BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


ఏమవుతున్నదో నాకు ఇంకా తెలియటం లేదు. ఇక్కడంతా చీకటి గుయ్యారం. అంతా చీదరగా తడిగా ఉంది. అమ్మ భారంగా ఊపిరి పీల్చుకోవటం తెలుస్తోంది. ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. నాకైతే ఏమీ అర్థం కావటంలేదు. ఒక్కటి మాత్రం తెలుస్తోంది. అమ్మ ఎమ్దుకో బాగా టెన్స్ గా ఉంది. నాకు భయం గా ఉంది. కాసేపటి క్రితం విన్న విషయం గురించి. అమ్మ తీసుకునే నిర్ణయం మీద నా జీవితం ఆధారపడి ఉంది. మరి అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?

ఇంతలో అమ్మ కదలటమ్మొదలెట్టింది. చేతులాడిస్తోందా? ఏమో మరి. అవుననుకుంటా. "ఈ ఫోనిప్పుడే మోగాలా?" అని అమ్మ అనటం లీలగా వినిపిస్తోంది. ఫోను తీసుకున్నట్టుంది. కుడి చెయ్యనుకుంట పైకి లేపినట్టు నాకు తెలుస్తోంది. "హలో!" వీగ్గా అమ్మ గొంతు వినిపిస్తోంది. నేను రిక్కిద్దామన్నా నాకు చెవులు లేవు. ఏవో రెండు కన్నాలున్నాయేమో. ఐనా నా ప్రాణాలన్నీ ఉగ్గబట్టి మరీ వినటమ్మొదలెట్టాను. ఎందుకంటే ఇది నా జీవన్మరణ సమస్య మరి. 

"అవును. డాక్టర్ని కలిశాను. చాలా టెస్టులు రాసింది."

అవతల ఫోనులో ఎదుటివారు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు. అంటే తెలియదు అని. ఎందుకంటే నాకు వినబడదుగా. 

మళ్ళీ అమ్మే అంటోంది. "లేటేజి ప్రెగ్నెంసీ కదా. చాలా కాంప్లికేషన్లున్నాయి. ఎబార్షన్ చేయించుకోమని డాక్టర్ అంది. టెస్ట్ రిజల్ట్స్ తరువాతొస్తాయట. వన్ వీక్ ఆగి రమ్మన్నది. అప్పుడు చెబుతానన్నది. ఎబార్షన్ ఎంత వరకూ అవసరమో అని. తల్లా బడ్డా తేల్చుకోమంటుందేమో మరి ఆవిడ. ఏంతేల్చుకోను?" అమ్మ నవ్వినట్టుంది. నాకు ఊపిరి కాస్త ఎక్కువగా అందింది. నాకు నిద్ర వస్తోంది. ఐనా ఏమనుకుంటున్నదో వినాలని అలాగే ఉన్నా. నాకు కంఫర్టబుల్ అనిపించిన పొజుషన్లోకి మారి. 

"ఏమైనా సరే, నాకైతే ఎబార్షన్ ఇష్టం లేదు. ఐ వాన్ట్ దిస్ బేబీ. ఎందుకనో తెలియదు కానీ, ఐ ఫీల్ లైక్ దిస్." అమ్మ మాటలు నా చెవిని కలకండ పలుకుల్లా తాకాయి. కానీ అంతలోనే మరో భయం... అమ్మకి ఏమన్నా అయి, నన్ను కనగానే అమ్మ చనిపోతే? నాకా ఆలోచనే భయం కలిగించింది. అమ్మ. ఇప్పుటి దాకా నన్ను అపురూపంగా చూసుకుంటున్న అమ్మ! నాకు ఊపిరి ఇస్తున్న అమ్మ. నేను పుట్టటానికి కారణమై, నేను రూపు దిద్దుకుంటంలో ముఖ్య పాత్ర పోషించిన అమ్మ! తనకేమన్నా అయితే ఇంకేమన్నా ఉందా? ఆలోచనల్లో ఉండగానే నిద్ర పట్టేసింది. మధ్య మధ్యలో నా ఆవాసంలో దొర్లుతున్నట్టు తెలుస్తున్నా ఎటు వెళుతున్నానో, ఏమి జరుగుతోందో నాకు ఏమీ అర్థం కాలేదు. కానీ, నా ఆలోచన మాత్రం అమ్మకి ఏమీ కాకూడదని. హాయిగా నేను చచ్చిపోతే అమ్మకి ఏమీ కాదు కదా. కానీ, నన్ను నేను చంపుకోలేను. ఎబార్షన్ అయినా అమ్మచేతుల్లోనే ఉంది. అమ్మ నిర్ణయమ్మీద మా ఇద్దరి జీవితాలు ఆధార పడి ఉన్నాయి. కాలమే మా జీవితాల్ని నిర్ణయిస్తుంది. కానీ నాకు మాత్రం భయం తగ్గలా. జూజూ అని నేను మాత్రం తేలుతూనే నిద్ర పోతున్నా. ఒక రూపం సాపం లేని నామీద అమ్మకింత ప్రేమ ఎందుకో. ఏమైనా సరే నాకైతే ఎబార్షన్ ఇష్టం లేదంటోంది. అసలు నన్ను చూసిందా తను? నేను కూడా అమ్మని చూళ్ళేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు. అమ్మ మనసు ఎంతో అందమైంది. 
***   ***   ***

మిసెస్ ప్రేమా నిరంజన్ డైరీలో ఒక రోజు follows quickly... :-)


Posted by గీతాచార్య Apr 14, 2010

Subscribe here