BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

అప్పుడెప్పుడో ఇంటర్మీడియేట్ రోజుల్లో ఒక స్కిట్ వ్రాశాను. దాని పేరు సిమ్రాన్ ఫాన్స్ క్లబ్. అప్పట్లో సమరసింహారెడ్డి సూపర్ హిట్ అయ్యింది. మా ప్రెండ్స్ అంతా ఎగబడి చూసేవారు. ఎందుకురా అన్నిసార్లు చూస్తున్నారు అంటే బాలయ్య బాబు ఇరక్కుమ్మేశాడని చెప్పేటోళ్ళు. నిజం చెప్పండ్రా నాయనలారా అంటే "నిక్కము మేము చూస్తుంటిమి బాలయ్య కోసరము" అని సరళ గ్రాంధికం వెలగబెట్టేవాళ్ళు.

కానీ నాకర్థమయింది సినిమా చూశాక. అసలు విషయం. నేను రెండో సారి వెళ్తుంటే అడిగారు ఎందుకురా వెళ్తున్నావు అని. సిమ్రాన్ కోసం అని చెప్పాను. అప్పుడే నాకీ ఐడియా వచ్చి, ఫేర్వెల్ పార్టీ కోసమని వ్రాశానీ స్కిట్. బాగా పేరొచ్చింది. మా మహేష్ బాబు దాన్ని మెచ్చుకున్నాడు కూడా ప్రత్యేకంగా.

దాన్నే నేను బ్లాగింగు మొదలెట్టిన కొత్తల్లో  అనుష్క ఫాన్స్ క్లబ్ అని తిరగవ్రాశాను. అదిక్కడ చూడండి. నాలుగు రోజుల క్రితం అనుకోకుండా వేరే టపా బదులు ప్రచురితమైంది. అసౌకర్యం కలిగితే క్షమించగలరు. అందుకే వెంటనే ఆపేసి ఇప్పుడు సరదాగా చదువుకునేందుకు గానూ... చదివిన వాళ్ళు వదిలేసేయండి. బాగుందనిపించి మళ్ళా ఒకసారి చదివితే... నా ప్రయత్నం సఫలం.
***   ***   ***

తమ్ముడు: అన్నా! ఇదన్నాయం.


అన్న: ఏది రా?

తమ్ముడు: అదే హీరో లకి ఫాన్స్ క్లబ్బులు ఉండటం.

అన్న: దేనికి?

తమ్ముడు: ఎందుకా? నువ్వే ఆలోచించు. తెలుస్తుంది. పెద్దలకి చెప్పగలిగే నాలెజ్ నాకు లేదు.

అన్న: సరే! నువ్వు పో! నివేదిక తెప్పిస్తాను. చదివి శాసనం జారీ చేస్తాను.

తమ్ముడు: ఆజ్ఞ!

అన్న: ఆశీస్సులు.

ఆరు రోజుల తర్వాత...

వేదిక మీద

అన్న: ఈ మధ్యో అన్నాయం అదే అన్యాయం నా దృష్టికి వచ్చింది. అదేంటంటే... హీరోయిన్ లకి ఎందుకు ఫాన్స్ క్లబ్బులు లేవు అని. అందుకే నేనీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఏమయ్యా నరేష్! బలాదూర్ సినేమా రిపోర్ట్ ఏంటి?

నరేష్: ఫ్లాపు సర్.

అన్న: ఎమోయ్సతీష్! బలాదూర్ చూశావా?

సతీష్: చూశాను సర్.

తమ్ముడు: నేనూ వెళ్లాను సర్! చమించాలి అన్నయ్యా!

అన్న: దేనికి?

సతీష్: సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడని.

అన్న: నిజం చెప్పు.

సతీష్: నేను రవితేజ ఫ్యాన్ ని.

అన్న: ెంద పరంద ఎంద శాట.  సత్యమేవ జయతే! అన్నది మన రాజ్యపు స్లోగన్. అది స్లోగన్ అయినా మనం ఫాస్ట్ గా ఉండాలి. నిజం చెప్పు! లేదా....?

సతీష్: అనూష్క బాగుందని రెండు సార్లు చూశాను.

అన్న: మరి రవితేజ ఫ్యాన్ అంటూ బ్యానర్ కట్టావ్?

సతీష్: అదీ... అదీ... అదీ...

అన్న: జనులారా! ఈ ద్రోహికి నేను రాజ్య బహిష్కార శిక్ష విధిస్తున్నాను.

జనం: అన్నా! మీరు చెప్పిందాన్ని మేము ఎదిరించం. కానీ మాకు కారణం చెప్పండి. మీరే రేషనల్ గా ఉండాలని అంటారు కదా!

అన్న: అవును. నాకు ఒక సహేతుకమైన కారణం ఉంది. వింటారా?

జనం: వింటాం. వింటాం.

తమ్ముడు: అన్నయ్యా! మీరు చెప్పండి. నేను రికార్డ్ చేయిస్తాను. టీవీ ఫైవ్, టీవీ టెన్, టీవీ ఎలెవెన్, ఈటీవీ, ఆటీవీ, ఓ టీవీ, టీవీ ఇన్ఫినిటీ, అందరూ వచ్చారా?

టీవోళ్ళు: వచ్చేశాం. కామేరాస్! స్టార్ట్ ఫోకస్.

అన్న: ఏమయ్యా!...

తమ్ముడు: ఏంటి అన్నయ్యా?

అన్న: నిన్ను కాదెహె!

తమ్ముడు: స్వారీ!

అన్న: వాకే!

జనులారా! ఏమిటీ అన్యాయం? ఏమిటీ అక్రమం? సినిమాలు చూసేది హీరోయిన్ ల కోసం. ఫాన్స్ క్లబ్బులు హీరోల కోసమా? ఏమన్యాయ మేమక్రమ మేమి దుండగీడు తనం? మీ కోసరం అనూష్క అంతగా అందాలనారబోస్తే గుట్ట చప్పుడు కాకుండా చూసేసి, ఫోటోలని నెట్టులో దాచీసుకుని, లొట్టలేస్తూ... చొంగ కారుస్తూ... చూసేసుకుని, ఫాన్స్ కాగితాలు మాత్రం హీరోలకా?

మీరు బట్టలిప్పారా? ఎక్స్పోజ్ చేశారా? వానలో తడిశారా? ఎందుకురా మీకోసం అనూష్క అందాలారబోయాలి? తను మీకు అంత చేస్తే మీరు ఒక కాగితం ముక్క మాత్రం పెట్టలేరా తనకోసం? అసలే సినేమా ఫ్లాప్ అయి తను విషాదం లో ఉంటే మీరు ఈ విధం గా చేస్తారా?

Ladies whistles వేశారు. ఐదునిమిషాల తర్వాత...

అన్న: ఇలియానా కోసం దేవదాసు చూసి దేవదాసు అద్దిరిందంటారా? భలే దొంగలకి ఆ కొద్ది మందయినా వెళ్ళింది ఎవరి కోసం? చార్మీ, ఇలియానాల కోసరం కాదా?

లేడీస్: అవునూ! అవునూ!

అన్న: మరలాంటిది ఆ సతీష్ అనూష్క కోసం సినేమా చూసి రవితేజకి బ్యానర్ కడుతాడా? అందుకే వీడికి దేశ బహిష్కార శిక్ష.

Ladies and Gentlemen: అవునూ అవునూ, మీతీర్పు రేషనల్..

టీవోళ్ళు: అవునూ అవునూ!

అన్న: ఈ శుభ సందర్భంగా నేను సతీష్ లాటి వాళ్ళ కోసరం "అనూష్క ఫ్యాన్స్ క్లబ్" స్థాపిస్తున్నాను. దీనికి అధ్యక్షుడుగా మన డమ్మీ - హార్డువేరు ఇంజినీయర్ ని నియమిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రశ్నను లేవనెత్తి నన్ను ఆలోచింపజేసింది అతనే!

Ladies and Gentlemen: డమ్మీ - హార్డువేరు ఇంజినీయర్ గారికీ! జై.

జనం: అందరు హీరోయిన్లకీ ఫ్యాన్స్ క్లబ్బులు ఏర్పాటు చేయండి అన్నా!

అన్న: శాంక్షండ్.

జనం: "అన్న" గీతాచార్య గారికీ జై.
***   ***   ***

వేసిందే ఎన్నిసార్లు వేస్తావు అనొచ్చు. చదవని వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాగే ఒక శుభ సందర్భం కూడా. నా యీ స్కిట్ ని ఇన్నాళ్ళా తరువాత ఒక కాలేజ్ విద్యార్థులు వెతుక్కుని మరీ వేస్తామని అడిగారు. సరే అని ఇచ్చాను. కొన్నిమార్పులతో. ఒక్కసారి అందరికీ చూపిద్దామనీ...

Posted by గీతాచార్య Nov 29, 2009

Subscribe here