BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

అనిల్ కుంబ్లే. భారత దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్ విన్నర్. నిబద్ధతకీ, హుందాతనానికీ నిలువెత్తు నిదర్శనం. అవును మరి. ఆరడుగుల పైన ఎత్తు.


భారత దేశనికి captain గానూ సేవలందించి Sidney టెస్టు సందర్భంగా ఒక నాయకుడు అంటే ఎలా ఉండలో మనకి అర్థంఅయ్యేలా చెప్పినవాడు.

రిటైర్ అయినప్పుడు ధోనీ భుజాల పైన మోసి మరీ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

అంతేనా? ట్రోఫీ ని కుంబ్లేతోనే పంచుకుని, తన గౌరవాన్ని చాటిచెప్పాడు.

కుంబ్లే. ద లెజండ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.

సచిన్ కి కూడా సాధ్యపడనన్ని విజయాలని జట్టుకు కట్టబెట్టినా జనంలో అంత పాప్యులారిటీ రాలేదు కానీ ఎనటికీ తరగని గౌరవాన్ని మాత్రం అందుకున్నాడు.


ఇప్పుడు Royal Challengers Bangalore ని విజయాల బాట పట్టించి తానెప్పుడూ ఎవర్గ్రీన్ అని చాటాడు. కోట్లకట్టలు విరజిమ్మి పీటర్సెన్ ని కొన్నా, ద్రవిడ్ ని captain గా వద్దన్నా, నిరుడు టెస్ట్ జట్టుని కొన్నాడని విమర్శలు ఎదుర్కొన్నా... మాల్యా ఈ సారి చేసిన మంచి పని కుంబ్లేకి captaincy అప్పజెప్పటం. ఫోర్స్ ఇండియా, ఈ ఛాలెంజర్స్ దెబ్బకి విదేశీ మోజు దిగటంతో కాస్త మెదడు ఉపయోగించి సరైన నిర్ణయాలు తీసుకుని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.

రాజస్తాన్ పై 5/5 తో మొదలెట్టిన కుంబ్లే ఈ IPL లో most successful spinner. ద్రావిడ్ కన్నా గొప్ప captain అయిన కుంబ్లేకి భారత captaincy ఆలస్యంగానే దక్కింది. దానికి తోడు జట్టు కాస్త అలసత్వంతో ఉన్న సమయం అది. తనూ కాస్త ఫామ్ కోల్పోయాడు. ధోనీ మేనియా కూడా ఊపందుకుంటోంది. ఆ సమయామ్లో కూడా తన సంయమనం కోల్పోని ధీరోదాత్తుడు. మన జంబో.

’భారత క్రికెట్ టార్జాన్’ గా పరిచయం అయిన మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఎవరికీ చెప్పనవసరం లేదు. వికెట్‍కీపింగ్ అంత గొప్పగా లేకున్నా తన batting విన్యాసాలతో ఆకట్టుకుని, క్రమంగా టెస్ట్ స్థాయికి ఎదిగన ధోనీ గత టి20 ప్రపంచ కప్ లో నాయకత్వం నెరిపే అవకాశం రావటాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ముందు వన్డే టీమ్ కి, ఆ తరువాత టెస్ట్ టీమ్ కి captain అయి, ఇప్పుడు IPL లో చెన్నై సూపర్ కింగ్స్ ని సెమీస్ కి చేర్చి, తనలాంటి వాళ్ళకి గురుతుల్యుడైన కుంబ్లేకి ఎదురు నిల్చాడు.

ధోనీ కి అచ్చొచ్చిన, కుర్రాళ్ళ ఆట అనే ఈ ఫార్మాట్ లో కుంబ్లే గెలిస్తే భలే మజా.

ఓల్డ్ హార్సెస్ ఆర్ మేకింగ్ వేవ్స్ హియర్ ఇన్ దిస్ IPL.

ఇది మొదలెట్టి చాలా సేపైనా కరన్ట్ పోయి ఇదిగో ఇప్పుడు స్కోరు RCB 98/3 while chasing 147, అన్న సమయంలో వచ్చింది.


ద్రవిడ్ ఔటట. మా బాబాయి కొడుకు చెన్నై అంటున్నాడు. But Heros must win. Kumble is one. So, RCB జైహో.

కమాన్ జంబో కమాన్.

కుంబ్లేకి శుభాకాంక్షలు చెప్పండి. నేను మ్యాచ్ చూడటానికి వెళ్తున్నాను.

మీరు చూసే సమయానికి ఫలితం తేలి పోతుంది కదా...! :-)

*** *** ***

తాజా వార్త: కుంబ్లే టీమ్ విన్స్.


ధోనీ కా ఇలాకా మే కుంబ్లే కా ధమాకా.

Posted by గీతాచార్య May 23, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!