ఈ వ్యాసం ఇంతకు మునుపు నవతరంగంలో వచ్చింది. సరదా సరదా రివ్యూ కనుకా, చాలా రోజులైంది కనుకా ఇక్కడ.
అదండీ సంగతి. సినిమా గురించి మీకు అర్ధం అయి ఉంటుంది. ఇంతకీ ఏమి సినిమా అది?
వేశావులే ప్రశ్న!
నేను వెయ్యలేదండీ. ప్రశ్నించాను. అంతే పాపం.
ఎన్నిసార్లు చూసినా కొన్ని సినిమాలు మాత్రం విసుగెత్తవు. అందులోనూ కొన్ని సన్నివేశాలు ఎన్నిసార్లు చూసినా నువ్వు పుట్టిస్తూనే ఉంటాయి.
ఒక సినిమా తీయాలంటే కథ, కథనం ప్రధానం. ఇవాళ నీకు ఏదో అయ్యింది. తెలుగు సినిమాల్లో కథ ప్రధానం. కాదు. వీరో ల బాడీ లాంగ్వేజ్ ముఖ్యం అంటే నేను ఏమీ చేయలేను. పాపం.
కథనం అస్సలు కాదు. గ్రాఫిక్కులు బావున్నాయాలేదా? ఈరో గారు డాన్సులు బాగా చేశారా లేదా? ఫైట్లు కొత్తగా ఉన్నాయాలేదా? నీకు మతి పోయింది అందుకే ఇలా అంటున్నావు అంటారా? ఏంచేస్తాం చెప్పండి. పొద్దున్న ఒక లోకల్ చానల్లో ….
ఆఁ.. లోకల్ చానల్లో….???
ఆ ఒక్కటీ అడక్కు!
రాజేంద్రప్రసాద్ హాస్యం, రావు గోపాలరావు నటనా, డైలాగ్ డెలివరీ, రంభ అందచందాలు (నాకు అంత నచ్చలే!) ఎల్బీ శ్రీరాం పాండిత్యం… అబ్బబ్బో…!!!
చేశావులే పొగడ్త!
ఏవీయం వారు తెలుగులో తీసిన చివరాఖరి సినిమాల్లో ఇదీ ఒకటి. ఈవీవీ దర్శకత్వంలో, కె.వి.మహదేవన్ సంగీత దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా కామెడీ సినిమాల్లో ఒక క్లాసిక్. సందేశాలు under current గా ఇస్తాం అనే మన తెలుగు సినిమాల్లో… సందేశాన్నీ, హాస్యాన్నీ రంగరించి రెండున్నర గంటల పాటూ ప్రేక్షకులని ఆడించీ, పాడించీ, మురిపించీ, మైమరపించీ….
చేశావులే భజన!
అందుకే నేను ఏమీ చెప్ప. క్రింద రాసినవి చూసి సినిమాని చూడాలో వద్దో నిర్ణయించుకోండి.
పెట్టావులే స్వీటు!
అందరూ (ఈ చదివే వాళ్లు) (అసలంటూ ఉంటే) ఈ చిత్ర విదూషకాన్ని (చిత్రరాజం కాదు. But in the same sense) చూసి ఉంటారు. మళ్ళీ చూడాలంటే కనుక…
కథ: పగటి కలలు కంటూ జ్యోతిష మాయాజాలం లో పడి బాధ్యతలని పట్టించుకోకుండా తిరిగే వ్యక్తి జీవితం లో ఎలా మార్పు వచ్చింది?
ఐ బాబోయ్! దీంట్లో కతుందండీ.
కథనం: ఎలా చెపితే జనానికి ఎక్కుతుందో, ఏ పాళ్ళలో హాస్యాన్ని, ఏ పాళ్ళలో పదోవంతు అర్ధం (అబ్బ! sentiment కి వచ్చిన తిప్పలు ఇవి. అనుబంధాలూ ఆప్యాయతలూ అందామంటే అంత సంతృప్తిగా అనిపించలేదు. అందుకే అలా literal గా అనువదీకరించాను).
కథనం అందరికీ తెలుసు కనుక నేను resigned. మరొక్కసారి చూడండి.
పెట్టావులే పకోడీ!
వీలైనంతవరకూ integrity చెడకుండా మరీ ప్రతి సన్నివేశం కాక పోయినా వృధా సన్నివేశాలు ఎక్కువ లేకుండా వీక్షకబుల్గా, బోరీకరణ లేకుండా ఉంది. మనం కొన్ని సన్నివేశాలకోసం ఎదురు చూసేలా ఉండటం ఈ సినిమా గొప్పతనాన్ని పట్టి ఇస్తుంది. చాలా హాస్య సినిమాల్లో ఇదే విషయం మీద దృష్టి పెట్టి మిగతా సన్నివేశాలలో బలం లేకుండా చేసుకుని అపహాస్య హత్య చేసుకుంటాయి (ala ఆత్మహత్య).
పాత్రలని establish చేసిన విధానం, వాటి వ్యక్తిత్వాలని చూపెట్టిన విధానం అద్భుతం.
పడ్డావులే ఆశ్చర్యం.
ముఖ్యంగా ముఖ్యం అన్నా అనక పోయినా అన్ని పాత్రల్నీ బహు బాగా establish చేశారు.
ఎక్కడా inconsistensy ఉండదు. చాలా సినిమాల్లో మిస్సయ్యేది అదే. (కావాలంటే అతిపెద్ద బిగ్గెస్ట్ బడా హిట్ అయిన సినేమాలో హీరోయిన్ పాత్ర చూస్తె అర్ధం అవుతుంది).
మచ్చుకు రావు గోపాలరావు ని పరిచయం (introduce అనాలా?) చేసే సన్నివేశాన్ని తీసుకుందాం. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనే విధంగా అటు బ్రహ్మానందాన్ని, ఇటు రావుగారినీ, వాళ్ల వాళ్ల వ్యక్తిత్వాలనీ మనకి శానా వీజీ గా అర్ధం అయ్యేలా చీపించారు.
చెప్పావులే నిజం!
ఆఁ ఒక్క సన్నివేశం చాలు సినిమాని కేవలం వినోదం కోసమే కాదు, మామూలుగా నవ్వించేటన్దుకే కాదు, కాస్త సీరియస్ (శ్రద్ధ అనాలా?) గానే తీశారని చెప్పవచ్చు. ఎంతైనా ఏవీయం వాళ్లు కదా.
ఈ కథనం గురించి మరో వ్యాసంలో వివరిస్తాను.
నటీనటులు: రాజేంద్రప్రసాద్, రంభ, రావు గోపాలరావు, నిర్మలమ్మ, బ్రహ్మానందం, లతాశ్రీ, బాబూ మోహన్, ఇంకా….
వేశావులే లిస్టు!
ప్రతిభ: నటీనటులంతా masters in comedy (రంభ కొత్తది అప్పటికి). కనుక వారి గురించి చెప్పటానికి ఏమీ ఉండదు. ఆ పాత్రలకి న్యాయం చేశారనటం తప్ప.
ONLY MASTERS THAT MATTER. WHO CREATES WONDERS అని పికాసో అన్నాడుకదా.
అలాంటివారే ఇందులో ఇమిడి పోయారు.
కొన్ని చోట్ల అతి ఉన్నా అది హాస్య చిత్రాలకి అవసరం కనుక పట్టించోకోనవసరం లేదు.
సంగీతం: ONLY MASTERS THAT MATTER. WHO CREATES WONDERS. ఇళయరాజా అండీ. (ఆ రోజు తెవికీ వల్ల పప్పులో కాలేశాను. నవతరంగం వారికి సారీలు)
“…”
దర్శకత్వం: ఈవీవీ కి ఇదంతా కొట్టిన పిండే కదా. అయినా ఒక మాట. ఈ మధ్యా, ఆ మధ్యా కాస్త బూతు హాస్యాన్ని అందించే ఎవీవీ, ఈ చిత్ర విదూషకం విషయంలో అంత హద్దులు దాటలేడనే చెప్పాలి. ఆ శోభనం సన్నివేశాలని మినహాయిస్తే. అప్పటికీ అంత వెగటు పుట్టించేలా లేదులే. ఏవీయం వారి సినిమా కదా.
రచన: ఎల్బీ శ్రీరాం పెట్టాడులే భోజనం.
ఫోటోగ్రఫీ, వగైరాలు: ఈ సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి.
Rating: 4.25 on the scale of 5. ఇది నా దృష్టి మాత్రమే. మీ rating మీ ఇష్టం. కానీ సినిమాని ఎన్నిసార్లు అయినా చూడొచ్చు.
అయ్యిందిలే రీవ్యూ.
గమనిక: ఈ వ్యాసం వ్రాసింది నేను కాదు. వాళ్లు. ఆ వాళ్ళెవరో నాకు తెలియదు. అందుకే నేను వ్రాసినట్లు.
చెప్పావులే వివరం