BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

కొంత మందికి తెలిసి ఉండవచ్చు, లేదా తెలియక పోవచ్చు, కానీ ఒక చక్కని బ్రౌజర్ ని పరిచయమ్ చేయందే నాకు నిద్ర పట్టక పోవచ్చు.

ఫ్రీ/ఓపెన్ సోర్స్ సాఫ్ట్‍వేర్ల ఉద్యమం మొదలెట్టాక లాంటి సాఫ్ట్వేర్ల గురించీ, బ్రౌజర్ల గురించీ, ఆఫీసు ప్యాకేజీల గురించీ, ఇతర మంచి మంచి అప్లికేషన్ల గురించీ చెప్దామని నిర్ణయించుకున్నాను. పెద్ద పెద్ద టపాలు వ్రాసే ముందు కాస్త వామప్ గా చిన్న చిన్న విషయాలని గురించి చెప్తున్నాను.

మొన్న ఓపెనాఫీసు దింపుకోమన్నాను, నిన్న (అనగా నా మొదటి టపా, రెండో టపా అని ఉవాచ) కామెట్ బర్డ్ అనే ఆన్లైన్ బుక్మార్క్ సౌకర్యమున్న బ్రౌజరుని పరిచయం చేశాను. ఇప్పుడు చెప్పబోయేది కూడా బ్రౌజరే. కాకపోతే ఇది ఒక మ్యూజిక్ ప్లేయర్ గా కూడా పని చేస్తుంది.

సాంగ్ బర్డ్

విండోస్ మీడియా ప్లేయర్, రియల్ ప్లేయర్ లలో ఈ మధ్య పాటలు వింటుంటే టాటా డొకోమోలో సెకన్లు స్కిప్ అయినట్టుగా కాస్త ముందుకు జరిగి మధ్య మధ్యలో అక్షరాలు మిస్ అవుతున్నాయి. అలాగే వాటికోసం టాస్క్ బార్ మీద మరో విండో భారం. అలాంటప్పుడు చక్కగా ఓ వంక పాటలు వింటూ మరోవైపు బ్రౌజింగు చేసుకోవాలంటే ఇది బాగా పనికొస్తుంది. నా రేటింగ్... 4.3.

ఫైర్ఫాక్స్ 3.5 తో సమానమైన పెర్ఫామెన్స్, బ్లాక్ అండ్ బైట్ కలర్ కాంబినేషన్లో చూట్టానికి స్టైలిష్ గా కూడా ఉంది. ఎక్కడా హ్యాంగవటం చూడలేదు (పదకొండు రోజుల ఉపయోగం). మనకు నచ్చినట్లు కస్తమైజ్ చేసుకోవచ్చు.

ఒక సారి పైన ఇచ్చిన లంకెలో నుండి దింపుకుని వాడి చూడండి. విన్ ఎక్పీ, విస్టా, సెవెన్, లినక్స్ లో ఎక్కడైనా పనికొస్తుందీ ముచ్చటైన బ్రౌజరు.

ఉపయోగాలన్నీ ఊదరగొట్టి జనం వాడి తీరాల్సిందే అన్నట్టు చెయ్యటం ఈ బ్లాగోజినా పాలసీ కాదు. కేవలం మంచి వాటిని పరిచయం చేయటమే. మీకుగా దించుకుని వాడి చూడండి. నచ్చి, ఏమన్నా సమస్యలు, ప్రశ్నలూ ఉంటే తెలియజేయండి. వీలున్నంతలో సమాధానాలిస్తాను.

B&G Wishes everybody a HAPPY & PRODUCTIVE, Fun filled NEW YEAR

Dhanaraj Manmadha

కొన్ని పరిచయాలయ్యాక త్వరలో ఓపెను/ఫ్రీ సాఫ్ట్వేర్ల గురించిన టెక్నికల్ సమాచారం అందిస్తాను. ఈలోగా ఇక్కడ ఇచ్చిన వాటిని వాడి మ అభిప్రాయం చెప్పండి.

Posted by Dhanaraj Manmadha Jan 2, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!