BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

పున్నమి ఎవరో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.పున్నమితో నా పరిచయం తెలుసుకునేందుకు ... నాకు పున్నమి కథలు చెప్పటానికి కల కారణం కోసం... ఇక్కడ


పున్నమి జమీల్య కథ మొదలెట్టింది. దాన్ని చదవాలంటే ఇక్కడ.

నేను వింటున్నానో లేదో అని ఒక సారి చూసి తను నవ్వింది. "ఎందుకు నవ్వావ్?" అడిగాను."నువ్వెక్కడ పడుకున్నావో తెలుసా?" పున్నమి నన్ను అడిగింది. ఎందుకడిగిందా అని నేను కాస్త ఆలోచించి చూశాను. "పొద్దున్నుంచీ బాగా అలసిపోయాను. అందుకే కాస్త నడుం వాల్చాను," అన్నా. ఇంతలో సోనియా గాంధీ లేచింది. "నువ్వు పడుకుంటోంది శ్మశానంలో బిడ్డా. దెయ్యమౌతవు. జల్ది పైకి లేచి నీ లెగ్స్ ఝాడించి కూకో. సమఝైందా?" అంది.


"శ్మశానంలో పడుకుంటే దయ్యమౌతారా?" అమాయకంగా అన్నా.

"నీ తల్లి ఏంగుంటడివిరా నువ్వు. చెప్తుంటే సంఝౌటం లేదా? ఇక్కడ పడుకునేది దెయ్యాలే...," సోనియా గాంధీ నిప్పులు చెరుగుతోంది. ఇంతలో పున్నమి కల్పించుకుని, "ఇక్కడ మనుషులెవరైనా పడుకుంటే దయ్యాలే అవుతారు. నువ్వలా ఆ చెట్టుకి ఆనుకుని కూచో," అంది. సరే అని కూచున్నా.

ఇంతలో పోలీస్ సైరన్ వినిపించింది. ఈ టైమ్ లో ఎవరబ్బా అని నేను రోడ్డు వైపు చూశాను. ఇద్దరు కానిస్టేబుళ్ళు నా వైపు వస్తున్నారు. నేను నిశ్చలంగా పున్నమి వైపు చూశాను. తను నవ్వుతూ నావైపు చూస్తోంది. సోనియా గాంధీ నిద్ర మొహంతో ఉంది. సరిగ్గా ఒక కానిస్టేబుల్ నా వైపు వచ్చి ప్రశ్నించబోతున్న సమయంలో సోనియాగాంధీ ఆవులించింది. "ఎవరయ్యా నువ్వు? ఈ టైమ్ లో ఏంటిక్కడ? ఒక్కడివే ఏంచేస్తున్నావ్?" అడిగాడు. సోనియా గాంధీ మాయలోడులో ఆలీ లాగా నావైపు చూసి నవ్వింది.


నాకు విషయమర్థమయింది. కానిస్టేబులుకి ఈ దయ్యాలు కనబట్టం లేదు. ఎట్లీస్ట్ ఈ కానిస్టేబులుకైనా. మిగతా వాళ్ళకి కనిపిస్తున్నారోలేదో అని అడుగుదామనుకున్నా కానీ, ఉన్న పొజిషనుకి ఏమైనా చెయ్యొచ్చు. శవాలెత్తుకుపోయే చచ్చు సన్నాసి అనుకున్నా అనుకుంటారు. ఇప్పటికే నా మాసిన గడ్డం, చిరిగిపోయిన చొక్కా, తింగరి నవ్వు చూసి అనేసుకున్నా అనేసుకునే ఉంటారని డిసైడయ్యా. నేను డిసైడయ్యా కానీ, కానిస్టేబులు సైడివ్వలేదు.

"ఏమ్చేస్తున్నావిక్కడ?" మళ్ళా అడిగాడు. మకారాన్ని స్ట్రెస్ చేశాడా? లేక ఏ నా అని తర్కిస్తూ జీవితమ్మీద మమకారం పోయిన వాణ్ణి కనుక ఏమీ మాట్లాడకుండా నించున్నాను. నా బాధల్లా ఒకటే. చక్కగా ఐత్మాతొవ్ వ్రాసిన జమీల్యా గురించి పున్నమి చెప్తున్నప్పుడొచ్చి అనవసరంగా డిస్కషన్ చెడగొట్టాడే అని. నా ఆలోచనలో నేను ఉండగా ఆ వచ్చిన కానిస్టేబుళ్ళు నన్ను తీసుకెళ్ళి సెల్లో వేశారు.
***   ***   ***

నాకు కాసేపలా కూచున్నాక విసుగొచ్చింది. ఏమ్చెయ్యాలో తోచలేదు. ఇంటికెళ్ళి వారం దాటింది. అసలు ఏమయ్యానో అని కంగారు పడటానికి ఇదే ఇలా మొదటి కాదు. కాకపోతే ఎప్పుడూ ఇలా ఎక్కడున్నానో తెలియకుండా లేను. ఇంకో వారమ్ దాకా కంగారు పడక పోవచ్చుగానీ, ఇది మాత్రం ఎందుకో నాకు నచ్చలేదు. కనీసం వాళ్ళకి నేను ఎక్కడున్నానో తెలియక తికమక పడుతుంటే చూసి ఆనందించే అవకాశం కూడా లేదిప్పుడు. :-D జైల్లో పడ్డాను. కాసేపెలాగో అలా అలా ఊచల్లెక్కెడుతూ కూచున్నా కానీ, ఏడంకెల్ని ఎంత సేపు లెక్కెట్టగలను? ఏడ్పు మొహం వేసుకుని కూచున్నా.

అస్సలు ఏవిధంగానూ తోచుబాటు కాలేదు. ఉన్న ఇద్దరు కాన్స్టేబుళ్ళూ కార్డ్స్ పంచుక్కూచున్నారు. వాళ్ళని కదిలిద్దామంటే భయమేసి అలా కూచున్నా. కనీసమేదన్నా పుస్తకముంటే దాన్నన్నా తినొచ్చు.

ఆలోచిస్తుంటే పొద్దున పున్నమిని కలిసిన చోట్లో నేను వదిలేసిన Feynman పుస్తకం గుర్తొచ్చింది. పున్నమిని చూస్తూ అలా చొంగ కార్చుకుని వెంటెళ్ళానుగానీ, ఆ పుస్తకం చేత్తో పెట్టుకోవాలనే ధ్యాసే లేదు. అదున్నా ఎలాగోలా ఈ రాత్రి లాగించేసేటోణ్ణి. హ్మ్! అంతా మాయ. చద్దామనుకున్న వాదివి హాయిగా చావక ఈ గోలంతా ఎందుకు అంటారా? ఓకే ఓకే. పున్నమి చెప్తున్న జమీల్యా ముగియకుండా చస్తే దయ్యమవుతాననే భయం. చచ్చి పైకి పోవటమో, లేదా మళ్ళా క్రిందకు రావటమో బాగుంటుందిగానీ, దయ్యమైతే కష్టం. అందులోనూ ఆడ దయ్యాలైతే ఇంటెరెస్టింగుగా ఉంటుందిగానీ, మగ దయ్యాలని మగోళ్ళే పట్టించుకోరు. గోళ్ళు గిల్లుకోటానికి కూడా పనికి రాదు మగ దయ్యం బ్రతుకు.

ఆ Feynman పుస్తకం చాలా ఇంటెరెస్టింగుగా ఉంది. అదక్కడే ఉందా? ఎవరన్నా ఎత్తుకెళ్ళారా? ఏమో మరి. ఆ పుస్తకం గురించి మాత్రం మీకు చెప్తూ ఈ రాత్రెలాగో కాలక్షేపం చెయ్యాలి.

(సశేషం)

In a few hours a review of that book will be published.

Posted by గీతాచార్య Jan 27, 2010

Subscribe here