గమనిక అసలు మనసు పెట్టి B&G మీద కూచునే అవకాశం లేక పోవటం వల్ల ఈ నెల లో రెండో సగ భాగంలో ఒక వరుసలేకుండా (అదే ఏ వారం రావాల్సినవి అప్పుడు) టపాలు వచ్చాయేమో. ఇప్పుడు ఇయరెండు సందర్భంగా కొన్నిప్రత్యేక టపాలనుకున్నాను. అవి రేపెల్లుండుల్లో వస్తాయి. ఇవిగాక మరో పెద్ద ప్రయత్నమే చేశాను. అదీ ఫలిస్తుందేమో చూద్దాం. మరో పది రోజులు వరుస కుదరకపోవచ్చునేమో. మన్నించ గలరు. క్షణం తీరిక లేని పరిస్థితి. మితృలు అప్పటికీ నాకు సహాయంగా సమయానుకూలంగా స్పందిస్తూనే ఉన్నారు. వారికి ధన్యవాదాలు
*** *** ***
హమ్మయ్య గమనిక చదివి మన్నించారు కదా. ఇక ఈ చిరు కవిత చదివి పెట్టండి.
చెవిలో సెల్లుఫోను గీతాలు
చుట్టురా బస్సు హారన్ల పకపకలు
పైకి చూస్తే మిల మిల మబ్బులు
ఎదురుగ చూస్తే తళ తళ తారకలు
ఇంటికెళ్ళే గేదెలు
బడి బైట కెళ్ళే పిల్లలు
సిమెంటు రోడ్డు మీద నడకా
ఓపికుడిగి ఇంటికి చేరిక
ఇవే కదా సాయంకాలపు కబుర్లు
(రోజూ తప్పని ట్రబుళ్ళు)
చుట్టురా బస్సు హారన్ల పకపకలు
పైకి చూస్తే మిల మిల మబ్బులు
ఎదురుగ చూస్తే తళ తళ తారకలు
ఇంటికెళ్ళే గేదెలు
బడి బైట కెళ్ళే పిల్లలు
సిమెంటు రోడ్డు మీద నడకా
ఓపికుడిగి ఇంటికి చేరిక
ఇవే కదా సాయంకాలపు కబుర్లు
(రోజూ తప్పని ట్రబుళ్ళు)
సాయంకాలాలు కాలేజీ బస్సు దిగగానే గమనించే దృశ్యాలకు అక్షర రూపం. ఎక్కడో కామెంటుగా పెట్టాను. ఒక గుర్తుగా ఉంటుందని ఇక్కడేస్తున్నాను.
B&G WISHES U ALL A HAPPY AND GR8 YEAR END
గీతాచార్య