BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


2001 NOVEMBER 14thTHE BEGINNINGS

Dhanaraj Manmadha says...


మా నాన్న గారు చనిపోయి పది రోజులు కావస్తోంది. అమ్మ ఇంకా ఆ షాక్ నుంఛి కోలుకోలేదు. వచ్చిన వాళ్ళు మమ్మల్ని తిట్టటమో, లేకపోతే విపరీతమైన సానుభూతిని చూపటమో. అంతే. మాకూ ఆత్మహత్య చేసుకుంటే సరిపోతుందని అనిపిస్తున్న సమయం. విపరీతమైన మానసిక వత్తిడిలో ఉన్నాను. ఇల్లు ఖాళీ చేసేసి ఉన్నవన్నీ అమ్ముకుని వెళ్ళాల్సిన పరిస్థితి. మా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఉన్నవాళ్ళంతా ముఖం చాటేశారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని సమయం.

నేనప్పుడు డిగ్రీ లో ఉన్నాను. అంత వరకూ అలా సరదాగా కాలేజ్ కి వెళ్ళిరావటం, ఫ్రెండ్స్ తో షికార్లు కొట్టి రావటం, అలా అలా రోజులు వెళ్ళబుచ్చుతూ, కలలు కంటూ మహదానందం అంటే ఏంటో ఒక ఉదాహరణలా ఉండేవాణ్ణి. మా జీవితంలో పెద్ద కుదుపు. నమ్మిన స్నేహితుల చేతిలో మొసపోవటం వల్ల మా నాన్న ఆత్మహత్య చేసుకోవటం, లేని అప్పులు నెత్తిన పడటం, బంధువులంతా ముఖం చాటేయటం... రక్తం మరిగేలా చేసే ఙ్ఞాపకం అది. ఎదుటివారిని ఏమీ చేయలేని నిస్సహాయత.

"కొన్ని కోరికలు తీరాలన్నప్పుడు తీరవు. తీరా అవి నెరవేర్చుకొన గలిగే సమయం వచ్చే సరికి మనకి వాటి మీద ఆసక్తి పోతుంది. ఇదే మానవ జీవితం."

చాలా తేలిగ్గా అందరూ చెప్పే మాటలు అవి.

*** *** ***

సాయంత్రం నేనూ అమ్మా కూచుని ఉన్నాం. అమ్మ కళ్ళలో నిర్వేదం. నాకు పిచ్చి ఎక్కేలా అనిపిస్తూంది. ఇంతలో గేటు చప్పుడైంది. ఆ మధ్యే పరిచయం ఐన మా సీనియర్ ఒకతను తలుపు దగ్గర ఆగాడు. రానా వద్దా అన్నట్టు కాదు. నేను వస్తున్నాను. అన్నట్టు. తప్పదన్నట్టు నేను లేచి వెళ్ళి లోపలకి రమ్మన్నాను. లోపలకి వచ్చాడు.

అమ్మ లోపలికి వెళ్ళింది. మంచి నీళ్ళు తేవటానికి. ఏంటన్నట్టు చూశాను. "పది రోజుల్నించీ చూస్తున్నాను. నువ్వు కాలేజికి రావటంలేదు. I miss your bike yaar..." నవ్వుతూ అన్నాడు.

నాకు చిర్రెత్తుకొచ్చింది. తమాయించుకున్నాను. ఈ కొన్నాళ్ళలో ఎన్ని సార్లో అలా అనిపించినా అలాగే తమాయించుకున్నాను. విషయం తెలియదేమో అని చెప్పబోయాను. "Hmm. I know it bro. You oughtta move on." నేనలాగే చూస్తున్నాను. అమ్మ వచ్చి మంచినీళ్ళు అందించింది. మంచినీళ్ళు తాగుతూ అన్నాడు, "What d'yoo wann fromme. I don' go those bloody pitiful words. ఎన్నైనా, ఎన్ని చెప్పినా మీ నాన్నగారు తిరిగి రారు. ఇలాగే ఎంతకాలం కూచుంటావ్? ఏదోకటి చెయ్యాలి కదా. నాతో రా." నేను కదలలేదు. అమ్మ ఆశ్చర్యంతో చూస్తూంది. నా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు మా పరిస్థితి చూసి ఒక్కళ్ళూ రాలేదు. ఇతనేమో ఈ మధ్యే పరిచయం అయ్యాడు. అమ్మకి ఎవరో కూడా తెలీదు.

"కాసేపు ధనా ని నాతో పంపండి." అమ్మ కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నాడు. అమ్మమాట్లాడలేదు. తనే నావైపు తిరిగి రమ్మన్నట్టు చేయిజాపాడు. నేను ఇక మాట్లాడకుండా కదిలాను.

*** *** ***

ఒక అరగంట తర్వాత నేను ఇంటికి వచ్చాను. కానీ ఇందాకనలా కాదు. చాలా రెజువెనేట్ అయ్యాను. సానుభూతి వల్ల ఏమీ రాదు. కానీ జనానికి అదే కావాలి. కష్టం ఎవరికైనా వస్తుంది. అది నాకే వచ్చింది. నాకన్నాఎదుటివాళ్ళ కష్టాలు చాలా చిన్నవి అనుకోటం ఫూలిష్‍నెస్. అసలు కష్టం గురించి ఆలోచించటమే మానేస్తే? అసలు కష్టాన్ని లెక్కచేయకపోతే? అసలేదైనా పట్టనట్టుండగలిగితే?

నాన్న చనిపోయారు. ఆస్తులు పోయాయి. అప్పుల్లో ఇరుక్కున్నాం. అంతే. ఇంతకన్నా ఏమైంది? That's a fact. I can't change it. కానీ ఒకటి మాత్రం నేను చేయగలను. ఇక ముందు జరిగేదంతా నా చేతుల్లోనే ఉంటుంది. దాన్ని నాకిష్టమొచ్చినట్టు మల్చుకోగలను. అమ్మా, నేనూ ఉన్నాం. ఇంతకు ముందులా ఉండలేకపోవచ్చు. కానీ వేరే రకంగానైనా ఉండగలం కదా.

*** *** ***

"If you say yes to anything, it will be yours."

The Fountainhead లోని హీరో dialogue.

మరి నేనూ అంతే . ఈ ప్రపంచానికీ, ఈ లోకానికీ, "Yesss!" అందుకే ఈ ప్రపంచం నాదే. దేనికైనా భయ పడుతూ కూచుంటే అది మనకి మరణం తో సమానం అని వివేకానంద చెప్పారు. సో, "నో టు ఫియర్. ఎస్ టు ది లైఫ్." అదే నేను ఆలోచించింది.
ఏం జరుగుతుందో అని భయపడటం వల్లే, మాకు ఆ డిప్రెషన్. అదే ఏది జరిగినా నాకు తెలిసే జరుగుతుంది. I can decide, and implement the forth-coming events of my life. అనుకున్నాను. It's all in my hands.

*** *** ***

మర్నాడే గుంటూరుకి మారాం. ఆ ఫ్రెండ్ మాకు ఇల్లు మారటంలో సాయపడ్డాడు. ఇక వెళ్తాడనగా అమ్మ, "చాలా థాంక్స్ బాబూ!" అంది. "ధనాతో బైక్ మీద తిరగాలంటే తను తొందరగా కోలుకోవాలి. అందుకే వచ్చాను. It's just for my sake. Not to help you." పెద్దగా నవ్వాడు.

అతను వెళ్ళిపోయాక అమ్మ అంది. "ఈ కుర్రాడు చిత్రంగా ఉన్నాడు. దేనికైనా నవ్వుతున్నాడు. ఒకరకమైన హుషారుగా ఉంది అతను ఉంటే. నిజమే కదా. మనం అక్కడే అలాగేఉంటే మాత్రం జరిగినవన్నీ తీరిపోతాయా? ఒక్కపూటలో ఎంత మార్పు? నువ్వు నీ ఆలోచనలన్నీ చదువు మీదే పెట్టు. కావాల్సినవన్నీ నేనెలాగో చూస్తాను. ఇంతకుముందు లానే ఉందాం. ఏమీ జరగనట్టే."
ఆ తర్వాత ఆ ఫ్రెండ్ అంటే అమ్మకి ఇష్టం పెరిగిపోయింది. చాలా అభిమానంగా చూస్తుందిప్పటికీ. అనుకున్నది అనుకున్నట్టు చెయ్యటం తప్ప, అనవసరపు ఆలోచనలు చేయటం వృధా అన్న తన మాటలు నాకిప్పటికీ వేదవాక్కే. అందుకే తనని నేను మాస్టర్జీ అంటాను. మా ఇద్దరి పుట్టినరోజే కాదు ఆలోచనా విధానం కూడా ఒకటే. అలా మొదలైన మా స్నేహం చాలా చిత్రంగా ఉంటుంది. రకరకాలైన ఎడ్వెంచర్స్ చేశాం. తనకి బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం. అలా మేము ఎన్నోసార్లు బైక్ మీద తిరిగాం. ఒక్కోటీ ఒక్కో కథ. ఎన్నెన్నో అనుభవాలు. అవన్నీ ఇక్కడ మీతో పంచుకునే ప్రయత్నమే ఈ...

MOTORCYCLE DIARIES

*** *** ***

మా బైక్ ప్రయాణాల ఆలోచన నేను ఇందాకన చెప్పిన అరగంటలోనే కలిగింది. నా జీవితంలోని అతిముఖ్యమైన అరగంట అది. అందుకనే ఈ విషయాలన్నీ ఇక్కడ గుర్తు తెచ్చుకున్నాను. ఆ అరగంటా ఏమైందో చివరలో చెప్తాను. ఈ లోపల మా బైకానుభవాలని ఆస్వాదించండి.

NEXT EPISODE: Must lead the Life. (MOTORCYCLE DIARIES లో)

*** *** ***

ఈ బైక్ కథల్లో ప్రధాన సూత్రధారి ఐన మా ధనరాజ్ మన్మధ ఇక్కడ తన version of the stories ఇస్తాడు. వీటి వెనుక ఉన్న మా సత్యాన్వేషి మిగిలిన వివరాలని ఇస్తాడు.


Chaitanya Kalyani

Posted by చైతి Jul 11, 2009

Subscribe here