం మాటలు సార్ నేను చేసినది అతిధి మర్యాద  సార్ !”
                               
నో ! నీకు  అది  అతిథి మర్యాదే  కావచ్చు ! కాని  చూసేవారికి  లంచం  తీసుకొన్నట్లు ఉంటుందివెళ్లి  బిల్  ఫట్టుకుని  రా !”
                             
వనాధికారి ఇరకాటంలో  ఫడిఫోయాడు. బిల్లు నిజంగానే ఇస్తే  తన  భవిష్యత్తు ఏమవుతుందని ఇంకో  దిక్కుమాలిన  అడవికి  బదిలీ  ఖాయం ఈ  అడవి కాస్తలో కాస్త  నయం ! ఇఫ్ఫుడీ  ఆఫద నుంచి ఎలా  తఫ్ఫించుకోవడం? పాలుపోలేదు. అతని  అవస్థ  కనిపెట్టిన  ముసలి  వాచ్ మేన్  ఉపాయం  చెఫ్ఫాడు.
                       
మంత్రిగారికి  బిల్ ఇవ్వడం  అయిందిఅతనికి, అతని బలగానికి  కలిపి  ఉదయం  త్రాగిన టీ  ఖర్చు అయిదున్నర  రూపాయలు( ఫదకొండు  మందికి).
                           
 అంతే ! ఔచిత్యం  స్థాపిత మయిపోయిందిమంత్రి గారు  బిల్ ఇచ్చేసి  వెళ్ళి పోయారు. అలాంటి ఔవిత్య  స్థాపన  ద్వారా వనాధికారి  మానసిక  బలహీనత  బయపడలేదూ !!  దీన్ని మానసిక  రోగం  కాదంటారా??
                             
జీవితంలో  ఎదురైన  వైఫల్యాలని  తమ ప్రయత్నలోపం వల్లనేనని  బహుకొద్ది మంది మాత్రమే ఒఫ్ఫుకొంటారు. తక్కిన  వారు జ్యోతిష్కులను  ఆశ్రయిస్తారు. జ్యోతిష్కుడు  యజమాని పక్షాన్నే  సమర్థిస్తాడు .మీరేం  చేయగలరు  సార్ఇదంతా  ఏల్నాటి  ఫ్రభావం అంటూ అంతే!! ఔచిత్యం  స్థాపితమయి ఫోతుంది. తప్పంతా,’ శని   మీదకి  నెట్టి  మనని మనం   సమర్థించుకోవచ్చు.
                           
ప్రేమలో కూడ ఆడపిల్ల ఇలాంటి   ఔచిత్యాన్నే  కోరుకొంటుంది. ఎలాంటి  ఫూర్వ పరిచయం  లేకుండా  తనతో  సరసమాడడానికి ఫ్రయత్నంచే కుర్రాడిని ఆమె  చీదరించుకొంటుంది. మెల్లగా పరిచయాన్ని  పెంచుకొని   ఆమెని గాఢంగా ప్రేమిస్తున్నానని ఆమె  లేనిదే  జీవితం  వ్యర్థమని   అన్న  వ్యక్తికి  తన  సర్వస్వం  సమర్పించుకొంటుంది.
                           
 పరీక్షలో  ఫెయిల్  అయిన  విద్యార్థి   ఆ సంవత్సరం  పేపరు  చాల కష్టంగా  ఇచ్చారని, తనే  కాక ఎంతోమంది  తెలివైన  విద్యార్థులు  ఫెయిల్   అయ్యారని  చెప్తాడు. ఇంట్లో   అమ్మానాన్న  అంతా  నమ్ముతారుఎందుకంటే  ఔచిత్యం  స్థాపితమయింది  కదా!!
                             
పేదవాని ఔచిత్యం  అందరికీ  తెలిసిందేనేను  నిరుపేదని  కావచ్చుధనానికి  పేదని  గాని గుణానికి  కాదు”  అన్న  భావనే అతని ఓదార్పు, అక్కడికి  ధనవంతులంతా  గుణహీనులయినట్లు!
                             
ఇకపోతే  రాజకీయాలలో ఈ ఔచిత్యం ఇంకా  స్ఫష్టంగా  కనిపిస్తుంది. పాలకపక్షం  వాళ్లు  తమ  నిష్క్రియతని  ప్రతిపక్షం  మీద    ప్రతిపక్షంవారు   పాలకపక్షం    మీద   ఔచిత్యస్థాఫన   చేసుకొంటూ   పోతారు.
                           
ఇఫ్ఫుడేమంటారు?! ఔచిత్యమనేది  మన  నిత్య జీవితంలో ఒక  మానసిక  రోగంగా  పరిణామం  చెందుతోందని   అంగీకరిస్తారా??

Posted by గీతాచార్య Jan 6, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!