BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

ఈ మధ్య మన B&G కదలటం లేదేంటా అని అనుకుంటూ ఇంక్వైరీ చేస్తే గీతాచార్య సెమెస్టర్ పనుల్లో బాగా బిజీ అని తెలిసింది. మరి బిజీ తగ్గేదాకా ఇంతేనా అని అంటే నువ్వే ఒక టపా వ్రాయకూడదూ అని అన్నారు. నాకు ఒక నెల పైన ఖాళీ దొరికింది కానీ, దొరక్క దొరక్క దొరికిన ఖాళీని పూర్తిగా సద్వినియోగం చేసుకుందానని బబ్బునే పనిలో బిజీ ఐపోయా. ఏదైనా పుస్తకం గురించి రాద్దామనుకున్నా కానీ, కష్టం కదా. బాగా ఆలోచించి రాయాలని ఏమి చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టమైన కాపాట (కాపీ పాట) గుర్తొచ్చింది. ఇప్పటికీ ఆ పాట వింటుంటాను దాదాపూ రెగ్యులర్ గానే. దాన్ని గురించి కాస్త పంచుకుందాము. కాస్త బద్ధకం తగ్గాక మంచి పుస్తకవరేణ్యుని గురించి ఇద్దామని ఇలా వచ్చా.

ఆ పాట... मैंने प्यार किया  లోని మేరి రంగ్ మేఁ... పాట. బహు చక్కని ఒరిజినలు పాట అది. మరి దాని ఒరిజినలెక్కడ?

అది స్వీడిష్ రాక్ బ్యాండ్ యూరప్ కోసమని జోయీ టెంపెస్ట్ రాసి పెట్టిన The Final Count Down. యూరప్ ని ఎనభైల్లో ఒక ఊపు ఊపిన ఈ పాటని మన బాలీవుడ్డు సంగీత చోరా కారులు కళాకరించేశారు. ఐనా విశేషమేమిటంటే రెంటిలోనూ అద్భుతమైన లిరిక్స్ ఉన్నాయి. కాపీకరించినా ఆ అందం చెడకుండా మననీ ఒక ఊపు ఊపేలా ఉంది. మొదల్లో వచ్చే మ్యూజిక్ అబ్బ! తల్చుకుంటుంటేనే వళ్ళు పులకరించి పోతుంటుంది. ఒరిజినలైనా, మన రిజినలైనా (రీజియానల్ ని భ్రష్టీకరించాను). భలే ఉత్సాహమైన మ్యూజిక్, మనసుని హత్తుకునే లవ్ ఫీల్ ఉన్న పాటలవి.

నా చిన్నప్పుడు, వాళ్ళపెళ్ళి రోజున నన్ను పిలవకుండా పెళ్ళి చేసుకున్నారని అమ్మా, నాన్నల మీద అలిగిచ్చి, గిల్లి చంపేస్తుంటే సినిమా కెళదాం అన్నారు. నాకు మా చెడ్డ కోపం. చెడ్డ కోపం కదా. అందుకే అది వచ్చిందంటే దొరికిన వాళ్ళని దొరికినట్టు గిచ్చేస్తా. అసలే పొడుగాటి గోళ్ళు. నా గిచ్చుడు తప్పించుకునేందుకు నన్ను తీసుకెళ్ళిన సినిమా ప్రేమ పావురాలుमैंने प्यार किया ప్రేమ పావురాలు ఎలా అవుతుందో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. కానీ సినిమా కన్నా నాకు పాటలు బాగా నచ్చాయి. అందులోనూ మేరీ రంగ్ మే పాట చాలా బాగా నచ్చింది. 

సహజంగా నాకు బాగా నచ్చినవి ఒరిజినలు కాదని బహు నమ్మకం (కోడలి నమ్మకం కాదండీ. బాగా అని అన్న మాట) ఈ మధ్య వెతుకుతున్నా ఒరిజినలు కోసమని. అది The Final Count Down అని ఇక్కడికి చదూకునేందుకు వచ్చాక తెలిసింది. ఇప్పటికీ ఇక్కడ అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉంది. పైగా మా రిసెర్చ్ మేట్ ముపాలిక ఎంపోఫు (Nmupalika Mpofu) అబ్బో మహ శ్రావ్యంగా పాడేస్తుంటాడు. 

The Final Count Down లిరిక్స్ ఇక్కడ చూడండి...

We're leaving together
But still it's farewell
And maybe we'll come back
To earth, who can tell?
I guess there is no one to blame
We're leaving ground
Will things ever be the same again?

It's the final countdown
The final countdown

Ohh
We're heading for Venus and still we stand tall
'Cause maybe they've seen us and welcome us all, yea
With so many light years to go and things to be found
(To be found)
I'm sure that we'll all miss her so

It's the final countdown
The final countdown
The final countdown
(The final countdown)
Ohh ho ohh

The final countdown, oh ho
It's the final countdown
The final countdown
The final countdown
(The final countdown)

Ohh
It's the final countdown
We're leaving together
The final countdown
We'll all miss her so
It's the final countdown
(The final countdown)
Ohh, it's the final countdown
Yea

వీడియో ఇక్కడ చూడండి...అలాగే మన హిందీ పాట లిరిక్స్ ఇక్కడ...

Mere Rang Mein Rangne Wali
Pari Ho Ya Ho Pariyon Ki Rani
Ya Ho Meri Prem Kahani
Mere Sawaalon Ka Jawab Do, Do Na
Bolo Na Kyu Yeh Chand Sitare
Takte Hai Yuh Mukhde Ko Tumhare
Chuke Badan Ko Hawa Kyu Mehki..?
Raat Bhi Hai Kyu Behki Behki..?
Mere Sawaalon Ka Jawab Do, Do Na

Kyu Ho Tum Sharmai Hui Si
Lagti Ho Kuch Ghabrai Hui Si
Dhalka Hua Sa Aanchal Kyu Hai..?
Yeh Mere Dil Mein Hulchul Kyu Hai..?
Mere Sawaalon Ka Jawab Do, Do Na

Dono Taraf Benaam Si Uljhan
Jaise Mile Ho Dulha-Dulhan
Dono Ki Aisi Halat Kyu Hai..?
Aakhir Itni Mohabbat Kyu Hai..?
Mere Sawaalon Ka Jawab Do, Do Na

దాని వీడియో ఇక్కడ... 


ఒరిజినల్ పాట... The Final Count Down లో పాట మొదలవ బోయే ముందు  ఊఊఊఊఊ అంటూ వచ్చే బిట్ జాగ్రత్తగా వినండి. మనసెక్కడకో వెళ్ళి పోతుంది. 

అలాగే తెలుగు తరహా హిందీలో బాలూ కూడా మ్యాజిక్ చేస్తాడు. 

కొసమెరుపేంటంటే... The Final Count Down పాట ఫిబ్రవరి 14 1986 న విడుదలైంది. 

Posted by గీతాచార్య Apr 10, 2010

Subscribe here