ముఖ్య మంత్రి (?) వయ్యస్సార్ మరణం గురించి ఇది టపా కాదు. ఇప్పుడు టీవీలో వింటున్న వ్యాఖ్యానంలో ఒక గొప్ప సత్యం తెలుసుకున్నాను. సారీ సత్యం కాదు నిజం. (ఆ రెంటికీ తేడా ఏంటో? ఆ చెప్తారు. ఇక్కడ నా సోది వేరు. ఇంటిగ్రిటీ దెబ్బ తినదూ? ;-) )
"అచ్చ తెలుగు తెలుగు వాడు" అని వ్యాఖ్యానంలో అంటుంటే అదంటే ఏంటో బోధ కాదు కాదు భోద అయ్యో ఇదీ కాదు కాదు... బాధ కాదున్నర కాదు అర్థం కాక అడుగుతున్నాను. అంటే ఏమిటో నాకు చెప్పగలరా? (చెప్పు + కలరా కాదండీ... Can you explain please అని).
ఆయన ఆహార్యం చాలా గొప్పగా ఉంటుంది. చక్కని పంచ కట్టు, తెల్లని చొక్కా. తలగుదనాన్ని ప్రతిబింబించేలా. ,అరి అచ్చ తెలుగు తెలుగు వాడంటే? అంటే అచ్చ తెలుగు అరవ వాళ్ళుంటారా? అదీ నా అనమానం.
ముఖ్యమంత్రి వయ్యస్సార్ గురించి కాస్త హడావిడి తగ్గాక వ్రాయాలి! ఈ లోపు జలయఙ్ఞం లో ప్రాజెక్టుల వేట