PRIYA IYENGAR SAYS...
నాకు చిన్నప్పటి నుంచీ కథలు అంటే ఇష్టం. రోజూ అమ్మ నాకు కథలు చెప్పండే నేను నిద్ర పోయేదాన్ని కాదు.కొన్నాళ్ళకి కథలు అన్నీ అయిపోయాయి. అంటే కదా! అమ్మకి మాత్రం ఎన్ని వొచ్చు అని? అందుకే నాన్నని పట్టుకున్నాను నేను. వైష్ణవి ఎప్పుడూ పెండ్రాలే నిద్ర పోతుంది. దానికి వేడి వేడి పాలు గ్లాసెడు ఇస్తే చాలు నిద్ర ముంచుకొస్తుంది. మరి నాకలా కాదు.
నాన్న నాకు చాలా విషయాల్ని నాకు చెప్పేవాడు. కేవలం కథలనే కాదు. రామాయణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని చెప్పేవాడు. అవన్నీ వింటూ పడుకునే దాన్ని. అందులో నాకు బాగా నచ్చింది శ్రీకృష్ణుని బాల్యం. కొంత కాలానికి వాటితో పాటూ నాన్న నాకు తను చదివిన నవలలలోనుంచీ కొన్ని పాయింట్ లను తీసుకుని నాకు అనుగుణం గా మార్చి చెప్పేవాడు.
ఆయన లేని రోజుల్లో అమ్మని నేను వేధించే దాన్ని. అందుకే ఒక సారి నాన్న నాకు ఒక పుస్తకాన్ని తెచ్చాడు. దాని పేరు "ఉక్రేనియన్ జానపద గాథలు". దాన్ని తన ఫ్రెండు తనకు తెలిసిన ఈ పుస్తకం అనువాదకుని దగ్గరనుంచీ పట్టుకొచ్చాడు. అది నాన్న నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. దీని గురించి మళ్ళీ చెపుతాను.
ఎంత బాగుండేవో ఆ కథలు. అందులో నాకు "దొర్లే బఠాణీ గింజ" అంటే ఎంతిష్టమో. ఒకమ్మాయికి ఒక బఠాణీ గింజ దొర్లుకుంటూ తన కాలి కిందకి వస్తుంది. దాన్ని తింటే సంతానం కోసం అలమటిస్తున్న తనకి ఒక కొడుకు పుడుతాడు. వాడికి "దొర్లే బఠాణీ గింజ" అని పేరు పెడుతుంది. వాడి సాహసాలు ఎంత బాగుంటాయో.
నాన్నకి కృష్ణాష్టమి అంటే బాగా ఇష్టం. ఆ రోజు చాలా సేపు పూజ చేస్తాడు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి తినే వాడు. మేమూ అలాగే చేసేవాళ్ళం. కాక పోతే ఒక గంట ఉపవాసం చేసేవాళ్ళం. విజయశాంతి తెలంగాణా కోసం ఆరు గంటలు ఉపవాసం చేసినట్లు. మేము ప్రసాదం కోసం ఒక గంట ఉపవాసం చేసేవాళ్ళం.ఇవాళ జన్మాష్టమి. అందుకే నాన్నకి నివాళిగా...
గీతాచార్య గారు BOOKS AND GALFRIENDS కోసం ఏదన్నా వ్యాసం రాయమని నన్ను అడిగారు. పుస్తకాల గురించి రీవ్యూ కాకుండా పుస్తకాలతో మన అనుబంధాలని గురించి పంచుకోవటం అనే కాన్సెప్ట్ నాకు నచ్చింది. కొత్త ప్రయత్నం.
నాకు చిన్నప్పుడు బాగా నచ్చిన, నన్ను బాగా ఇన్ఫ్లూయన్స్ చేసిన పుస్తకం అది. అద్భుత లోకాలు కాదు కానీ, లోక ఙ్ఞానం, మనకన్నా బలవంతుల్ని బురిడీ కొట్టించే తెలివితేటలూ, జంతువులూ, మహాకాళాలూ, పెద్ద పెద్ద విలన్ల పైన గెలిచే సామాన్య మానవులూ, తండ్రి కోసం త్యాగం చేసే కూతుళ్ళూ, అబ్బో ఒకటేమిటిలే... చాలా ఉన్నాయ్ అందులో. పిల్లలకి భలే నచ్చుతుంది. పెద్దలకైనా. నాకెప్పుడన్నా హోమ్ సిక్నెస్ వస్తే ఈ పుస్తకాన్నే చదువుతుంటాను.
పిల్లందరూ చదవదగ్గ పుస్తకం అది. మరి ఇప్పుడు దొరకటం లేదంటున్నారు. ఈ పుస్తకం గురించి ఇంకా కబుర్లు త్వరలోనే ఇక్కడే పంచుకుంటాను. పైన ఇచ్చింది నేను ఇంతకుముందు చాలా రోజుల క్రితం నా బ్లాగులో పెట్టుకున్నది. ఉపోద్ఘాతం గా ఉంటుందని ఇక్కడ అదే ఇచ్చాను. అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. దాని క్లిప్పింగ్ నా బ్లాగులోనే పెట్టాలి.
My thanks for Chaitanya Kalyani for this one.
*** *** ***
సో అదండీ సంగతి. అడగగానే మాకు ఈ వ్యాసాన్ని పంపిన ప్రియ అయ్యంగార్ గారికి నెనెర్లు. ఇలా పుస్తకాలతో మీ అనుబంధాలని పంచుకోవాలనుకుంటే నన్ను ఇక్కడ కాంటక్ట్ చేయండి.
chaiti.ch@gmail.com
IPL Latest news...
కుంబ్లే రెండో బంతికే లేపేశాడట. క్రిక్ ఇన్ఫో చెప్పింది. గో జంబో గో.
CHAITANYA KALYANI