BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


గురు శిష్యుల స్వాతికి’రణం’
గురువుల గురించి విశ్వనాధ్ సినిమాల్లో ఉన్న అంశాన్ని శోధించే నా ఈ చిరు ప్రయత్నం లో ఇది మొదటి అడుగు. ఇంతకు ముందర నేను శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa? అని నా ప్రయత్నానికి పీఠికని వ్రాశాను. ఇది అసలు విషయం.
Ayn Rand వ్రాసిన The Fountainhead అనే నవలలో మనుషుల మనస్తత్వాలని విశ్లేషిస్తుంది. అవి నాలుగు రకాలంటూ. ఆ నాలుగు రకాలలో ఎంతో గొప్ప generalization ఉంది. ఆమె ఆరోహణ క్రమంలో వివరించింది.
అలాగే కే విశ్వనాధ్ సృజియించిన అద్భుత చిత్రరాజాలైన
౧. “శంకరాభరణం”
౨. “సాగర సంగమం”
౩. “స్వర్ణ కమలం”
౪. “స్వాతి కిరణం”
లలో గురువుల గురించి అవరోహణ క్రమం లో చెప్పారు. కానీ నేను ఆరోహణ క్రమం లోనే వాటి గురించి పరిచయం చేస్తాను. ముందుగా “స్వాతి కిరణం”.
కే విశ్వనాధ్ అద్భుతమైన పరిశీలనా శక్తికీ, సునిసిత దృష్టికీ, ఈ సినిమాలు గొప్ప ఉదాహరణలు. ఆయన తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే ఈ నాలుగు సినిమాలూ ఒక ఎత్తు. ఈ నాలుగింటినీ ఒక quadrulogy (పదం కరెక్ట్ కాదేమో. తెలిసిన పెద్దలు చెప్పండి) అనుకోవచ్చు.
ఇక్కడే నా కేస్ స్టడీ మొదలవుతుంది.
“శృతి నీవు ద్యుతి నీవు… ఈ నా కృతి నీవు భారతీ…” అంటూ ఆ శిష్యుడు కుతూహలం గా మొదలు పెడితే ఆ గురువు గారికి అసూయ మొదలైంది. విశ్వనాధ్ ఇక్కడే తన గొప్పతనాన్ని బయట పెట్టుకున్నారు. ఎలా అంటే…
ముందు ఆ గురు శిష్యుల పాత్రలకి ఎంపిక చేసిన పాత్ర దారుల ద్వారా? నిజంగా మమ్ముట్టీ ని ఎంపిక చేయటం masterstroke. ఏ కమల్ నో, సోమయాజులనో, ఎంపిక చేయ వచ్చు. కానీ వారిని ఇద్దరు గురువుల కోసం వాడేశారు. మూడో గురువు ఎవరో సస్పెన్స్. అందులోనూ వారిద్దరికీ తెలుగు ప్రేక్షకులలో ఒక రకమైన ఇమేజ్ ఉంది. అందువల్ల కథ మీద అంచనాలతో వచ్చే ప్రేక్షకులకి నిరాశ కలుగ వచ్చు. ఇక్కడ విషయ ప్రధానమే కానీ నట ప్రధానం కాదని ఆయన తన ఎంపిక తోనే చెప్పారు. మమ్ముట్టీ ఎంత మాత్రం నిరాశ పరచకుండా నటించి (మాట తప్పేమో…), ఆయన ఆశీస్సులని అందుకున్నారు. ఆ పిల్లాడూ అంతే బాగా నటించాడు. Selection of actors is of top class. K. Vishwanath is a master in it. (Some more about this aspect in the next post)
అసూయ” మనిషి భావాలలో అతి ఏహ్యమైన భావం. మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుంది. అందులోనూ ఒక గొప్ప శిష్యుని చూసి అసూయ పడ్డ గురువు ఆ గురుత్వానికే అనర్హుడు.
అలా అసూయ చేతిలో చిక్కి తన జీవితాన్ని కోల్పోవటమే కాక ఇద్దరికి కడుపు కోత మిగిల్చిన ఒక గురువు కథే “స్వాతి కిరణం”. అసూయ ప్రభావాన్నే కాదు మనుషుల సైకాలజీని ఇంత అద్భుతంగా స్టడీ చేసిన సినిమాలు చాలా అరుదు.
Ayn Rand తన The Fountainhead లో మనుషులని
౧. “a man who never could be, but doesn’t know it.”
౨. “a man who never could be, knows it too.”
౩. “a man who could have been.”
౪. “The man as he should be and ought to be.” అని విభజిస్తుంది.
మరి విశ్వనాధ్ సినిమాల్లో… మొదట అసూయ వల్ల ఎంత పతనమవుతారో చెప్పే “స్వాతి కిరణం”. ఇక్కడి నుంచే నా పయనం మొదలు.
(సశేషం)

Posted by గీతాచార్య Sep 13, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!