BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


Books and Galfriends!!!

ఏంటిదింతకీ? 

గత అక్టోబర్లో (అంటే సంవత్సరం క్రితం) నా స్నేహితురాలు చైతన్య కళ్యాణి ఎందుకో దిగులుగా ఉంది. తనని ఆ మూడ్లోంచీ బయట పడేసేందుకు బ్లాగులని పరిచయం చేసి, తననీ వ్రాయమన్నాను. నేను ఎమ్తో సెలెక్టివ్ గా చూపన కొన్నింటని చూసి బాగున్నాయి నేను కూడా మొదలెడుతాను అంది. ఇంతకీ ఆ బ్లాగుకేపేరు పెట్టాలి? సమస్య. అప్పట్లో నేను ఎక్కువ బ్లాగింగ్ చేయటంలేదు. పైగా నేను ఎక్కువ మందికి తెలియదు కూడా. నా వింబుల్డన్ విలేజే కాస్త గుర్తింపు. అందుకే మంచి catchy గా ఉన్న పేరు పెడదాం అనుకున్నాం. ఇంతకీ ఏ పేరు?

దేని గురించి వ్రాయాలనే సమస్య. ఆ మధ్య కొన్నాళ్ళు పరిస్థితుల ప్రభావమ్ వల్ల నేను పుస్తకాలు కొనటం, చదవటం తగ్గించాను. కానీ మళ్ళి ఒకరి వల్ల నాలో పుస్తకాల పట్ల ఆసక్తి రేగింది మళ్ళీ. విశాలాంధ్రా పుస్తకాల ప్రదర్శన జరుగుతుంటే వెళ్ళి జమీల్య, ఎగిరే క్లాస్ రూం, బుడుగు, ఇంకా నాలుగైదు కథల పుస్తకాలు కొన్న ఊపులో ఉన్నా. కనుక పుస్తకాల మీద ప్రత్యేక బ్లాగు ఎటూ లేదు కనుక (నాకు తెలిసినంతలో. అప్పటికి తెలుగులో పూర్తిస్థాయి స్పోర్ట్స్ బ్లాగుగా వివి మొదలెట్టాను నేనే మొదట) సో బుక్స్ విలేజ్ అనే పేరు పెట్టాలని అనుకున్నాం. ప్చ్. మామూలుగానే ఉంది కదా.

ఉత్తినే బుక్సే ఎందుకు? వాటి గురించి ఎందుకు? చాలా మంది చాలా పుస్తకాల గురించి రాస్తున్నారు కద. మనకన్నా పేరున్న వాళ్లని చూపించావు. మరేదన్నా చెప్పు అమ్ది. అందరికీ పుస్తకాలతో ఉన్న అనుబంధం వేరు, నాకున్న అనుబంధం వేరు. Those are more than friends to me. అన్నాను. నాకెంత ఇష్టమంటే ఒకందమైన అమ్మాయి వెంట పడటం ఎంత మజా ;-) నిస్తుందో అంత మజానీ పుస్తకం చదివితే వస్తుంది. Sometimes I feel books are better than friends. Friends may leave you, but the book which once become your property, it will never leave you. Even if you lose it, itz essence will never leave you.

అందుకే ఈ బ్లాక్కి BOOKS AND GALFRIENDS అనే పేరు పెట్టేద్దాం అన్నాను. అలా మొదలెట్టి వీవెనీకరించబోతే ఆంగ్లంలో టపాలున్నాయి కనుక కూడలైజేషన్ చేయటం కుదరదన్నారు. మళ్ళా తెలుగులో టపాలు వ్రసి పంపే లోపుల ఏడు నెలలు గడిచి ’మే’కరణ జరిగింది. ఇక లాభం లేదు. దీన్ని ఇలా వదిలేసే కన్నా ఏదోకటి చేయాలని మళ్ళా మొదలెట్టి, కూడల్లో దిగి, సృజన అందిన మాలా కుమార్ గారి బుడుగు వ్యాసంతో రంగంలోకి దిగాం. ఓ వెయ్యి క్లిక్కులు పడే సరికే మూడు నాలుగు నెలలు పట్టే నా బ్లాగుకి రెణ్ణెల్లు తిరక్కుండానే మూడు వేల దాకా హిట్స్ వచ్చాయి. ఇంతలో సుజాత గారు అందుకుని రోజులన్నీ (మీ)మావే అనిపించారు. వెంటనే మా బైకు రైళ్ళ గురించ రాద్దామని Dhanaraj Manmadha అంటే నువ్వే మొదలెట్టు, తరువాత నేనందుకుంటాను అన్నా. అలా మొదలైన MOTORCYCLE DIARIES బాగా రిసీవ్ చేసుకోబడింది. అందులో దాదాపూ 20adventures వస్తాయి. ఇప్పటికెక్కువ క్లిక్స్ సుజాత గారికి వస్తే, 896, (ఐదొందల పైన ఒక్కరోజులోనే), ఎక్కువ వ్యాఖ్యలు మా MOTORCYCLE DIARIES సంపాదించాయి.

మళ్ళా బ్రేక్. ఈసారి సరైన టెంప్లేట్ కోసం. ఎంకంటే నకు దీన్ని ఒక బ్లాగులా ఉంచేయాలని అనిపించలా. Magazine చేద్దామని ఆలోచన. ఎన్ని టెంప్లేట్లు మార్చినా నచ్చలేదు. చూసి చూసి, ఇక ఇలా అయితే కష్టమని బ్లాగ్గురువు గారినాశ్రయించి, వారి మీదే భారం వేసి, నా మిగతా బ్లాగులన్నిటికీ స్వస్తి పలికి ఇలా magazine form లో మొదలెట్టాను. ఉష గారి చేప పిల్లతో పున:ప్రారంభమై, నేస్తం జట్టుగాచేరితే, మన B&G దూసుకెళ్తోంది. ఈ వారంలోనే నిలకదగా రోజుకి మూడొందల పైన హిట్స్.ప్రతి టపాకీ పది పైన వ్యాఖ్యలు. ఇదేమీ నా గొప్పతనం కాదు. వ్రాసిచ్చిన వారి అభిమాన గణం, వ్రాసిచ్చిన వారి అభిమానం, తప్ప నా వల్లయినదేమీ కాదని నాకు తెలుసు. అందుకే మరింత జాగరూకత పెరిగింది.


ఏముంటాయిందులో?

కేవలం పుస్తకాల కోసమే సరదాగా మొదలై, blogozina (blog-magazine) రూపు దిద్దుకున్న B&G లో ఈ క్రింది విభాగాలని కవర్ చేయాలని నా ప్రయత్నం.

1. Books (Literature... poetry, novels, reviews, and introduction of different nuances of lit)
  2. Galfriends (A tribute to my Galfriends)
  3. Movies
  4. Sports updates (Detailed analysis)
 5. Parties
  6. My own literature 
  7. Motorcycle Diaries

                   8. Arts (About dramas, music, and dance etc)
                   9. Tech help
                   10. And campaigning of Linux


ఎప్పుడెప్పుడు?


సోమ... సాహిత్యం, దానికి సంబంధించిన అంశాలు. (నాకు సమయాభావం ఉండటం తెలిసి ఆ విభాగానికి సంబంధించిన సహాయాన్ని జ్యోతి గారు చేఅటానికి ముందుకు వచ్చారు. ఇలా పెద్దల సహాయంతోనే మేము ముందుకు పోగలుగుతున్నాం).


బుధ... Arts and my original pieces


శుక్ర... సినిమా సమాచారం, entertainment etc. (చైతి చూసుకుంటానంది).


శని... Tech issues, and other things remained in movies, and lit etc. (If any)


ఆది... Sports analysis, and my other posts (పైన పేర్కొన్న అంశాలన్నీ ఏదో ఒక category లో ఉంటాయి)


ఇలా విభజించుకుని, కాస్త మొండి ధైర్యంతో ముందుకి ఉరికాను. ఏమౌతుందో మరి! వీలైనప్పుడల్లా అందరు articles పంపి మన B&G ని ముందుకు నడిపించాలని ప్రార్థన.


అవసరాన్ని బట్టీ వేరే సమయాల్లో రావచ్చు, లేదా సరైన విషయం దొరకందే, ఆ రోజుకి ఆపేయనూ వచ్చు. అంతే తప్ప, there won;t be any crap in B&G. నడిపించానంటే నడిపించాను అనేలా కాకుండా వీలైనంతలో మంచి quality ఉన్న articles నే అందించాలని ప్రయత్నం.


నా ఆలోచన తెలిసినప్పటి నుండీ నాకు అన్ని విధాల అండగా ఉన్న ప్రముఖ మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. సహాయ సహకారాలని అన్ని వేళలా అందించిన friend కి మాటల్లో చెప్పలేనన్ని వందనాలు. అడిగిన వెంటనే join అయిన కత్తి గారికి... thanks. Last but not the least, B&G లో మొదట ప్రచురితమైన guest author post ఇచ్చిన ప్రియకి మెనీ థాంక్స్.MAKE THINGS HAPPEN అనే నా మోటో నాకు ధైర్యాన్నందిస్తోంది. ThankQగీతాచార్య


Posted by గీతాచార్య Oct 6, 2009

Subscribe here