Dhanaraj Manmadha Says...
August 24, 2009,
Hyderabad.
టైమ్ పదిన్నర కావస్తోంది. "రేయ్ ధనా! మాస్టర్జీ ఫోన్. అర్జంట్. లేవాలి," అమ్మ పిలుస్తుంటే కలత నిద్రలోంచీ లేచాను. మామూలుగా వేరే ఎవరైనా అయితే నేను సమాధానం కూడా చెప్పను. అసలు అమ్మ నన్ను లేపనే లేపదు. నేను వెంటనే మెలకువ తెచ్చుకుని పక్కింటికి పరిగెత్తాను. "ధనా! నీకోసం లైన్లో ఉన్నారు," సుప్రజా ఆంటీ చెప్పింది. నేనెళ్ళి రిసీవరందుకున్నాను.
"ధనా! The flightz gonna be late. So, will you help her to reach the station in time?"
"Sure," అన్నాను. విషయమేంటంటే మేమ్సాబ్ ఆ రోజు జర్మనీ నుంచీ వస్తున్నారు. ఫ్లైట్ లేట్ అయ్యే అవకాశం ఉంటే నేను వెళ్ళి రిసీవ్ చేసుకుని త్వరగా సికింద్రాబాద్ స్టేషన్ చేరేలా చెయ్యటం. సాయంత్రం నాలుగు తర్వాత నాకు పని. ఇంకా ఐదు గంటలపైన నిద్రపోవచ్చు. వెళ్ళి పడుకున్నాను. అమ్మకి విషయం చెప్పి. ఇంకో గంటయ్యాక మళ్ళా ఫోన్. ఈ సారి తెలిసింది, మాస్టర్జీ గుంటూరులో మేమ్సాబ్ ని స్టేషన్ లో కలుస్తారు. అక్కడి నుంచీ రాజమండ్రి దాకా వెళ్తారని, అక్కడి నుంచీ మేమిద్దరం తిరిగి రావాలని. "Oh well. Another nice adventure is on cards." అనుకున్నాను.
సాయంత్రం ఏమి చెయ్యాలో స్కెచ్ వేసుకుని అమ్మకి విషయం చెప్పి కూచున్నాను. మే 17 తర్వాత మేమిద్దరం చెయ్యబోయే కొత్త adventure ఇది. అప్పుడు జరిగింది మరో కథ. సాయంత్రం నాలుగున్నరకి శంషాబాద్ వెళ్ళాను బైక్ మీద.
*** *** ***
Srujana Ramanujan Says...
Formalities అన్నీ పూర్తి చేసుకుని బయటకి వచ్చే సరికి ఎదురుగా ధన. "హాయ్," అంటూ విష్ చేసుకున్నాము. ధన వెనకాల సెల్వి కోసం చూశాను. ధన వస్తాడని, నన్ను సికింద్రాబాద్ చేరుస్తాడనీ తెలుసు. సెల్వి కూడా initial plan ప్రకారం రావాలి. కానీ హడావిడి కనుక వద్దన్నానని ధన అన్నాడు. శైలజ గారు మాత్రం వచ్చారు. కాసేపు నాతో ఆప్యాయంగా మాట్లాడి వాళ్ళ తమ్ముడు నరసింహన్ తో కలిసి వెళ్ళిపోయారు. ధన పనిప్పుడు నన్ను ఇన్టైమ్ స్టేషన్ కి చేర్చటం. తర్వాత ఏమిచేస్తాడనేది తన ఇష్టం. Parking lot దాటి బయటకి రాగానే ధన ఫ్రెండ్ హిమేష్ నా లగేజ్ ని ధన వాళ్ళింటికి తీసుకుని వెళ్ళాడు. వాటిని నాకు తర్వాత చేరుస్తారు. ఇరవై ఏడో తారీకున అన్నయ్య పెళ్ళి. ముందు వైజాగ్ వెళ్ళి నాన్న, అన్నయ్యలతో కల్సి వైజాగ్ నుంచీ 26 పొద్దున్నే చెన్నై వెళ్ళాలి. తన స్పీడ్ తెలుసు కనుక నాకు కంగారేమీ లేదు. జర్మనీ ట్రిప్ విశేషాలు మాట్లాడుకుంటూ సికింద్రాబాద్ చేరుకున్నాం. ఇంకా మూడు నిమిషాలు ఉంది అనగా మేము స్టేషన్లోకి అడుగు పెట్టాము. నేను, సెల్వీ ట్రైన్లో వెళ్తుంటే మమ్మల్ని గుంటూరులో చంటి కలుస్తాడు.
కంపార్ట్మెంట్ లో సెటిల్ కాకుండానే ట్రైన్ కదిలింది. అంటే ఎంత వేగంగా రావాల్సి వచ్చిందో తెలుస్తుంది. పోర్ట్ నుంచీ స్టేషన్ కి 30 నిమిషాల్లో వచ్చాడు. సెల్వీ, నేను మాట్లాడుకుంటున్నాం. ఇంతలో చంటి నుంచీ పోన్. "కిరా, ఇప్పుడే వచ్చాను కాలేజ్ నుంచీ, ధన కోసం వెయిటింగ్," అన్నాడు. "తనాల్రెడీ బైల్దేరాడు. గుంటూరులో ఎంతసేపు హాల్టింగ్?" అడిగాను. "అద్సరేగానీ ధనా రాగానే డిసైడ్ చేస్తాను ఏమి చెయ్యాలనేది. ఇక ఉంటాను," అని పెట్టేశాడు. చాలా రోజులైంది కదా కాసేపు మాట్లాడతాడేమో అనుకున్న నాకు నిరాశగా అనిపించింది. ఐనా ఎలగూ మరి కొన్ని గంటల్లో కలవబోతున్నామనే excitement dominate చెయ్యటంతో నేను సెల్వితో పెళ్ళి ఏర్పాట్ల గురించి, చెన్నైలో మా వర్క్ ఎలా ఉందనీ, మిగతా విషయాలు మాట్లాడటం మొదలెట్టాను. అన్ని కబుర్లూ ముగిసేసరికి నల్గొండ చేరాము. ఇంకా ఇక్కడేనా అనిపించింది. తనని కలవాలనే ఆత్రం. ఇంతకు ముందు కూడా చాలా సార్లు నేను ఫారిన్ ట్రిప్స్ కెళ్ళాను. ఎప్పుడూ ఇంత ఇంటి బెంగ లేదు. నాన్న గుర్తు రావటమ్తో నాన్నకి ఫోన్ చేశాను. అలా మాట్లాడుతూనే ఉన్నాను. నాన్న మాట్లాడుతూ ఉన్నప్పుడే "Dhana reached Guntur" అనే మెసేజ్ వచ్చింది. Hardly two and three quarters of an hour. My! ఎలా రీచ్ అయ్యాడు? అనుకోవటం వేస్ట్. ధన స్పీడ్ అంతే. Hez a master Rider.
*** *** ***
గీతాచార్య Says...
August 24, 2009
Guntur,
సాయంత్రం ఎనిమిది కావస్తోంది.
System ముందు కూర్చుని ఎదురుగ్గా ఉన్న ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. "హాయ్ బింగో!" అని వినిపించటంతో అటువైపు చూశాను. "ఎంతసేపు పట్టింది?" అదే నా మొదటి ప్రశ్న. ఎంత వేగం అన్నదే ప్రధానం కానీ, మిగతావన్నీ మా మధ్య అనవసరం. "2:44 hrs" అన్నాడు. అంతా మా థ్రిల్ ముఖ్యం అనుకున్నాము కానీ మేము తిరిగివచ్చేటప్పుడు జరగబోయే రెండు ముఖ్యమైన సంఘటనలని ఊహించలేక పోయానప్పుడు. "వానగా ఉంది," ధన అన్నాడు. "హీరోలకి కష్టం వచ్చినప్పుడు వాన వస్తుంది. చూద్దాం. మనకేమి కష్టం వస్తుందో. వెళ్ళేలోగా తగ్గితే సరి," అన్నాను.
"నేను ఇంకో హాఫెనవర్లో బయలుదేరుతాను," ధన అన్నాడు. "నీ జర్నీ ఎలా సాగింది?" అడిగాను. "Fast and Furious. Real quick, and enjoyed it."
వానైతే తగ్గలేదు కానీ, ధన వెళ్ళిపోయాడు అనుకున్న టైమ్ కి. చినుకులు రాలుతున్నాయి. అంతా చీకటిగా ఉంది. వాతావరణం అలా ఉంది. ఇంతలో తన ఫోన్. సత్తెన పల్లి దాటామని. ఐతే నేను కదలాల్సిన సమయమొచ్చింది అన్నమాట. ఇంట్లో ఫ్రెండు ఇంటికి పని మీద వెళ్తున్నాననీ, రేపు పొద్దున్నే కాలేజ్ టైమ్ కి వస్తాననీ చెప్పి, బయలుదేరాను. ఇంకా ట్రైన్ రావటానికి అరగంట కూడా లేదు. అన్నీ తెముల్చుకుని బయలుదేరే సరికి. ఇంటి దగ్గర నుంచీ ఆటో దొరకటం కష్టం. ఇంట్లోంచీ బయలుదేరి తొమ్మిదో లైను మీదుగా వెళ్ళటానికి ఇంటి ముందు భయంకరంగా బురద, చెరువు లాగా నీళ్ళు నిలిచున్నాయి. మళ్ళా వెనక్కి తిరిగి పన్నెండో లైను వెంట గోడ వారగా సైడు కెనాల్ గట్టు మీద నడుస్తూ వెళ్ళి సిమెంటు రోడ్డు మీదకెళ్ళాను.
ఇంటి ముందరి రోడ్డు
ఇంతలో ఫోను మ్రోగింది. తనే అనుకున్నాను. కానీ వినయ్. "ఒరే, ధనని ఇవాళ అనవసరంగా పిల్చావు. నాగరాజు వళ్ళు ఏలూరు సైడే ఉన్నారు. జాగ్రత్త. అవసరం ఐతే సాంబశివరావు గారికి ఫోను చెయ్యి," అన్నాడు. నేను ఆలోచనలో పడ్డాను. అనవసరపు రిస్కా ఇది. అసలే వాన. ఆపైన ధనాకి త్రెట్. కానీ adventure, తనని చాలా రోజుల తరువాత కలవబోవటం, ఇవన్నీ నన్ను ముందుకు నడిపించాయి. ఎందుకైనా మంచిదని ధనాకి ఫోను కొట్టాను. ఏలూరు దాటేశానన్నాడు. కాస్త మనసు కుదుట పడింది. ముందుకి నడిచాను. ఇంకా ట్రైన్ కి పది నిమిషాలుండగా బోరింగు పంపు సెంటర్ దగ్గర ఆటో దొరికింది. నేను ట్రైన్ అందుకునే ఆత్రంలో ఉండి చెయ్యబోతున్న తప్పుని ఆలోచించలేదు. అది ఎంత తీవ్ర పరిణామాన్ని కలిగిస్తుందో ఊహించలేదు.
(మిగతా తరువాత...)
*** *** ***
పెద్ద టపా కావటంతో రెండు ముక్కలు చెయ్యాల్సి వచ్చింది. మిగతాది రేపు.
Chaitanya Kalyani