BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

మనకేవన్నా సైట్లు నచ్చితే వాటిని బుక్ మార్క్ చేసుకునే అలవాటుంటుంది. కానీ ఎక్కద బుక్ మార్క్ చేసుకుంటే అక్కడే వాటిని ఉయోగించుకోగలం. మరి వేరే సిస్టం లో వాటిని వాదుకోవాలంటే? ఈ సమస్య స్వంత సిస్టం లేని వాళ్ళకు మరింత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏ సిస్తం ముందు కూచోవాల్సి వస్తుందో తెలియదు. అలాంటి సందర్భాల్లో ఆన్లైన్ బుక్ మార్కింగు సౌకర్యం ఉంటే బాగుంటుంది కదా...

సో ఈ బ్రౌజర్ ని చూడండి. పేరు కామెట్‍బర్డ్. బ్రౌజరు బాగా పని చేస్తుంది. నా వడకంలో దీనికి నాలుగుంపావు (4.25/5) రేటింగివ్వవచ్చని తేలింది. ఐదురోజులు పూర్తిగా దీన్ని తప్ప వేరే బ్రౌజరు వాడకుండా చూశాను. చూట్టానికి పైన ఎడమ వైపు కార్నర్ లో సింబలు తప్ప మొత్తానికీ చూట్టానికి మోజిల్లా ఫైర్‍ఫాక్స్ లాగా ఉంటుందిది.

బ్రౌజర్ల గురించీ, వాటిలో ఏది బెస్ట్, వేటిని ఏ పర్పస్ కి వేటిని వాడాలనే దాని గురించి ఒక సరళంగా అర్ధమయ్యే టపా రాస్తున్నాను. త్వరలోనే పూర్తవుతుంది. అలాగే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ల గురించి కూడా సమాచారమందిస్తాను.

ఈలోగా ఒకసారి కామెట్‍బర్డ్ ని దించుకుని వాడి చూడండి. ఫైర్ఫాక్స్ వాడకందారులకి ఇది దాని డమ్మీలాగా అనిపించినా బాగా నచ్చుతుంది. చక్కని ఫ్రీ బ్రౌజరు. పైగా ఫైర్ఫాక్స్ కన్నా సెక్యూరిటీ ఫీచర్లెక్కువ.

దించుకోవాలంటే ఇక్కడ నొక్కండి.

కొసమెరుపు: దీని అక్కలాంటి ఫైర్‍ఫాక్స్ లో ఒక బ్లాగు టపా రాశాక పబ్లిష్ అయ్యాక మళ్ళా ఎడిట్ చేసుకోవాలంటే కొన్ని సార్లు పేరాల మధ్య గ్యాప్ ఎక్కువవటం, వీడియోలప్లోడింగు ఇబ్బంది పెట్టటం, ఉన్నట్టుండి అక్షరాల ఫాంట్ సైజ్ పెరిగిపోవటం మొదలైన ఇబ్బందులు గమనించి ఉండవచ్చు. నా ఈ వాడకపు సమయంలో ఆరకమైన ఇబ్బందులూ, హ్యాంగింగు సమస్యలూ కనబడలేదు. అది కాస్తంత సౌకర్యవంతంగా ఉంది.

Dhanaraj Manmadha

గమనిక ఇది కేవలం ఒక చిన్న పరిచయం మాత్రమే. పెద్ద టెక్నికల్ అంశాలని స్పృశించలేదు. బట్ వాడిన అనుభవం మీద చేస్తున్న రికమెండేషన్. హాయిగా దింపుకోండి. ప్రయత్నించి చూడండి.

Posted by Dhanaraj Manmadha Dec 30, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!