BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...
రాజగోపాలాచార్యులు గారు సంస్కృతాంధ్ర పండితులు. ఇక ముందు ప్రతి సోమ వారము (వీలున్నంతలో. నెలకు రెండు తగ్గకుండా) వైభవము అనే శీర్షికన రాయల వారి కాలం నాటి కవితా వైభవమును అందిస్తారు.
*** *** ***

తెలుగు సాహితీ చరిత్ర యందు సర్ణ యుగముగ భాసిల్లెడి కాలము కృష్ణరాయల పరిపాలన. సాహితీ సమరాంగణ సార్వభౌమ! అను బిరుదమును కలిగిన ఈతడు క్రీ.శ. 1509 నుండీ క్రీ.శ. 1529 వరకు గల ఇరుబదేండ్లు మాత్రమె పరిపాలించినను, తన సుపరిపాలన ద్వారా, కళాపోషన ద్వారా, ఎంతో ఖ్యాతి గడించినారు.తన సంస్థానమున భువన విజయమను సాహిత్య గోష్టినేర్పరచి, వివిధ భాషా కవి పండితులను గౌరవాదరములతో సత్కరించినాడు. అందు అష్ట దిగ్గజములనెడి ఎనమండగురు కవి పుంగవులను గూర్చి ఈ వ్యాస పరంపర యందు పరిశీలించుదాము.

౧. అల్లసాని పెద్దన... అల్లిక జిగి బిగి అని పేరు. ఆంధ్ర కవితా పితామహుడు, మను చరిత్ర అను ప్రబంధ సృష్టి కర్త. వీరి పాండిత్యమును మెచ్చి రాయల వారే స్వయముగ గండపెండేరము నందించినారు.

౨. నంది తిమ్మన... ముక్కు తిమ్మన యను మరొక నామధేయమును కలిగిన ఈయన వాణీ విలాసము, పారిజాతాపహరణమను కావ్యములనందించినారు. సరళమైన భాషకు పెట్టింది పేరు.

౩. రామరాజ భూషణ... పెద్దన మును చరిత్రమునకు దీటుగ వసు చరిత్రమను ప్రబంధమును సృజియించినారు. "శ్లేష కవితా చక్రవర్తి" అని బిరుదము కలదు. కావ్యాలంకార సంగ్రహము, హరిశ్చంద్ర నలోపాఖ్యానమను ద్వ్యర్థి (ద్వయర్థి) కావ్యమును రచియించిన వీరి అసలు పేరు భట్టు మూర్తి.

౪. అయ్యలరాజు రామభద్రుడు... ఆంధ్రదేశమందలి కడప యందు జన్మించిన (పెక్కు మంది భావన) వీరు రామాభ్యుదయమను కావ్యమును రచియించినారు.

౫. మాదయ గారి మల్లన... రాజశేఖర చరిత్రము వీరి రచన. రాయల వారు దండయాత్రా సమయములయందు ఈయన వెంట ఉండెడి వారని ప్రతీతి.

౬. ధూర్జటి... శ్రీకాళహస్తీశ్వర శతకమును, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యమును రచియించిన వీరు రాయల వారి దిగ్గజములయందు భిన్నమయిన వ్యక్తిత్వము కలవారు.

౭. పింగళి సూరన... ఆంగ్లమున జెప్పవలెనన్న... ఈయన one of the rarest original story teller of that time. కళాపూర్ణోదయము అను కావ్యము (ఆంగ్లమున The sound of the kiss) చిత్ర విచిత్రమైన కథా గమనముతో నుండును. ప్రభావతీ ప్రద్యుమ్నము వీరి మరొక రచన కాగా, రాఘవపాండవీయమను ద్వ్యర్థి (ద్వయర్థి) కావ్యమును కూడ వ్రాసినారు. Two of his works were revolutionary in Telugu and the first of their kind. Kalapurnodayam is more of a novel than poetry and Raghava Pandaveeyam is in dvayarthi style. (ఈ మాటలు వికీ యందలివి).౮. తెనాలి రామకృష్ణుడు... తెనాలి రామలింగడనెడి పూర్వ నామము కలిగిన ఈతను సుప్రసిద్ధుడు, అనేక ఊహా కథల యందు పాత్రధారి. వికటకవి యైన ఈయన పాండు రంగ మహాత్మ్యమును, ఉద్భటారాథ్య చరిత్రముని రచియించటయే కాక, అనేక ప్రసిద్ధములయిన పద్యములను చెప్పెనని పేరు. ఘటికాచల మహాత్మ్యమను వేరొక కావ్యమును రచియించెను. పాండు రంగ మహాత్మ్యమును పంచ కావ్యములందునొకటిగ పేర్కొందురు.


ఇట్టి అష్ట దిగ్గజములకు దీటుగ రాయల వారు ఆముక్త మాల్యద యను గోదా చరిత్రమును రచియించెను.

విశిష్టాద్వైతమును స్వీకరించినను సర్వులను సమముగ ఆదరించిన రాయల వారి కాలమందలి కవితా వైభవమును గూర్చి వరుసగ తెలుసుకొందుము.
*** *** ***

We thank Rajagopalacharyulu garu for providing us with an insightful information about the Ashta diggajas.

గమనిక: గీతాచార్య టైప్ చేయవలసిన టపా ఇది. అందుబాటులో లేక పోవటం వల్ల ఆ బాధ్యత నా మీద పడింది. పొరబటులన్నీ నావే అనిన్నీ, వ్యాసమిచ్చిన ఆచార్యుల వారివి కాదనిన్నీ నా మనవి. వేగంగా dictate చెయ్యటంలో కొన్ని పొరబాట్లు దొర్లి ఉంటే క్షంతవ్యురాలను.

చైతన్య కళ్యాణి

Posted by చైతి Nov 2, 2009

Subscribe here