ఎన్నాళ్ళ నుంచో గీతూ ఈ టపా రాయాలని కోరిక. కానీ వీడియో దొరక్క ఆగారు. ఇది జాంటీ రోడ్స్ ని అమాంతం సూపర్ స్టార్ ని చేసిన ఫీల్డింగ్ విన్యాసం.
గీతాచార్య Says...
1992 world cup సమయంలో నాకు క్రికెట్ పరిచయం కావటం జరిగింది. మనోళ్ళు ఎటూ ఓడిపోయే మొహాలే అమ్దులో. జస్ట్ రెండు మ్యాచులు గెల్చి, రెండు మ్యాచులు గెలవబోయి పోగొట్టుకుని, ఇంటీ ముఖం పట్టారు. అప్పట్లో మా ఇంట్లో ఇండియా కాకపోతే వెస్టిండీస్ కి మద్దతు. సరే. నాకు ఆంబ్రోజ్ మీద ఉన్న వ్యక్తిగత కక్షల వల్ల వెస్టిండీసు కి నా సపోర్ట్ లేదు. (నీ సపోర్ట్ ఉంటే ఎంత లేకపోతే ఎంత? అంటే నా సమాధానం ఇదీ. ఈ సపోర్టులూ రిపోర్టులూ మన తుత్తి కోసం కానీ మననెవడు పట్టించుకుంటాడు) . కానీ ఒక రోజు పాకీస్తాన్, సౌతాఫ్రికా మ్యాచ్ వస్తోంది. నాకప్పటికి కాస్త టెన్నిస్ తెలుసు కానీ క్రికెట్ అప్పుడప్పుడే పరిచయమవుతోంది. హఠాత్తుగా చిన్నమామయ్య పెద్దగా అరిచాడు. ఏంటా అని చూస్తే ఈ సన్నివేశం.
ఆశ్చర్యపోయి అలాగే చూస్తుండి పోయను. జాంటీ రోడ్స్. ఒక కొత్త సూపర్ స్టార్. అంతవరకూ బ్యాటింగులోనో, బౌలింగులోనో మనకి స్టార్లు తెలుసు. కానీ ఫీల్డింగు కూడా ఒక కళ అని చాటిన ఆ సన్నివేశం నా మదినుండి తొలగిపోదు. ఆ ఫీల్డింగు విన్యాసమే సౌరవ్ గంగూలీ మన కెప్టెన్ అయ్యే దాకా నాకు సౌతాఫ్రికా అంటేనే క్రికెట్ టీమ్ అనేంత ఫావరిట్ టీమ్ గా నిలచింది.
ఇంజమామ్ ని స్టార్ ని చేసిన ఆ ప్రపంచ కప్పే, జాంటీనీ ప్రపంచానికి పరిచయం చేసింది.
*** *** ***
సో ఎంజాయ్ ద వీడియో.
చైతన్య కళ్యాణి