BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


మాల గారు B&G లో ఇప్పటికి రెండు ఆర్టికిల్స్ రాశారు. ఇక్కడ మల్లాది రాసిన సద్దాం ఆంటీ కథ గురించి చెప్తున్నారు. చూడండి.

నా అభిమాన రచయత/త్రి లలో మల్లాది వెంకట కృష్ణమూర్తి ఒకరు, ఆయన రాసిన ప్రతినవల కొన్ని పదుల సార్లు చదివి వుంటాను. ప్రతి దాన్లోనూ ,ఏదోవక ట్విస్ట్ .అలా అని భయంకరంగా ఏమీ వుండవు. చిన్న చిన్న పొడుపుకథల తో ,క్విజ్ ల తో సరదాగా , ఆహ్లాదంగా సాగి పోతూ వుంటాయి. ఇంతవరకూ ఏ నవల లోనూ , కథ లోనూ ఏ ఒక్క పేరూ నూ తిరిగి ఏ పాత్ర కూ వాడలేదట ! కొత్త కొత్త పేర్లను కనిపెట్టి రాస్తూవుంటారు. ఆంధ్రుల ఆహ్లాద రచయిత అని ఆయన పేరు!
సద్దాం ఆంటీ అసలు పేరు కంకాళమ్మ .అన్నయ్యలు బబృవాహనుడు, బలిచక్రవర్తి, అక్క జాంబవతి పిల్లలు కలగ కుండ మరణిచటము వలన కంకాళమ్మ ఓ పెద్ద ఇంటికి ఏకైక వారసురాలవుతుంది.భర్త వెంగళరావు కూడ విచిత్ర పరిస్తితుల లో మరణిస్తాడు. కొడుకు కు అతనికి ఇష్టములేని,వేరేకులపు అమ్మాయిని కట్నము తీసుకోకుండా పెళ్ళి చేస్తుంది.

ఓరకముగా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోని కథకు వ్యతిరేక మన్న మాట ! దానితో అతను అలిగి భార్య తోసహా ఇంట్లోంచి వెళ్ళి పోతాడు. ఆ పరిస్తితుల లో తన ఆరోగ్యము బాగుండక ,ఆర్ధిక ఇబ్బందులవలన ,ఇక కొడుకు రాడనుకొని గ్రామం ( జి.రామం ) కి తన ఇల్లు అమ్ముతుంది .దాని కి సేల్ డీల్ లో తను చని పోయే వరకు గ్రామం ఆమె ఖర్చులకు సరిపోయేంత డబ్బులు ఇచ్చేట్లుగానూ ,ఆమె తదనంతరము ఆ ఇల్లు అతని చెందేట్లుగానూ రాసుకుంటారు.పాపం గ్రామం ఆమె డాక్టర్ ను కనుక్కోనే, ఆవిడ ఆరోగ్యము క్షీణించి చివరిదశలో వుందని తెలుసుకొనే చీప్ అండ్ బెస్ట్ అనుకొని అలా తీసుకొంటాడు. ! కాని, అబ్బే ఎక్కడ ,చెప్పిన డాక్టరూ ,గ్రామమూ ,ఆయన పిల్లలూ అంతా చని పోతారు .చివరికి గ్రామం గారి మనవలు ఆమెకి సద్దాం ఆంటీ అని పేరు పెట్టుకొని , ప్రస్తుతము కోట్లు విలువ చేస్తున్న ఇంటిమీద హక్కును పోగొట్టుకోలేక నెల నెలా డబ్బును కడుతూనే వున్నారు !

ఇంతలో అనుకోకుండా కంకాళమ్మ కొడుకు ,భార్య కిడ్నీ వ్యాధి తో చనిపోయాక పదునాలుగేళ్ళ కొడుకు తో తిరిగి వస్తాడు. ఆ మనవడు పొస్టల్ కోచింగ్ లో ఈత నేర్చుకొని టాంక్ బండ్ లో ఈదటానికి వెళ్ళి చచ్చాడు. ఆ మనవడి కూతురు అనన్య తాతమ్మ తో కలిసి వుంటుంది .కంకాళమ్మకి తాతమ్మా అని పిలిపించుకోవటము లేక బామ్మా అని పిలిపించుకుంటుంది .బామ్మా , మనవరాళ్ళిద్దరూ పూర్తిగా వ్యతిరేక స్వభావము కలవారు. బామ్మ కంప్యూటర్ లో గేంస్ ఆడుకుంటూ ,యం .టి. వి చూస్తూ పీజా హట్ కు వెళుతూ ఎంజాయ్ చేస్తూ వుంటుంది. మనవరాలు పూజలు చేసుకుంటూ ,ఏ పని చేయాలన్నా ముహూర్తాలు చూసుకుంటూ వుండే చాదస్తురాలు. చివరకు మనవరాలిని ప్రేమ లో పడేయటా నికి కూడా బామ్మ నే ప్లాన్ చేస్తుంది !

ఇక గ్రామం గారి మనవళ్ళేమో సద్దాం ఆంటీ ఇంటిని ఎలా స్వాధీనము చేసుకోవాలా అని రకరకాలుగా ప్లాన్లు వేస్తూ ,చివరికి ఆమెని హత్య చేయించటానికి కూడా ప్రయత్నిస్తారు.ఈ క్రమము లో రకరకాల పాత్రలూ , వాటి సరదా స్వభావాలూ ,సరదా సంఘటనలూ నవలంతా ఆహ్లాదం గా సాగిపోతుంది.

ఇందులో సద్దాం ఆంటీ పాత్ర నాకు చాలా నచ్చింది. సంతోషమే సగం బలం అన్నట్లు ఆమే ఎన్ని ఇబ్బందులు వచ్చినా తొణకక బెణకక ,పరిస్తితులని ధైర్యంగా ఎదుర్కుంటుంది. ఆమేలాగా ఆస్తి , ధైర్యం నాకైతే లేవుకాని వూరికే దిగులు పడుతూ బాధపడుతూ కూర్చోవటం నాకూ ఇష్టం వుండదు. హాయిగా చల్తే ఫిర్తే అన్నట్లుగానే వుంటాను. మా పిల్లలేమో అనన్య టైపు. నా ఫేవరేట్ డ్రస్ జీన్స్ ,కుర్తి .అవేసుకుంటే కార్ లో వెళ్ళండి , ఆటోలో వెళ్ళకండి. అంటుంది మా కోడలు.

మా అమ్మాయి తో పార్లర్ కి వెళ్ళి హేర్ కట్ చేయించుకుంటుంటే గుర్రున చూస్తుంది మా అమ్మాయి. అమ్మ హేర్ కట్ చేయించుకున్నావా అని ఆక్రోషించాడు మా అబ్బాయి. ఇంకా నయం బాబ్ కట్టొ, బాయ్ కట్టొ చేయించుకోలే సంతోషించండి అన్నా ! కార్ డ్రైవింగ్ నేర్చుకుంటానంటే నీకు భయం వద్దు అన్నారు మావారు. అంతా వుత్తదే .సద్దాం ఆంటీలా నేను కూడా కారేసుకొని ,జీన్సేసుకొని తిరగనీకి పోతానని మా వారికి భయ్యం ! నేనూ నా గ్రాండ్ చిల్డ్రన్ అనుకుంటాము ఈ బాబా జమానా గాళ్ళు మన కెక్కడ తగిలారురా అని ! ;-)

మనసు పాడైనప్పుడు సద్దాం ఆంటీ ఇంటి కథ చదివి రిపేర్ చేసుకోవచ్చు!

చైతన్య కళ్యాణి

Posted by చైతి Oct 10, 2009

Subscribe here