నేను “స్వాతి కిరణం” సినిమాని ఒక ఖాళీ రోజున చూస్తుండగా నాకు కలిగిన ఆలోచన ఈ సినిమా గురించి నా అభిప్రాయాలని బ్లాగులో పెడుదాము అని. నెట్టుకి వచ్చి వ్రాద్దును కదా… ఎప్పటి నుంచో నన్ను తొలుస్తున్న కాన్సెప్ట్, బయటకి వచ్చింది. అందుకే ఒక కేస్ స్టడీ గా గురువుల గురించి విశ్వనాధ్ సినిమాల్లో ఉన్న విషయాన్ని తీసుకుందామని అనిపించింది.
దీనికి Ayn Rand వ్రాసిన THE FOUNTAINHEAD కోణం లోనుంచీ చూస్తే కలిగిన ఆలోచన గురించి “విజయ విశ్వనాథం” అనే బ్లాగులోనే వివరించాను.
నాకు కే విశ్వనాధ్ పరిచియం అయింది “స్వాతి కిరణం” సినిమాతో. అప్పటికి నేను చాలా చిన్న వాడిని. ఆ సినిమా నన్నెంతో ఆకట్టుకుంది. అది సంగీత మీద మక్కువ తోనో, లేక కళాకృతుల మీద అభిమానం తోనో కాదు. అంతకు ముందే నేను “ఖైదీ” చూశాను. సినిమా నచ్చినా నాకెందుకో అందులోని కాన్సెప్ట్ నచ్చలేదు. సినిమా అంటే ఫైటింగేనా? అనుకునే వాడిని. ఆ సమయంలో నేను “స్వాతి కిరణం” చూశాను. నా చిన్ని మనసుకెందుకో ఆ పాటలూ, ఆ నటన లోని సహజత్వం, కంపు హాస్యం చూసిన నాకు ‘గాయట్రీ వషన్టం’ జోకులూ తమాషాగా అనిపించాయి.
ఆ తరువాత దాదాపూదశాబ్దం తరువాత నేను Ayn Rand వ్రాసిన THE FOUNTAINHEAD చదివాను. అది చదువుతుంటే నాకు ఎందుకో విచిత్రంగా కేవిశ్వనాధ్ సినిమాలే గుర్తుకు వచ్చేవి. కొన్ని సార్లు నాకు ఈ విషయాన్ని మాటలలో పెట్టాలని అనిపించేది.
అది ఇలా ఇవాళ బయటకి వచ్చింది.
ఈ టపా శీర్షిక “శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa?” చూశారా? ఎవరైనా FOUNTAINHEAD చదివిన వారికి అందులో హీరో HOWARD ROARKఆత్మాభిమానం గురించి తెలిసే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన లక్ష్యమే తప్ప అన్యమైన విషయాల మీద దృష్టి ఉండదు. ఎవరు ఎలా మారినా తన మీద తనకున్న నమ్మకం తో ఏ పరిస్థితుల్లోనైనా రాజీ పడడు. అంతగా ఐతే తన వృత్తిని వదిలేసి రాళ్ళు కొట్టైనా బ్రతుకుతాడేమో కానీ తన విలువలని మాత్రం వదులుకోదు.
మరి మన “శంకర శాస్త్రి“? ఆయనా అంతే. తన సంగీతాన్ని జనం ఆదరించక పోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా తను నమ్మిన విలువల కోసమే కట్టుపడ్డాడు. అసలు “బ్రోచే వాడెవరురా” ని ఒహండు ఖూనీ చేస్తున్నప్పుడు ఆయన పడ్డ వేదనని చాలా సినిమాల్లో పేరడీ క్రింద వాడారు. అలాగే తన కూతురుతప్పుగా పాడే సందర్భంలోనూ తనకు ప్రాణాతి ప్రాణమైన సంగీతాన్ని గురించే ఆయన ఆలోచన కానీ అన్యం కాదు. ఈ సన్నివేశాన్నీ మన సినీ దుండగులుపేరడీ చేశారు.
అలాగే వేశ్య అయిన ఒక స్త్రీని ఆదరించే సమయం లో తన విలువలకి కట్టు బడ్డాడే కానీ ఎవరో ఏదో అనుకుంటారనే విషయాన్నే ఆయన పట్టించుకోడు.
సరే. ఇంతటితో ఇక్కడికి ముగిస్తున్నాను. అసలు విషయాన్ని నేను ముందు ముందు వ్రాసే టపాలలో చూపుతాను. ఒక్క విషయం. Ayn Rand రచించిన THE FOUNTAINHEAD ని శంకరాభరణంతో పోల్చటం నా లక్ష్యం కాదు. కొన్ని సారూప్యాలని మాత్రం ఎత్తి చూపడం. నా ప్రధాన లక్ష్యం పైన తెలిపిన కేస్ స్టడీ.
శంకర శాస్త్రి శంకర శాశ్త్రే. Roark Roarke.
నా దృష్టిలో “శంకర శాస్త్రి” is the Greatest Heroic character in the Telugu Cinimas. ఆ సమయం అలాంటిది. ఆ దర్శకుని గొప్పతనం అలాంటిది. అదెలాగో తెలుసుకోవాలంటే “విజయ విశ్వనాథం” చదవండి.
గమనిక: ముందు ముందు నేను ఈ శ్రేణి లో వ్రాసే బ్లాగులని నవతరంగం లో పెడుతాను. ఈ వ్యాసం మాత్రం కేవలం ఒక పీఠిక లాంటిది.
శీర్షికలో ఆంగ్లాన్ని వాడాను. అది తప్పని సరి అని నా అభిప్రాయం. ఎందుకంటే… Roark ని ఎవరు ఎలా పలుకుతారో తెలీదు. అందుకే ఆంగ్లం లోనే వదిలేస్తే బాగుంటుందని ఇలా చేశాను.