Dhanaraj Manmadha Says...
NH 5, on my to Vijayawada.
గుంటూరు నుండీ బయలుదేరిన నాకు మొదటి పని విజయవాడలో వినయ్ ని కలవటం. అక్కడ వాడి దగ్గర సెల్‍ఫోను తీసుకోవాలి. లేందే నాకు కమ్యూనికేషన్ కుదరదు. ఇంకా బాగా వానగానే ఉంది. చినుకులు పడుతూనే ఉన్నాయి. తప్పని సరై హెల్మెట్ తీశాను పెట్టుకునేందుకు. పెదకాకాని దగ్గర వినయ్ కి ఫోను చేసి, ఏలూర్రోడ్డు లోని విశాలాంధ్రాకి రమ్మన్నాను. అక్కడైతే ఎక్కువ సేపు ఆగకుండానే వెళ్ళొచ్చని.
విశాలాంధ్రా దగ్గర,
ఏలూర్రోడ్డు,
విజయవాడ.
అక్కడ టీ తాగుతూ కాసేపు మాట్లాడుకున్నాం. తన సీయే పూర్తైందనీ, చైతిని ఇగ్నో ఇంజినీరింగ్ లో వేశామనీ చెప్పాడు. మేమిద్దరం సరిగ్గా కల్సి చాల రోజులైంది. చైతికి నా లాప్టాప్ ఇచ్చినందుకు thanks చెప్పాడు. డిప్ప మీద ఒకటి ఇచ్చి మనలో మనకివి అవసరమా అన్నా. దెబ్బ గట్టిగా తగిలినట్టుంది తల రుద్దుకున్నాడు.
"సరేరా నేను వస్తాను. ఫోనివ్వు," అన్నాను.
వాడిచ్చాడు. "ఒరే! ఇదెందుకిచ్చావు. మామూలుదేదైనా ఉంటే ఇవ్వు. మరీ కొత్తది కదా."
"అది నీకే, నా మొదటి డబ్బులతో వాడికిద్దామని (మాస్టర్జీ) కొంటే, నా వస్తువుని నేనే కొనుక్కుంటాడు అన్నాడు. పెద్ద మగాడిలా...," అంటుండగానే అన్నా, "అంటే పెద్ద మగాడు, చిన్న మగాడు అని differences ఏమన్నా ఉన్నాయా?" అడిగాను. వాడు నవ్వుతూ, "వాడి కాలేజ్ లోనే వాణ్ణి కొత్తగా చూసినోళ్ళు లెక్చరర్ అనుకోరు. వాడింకా పెద్ద మగాడా? చిన్న మగాడా?"
"మనక్కొంచం ఎక్కువవుతున్నట్టుంది? అది వదిలెయ్. నేనూ తీసుకోను. I don't use any number for a period of 5 days on a trot. నాకెందుకు ఫోను. అలా ఉంచేయ్. ఉపయోగ పడుతుందిలే. ఇంతకీ ఇదేమి నంబరు? ఎయిర్టెల్లా? వోడానా?"
"ఇక్కడందరం బీఎసెనెలే కానీ, నేను వెల్తాను. చైతి ఒక్కతే ఉందింట్లో." అంటుంటే ఎదురుగా ఒకమ్మాయి తన స్కూటీని పార్క్ చేస్తూ నావైపే చూస్తోంది. నేను చెయ్యూపాను. చప్పున మొహం తిప్పేసుకుని మళ్ళా చూసింది. "ఏరా నీ చీనిక ఏమంటోంది?" వినయ్ అన్నాడు తన బైక్ స్టార్ట్ చేస్తూ. "హేయ్! పోడా," రజనీ స్టైల్లో అంటూ ఆ అమ్మాయినే చూస్తూ నేను నా బైక్ ని స్టార్ట్ చేశాను. కొంచం దూరమెళ్ళాక ఒకచోటాగి సిగరెట్ తీసుకుని వెలిగించాను. డిగ్రీలో అలవాటుండేది కానీ, మాస్టర్జీ పరిచయం అయ్యాక మానేశాను. ఎప్పుడన్నా బాగా టెన్స్ గా ఉన్నప్పుడు మాత్రం ఒకటెలిగిస్తుంటాను. ఆ విషయం మాస్టర్జీకీ తెలుసు. టౌన్లో చిన్నగా వెళ్ళి, ఊరుదాటాక స్పీడ్ పెంచుదామని చిన్నగా దిక్కులు చూస్తూ నడుపుతున్నాను. ఇంతలో ఆ పిల్ల నన్ను దాటిపోతూ, "చూశావా?" అన్నట్టు నావైపో expression ఇచ్చింది.
చిన్నగా సిగరెట్ కాలుస్తూ, (మామూలుగా అయితే నేను చాలా స్పీడుగా నడుపుతుంటాను. అదే సిగరెట్ ఉంటే కాస్తంత స్లో అవుతాను. అది కూడా సిగరెట్ వెలిగించుకునేందుకు కారణం. ఇప్పుడు స్లోగా వెళ్ళాల్సిన అవసరం ఉంది) బైక్ ని ముందుకు నడిపిస్తున్నాను. ఊరు దాటాక క్రమంగా వేగం పెంచబోతూ, ఒకసారి అమ్మతో మాట్లాడాలని రోడ్డు పక్కన బైకాపి ఫోను చేసి మళ్ళా మొదలెట్టాను.
ఏలూర్ దాటుతుండగా వేగం బాగా పెంచేశాను. టౌన్ బాగా దూరం జరిగింది అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా నా మెడకు ఏదో తాడు లాంటిది తగిలింది. అసలేం జరుగుతోందో అర్ధం అయ్యేలోగా నేను వెనక్కి తూలి పడ్డాను. ఎదురుగా అలా నా బైక్దూసుకుపోతోంది...
*** *** ***
Srujana Ramanujan Says...
గుంటూరు నగర శివార్లు.
ట్రైన్లో...
"సార్ వరత్తుక్కు ఎవళో నేరమాగుమ్?" సెల్వి అడిగింది. (సార్ ఎంతసేపట్లో వస్తారు?)
"May be in a twenty minutes Selvi," నేను అన్నాను. తనకి సరిగ్గా తెలుగు రాదు. నాకు అంతగా తమిళ్ రాదు.
ట్రైన్ నడుస్తూనే ఉంది. నల్లపాడు దాటంగానే ఇద్దరం డోర్ దగ్గర నించున్నాం. తనకి కాల్ చేసి బయలుదేరాడో లేదో కనుక్కుందాం అనుకున్నాం కానీ, ఎదురుచూశాక ఒక్కసారిగా కనిపిస్తే తమాషాగా ఉంటుంది కదాని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఇక్కడ బాగా చినుకులు పడుతున్నాయి. మొహం మీద జల్లు పడుతుంటే భలే ఉంది. అలా ఒకచేత్తో కడ్డీ పట్టుకుని రెండో చేతిని బైటకి చాపాను. చల్లటి చినుకులు. మసక వెలుతురు. "ఇప్పో అవన్ కూడా ఎరుక్కాన నన్నారుక్కుమ్," అన్నాను. (ఈ టైమ్ లో తను ఉంటే బావుణ్ణు కదా). సెల్వి నా వైపు చూసి నవ్వింది. నేను కూడా నవ్వాను.
"The dimple on your chin is cute madam. It's a heavenly sight," అంది.
ఇంకాసేపట్లో గుంటూరు స్టేషన్ చేరాము. తను ఇంకా రాలేదు. నేను ట్రైన్ దిగి తనకోసం చూస్తుంటే, సెల్వి డోర్ దగ్గర నిలబదింది. ఇంకో టూ మినిట్స్ లో ట్రైన్ కదులుతుంది అన్న సమయంలో కూడా తను వస్తున్న జాడ కనపడలేదు. నేను వెళ్ళి ట్రైన్ ఎక్కాను. "అవన్ వాండ," సెల్వి అనటంతో అటువైపు చూశాను కానీ వచ్చింది తనుకాదు. ట్రైన్ పదిన్నరకి ఐతే పదిన్నరకి ఇంట్లో బయలుదేరటం తన అలవాటు. హ్మ్.
*** *** ***
గీతాచార్య Says...
District court దగ్గర,
గుంటూరు.
ఆటో అతను ఒకరున్నారని ఆపాడు. "స్వామీ! తొందరగా పోనీ. ట్రైన్ కి లేటైపోయింది."
"ఒక్కళ్ళే సారూ. ఆఁ తొందరగా ఎక్కవయ్యా..." ఆటో అతనన్నాడు. అతను ఎక్కగానే ఆటో కదిలింది. టైమ్ చూసుకున్నాను. ఇంకా మూడు నిమిషాల్లో ట్రైన్ కదులుతుంది. కానీ మన ఆంధ్రా ట్రైన్ల మీద నమ్మకంతో కూచున్నాను ప్రశాంతంగా. మామూలుగా అయితే ట్రైన్ షెడ్యూల్డ్ టైమ్ ఎంతైతే సరిగ్గా ఇంట్లో ఆ టైమ్ కి బయలుదేరుతాను. కానీ వానగా ఉందని ఈసారి కొంచం ముందు బయల్దేరాను. "వానగా ఉంది కదా సారూ, అందుకనీ..." ఆటో అతను ఇంకా విషయం వదిలిపెట్టలేదు. నేను సమాధానమివ్వకుండా బయటకి చూస్తున్నాను. వాన బాగానే కురుస్తోంది. తల తడిసేలానే. సరిగ్గా టైమ్ కి ఒక్క నిమిషం లేటుగా ఆటో స్టేషన్లో ఆగింది. నేను అతనికి ముప్పై రూపాయలిచ్చి పరిగెత్తాను. నా చేతిలో ఒక కవర్లో ఉన్న ప్యాక్ తప్ప ఇంకేమీ లేవు. ఒక చోట కాలు స్లిప్పయి, ముందు ఉన్న ఒకమ్మాయి మీద పడబోయి, ఎలాగో నిలదొక్కుకున్నాను. నా వైపు తిరిగి ఆ పిల్ల ఏదో అనబోయేంతలో నవ్వుతూ, "సారీ సిస్టర్," అనేసి పరిగెత్తాను. ప్లాట్ఫామ్ నంబర్... ఐదు అని ఇంతకుముందే చూశాను కనుక గబ గబా అటువైపు వెళ్ళాను. దాదాపు సగం దూరం వెళ్ళే సరికే ట్రైన్ కదిలింది. నేను నాలుగు నాలుగు మెట్లు కవర్ చేస్తూ వెళ్ళేసరికి కిరా డోర్ దగ్గర నుంచుని కేక పెట్టింది, "చంటీ ఇటు," అని. ట్రైన్ కాస్త వేగం పుంజుకుంది. నేను గభాలున ఎదురుగ్గా ఉన బోగీలొ ఎక్కి, నడుస్తూ ఆవైపు పోవచ్చులే అని ఎదురుగ్గా ఉన్న బోగీలో దూరబోయాను. అంతలో ఎవరో చూసుకునో లేకపోతే చూసుకోకో డోర్ క్లోజ్ చేయబోయారు. కడ్డీ పట్టుకుని నేను మేనేజ్ చేయబోయాను కానీ గిప్ కుదరలేదు. ఇంతలో ఎవరో వెనుక నుంచీ నన్ను హిప్స్ వద్ద పట్టుకుని ఇంకో చేత్తో గట్టిగా తలుపు తోశారు. నేను ఒక్కసారిగా లోనికెళ్ళాను. "ఏం, ఇంట్లో...." నేను మాత్రం వినిపించుకోకుండా అలా ముందుకెళ్ళిపోయాను.
ఇంకో మూడు బోగీలు దాటితే వాళ్ళిద్దరూ ఉంటారు. కానీ ఇక్కడో పొరబాటు జరిగింది. తను ఉంది ఏసీ క్యాబిన్. నేను ఎక్కింది స్లీపర్. హ్మ్! ఇక విజయవాడ దాకా కుదరదు తనని చూట్టం అనుకుంటూ నిట్టుర్చేంతలో సడన్‍గా ట్రైన్ ఆగింది. నేను ఒక్క దెబ్బతో దూకి, అలా రాళ్ళ మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కేశాను. సరిగ్గా నేను కడ్డీ పట్టుకుని గ్రిప్ తీసుకుని రెండు కాళ్ళూ ఎత్తానోలేదో ట్రైన్ మళ్ళా కదిలింది. తలొకసారి విదిలించి లోపలకి వెళ్ళి తలుపు క్లోజ్ చేశాను. బోగీలో వేరెవరూ లేరు. ఎదురుగ్గా తను. ఇంతలో సెల్వి అవతలకి వెళ్ళటం గమనించినట్టు గుర్తు. ఆకుపచ్చ రంగు చీరెలో సేమ్ కలర్ జాకెట్లో పొడుగ్గా శ్రీచూర్ణం... చాలా రోజులైంది తనని చూసి. ఏమైందో తెలిసేలోగానే తనని గట్టిగా వాటేసుకున్నాను. తనుకూడా నా చుట్టూ చేతులేసింది. కళ్ళు తడి అయినట్లు తెలుస్తూనే ఉంది. కళ్ళు మూసుకున్నాను. ఇక ఏమైందో తెలియదు. అలా ఎంతస్పున్నానో తెలియదు. "This seems to be the longest break Kira," అన్నాను. తను చిన్నగా ఊఁ అంది.
నిజమో కాదో తెలియదు కానీ, మనిషికి తనంటే చాలా ఇష్టం. ఒక మనిషికి అత్యంత అపురూపమైన రూపు తనదే. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కుడా తనే. తన విలువలు, తన ఆలోచనలూ, తన తన తన... If that man finds his ideals personified in opposite sex, then he will be hooked to that being. అసలు ప్రేమంటే ఏమిటి? నీలోని అత్యుత్తమ విలువలను ఎదుటి మనిషిలో చూసి ఆ విలువలకి పట్టం కట్టటమే కదా. She's mine. No. She's me. It's me. My ideals, my values personified...
ఇవే ఆలోచనలు నా మనసులో మెదులుతున్నాయి. ఒక రకమైన అవ్యాజమైన ఆనందం. అలౌకికమైన 'లౌ'కికానందం. ట్రైన్ మళ్ళా సడన్ గా ఆగటంతో నేను ఈలోకంలోకి వచ్చాను. కృష్ణా కెనాల్ అనుకుంటాను. ఇద్దరం ఎదురెదురుగ్గా కూచున్నాం. "చంటీ, Itz faryoo," అంటూ తనొక packet ఇచ్చింది. "ఏంటి?" అడిగాను. "ఒక చిన్న గిఫ్ట్." "ఇంతకన్నానా," హగ్ చేస్తున్నట్టుగా అభినయించి నవ్వాను. తను కూడా చిన్నగా నవ్వింది. నా చేతిలోని ప్యాక్ నిచ్చి తీసి చూడమన్నాను. ఇంతలో మా మాటలు విని సెల్వి వచ్చింది. "ఎంతసేపు మీకోసం ఎదురు చూశామో తెలుసా?" చిన్నగా కోప్పడ్డది. తమిళ్ లో. నాకు అర్థం కాలేదు కనుక as usual గా "ఎంద పరంద ఎంద శాట?" అన్నాను. "No sir. You are too adventurous. అక్కడ స్టేషన్లో ఎంత కంగారేసిందో తెలుసా? ఒకవేళ రైలు కింద..." అనబోతుంటే తను అందుకుని, "సెల్వీ లీవిట్. ఇత్స్ నోప్రాబ్లం," అంది కానీ, తనలో కూడా చాలా కంగారు. మాటలు దాచినా మనసు దాగదు కదా. కళ్ళలో. బయట నుంచీ బ్రిజ్ చేస్తున్న శబ్దాలు.
రైలు విజయవాడలో ఆగింది. మేమిద్దరం ఇంకో వారమ్ తరువాత నేను పాల్గొనబోయే 3day novel contest గురించి మాట్లాడుకుంటున్నాం. సెల్వి కూడా ఆసక్తితో మా కబుర్లని వింటూ నేను చెపుతున్న కథలో డౌట్లు అడుగుతోంది. బాగా లాజికల్‍గా ప్లాన్ చేస్తుండటంతో ఎక్కడా నేను దొరకటం లేదు. అసలు నేను వెళ్ళిందే కథని పూర్తిగా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేద్దామని. రైలు మళ్ళా కదిలింది.
*** *** ***
ఇక్కడ చెప్పిన దానికి ఒక అరగంట ముందు...
Dhanaraj Manmadha Says...
భలే ఆలోచన ఇందాకటిది. బైకు నడుపుతూనే కలగన్నానా? తల విదిలిస్తూ కాస్త స్లో చేస్తూ ఎదురుగ్గా చూస్తుంటే ఎవరో లిఫ్ట్ అడుగుతున్నట్టుగా చేయి పెట్టారు. నాకు అనుమానం వచ్చి వేగం పెంచి అతన్ని దాటించాను. "రేయ్ ఆపండ్రా. దొంగ నా కొడుకివాళ వెళ్ళ కూడదు." మాటలు వినిపించాయి. నా ఎదురుగా రెండు బైకుల మీద నాగరాజు, వాడి తమ్ముడు. నా వైపే వస్తున్నారు. గుద్దేస్తారల్లేనే అనిపించి నేను సడన్‍గా బైకుని వెనక్కి తిప్పి ఇందాకటి వ్యక్తి వైపు పోనిచ్చి, ఆపాను. వాడు అర్ధం చేసుకునే లోపలే బైకునలా వదిలేసి సైడ్ కిక్ ఒకటి వాడి గొంతు మీదిచ్చాను. వాడు ఆఫ్ బాలెన్స్ గా ఉంటంతో కింద పడిపోయాడు. నేను మళ్ళా వాడు లేచే లోగా... అంతే. విలవిల్లాడి పోతున్నాడు. ఇంతలో వాళ్ళిద్దరూ నా వైపొచ్చారు. నేను వేగంగా కదిలి నాగరాజుని కిక్ చెయ్య బోయాను. ఇద్దరూ సడన్ బ్రేక్ వేసి నాకు ఒక అడుగు దూరంలో ఆగారు. నా హైట్ అండ్ వెయిట్ కి నాగరాజు గాడు ఆనడు. అందుకే ఇద్దరూ నా పైన పడబోయారు. వాళ్ళు నన్ను గుద్దేయొచ్చు కానీ నా మూమెంట్ స్విఫ్ట్ గా ఉంటుంది. గుద్దేలోగానే నేను దిశ మార్చుకుని కిక్ చేస్తే ఆ పైన వాడికి ఎందపరంద ఎంద శాటే. అందుకనే అలా వచ్చారన్నమాట. నేను రెండంగలు (దాదాపూ పన్నెండడుగులు. ఈలోగా వాళ్ళు నామీదకి వస్తారు కింద పడ్డాననుకుని. గన్-ఫూ లో ఇదో టెక్నిక్. ప్రత్యర్ధిని కాల్చే ముందు మనం ఇలా తప్పుదోవ పట్టించి ఆఫ్ బాలన్స్ గా ఉన్నామని భ్రమసినప్పుడు రెండో చేత్తో కాలుస్తారన్నమాట. ఈ మధ్య చైనాలో నాలుగు నెల్ల పైగా నేర్చుకున్నదిక్కిద ప్రయోగించాను. గన్ లేకుండా. హిహిహి. ఐనా ఎంత గన్-ఫూ ఐనా అక్కడా గన్ చేతికివ్వరు. అది చేతిలో ఉందనుకుని పని కానివ్వమంటారు. గన్-ఫూ గురించి తరువాత నా బ్లాగ్ లో ఎప్పుడన్నా) వెనక్కి దూకి కింద పడబోతున్నట్టుగా వంగి, ఎడమచేతిని నేలకానిచ్చి, ఆ చేతి మీద నా బలమంతా ఉంచి శరీరాన్ని పైకి లేపి రెండు కాళ్ళతో ఇద్దరినీ లాగి తన్నాను. సినిమాల్లో ఐతే ఇద్దరూ ఎగిరెళ్ళి ఎదురుగా ఉన్న చెట్టు మీద పడితే ఆ చెట్టు విరిగి ఇద్దరి నెత్తి పైనా పడుతుంది. అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ నుండీ నిప్పురవ్వలు రాలుతుంటే నేను మహేష్ బాబులా ఒక సైడు తల వంచి స్టైలుగా చూస్తుంటాను. కానీ ఇది సినిమా కాదుగా... అందుకే ఇద్దరూ మూడడుగులవతల పడి, బురదలో ఇంకో నాలుగైదు అడుగులు జారారు.
నేను కూడా కింద పడ్డాను. వాళ్ళకన్నా ముందు లేచి వంటికంటిన బురదని దులుపుకుంటూ వాళ్ళ వైపు చూశాను. ఇద్దరూ లేస్తున్నారు. నేను నేల మీద కాస్త గ్రిప్ తీసుకుని నాగరాజుని మోకాలుమీద కొట్టాను. వాడి తమ్ముడు మీదకు రాగానే టైగర్ శ్టాన్స్ తిసుకుని పా పొజిషన్ సరిజూసుకుని వాడి మెడమీద ఎడమ చెయ్యి వేసి, కుడిచేత్తో వాడు పొట్టమీద గ్రిప్ తిసుకుని గాల్లోకి లేపి, (ఏంటీ సినిమా కథనుకుంటున్నారా? నా హైట్ ఆరూ నాలుగు. వెయిట్ తొంబై మూడు. వాడు ఐదూ ఆరుంటాడు. నాకన్నా కనీసం ముప్పై కేజీలు తక్కువ) గట్టిగా నేలకి కొట్టాను. నా వంటి మీద దెబ్బ పడకుండా చూసుకోవాలి. లేందే మాస్టర్జీ అనవసరంగా నన్ను రమ్మన్నానని ఫీలవుతారు. బైకుకి కూడా ఏమీ కాకుండా చూసుకోవాలి కదా. దానికేమైనా ఐనా విశయం తెలిసిపోద్ది. అందుకనే ఇంత ప్లాన్ అండ్ కాలిక్యులేషన్లు. ఇంతలో ఆ మూడో వ్యక్తి నా వనక వస్తున్నట్టు అనిపించి లెఫ్ట్ సైడ్ తర్న్ తీసుకుని కిక్ చేయబోతున్నప్పుడు నాగరాజుగాడు చేత్తో రాయితో నా పైనకొస్తున్నాడు. దబుల్ అట్టాక్! నా మైండ్ వేగంగా ఆలోచిస్తోంది. ఇంతలో ఎవరివో పెద్దగా అరుపులు వినిపించాయి. వాన జోరు ఎక్కువైంది. చూస్తే ఆయన సాంబశివరావు గారు. ఆయనతో కొంతమంది కాన్స్టేబుళ్ళూ. (పేర్లు మార్చాను. ప్లస్ వాళ్ళు మఫ్టీలో ఉన్నారు. సాంబశివరావుగారిది మరో కథ. అదంతా అనవసరం) వాళ్ళ ముగ్గురినీ పట్టుకుని జీప్ లొ వేసుకుని కాన్స్టేబుళ్ళెళ్ళగానే, సాంబశివరావు గారు న బైకుని పైకి లేపి పోదామన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి డ్రస్ మార్చుకుని ఫ్రెషప్ అయ్యి రాజమండ్రి వెళ్ళాను.
*** *** ***
రాజమండ్రి స్టేషన్...
నేను ఇంకో పావుగంట ముందుగానే సిద్ధార్ధ వాళ్ళ ఇంటినుంచీ బయలుదేరెళ్ళి నించున్నాను. ఇంకాసేపట్లో మాస్టర్జీ, మేమ్సాబ్ ఇద్దరూ ట్రైన్లోంచి దిగారు. "ఏంటి ధనా! కిమ్ కర్తవ్యం?" అడిగారు మేమ్సాబ్. "హ్మ్. చక్కగా అరవచీనీ కళతో అదరగొడుతోంది," నవ్వాను. ట్రైన్ ఎక్కువ సేపు ఆగలేదు. నాకో packet ఇచ్చారు. వద్దన్నా. నేనూ, మాస్టర్జీ ఇద్దరం స్టేషన్ బైటకొచ్చాము.
(చెప్పాల్సిన వివరాలు ఇంకా కొన్నున్నాయి. అవి తరువాత ఎపిసోడ్ లో. ఇంత రిస్క్ అవసరమా? అంత గొడవలేంటి? అంటారా/? వాటికి చాలా వివరాలు చెప్పాలి. కానీ కుదరదు. అండుకే జస్టలా ఒక ఎడ్వెంచర్ స్టోరీ చదివామనుకుని ఒక కామెంటు పెట్టి మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్ధన ;-). ThankQ very much)
Dhanaraj Manmadha