రెండేళ్ళ క్రితం అనిల్ కుంబ్లేకి మతి పోయిందనుకున్నారు. పదహారో ఆటగాడిగా ఆస్ట్రేలియా టూర్ కి వీరేంద్ర సెహ్వాగ్ ని ఎంపిక చేయించినప్పుడు. జాఫర్, ఒక ఓపెనర్ గా సెటిల్ అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. దినేష్ కార్తిక్ కూడా ఫర్లేదనిపిస్తున్నాడు. అలాంటి సమయంలో సెహ్వాగ్ ని జట్టులోకి తీసుకున్నాడు.
యువరాజ్ కి జట్టులో స్థానం కోసం సెగ్గీ దాదాని త్యాగం చేసి ద్రవిడ్ ని ఓపెనింగ్ చేయించాక యువీ ఫైల్యూర్ కళ్ళుతెరిపించాక సెహ్వాగ్ ని మూడో టెస్టులో తెచ్చారు. అప్పటిదాకా నత్త నదకన సాగిన ఓపెనింగుకి కాస్త ఊపునిచ్చిన సెగ్గీ, ఆ మ్యాచ్ లో మమ్చి ఆరంభాలనివ్వటమే కాకుండా రెండు వికెట్లు తీశాడు. తరువాత మ్యాచ్ లో మ్యాచ్ సేవింగ్ ఇన్నింగ్స్ తో సెంచరీ సాధించి, ఆ పైన జరిగిందంతా ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది.
ఆ సెలెక్షన్ సమయమ్లో సెహ్వాగ్ దేశవాళీ ఫామ్ కూడా అంతంత మాత్రమే. అనిల్ కుంబ్లే చెప్పిన మాటలు... "సెహ్వాగ్ లాంటీ ఆటగాడు డకౌట్ ఐనా ఫర్లేదు కానీ, జట్టు బైట ఎక్కువ కాలం ఉండ కూడాదు."
619 వికెట్లు, కెరియర్ చరమాంకంలో చేసిన సెంచరీ, ఇవే కాదు. చాపెల్ చలవతో దెబ్బతిని, మూలన పడి ఉన్న మహా వీరుడు సెహ్వాగ్ ని మళ్ళా బయటకు తెచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేలా చేసినదే అతను భారత క్రికెట్ కి చేసిన గొప్ప సేవ.
చూశాము కదా ఇవాళ్టీ ఇన్నింగ్స్. రెండేళ్ళలో మూడూ డబుల్ సెంచురీలు, వీలుంటే రేపటితో మూడు ట్రిపుళ్ళేసినా ఆశ్చర్యం లేదు. అవును మరి. భారత క్రికెట్ చంటిగాడు ఓపెనింగ్ కి లోకల్ కదా. అలాగే రేపు ట్రిపుల్ వేస్తే క్రీడామరత్వానికి కూడా లోచల్. ఎప్పుడూ అక్కడే ఉంటాడు.
లారా రికార్డు దాటాలని సెహ్వాగ్ కి శూభాకాంక్షలు చెపుదాం
ఆదివారం నాడు సెహ్వాగ్ స్పెషల్ టపా.