BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...





ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టి తెలంగాణా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది అందరికి ఉన్న సందేహం. దానికి శ్రీనివాస్ గారు మాంచి సొల్యూషన్ చెప్పారు. మీరు చెప్పండి ఏమంటారో? హాయిగా నవ్వుతూ (లేకపోతే చిరు మందహాసంతో) కొత్త సంవత్సరంలోకి వెళదామా మరి..

ఒరే సూరిగా ఏటవుద్దిరా ఈ గోల ఎప్పటికి తేలుద్దంటావ్ ఇసయం. ఓ సిన్న సలహా పాడేయ్ ఈలోపున సోనమ్మ ఫోన్ చేస్తది మనం సెప్పేదాని బట్టి అవతల నిర్ణయం సేత్తానంది.

అయ్యా తమరేమి అనుకోనంటే సెప్తానండి.అసలు గోలెందుకు వచ్చిందండి.

ఈ రాజకీయనాయకులకి ఏదో ఒక కాలక్షేపం కావాలి కదా, సేతిలో సిల్లరాడట్లేదు పెద్దాయన పోయినకాడ్నించి, అందుకని ఏదో ఒక సమస్య సృష్టించాలి కదా.అలానే ఆనికి తెలీకుండానే మన ముక్కు సెంద్రిగాడు అసలే కోతి అందులో కల్లు తాగిందన్నట్టు ఈ సమస్యని లేపాడు. అసలు ఆడూ అనుకోనుండడు,ఆ మాటకొత్తే ఎవ్డూ కూడా అనుకోనుండడు ఇదింత గోలవుద్దని. అది కాత్తా ఇందిరమ్మ సృష్టించిన భింద్రన్‌వాలే గాడి యవ్వారంలా తయారయ్యింది.

అవునండయ్యా నెనొకటి సెప్తా ఇనుకోండి ఇదెవర్నీ తక్కువ సెయ్యడానికి కాదుగానండి కానీ నిజమయిన ఆలోశనండి.ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పేరుని తెలంగాణా గా మార్సిపడేత్తే సరిపోద్ది కదండి(ఆళ్ళకేమో మన సరుకుల ప్రకటనల్లోలాగ ఇప్పుడు పాత ధరకే ఇంకొంచెం ఎక్కువ అంటే 50గ్రాములు ఎక్కువన్నమాట, ఇవతలోళ్ళకేమో యూటీఐ బేంక్ ఇప్పుడు ఏక్సిస్ బేంక్ అంతే పేరు మార్పు మీ సొమ్ము భద్రం అన్నట్టు). అప్పుడు తెలంగాణోల్లకి రాష్ట్రం ఇచ్చేసినట్టుంటది, సీమాంధ్రోళ్ళకి రాష్ట్రాన్ని ఇడగొట్టనట్టూ ఉంటాది గందా అందరూ కల్సీ ఉండచ్చు గందా ఏవంటారండయ్యా…

నిజమేరా సూరిగా ఎంత మాంచి ఆలోశన సేసావురా నిక్కచ్చిగా ఉంది.కొంత పేపర్ కర్సుతో మరికొన్ని మార్పులు సేర్పులతో సరిపోద్ది ఈ నాయకులంతా ఒప్పుకోవాలి కాని, పెజానీకానికయితే అబ్బెంతరం ఉండకపోవచ్చనుకో.

ఆయ్ అవునండయ్యా. (అంతా వాకే అయితే పర్లేదు కాని తేడా వచ్చిందంటే మరి నా తమ్ముడి పరిస్థితేంటి ఆడేమో తెలంగాణోడు ఆళ్ళావిడేమో ఆంధ్రా మరెట్టా కాపరం చేసేది, పైగా ఇద్దరూ ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నారు కూడా,బుర్రలో అనుమానం తొలుస్తోంది అప్పుడే...)

ఎలాగు పరిస్థితి లో మార్పు ఎప్పుడూ ఉండదు కాబట్టి (ఎవుడెవుడ్ని పరిపాలించినా ఏపెబుత్వ మొచ్చినా సామాన్య పెజానీకం బతుకులో మార్పేమి రాదు) అదేదో బాపు గారి సినిమాలో సెప్పినట్టు అమాయకురాలు లక్ష్మీ దేవి అయ్యవారి పాదలొత్తుతూ స్వామిని అడుగుతుంది సరదాగా మనిద్దరమూ కాసేపు మన స్థలాలు (ఆవిడ ఉద్దేశ్యంలో అయ్యవారు అమ్మవారి పాదాలొత్తుతూ అని) మార్చుకుందామా అని.దానికి అయ్యవారు అలాగే దానిదేముంది అని తలకట్టునించి కాళ్ళకట్టకి అట్నించి ఇటు మారి పడుకుంటాడు.అమ్మకి నోటంట మాట రాకపోయె.యధాస్థానం కరిష్యామి అన్నట్టు మళ్ళీ పాదాలొత్తుతూ కనుకొలకుల్లోంచి జారే కన్నీటిబొట్టు కొంగంచుతో తుడుచుకుంటూ అమ్మ “ప్చ్”(అలాగే సామాన్య పెజానీకం కూడా).

కాసేపటికి సోనమ్మ దగ్గర్నించి ఫోన్ రావడం ఇదే సలహా ఆవిడకినిపించడం ఆవిడ సరే (ఈరాయికూడా ఇసిరి సూడనడం) వాకే అనడం జరిగిపొయ్యాయి.ముందు జనాలకి ఇనిపించు తర్వాత మిగతా కార్యక్రమం కానిద్దామంది.

ఇందుమూలముగా యావన్‌ పెజానీకానికి తెలీచేసేదేంటంటే కొత్త సంవత్సరం సందర్భంగా మన ప్రియతమ నాయకురాలు సోనమ్మ గారు తీస్కున్న గొప్ప నిర్ణయమేంటంటే మన ఆంధ్ర ప్రదేశ్ ని తెలంగాణా గా పేరు మార్చుటకు నిర్ణయించినారు అందువల్ల మీకు మీ రాష్ట్రం ఇచ్చేసినట్టే, అవతలోళ్ళకి ఇడగొట్టకుండా కలిసున్నట్టే అని దీని తాత్పర్యం కావున తెలియచేయడమైనది.

(తాంబూలం ఇచ్చేసాం ఇంక మీలో మీరు కొట్టుకుంటారో నరుక్కుంటారో మీ ఇష్టం) నా గురించి చెప్పమాకండి.

మరి నాకు సెలవిప్పించండి నేపోతున్నా. అందరికి “నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు”.


మీ శ్రీనివాస్ పప్పు

Posted by జ్యోతి Dec 31, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!