BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

ఈమధ్యే సాహితి బ్లాగు ద్వారా బ్లాగంతర్జాలంలో మహిళలంటూ చాలా శ్రమ తీసుకుని మహిళా బ్లాగులన్నింటినీ ఒక్క చోటజేర్చిన మన సాహితీ మాల గారు, B&G కి మొట్టమొదటి గెస్టాథరు. బుడుగుతో అనుబంధం అంటూ ఇక్కడ మాచేత శుభారంభం చేయించిన మాల గారు చాలా రోజుల తరువాత మరో పుస్తక పరిచయం చేస్తున్నారు.ఈ మధ్య బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కు నవల ల పరిచయము రాయటము మొదలు పెట్టినప్పటి నుండి , పాత , తెలుగు నవలల ను గుర్తు తెచ్చుకొని వెతకటము మొదలు పెట్టాను . అందుకె యెం ఎస్ కో లో మెంబర్ షిప్ తీసుకుంటే పాత నవలలు దొరుకుతాయేమో అనే ఆలోచన వచ్చింది . ఎలాగా అనుకుంటూ వుంటే ఆ మధ్య జరిగిన బుక్స్ ఎక్జిబిషన్ లో యంస్ కో వారి స్టాల్ కనిపించింది . వెంటనే కొన్ని నవలలు కొనేసి , మెంబర్ షిప్ తీసుకున్నాను . వారి పంపిన మొదటి కేటలాగ్ లోనే , ఆనందారామం రాసిన , శారద ( నానృషి: కురుతే కావ్యం ) కనిపించింది . వావ్ దీనికోసం ఆన్ లైన్ లో కూడా వెతికాను దొరకలేదు . ఇప్పుడు చిక్కింది అనుకొని వెంట నే తెప్పించి , అంతకన్నా వేగం గా చది వేసి , ఇదిగో రెవ్యూ రాద్దామని సెటిల్ ఐపోయాను .


శ్రీమతి డాక్టర్ . సి . ఆనందారామం గారి నవల ల లో , ఎక్కువగా మధ్యతరగతి జీవన శైలి ప్రతిబింబిస్తుంది . లెక్చరర్ కావటము మూలం గా నేమో చాలా వరకు కారెక్టర్ ల మనస్తత్వం గురించి ఆలోచింప చేసేలా రాస్తారు . అరే ఇలాంటి వారిని చూసామే అనుకుంటాము . ఈ  "శారద" నవల ఒక అందమైన , మధ్య తరగతి అమ్మాయి ఆశల ఆరాటము గురించి . శారద , ఆయా సంధర్భాలను బట్టి , గుణం గానూ , దోషం గాను , కూడా పర్యవసించే ఉద్రేకశాలి . విపరీతమైన అహం ! తన సౌందర్యానికి అష్టైశ్వర్యాల లో తులతూగే ఆ రాత సహజం గానే వుందని ఆమె నమ్మకం . అందరూ తనను రచయిత్రి గా గుర్తించాలి , జగమంతా తనను ఆరాధించాలి , ప్రతిఒక్కరూ తన ప్రతిభకు ముగ్ధు లవ్వాలి , ఇలా పగటి కలలు కనే రచయిత్రి , శారద .


ఉన్న దానిలో తృప్తి పడేవాడు , చెల్లెలి భవిష్యతు కోసము పాటు పడేవాడు , బలమైన వ్యక్తిత్వం కలవాడు , మనోభావాలను గుప్తంగా దాచుకొని , సభ్యత ఉట్టిపడేలా ప్రవర్తించే , సంస్కారవంతుడు రావ్ . సాధారణం గా వినిపించే ప్రేమ కథలకు భిన్న మైనది రావ్ , శారదల ప్రేమ కథ . శారద తప్పనిసరై రావ్ ను వివాహం చేసుకోవలసి వచ్చింది .


గృహిణిగా కాని , తల్లిగా కాని ఏ భాద్యతలను నిర్వర్తించలేక పోతుంది . తనకు లభించిన మధ్యతరగతి జీవితం తో తృప్తి పడలేక పోతుంది . అందుకే తన రచనను , రావ్ మితృడు , లతీఫ్ కు పంపిస్తుంది . లతీఫ్ సహకారము తో పెద్ద రచయిత్రి గా పేరు ప్రఖ్యాతులు , ధనము సంపాదిస్తుంది . ఈ పరిణామం లో రావ్ దూరం అవుతాడు .

అకస్మికంగా లతీఫ్ ఔనత్యం , శారదలో ఏదో నిర్వేదాన్ని రేపింది . ఆనిర్వేదం ఆమె మనసును మధింప నారంభించింది . ఆ నిర్వేదమే అన్ని భావాలకూ పుట్టినిల్లనీ , ఆ నిర్వేదం లోనుంచి , జిజ్ఞాస , విచక్షణ , ఉద్భవమందుతాయని , వీటిసాయం తోనే తను ఇంతవరకు ప్రయత్నించి , సాధించలేక పోయిన సం యమనాన్ని సాధించవచ్చని క్రమంగా అర్ధం చేసుకుంటుంది . ఆ మధనం లోనుండి ఉత్పన్నమైన భావాలను ఆలంబనము చేసుకొని రాయటము ప్రారంభించింది .అంత వరకూ ఆమె ప్రేమ కథలను ఆదరించిన పాఠకులు పెదవి విరిచారు . ఒక ఏకాగ్రత తో రాసే విషయాలు , తనను తను సంస్కరించుకోవటానికి వుపయోగ పడ్డాయి . పుస్తకాలు అమ్ముడైనా , కాకపోయినా ఎవరు మెచ్చుకున్నా , మెచ్చుకోకపోయినా , నిర్వేదంగా వ్రాయనారంభించింది . రచయత ఎలా వుండాలో అర్ధం చేసుకో గలిగింది . నిర్మోహదృష్ఠి అంటే మమతా రహితమైన స్తబ్దత కాదని , తపస్సాధనకు అరణ్యాలలోకి వెళ్ళనక్కర లేదని శ్మశాన వైరాగ్యం లోనుంచి కాక , హృదయం లోనుంచే సృష్ఠిరహస్యం బోధపడుతుందని స్పురించింది .


" భావనా బలం తో దృగతీత విషయాలను సాక్షాత్కరింప చేసుకోగలటమే క్రాంత దర్షిత్వం . అలా దర్షించగలవాడే ద్రష్ట ఋషితుల్యులే అలాంటి ద్రష్టలు కాగలరు . సమస్త విశ్వాన్ని నిర్మోహంగా , సానుభూతితో చూడగలటం ఋషులకే సాద్యం . వశ్యవాక్కులు దర్శించిన దానిని వర్ణించగలరు . తపస్సుకు సజాతీయమైన ఏకాగ్ర సాధకులు కాని వశ్య వాక్కులు కాలేరు ! ఈ కారణం గానే ఆర్యులు " నా నృషి కురుతే కావ్యం ' అన్నారు . "


ఈ విషయము అర్ధం చేసుకున్న శారద , ఆ తరువాత ఎలా మారింది , రావ్ , శారదల ప్రేమ కథ ఏ తీరం చేరిందో తెలుసు కోవాలంటే " శారద ( నా ఋషి కురువతే కావ్యం ) " చదవాల్సిందే !

Posted by గీతాచార్య May 19, 2010

Subscribe here