బాబీ... మహేష్ నటించిన ఒక లాండ్మార్క్ ఫ్లాప్. ఒక ఫ్లాపు సినిమా అంటే ఇదీ అనిపించుకున్న ఆ చిత్రరాజాన్ని జనం నిరాకరించినా దానికి కొందరు మూగ ఫానులున్నారు.
సరే అవన్నీ మనకెందుకులే కానీ ఇక్కడ విషయానికొద్దాము. "అడుగడుగు గుండెనడుగు" పాట ఒక చక్కని మెలోడీ. చక్కని బాణీకి అందమైన అక్షరాలున్నాయి. మహేష్ నటనా, ఆర్తీ అందం (ఆరోజుల్లో కాస్త బాగుండేది కదా :-)) చిత్రీకరణా... ఇవన్నీ ఈ పాటని ఒక చిన్న సైజు క్లాసిగ్గా నిలబెట్టాయి. సినిమా సంగతీ, దాని మీద జనానికున్న అభిప్రాయాన్నీ ప్రక్కన పెట్టి కస్త ప్రయంలో ఉన్న వారి మనసు తలపులని విందామనుకుంటే భలే అనుభవమీ పాట. ఆస్వాదించండి.
*** *** ***
అడుగడుగు గుండెనడుగు తడబడిన ఈడునడుగు ఏ మంత్రమో వేసావే మనసునే మగతగా కమ్మావే నీ నవ్వుతో చంపావే వయసునే వరదలా ముంచావే గుండెలానుండి రుసరుసలేవో వెన్నులొ పాకయిలే ఊహకు రాని తహ తహలేవో తాపం పెంచాయిలే
నా నరనరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది
కోరికేదో తొలిమెట్టై పోసె తేనెలాగ చిరు చెమటైపోసె మాయ ఇది ఎవరి మాయ సిగ్గు నూనూగు చిగురే వేసె ఉగ్గపట్టి ప్రాణాలే తీసె మంత్రం చెలివేసే మంత్రం చూపుదిగితే చెప్పలేని వయసు కోతా వెన్నులోన చలుపుతున్న తీపి బాధా
గోరువెచ్చని ఊపిరికే వేడికొసలు చిరు తాకిడికే మేను మెరుపులా మెరిసింది ఈడు మెలికలే తిరిగింది చెలి తుంతరి నవ్వులకే తలుపు తియ్యని కౌగిలికే వయసు భగ్గున మండింది తియ్య తియ్యగా కాల్చింది చిగురాకులాగ నా ఒళ్ళే సెగ చిమ్మి పొంగుతూ ఉంది తమకాన్ని రేపే నీ పెదవి నవనాడులాపుతూ ఉంది నా నరనరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది
*** *** ***
గుండెలానుండి రుసరుసలేవో వెన్నులొ పాకయిలే
ఒక్కసారి ఈ వాక్యాన్ని చుడండి. గుండెల నుండీ రుస రుసలేవో వెన్నులో పాకాయిలే... హా....... వెన్ను పులకరించే భావన ప్రేమ అని ఎంత అద్భుతంగా చెప్పాడు కవి.
చూపుదిగితే చెప్పలేని వయసు కోతా
ఇది మాత్రం తక్కువా?
అందుకే చదువుతూ, విని చూసి ఆనందించండి. మాంఛి రొమాంటిక్ ఫీల్ ఉన్న పాటని
గీతాచార్య