BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


పున్నమి చెప్పిన కథలు కోసం ఇదంతా వ్రాయవలసి వచ్చింది. ఆ సీరీస్ లో కాకుండా పూర్తిగా కేవలమీ పుస్తకం గురించే తెలుసుకోవాలంటే ఇక్కడ నొక్కండి.

Richard P. Feynman

కొంత మందికి ఈయన ఒక శాస్త్రవేత్త. ఇంకొందరికి ఒక పుస్తక రచయిత. విద్యార్థులకు ఒక ఉండదగ్గ గురువు.

కానీ నాకు మాత్రం ఆయన ఒక మిస్టర్ పర్ఫెక్ట్. నిజం. సైన్సైనా, సరదా అయినా, ఏదైనా తనదైన శైలిలో చేసే తమాషా వ్యక్తి. అందులోనూ లెక్చర్లు దంచటంలో దిట్ట. ఆయన ఫిజిక్స్ లో ఇచ్చిన లెక్చర్లు The Feynman Lectures on Physics గా పేరు పడ్డాయి. ఫిజిక్స్ కు సంబంధించినంత వరకూ అవి పరమ ప్రామాణికాలు. 1961 నుంచీ 1963 దాకా కాల్ టెక్ (California Institute of Technology) లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆయన ఇచ్చిన లెక్చర్లవి. ఇప్పుడవి పుస్తక రూపంలో ఫిజిక్స్ నేర్చుకోవాలనుకునే వారికి ఒక రకంగా బైబిల్ లాంటివి.

ఇవిగాక Feynman చాలా పుస్తకాలు వ్రాశాడు. అవన్నీ బాగా పాప్యులర్ కూడా.

అలాంటి ఒక పుస్తకాన్నే నేను పొద్దున చదువుతున్నాను. కాసేపు ఏదో నిరాశ ఆవరించి కళ్ళుమూసుకుని కూచుంటే ఇంతలో పంచమి కాంతుల నెలరాజులా పున్నమి కనిపించింది. చందృడికే అసూయ పుట్టించేలా ఉన్నా ఆ భామిని వెంట పడి పోయి కబుర్లలో పడ్డ నేను ఆ పుస్తకాన్ని మిస్సైపోయాను. సరే ఏంజేస్తాం? నాకు తెలిసినంతవరకూ ఆ పుస్తకం గురించి చెప్తాను.

ఆ పుస్తకం పేరు క్వాంటమ్ ఎలెక్ట్రో డైనమిక్స్... లేదా QED. A strange theory of Light and Matter అని చెప్పుకునే QED.
ఆగండాగండి. ఇదేదో సైన్సు పుస్తకమని పారిపోకండి. కనీస పరిఙ్ఞానమున్న ఎవరికైనా (ఎనిమిదో క్లాసు పైన ఉన్న ఎవరికైనా అర్థమయ్యేలా ఉంటుంది. అసలు సైన్స్ పుస్తకాల గురించి Feynman అనే మాటలే చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

పాప్యులర్ సైన్స్ పుస్తకాలని వ్రాసేటప్పుడు కొన్ని సార్లు రచయితలు అతిశయోక్తులు వ్రాస్తారు. (Sometimes the writers of popular science books may get carried away, and fill the pages with exaggerations). కానీ నాకు మాత్రం ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే చెప్పటమిష్టం. అతిశయోక్తులతో ఆసక్తి కలిగించే కన్నా ఉన్న నిజాలను ఉన్నట్టుగానే చెప్తే నిజమైన ఆసక్తిగల వాళ్ళెప్పుడూ వస్తారు. క్రమంగా అదే ఆ సంఖ్యను పెంచుతుంది.


అలా భావించే వ్యక్తి చెప్పే విషయాలేవన్నా బోరుగా ఉంటాయా అనుకుంటే... ముందుగా ఆయన గురించిన ఒక్...

ఇంతలో ఏదో చప్పుడైతే తల అటువైపు త్రిప్పి చూశాను. ఎదురుగా సోనియా గాంధీ వస్తోంది. ఊచలలోంచీ. నాకాశ్చర్యమనిపించింది. వస్తే గిస్తే పున్నమేమన్నా రావాలిగానీ, (మనలో మాట నాకైతే పున్నమి నాకోసమొస్తుందని అసలు అనుకోలేదు. దయ్యాలకు నా మీదేమాత్రం మమకారముండదని నా ప్రగాఢ విశ్వాసం. గాఢ సల్ఫ్యూరికామ్లమేం కాదూ అనకండి. వాతికి మనుషుల్తో పనేంటీ? హాయిగా వాతి మానాన వాటి పనుల్లో బిజీగా ఉంటాయిగానీ. మనమంతా సినిమాల్జూసి చెడిపోతున్నాం. దయ్యాలు మనుషుల్ని ప్రేమిస్తాయనీ, ఆఁ ఇక ఈ సుత్తి వదిలేద్దాములే. ఈ విషయాన్ని వేరొక సారి కొడదాం) ఈ సోనియా గాంధీ రావటమేంటీ? నాకు ఆర్థం కాలేదు. సరే ఎటూ పోలీసులకు కనపడదు కదా, కాసేపు కాలక్షేపం అనుకున్నా. ఆ క్షణంలో వాళ్ళకు ఆ సోనియా గాంధీ కనబదక పోయినా నేను మాట్లాడితే తేడా గాడనుకుంటారనే అనుమానం రాలేదు. ఇంటి తిండి తినక మెదడు మూడంకేసిందేమో మరి.

"హాయ్! ఏంటండీ ఇలా వచ్చాఆఆఅ...," అనబోయేంతలోనే కళ్ళు నీలం జేసి (దయ్యాలకు కోపం వస్తే కళ్ళు అగ్ని గోళాల్లా ఉంటాయని జనం అంటారట. ఎర్రగా ఎందుకుండాలని హైదరాబాద్ బ్లూస్ చూశాక కళ్ళు నీలం చేయటం నేర్చుకుందని నాకు తరువాత్తరువాత్తెలిసింది) ఇదిగో నీ పుస్తకం అని ఇచ్చింది.  అది ఇప్పుడు మనం చర్చించుకుంటున్న పుస్తకమే. నేను ఆశ్చర్యంతో నోరు తెరచి thanks చెప్పబోయేంతలో, "రాసేదేదో సరిగ్గా రాయి. ఇంత వరకూ ఒక్కదాన్నీ పున్నమి గురించి సరిగ్గా రాయలేదు. కనీసం చూసన్నా సరిగ్గా రాస్తావని తెచ్చిచ్చా"

నేను గుడ్లు మిటకరించా... "ఇక నే పోతా." అని వెళ్ళిపోయింది. మళ్ళా సరిగా వ్రాయక పోతే ఎక్కడ మీద పడుతుందో అని భయమేసింది.
***   ***   ***

ఫిజిక్స్, ఫిలాసఫీ సాధారణంగా చదవాలంటే మహ బోరు కొట్టిస్తాయి. మామూలుగా జనం అర్థం కావని వదిలేస్తారు. కానీ వాటిని సరైన పద్ధతిలో చెప్తే వాటంత ఆసక్తికరమైన విషయాలేవీ ఉండవు. అలా ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నంలో సబ్జెక్ట్ లోని సారాన్ని మిస్ కాకూడదు. సైన్సునొదిలేసి మిగతా సంగతులెక్కువ చెపుతారు.

ఈ పుస్తకం పేరు వినగానే ఇదేదో ఒక సీరియస్ పుస్తకమనుకునేరు. సబ్జెక్ట్ సీరియసైనా దాన్ని డీల్ చేసిన విధానం బాగా ఇంటెరెస్టింగా ఉంటుంది. పైగా ఎవరైనా (సైన్స్ చదవని వారు కూడా) తేలిగ్గా చదివి అర్థం చేసుకునేలా.

ఇంతకీ







క్వాంటం ఎలెక్ట్రో డైనమిక్స్ అంటే ఏమిటి? 


కాంతికి సంబమ్ధించినంత వరకూ అది కణ రూపంలో ఉంటుందా? లేక తరంగ రూపంలో ఉంటుందా అన్న ప్రశ్న మొదటి నుంచీ, అంటే న్యూటన్ కాలం నుంచీ ఉన్నదే. కొన్ని కొన్ని ధర్మాలను (properties) కణ రూపంలో కాంతి ఉందని అనుకున్నప్పుడే వివరించగలము. మరి కొన్ని ధర్మాలను కాంతి తరంగ రూపంలో ఉందనే భావననుపయోగించి చెప్పగలము. మరలాంటప్పుడు కాంతి తరంగరూపమా? కణ రూపమా? Is light of particle nature or wave nature? 


చివరకు శాస్త్రవేత్తలు కాంతి అటు కణ రూపంలోనూ, తరంగ రూపంలోనూ ఉన్నదని తేల్చారు (నిజం చెప్పాలంటే సరిపెట్టుకున్నారు) క్రమంగా కేవలం కాంతే కాదు మిగిలిన ఏ వస్తువులైనా కదులుతున్నప్పుడు తరంగ రూపానికి దగ్గరగా ఉంటాయని చెప్పారు (Wave Particle duality).


Every body is associated with a wave when in motion అని లూయీ డీ బ్రోగ్లీ అనే శాస్త్రవేత్త ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఆ పునాదుల పైన ప్లాంక్ సిద్ధాంతాన్నుపయోగించుకుని క్వాంటం మెకానిక్స్ నిర్మితమైంది. దానికి ముందు జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ అనే ఆయన (పంతొమ్మిదవ శతాబ్దపు అత్యున్నత శాస్త్రవేత్త) Electromagnetic Theory ని develop చేశాడు. అలాగే ఐన్‍స్టీన్ ప్రతిపాదించిన Theory of Relativity ఉండనే ఉంది. 


ఈ క్వాంటం ఎలెక్ట్రో డైనమిక్స్ పైన చెప్పుకున్న మూడింటి సమాగమమే. నేను చెప్పిన దానికన్నా ఆ పుస్తకం చదివితే ఇంకా తేలిగ్గా అర్థమవుతుంది.

కాంతి గురించీ, ప్రస్తుతం ఫిజిక్స్ లో జరుగుతున్న పరిశోధనల గురించీ Feynman మాటల్లో తెలుసుకోవచ్చు.

కొన్ని చెమకులు...


People are always asking for the latest developments in the unification of this theory with that theory, and they don't give us a chance to tell them anything about what we know pretty well. They always want to know the things we don't know. — Richard Feynman


ఈ పుస్తకమంతా Feynman 1979 లో ఆక్లండ్ యూనివర్సిటీలో ఇచ్చిన లెక్చర్ల సమాహారం. వాతినే స్వల్ప మార్పులతో పుస్తక రూపంలో తెచ్చారు.


ఇందులో మనం రోజువారీ చూసే గ్లాస్ మొదలైన వస్తువుల మీద కాంతి పడితే ఏమవుతుంది లాంటి విషయాలని ఉపయోగిస్తూ, న్యూటన్ మహాశయుడు ఎన్ని విధాలుగా కాంతి గుణగణాలను తెలుసుకో ప్రయత్నించాడో వివరిస్తారు.


మొత్తం నాలుగు అధ్యాయాలు.


1. మొదటి అధ్యాయంలో కాంతి కణాలైన ఫోటాన్ల గురించిన ప్రాథమిక అంశాలు


2. రెండవ అధ్యాయంలో ఫోటాన్ల ధర్మాలను,


3. మూడవ అధ్యాయంలో uncertainty principle, ఎలక్ట్రాను ధర్మాల గురించీ, క్వాంటం సిద్ధాంతం గురించీ, 


4. చివరి అధ్యాయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల గురించీ చెప్పాడు. 


ఈ పుస్తకం గురించి Feynman మాటల్లో...


What I am going to tell you about is what we teach our students in the third or forth year of graduate school- and you think I'm going to explain it to you, so you can understand it? No, you are not going to be able to understand it. Why, then, am I going to bother you with all this? Why are you going to sit all this time, when you won't be able to understand what I am going to say? It is my task to convince yoy not to turn away because you don't understand it. You see my physics students don't understand it either.That is because I don't understand it. Nobody does.


మరి మనకీ పుస్తకం ఎందుకు? అంత ఖరీదు పెట్టి కొనాల్సిన అవసరమేమిటి? పుస్తకం చదివితేనే తెలుస్తుంది దాని విలువ. కనీసం మనకేది అర్థం కాదో తేలిగ్గా తెలుసుకునేందుకైనా ఈ పుస్తకం చదివి తీరాలని నాకు ఈ పుస్తకమిచ్చిన ప్రొఫెసర్ జాన్ వెన్నన్ అన్నారు. 


పుస్తకం ఖరీదు రెండువందల పది. కానీ మనకి తెలిసే విషయాల విలువ...? హహహ


లాండ్మార్క్, వాల్డెన్, మొదలైన చోట్ల దొరకవచ్చు. నా దగ్గర ఉంది అమెరికనెడిషన్.


ఆ లెక్చర్లను వీక్షించాలంటే ఇక్కడ నొక్కండి...

Posted by గీతాచార్య Jan 28, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!