ఒక వ్యక్తి చేసిన తప్పులు గుర్తున్నంతగా అతనిలోని గొప్పతనం గుర్తుండదు జనానికి. మానవాళి చేసుకున్న అతి పెద్ద దౌర్బాగ్యం ఇదే...
- రామానుజన్
నా చిన్నప్పుడు నాకు సౌతాఫ్రికా అంటే ఇష్టం. అద్భుతమైన ఫీల్డర్లూ, డొనాల్డ్ లాంటి అగ్రెసివ్ బౌలర్లూ, లెక్కలేనంత మంది ఆల్రౌండర్లూ, క్రోన్యే లాంటి గొప్ప ఇన్నోవేటివ్ కెప్టెన్... ఆహాహా... ఆటంటే అదీ అనిపించేలా ఉండేది.
- రామానుజన్
నా చిన్నప్పుడు నాకు సౌతాఫ్రికా అంటే ఇష్టం. అద్భుతమైన ఫీల్డర్లూ, డొనాల్డ్ లాంటి అగ్రెసివ్ బౌలర్లూ, లెక్కలేనంత మంది ఆల్రౌండర్లూ, క్రోన్యే లాంటి గొప్ప ఇన్నోవేటివ్ కెప్టెన్... ఆహాహా... ఆటంటే అదీ అనిపించేలా ఉండేది.
Hansie, the HERO
శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటన మొదలెట్టింది. అర్జున రణతుంగ సారథి. సరిగ్గా గుర్తు లేదు కానీ, అది మార్చో ఏప్రిలో. ఆ జట్ల మధ్య రెండో తెస్టు. డొనాల్డ్, క్రోన్యే, రోడ్స్ అంటే ఇష్టమున్న నేను, ఆ మ్యాచ్ మీద ఒక, కాది కాదు, రెండు కళ్ళూ వేశాను. అసలే తొలిటెస్టు SA గెల్చింది. ఇది కూడా గెలిస్తే ఇక సీరీస్ వశం అన్నది నా ఆశ.
ఆశ దోశ అప్పడం వడ అన్న తరహాలో మొదట శ్రీలంక మూడొందల పదో పన్నెండో చేసి, SA ని రెండొందలకే పొడుం కొట్టింది. డారిల్ కలినన్ సెమ్చురీ లేందే ఆమాత్రం స్కోరైనా వచ్చుండేది కాదు.
కానీ ఇక్కడో విషయం చెప్పాలి. అప్పట్లో, అంటే హాన్సీ క్రోన్యే కెప్టెన్‍గా ఉన్న రోజుల్లో SA ఎంత తక్కువ స్కోరుకాలౌటైనా ప్రత్యర్థిని అంతకన్నా తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసే బౌలర్లున్నారు. డొనాల్డో, పొల్లాకో, డివిల్లియర్సో, అదరగొట్టి మరీ గెలిపించేవారు. ఏదో ఒక ముక్కోణపు టోర్నీలో ఇంగ్లాండు వాళ్ళని 149 కి ఆలౌట్ చేస్తే SA ఇంగ్లాండుని నూట పాతిక లోపే ఆలౌట్ చేసి గెలిచింది. డొనాల్డు, క్రోన్యే దెబ్బకి శ్రీలంక మూడొందలకే ఔటైనా, మురళీధరన్ ధాటికి ఆఫ్రికా కూడా తలొంచి వాళ్ళకి విలువైన ఆధిక్యాన్ని సమర్పించుకుంది.
ఇలాంటి సన్నివేశమే ఈ మధ్య ఇండియా ఇంగ్లాండు టెస్టులో జరిగింది, ముమ్బై అల్లర్ల తరువాత చెన్నైలో జరిగిన టెస్టులో. మనందరికీ గుర్తుండిపోయే రీతిలో ఇండియన్ క్రికెట్ చంటి గాడు సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్స్ మాదిరి సంటనా ఇక్కడ జరిగింది. శ్రీలంకని రెండో ఇన్నింగ్స్ లో SA గుక్క త్రిప్పుకోనివ్వలేదు. వైట్ లైటెనింగ్ అలన్ డొనాల్డ్ నిప్పుకు చెరిగి ఐదు వికెట్లు తీయటంతో పాటూ క్రోన్యే కూడా మరో రెండు వికెట్లు సాధించాడు. లంకేయులు ఈ తడవ 122 కే చాపచుట్టి 226 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. తమ రెండో ఇన్నింగ్సుని తడబడుతూనే ప్రారంభించింది SA. తొంభై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పిచ్ బాగా తిరుగుతోంది. మురళీ మళ్ళా అదరగొడుతున్నాడు. SA కీ విజయానికీ మధ్య మురళీనే తేడా అనిపించేలా కనిపిస్తున్నది సన్నివేశం. అప్పటికే మూడు వికెట్లు తీసి మాంఛి ఊపుమీదున్నాడు కుర్రాడు. (సిద్ధూ, దెబ్బని మర్చిపోయి అప్పుడప్పుడే స్పిన్నర్ గా కాస్త పుంజుకుంటున్న సమయమది.
అప్పుడొచ్చాడు హాన్సీ క్రోన్యే.
కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఇదే అనేలా ఉన్న ఆ ఇన్నింగ్స్ సెహ్వాగ్ ఇన్నింగ్స్ కి ఏ మాత్రం తీసి పోదు. మొత్తం 63 బంతుల్లో, ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 82 పరుగులు సాధించాడు. అందులో తన అర్థ సెంచురీని సాధించిన తీరు ఇంకా నా కళ్ళలో మెదులుతూనే ఉంది. తనకు మాత్రమే సాధ్యమైన స్లాగ్ స్వీపులూ, గార్జియస్ కవర్ డ్రైవులూ, లాఫ్టెడ్ షాట్లూ, ఒకటేమిటి? ఎన్నిరకాలుగా చెండాడాలో అన్ని రకాలుగా చీల్చి చెండాడి, విజయానికి కేవలం పది పరుగులున్న సమయంలో ఔటయ్యాడు. నలుగురు ఫీల్డర్లని తప్పించి ఫ్లిక్ బౌండరీ, ఆ పైన లెగ్ సైడ్ కొట్టిన సిక్సర్, మరో లాఫ్టెడ్ షాట్... అబ్బబ్బ. తల్చుకుంటేనే వళ్ళు పులకరిస్తోంది. చూసి తీరాల్సిందే. ఇక అర్థ సెంచురీ సాధించి పెట్టిన మూడో (వరుసగా మూడేశాడు) సిక్సర్ అద్వితీయం. కాలు వంచి స్లాగ్ స్వీప్ కీ పుల్ షాట్ కీ మధ్యస్తమైన ఆ షాట్ ఇప్పటికీ నేను మర్చిపోలేదు. తనకే సాధ్యమైన ఒకరకమైన చూపుతో, బ్యాటునలా గాల్లోనే ఉంచి, చిన్నగా చేతులెత్తి అభివాదం చెయ్యటం ఏవరు మర్చిపోతారు? ఒక్కసారి చూస్తే. బంతి అలా గాల్లో తేలిపోతుంటే కాలమాగిపోతే బావుణ్ణనిపించిందప్పుడు. Real heroism. The sight of a WINNER, whose brutality has a sense of beauty, and and unforgettable grace. నిజమైన ఆల్రౌండ్ షో అది.
CHAMPION CAPTAIN. Hansie
అర్థ సెంచురీ దాటాక కూడా ఆ దూకుడు తగ్గలేదు. అంతిమంగా డొనాల్డ్ కి man of the match అవార్డు వచ్చినా, ఆ మ్యాచ్, ఆ గెలుపు మాత్రం హాన్సీవే. ఆ కసీ, ఆ ఠీవీ, మళ్ళా చూడలేమనేదే బాధ కలిగించే అంశం. మ్యాచ్ ఫిక్సింగ్ సరే. ఇదొకసారి ఎవరన్నా చూసిన వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటే నేను చెప్పిన పులకరింత కలుగదూ?
*** *** ***
This account is purely based on my memory. It was a match taken place more than a decade ago. So, small mistakes might have crept in. If you notice any mistakes, kindly help me to correct.