BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


పాటలు , వీడియోలు ప్లే అవడం లేదా??
లినక్స్ లో Applications>Sounds & Video విభాగంలో ఉండే Movie Player, Rhythm box Music Player అనేవి MP3 పాటలను, MPEG వీడియోలను డీఫాల్ట్ గా ప్లే చెయ్యలేవు. అందుకే ఉబుంటు ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మొట్టమొదట మీరు చెయ్యవలసిన పని System మెనూలో Administration>Synaptic Package Manager లో వెళ్లి Quick Search అనే బాక్స్ లో vlc అని టైప్ చేయండి. దాంతో క్రింద VLC పేరిట పలు ఎంట్రీలు వస్తాయి. మొదటిదాన్ని ఎంచుకుని Select for apply అనే బటన్ ని క్లిక్ చేయగానే ఆ క్రిందనే ఉన్న దాని ప్లగ్ ఇన్‌లు కూడా ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు పైన ఉండే Apply అనే బటన్ ని క్లిక్ చేస్తే VLC డౌన్ లోడింగ్ మొదలవుతుంది. తర్వాత ఇన్ స్టాల్ అవుతుంది. ఒకవేళ ఈ పద్ధతిలో VLC ఇన్ స్టాల్ అవకపోయినట్లయితే Applications>Accessories>Terminal ఓపన్ చేసి క్రింది కమాండ్లు ఒకదాని తర్వాత ఒకటి వాడండి.
sudo apt-get update
sudp apt-get install vlc vlc-plugin-esd mozilla-plugin-vlc
రెండవ కమాండ్ వాడినప్పుడు 48 MB డిస్క్ స్పేస్ అవసరం అవుతుంది. కంటిన్యూ అవుతారా లేదా అని అడుగుతుంది. Y కొట్టండి. దాంతో VLC ప్లేయర్ డౌన్‌లోడ్ చెయ్యబడి ఇన్‌స్టాల్ చెయ్యబడుతుంది. ఇక ఇప్పుడు ఏ ఆడియో, వీడియో ఫైళ్లనైనా VLC ప్లేయర్ ఆధారంగా ప్లే చేసుకోవచ్చు.
WMA, WMA ఫైళ్లు ప్లే అవ్వాలంటే...
పైన మనం చెప్పుకున్న VLC ప్లేయర్ ద్వారా కేవలం MPEG, AVI, DivX వంటి ఇతర ఫార్మేట్లకు చెందిన ఫైళ్లు మాత్రమే ప్లే అవుతాయి. మైక్రో సాఫ్ట్ సంస్థ స్వంత codecs అయిన WMV, WMA ఫార్మేట్లకు చెందిన ఫైళ్లని ప్లే చెయ్యాలంటే కొడెక్ లను క్రింది విధంగా ఇన్ స్టాల్ చేసుకోండి.
స్టెప్ 1: టెర్మినల్ లో sudo gedit/etc/apt/sources.list అనే కమాండ్ ని టైప్ చెయ్యగానే టెక్స్ట్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఫైల్ చివర్న క్రింది లైన్లు టైప్ చేసి Save బటన్ ప్రెస్ చేయడం ద్వారా సేవ్ చేయండి.
deb http://archive.ubuntu.com/ubuntu jaunty universe multiverse
deb-src http://archive.ubuntu.com/ubuntu jaunty universe multiverse రెండూ వేర్వేరు లైన్లుగా ఉండాలి.
స్టెప్ 2: తర్వాత టెర్మినల్ లో sudo apt-get update టైప్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు ళ్లీ టెర్మినల్ లో sudo wget http://medibuntu.org/sources.list.d/jaunty.list-output-document=/etc/apt/sources.list.d/medibuntu.list అనే కమాండ్ ని ఉన్నది ఉన్నట్లు టైప్ చేయండి.
స్టెప్ 4 : తర్వాత మళ్లీ అదే టెర్మినల్ లో sudo apt-get install medibuntu-keyring అనే కమాండ్ ని టైప్ చేసి వెంటనే sudo apt-get update వాడండి.
స్టెప్ 5 : ఇప్పుడు చివరిగా టెర్మినల్ లోనే sudo apt-get install w32codecslibdvdcss2 అనే కమాండ్ ని టైప్ చేసి ఫలానా మొత్తంలో డిస్క్ స్పేస్ అవసరం అవుతుంది అని అన్నప్పుడు Y ప్రెస్స్ చేయండి. దీంతో WMV, WMA కొడెక్ లు కూడా ఇన్ స్టాల్ ఐపోయి ఇకపై VLC ప్లేయర్లో అవీ ప్లే అవుతాయి.
RAR ఫైళ్లు ఓపెన్ అవడం లేదా??
ఉబుంటు ఇన్ స్టాల్ చేసిన తర్వాత సహజంగా అందరూ ఎదుర్కొనే సమస్య RAR ఫైళ్లు ఓపెన్ అవకపోవడం. దీనికి గాను unrar అనే చిన్న ప్రొగ్రాం ని ఇన్ స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. Applications>Accessories>Terminalని ఓపెన్ చేసి sudo apt-get install unrar అనే కమాండ్ ని టైప్ చేసి ఎంటర్ కొట్టిన వెంటనే పాస్వర్డ్ తెలుపమని అడుగుతుంది. మీ పాస్వర్డ్ ఎంటర్ చెయ్యండి. దాంటో unrar ప్రోగ్రాం ఇన్ స్టాల్ చెయ్యబడుతుంది.
Youtube వీడియోలు చూడలేకపోతుంటే...
ఉబుంటులో ఉండే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ద్వారా నెట్ ని బ్రౌజ్ చేస్తున్నప్పుడు Youtube వంటి సైట్లలోని ఫ్లాష్ వీడియోలు, ఇతర సైట్లలోని ఫ్లాష్ ఏనిమేషన్లు వంటివి ఏమీ ప్లే అవకుండా Missing plugin అనే మెసేజ్ పైన కనిపిస్తున్నట్లయితే Install అనే బటన్ ని క్లిక్ చేయండి. వెంటనే వెబ్ సైట్లలోని ఫ్లాష్ ఫైళ్లని ప్లే చెయ్యగలిగే అందుబాటులో ఉండే వేర్వేరు ప్లగిన్ల వివరాలు వెదకబడి చూపిస్తుంది. అందులో ఏదైనా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ప్లగిన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ అయ్యాక ఫ్లాష్ వీడియోలు, ఇతర ఫ్లాష్ కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది.

Posted by జ్యోతి Mar 20, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!