ఆమధ్య తెలిసిన ఫ్రెండెవరో ఎమ్మెసాఫీసు 2007 కోసం వెతుకులాడాననీ, ఒరిజినలి ధర విన దిమ్మ తిరిగి ఎవరి దగ్గరో పట్టుకున్నాననీ, కాకపోతే అప్డేటులేవీ అందటం లేదనీ వాకృచ్చాడు.
జనానికి ఎమ్మెసాఫీసు బాగా వంట పట్టింది కానీ దాంతో సమానంగా పని చేసే ఓపెన్ ఆఫీసు మాత్రం అంతగా ఎక్కలేదు. కారణం... పీసీ అనగానే విం’డోసు’ ఆఫీసనగానే ఆ సన్నాసి ఎమ్మెసాఫీసు. ఒక చక్కని మార్కెటింగు స్ట్రాటెజీ ప్రకారం, పోటీ లేకుండా చూసుకుని జనం గుండెల్లో తిష్టవేసుకుని కూచున్నారు.
జనానికున్న ఈ మైక్రోసాఫ్ట్ కార్నరు వల్ల ఎంత ఇబ్బందులున్నా అదే వాడతారు కానీ (ఇక్కడా చూస్తున్నా... కొందరు మితృలు ఆఫీసు 2010 కోసం ఎలా అర్రులు చాస్తారో eventhough they are open source lovers... for public) వేరే వాటి వైపు మళ్ళరు. అలవాటైపోయిందనేది ఒక సాకు. కుంటి సాకు.
ఎమ్మెసాఫీసు 2--3 కన్నా ఎక్కువగా, దరిదాపుల MO 2007 లాగా ప్రభావ వంతంగా, ఇంకా చెప్పాలంటే దండుకో గలిగిన వారికి దండుకోగలిగినంత ఓపెనాఫీసు. దాని గురించి వివరాలనూ, కొన్ని అప్లికేషన్లనూ ఇక్కడ నా వీలుననుసరించి వ్రాసే ప్రయత్నం చేస్తాను. మూడు నాలుగు టపాలుగా. అలాగే మరికొన్ని ఫ్రీ, ఓపెన్ సాఫ్ట్వేర్లని కూడా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.
ఈలోగా మీరు పక్కనున్న THE BEST DOWNLOADS AND SITES (V: VISIT, D: DOWNLOAD)
అనే సైడ్ బార్ నుంచీ ఓపెనాఫీసుని దించుకుని వాడి చూడండి.
త్వరలో మళ్ళా కలుద్దాము. అలాగే FOSS TELUGU అనే గూగిలు గుంపులో చేరి ఓపెన్/ఫ్రీ సాఫ్ట్వేర్ల ఉద్యమంలో పాలు పంచుకోండి. గుంపుని వీలైనంత త్వరలో హుషారుగా మార్చే పని చేస్తాను.
సెలవ్,
Dhanaraj Manmadha