BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

గమనిక: ఇది నేను వ్రాసుకుంటున్న నవలకి సంక్షేప రూపం. నవలంతా టెక్నికల్ గ సరిగ్గా ఉన్న, ఇక్కడ మాత్రం కొన్ని లోపాలు దొర్ల వచ్చు. మీ అందరి సలహాలు, సూచనలు నాకు విలువైనవిగా భావిస్తాను. నచ్చితే ఒక చిన్న వ్యాఖ్య వ్రాసి ప్రోత్సహించమని  మనవి :-) సంక్షేప రూపం కనుక కొన్ని చోట్ల అబ్రప్ట్ గా ఉండవచ్చు.

మిసెస్ ప్రేమా నిరంజన్ డైరీలో ఒక రోజు (పదకొండు వారాల క్రితం)


ఇవాళ నిరంజన్ ఫ్రెండ్ ఎరేంజ్ చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి వెళ్ళాము. ఆ పెయింటర్ పేరు రామ్ విలేఖరి. రంగుల కలగా పులగం, అర్థం పర్థం లేని ల్యాండ్ స్కేపులూ కాకుండా జీవం ఉట్టిపడేలా ఉన్నాయతని పెయింటింగ్స్. పల్లె వాతావరణం, జంతువులూ, పక్షులూ, పారే నది మీద పడవ వాళ్ళూ, నూలు ఒడికే ముసలమ్మలూ, ఇంకా, నాకు వివరించటం కుదరటం లేదుగానీ, అద్భుతాలనావిష్కరించాడా పెయింటర్.


అందులో ఒక పెయింటింగ్ మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది. అది ఒక తల్లీ బిడ్డా ఉన్న పెయింటింగ్. అది కూడా నెట్లోనో, మరో గ్రీటింగ్స్ లో ఉన్నట్లు ఎక్కడో తెలియని చోట కాదు. లేదా ఊహా లోకంలో కాదు. ఒక పచ్చని పల్లెటూరు. అందులో ఒక ఇంటి ముందు అరుగు. చుట్టూరా తోట. ఒక ఆల పాక. దానికెదురుగా ఆ అరుగు. దాని మీద ఒక స్త్రీ కూచుని ఉంది. ఆమె ఒళ్ళో బిడ్డ. చాలా అందంగా ఉన్నారిద్దరూ. పరిసరాల్లో కలిసిపోయినట్లు. అక్కడక్కడా చెట్ల మీద పక్షులు.


బిడ్డను తన గుండెల్లో పొదువుకుని ఉందామె. తల్లి వైపు నవ్వు మొహంతో చూస్తున్న బిడ్డ. ఎంత సహజంగా ఉందో! ఇద్దరూ వేరేదో లోకాల్లో ఉన్నట్లున్నారు. వర్ణించనలవిగాని భావమేదో ఆ పెయింటింగ్ లో ఉంది. నాకు వెంటనే పుష్కర గుర్తొచ్చింది. అప్రయత్నంగా చిరునవ్వొకటి నా మోముపైన మెరిసినట్లనిపించింది. మరుక్షణమే కంట చెమ్మ. పుష్కరను చూసి ఎన్నాళైంది? వెళ్ళి అప్పుడే నాలుగు నెలలు దాటింది. అంతకు ముందు ఎనిమిది నెలలు పైన చూడలేదు. ఎంతసేపూ, నేనూ, నా పనులూ, ఆఫీస్, ఆఫీస్, ఆఫీస్. నిరంజన్ తో పోటీ పడుతూ, ఉరకలు పరుగులు పెడుతూ అలా అలా అలా. హ్మ్!


ఇంక అక్కడ ఉండలేక ఇంటికొచ్చేశాను నిరంజన్ కి ఇవాళ ఆఫీస్ కి రానని. నా బిడ్డ పైన గాలి మళ్ళింది. రోజంతా ఆ ఆలోచనలలోనే గడిచిపోయింది. సాయంత్రానికి ఒక నిర్ణయాని కొచ్చాను. కొన్నాళ్ళీ పని జీవితానికి స్వస్తి పలకాలని. అందుకనే నిరంజన్ని తొందరగా రమ్మని కాల్ చేశాను. తను దాదాపుగా నా మాట కాదనడు. ఇప్పుడూ వస్తానన్నాడు. నా నిర్ణయాన్ని తనకి తెలపాలని. తను నా మనసుని అర్థం చేసుకుంటాడని నాకు తెలుసు. ఇంతకీ నా నిర్ణయం ఏమిటో చెప్పనే లేదు కదూ! మళ్ళా అమ్మనవాలని.
***   ***   ***


ద స్పెర్మ్ మారథాన్ (ఎనిమిది వారాల క్రితం)


హేయ్ గయ్స్. నా పేరు టెస్టికిల్. తెలుగులో వృషణం అంటారు. ఇవాళ ఇక్కడ పెద్ద పండగ జరగబోతోంది. ఇవాళ ద స్పెర్మ్ మారథాన్. అంటే మీకు తెలియదా? ఇక్కడ ఉన్న కొన్ని మిలియన్ల స్పెర్మ్స్ ఒక సృష్టి కార్యాన్ని సుగమం చేయటానికి సమాయత్తం అవుతున్నాయి. మారథాన్ వీరులందరూ తమ తమ ఐడెంటిటీ నంబర్లని తీసుకుని రెడీ అయి ఉన్నారు. ఇంకాసేపట్లో వీళ్ళందరూ ప్లే గ్రౌండ్ లోకి విడుదల చేయబడతారు. వీళ్ళందరి లక్ష్యం ఒకటే రిలీజ్ అయినప్పటి నుండీ అలుపెరుగక పరిగెత్తి, మారథాన్ లక్ష్యమైన ఓవమ్ రాకుమారిని చేరాలి. తద్వారా మిసెస్ ప్రేమా నిరంజన్ కోరుకున్న విధంగా ఆమె మరోసారి తల్లి అయ్యేలా సాయ పడాలి.


ఇక్కడ నా పనల్లా ఆ స్పెర్మ్ లందరూ సరిగ్గా విడుదలయ్యేలా చేయాలి. ఆ మారథాన్ని నేను కంట్రోల్ చేయలేక పోయినా స్పెర్మ్ ప్రొడ్యూసర్గా నా బాధ్యతల్లా ఆ స్పెర్మ్స్ అందరూ సక్రమంగా మారథాన్లో పాల్గొని తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పటమే. అందుకే అందరినీ ఒక్కసారి సమావేశ పరిచాను.


"గయ్స్! ఇవాళ పెద్ద పండగ మనకు. ముఖ్యంగా మీకు. మనకున్న, అందిన సంకేతలను బట్టీ ఇవాళ స్పెర్మ్ మారథాన్ లక్ష్యం నెరవేర బోతున్నది. మీరంతా సక్రమంగా మారథాన్లో పాల్గొని, లక్ష్యాన్ని సక్రమంగా సాధించాలనీ, తద్వారా మిసెస్ ప్రేమా నిరంజన్ని తల్లిగా మారేలా సాయ పడాలనీ కోరుకుంటున్నాను. మీరు మిలియన్ల సంఖ్యలో ఉన్నా, మీలో ఒక్కరే లక్ష్యాన్ని చేరగలరని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆ లక్ష్యాన్ని చేరేది మీలో ఉన్న బెస్ట్ స్పెర్మ్ అయి ఉండాలని నా వాంఛ. ఆల్ ద బెస్ట్ గయ్స్. ఇంకాసేపట్లో మీరంతా మారథాన్ స్టేడియంలోకి పంపబడతారు. గెట్ రెడీ.


స్పెర్మ్స్ అందరూ చాలా ఉత్సాహంగా మారథాని కి సమాయత్తమవుతున్నారు.


ఇంకాసేపట్లో మారథాన్ మొదలయింది. ఒక్కొక్కరే ఒక్కొక్కరే తమ తమ పరుగునారంభించారు స్పెర్మ్స్. వారందరి లక్ష్యమల్లా ఓవమ్ రాకుమారిని చేరతమే. ఆ పైన జరిగేది స్పెర్మ్స్ చేతిలో ఉండదు. ఓవమ్ రాకుమారిని చేరాక జరగేది భగవంతుని చేతుల్లోనే ఉంటుందా? అప్పుడే కొన్ని స్పెర్మ్స్ చనిపోయాయి. కొన్ని చేరలేక సాగిల పడ్డాయి. మిగిలినవన్నీ తమ శక్తిని కూడగట్టుకుని తమ లక్ష్యమైన ఓవమ్ రాకుమారి వైపు దూసుకుని పోతున్నాయి. వారందరిలో స్పెర్మ్ నంబరు 69696969 బాగా వేగవంతంగా, శక్తివంతంగా ఉన్నాడు. మరి అతనే గెలుస్తాడేమో ఈ మారథాన్.
***   ***   ***
2
నేనిప్పుడే పుట్టానని నాకు సంకేతాలందాయి. చూద్దామంటే కళ్ళు లేవు. విందామంటే చెవులు లేవు. నడుద్దామంటే కాళ్ళు లేవు. ఈదే ప్రయత్నమైనా చేద్దామంటే చేతులూ లేవు. అసలు నాకు ఏమి ఉన్నాయో ఏమి లేవో కూడా తెలియటం లేదు. అలా ఎక్కడో తేలుతున్నట్టు అనిపిస్తున్నది. అసలింతకీ నేనెవరిని? నా పని ఏమిటి? ఎలా వచ్చాను? ఎక్కడున్నాను? తెలుసుకోవాలి. కానీ ఎలా?

(ఏమైందో మళ్ళా చెపుతా) 

Posted by గీతాచార్య Apr 20, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!