1. ఇంటికెళ్ళగానే ఆవుని చూసి ఆశ్చర్యపడ్డాను. వాళ్ళకెప్పుడో పాడి ఉండేదని విన్నాను కానీ నాకు ఊహ తెల్సినప్పటినుండీ అయితే చూళ్ళేదు.
2. దూడ తమ్ముడు ప్రక్కన బుల్లిమామయ్య కొడుకు.
3. ఆవు ముందు బుల్లిమామయ్య. ఆ పోజు చూసి దూడని కిడ్నాప్ చేసేవాదిలా ఆ మొహమేంటి అంటే... అమ్మ ఒక డిప్పకాయ్ కొట్టబోయింది. నేను వంగాను, అన్నయ్యకి తగిలిందది. ;-)
4. దూడ, మామ బండి మీదుగా బుల్లిమామయ్య. దూడ భయపడుతోదని face-off చేశాను. ఆమాటే అంటే మొహం చూపించుకోలేకే కదా ఫోటోలు తీశావు కానీ ఎందులోనన్నా కనిపించావా? అని రిటార్ట్ ఇచ్చాడు.
5. శ్రీమతి బుల్లిమామయ్య గారు పాలు పితుకుతుంటే ఓ చేత్తో పాయం చేస్తున్న మామ. (పాలు + సాయం = పాయం) ;-)
6. "అమ్మా! నన్ను కిడ్నాప్ చేస్తారంటే..!" దూడ తమ్ముడి కంప్లైంట్. పాలు త్రాగుతూ. దీర్ఘంగా ఆలోచిస్తూ పిన్ని.
7. తమ్ముడితో పిన్నే చెప్పెను "నేనున్నాననీ...". భయం లేదు బిడ్డా. వీళ్ళు బాపనోళ్ళు. అంత సీను లేదీళ్ళకి. ఎద్దుసింహారెడ్డికి చెప్దాంలే ఏదన్నా అయితే.
8. ఆడెవడమ్మా? తమ్ముడి ప్రశ్న. ఆడోడున్నాడులే. యువ గోరత్న అని... పిన్ని చెప్పింది.
9. అలాగేనమ్మా. కాస్త ఫొటోలో నీ మొహం కూడా రానీ పిన్నీ, అనగానే ఇలా పోజిచ్చింది.
అంతా సరదా వ్యాఖ్యలే. ఎవరినీ నొప్పించాలని కాదు.