The Quest for the Ultimate Theory of Time అంటూ షాన్ ఎం కెరాల్ వ్రాసిన విశ్వావిర్భావానికి సంబంధించిన పుస్తకం ఇది. ఈ అంశం మీద ఇంతవరకు ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అలాంటి పుస్తకాలలో ఇది కూడా ఒక పుస్తకమే అనుకోవాల్సిన పని లేదు. షాన్ కెరాల్ (Shaun M Carroll) వ్రాసిన ఈ పుస్తకంలో చాలా క్లిష్టమైన విషయాలను అవసరమైనంత క్లుప్తం గాను, క్షుణ్ణం గాను, వివరింప బడ్డాయి. కాలంతో పాటు మన వయసు ఎందుకు పెరుగుతూనే ఉంటుంది? కాలగమనంలో మనం యవ్వనులం ఎందుకు కాలేము? అసలు కాలం ఆవిర్భావం ఏమిటి? విశ్వోదయానికి ముందే కాలం ఉందా? లేదా కాలం విశ్వావిర్భావం తరువాత వచ్చిందా? కాలానికి ఆద్యన్తాలున్నాయా? మొదలైనవి మానవుని అనాదిగా వేధిస్తున్న ప్రశ్నలే. ఇలాంటి విషయాలకు సంబంధించిన సమాధానాల అన్వేషణలో దొరికిన వివరాలను గూర్చి ఈ పుస్తకం లో చెప్తారు కెరాల్.
California Institute of technology లో సీనియర్ రీసెర్చ్ ఎసోసియేట్ గా పని చేస్తున్న కెరాల్ Cosmic Varience అనే బ్లాగులో కూడా వ్రాస్తున్నారు. కెరాల్ ఇంతవరకు కాస్మాలజీకి సంబంధించి చాలా పుస్తకాలను వ్రాశారు. అందులో నాకు కాస్త పరిచయం ఉన్న పుస్తకం ఇది. రెండు నెలల క్రితం ప్రొఫెసర్ జాన్ వెన్నన్ ని ఆయన హైదరాబాదు వచ్చిన సందర్భం లో కలిశాను. అప్పుడు ఇద్దరం ఆయన కోరిక పైన మన వాల్డెన్ బుక్ స్టోర్ కి వెళ్ళాము. అక్కడ నేను చేస్తున్న వర్క్ కి సంబంధించి ఆయన కొన్ని పుస్తకాలను సూచించి దొరకటం తో అక్కడే నాకు ఆయన కొన్నారు. ఆ కొనేటపుడు చెప్పిన పుస్తకాలలో ఇదొకటి. వచ్చే జనవరి లో ప్రచురితం కానుంది. విశ్వం గురించిన ప్రాథమిక సమాచారం తో, కాస్త పాప్యులర్ తరహాలో ఉన్న పుస్తకం చదవాలంటే ఈ పుస్తకం వైపో లుక్ వేయొచ్చు. Time Arrow, and Big Bang గురించిన వివరణలు, సిద్ధాంతాలు కూడా ఇందులో ఉన్నాయని విన్నాను. చూద్దాం. ఎలా ఉంటుందో మరి. నాకు వెన్నన్ గారు చెప్పిన సమాచారం బట్టీ కాస్మాలజీ లో ఆసక్తి ఉన్న వారికి ఈ పుస్తకం బాగుంటుంది.
Indie Bound, Amazon.com, Barnes and Noble మొదలైన వారి వద్ద దొరుకుతుంది.