BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...మొదట్లో వచ్చే సాగ్జా ఫోను బిట్టు తప్ప నాకు తెలిసినంతలో మణి శర్మ ఒరిజినల్ కంపోజిషనే ఈ పాట. యూట్యూబులో విచిత్రమైన చర్చ జరిగింది. ఏదైనా సరే ఈ హుషారైన పాట మీకోసం ఇక్కడ...మహమ్మారి మహమ్మారి మహమ్మారివే అందాల మహమ్మారివే...
వహవ్వారి వహవ్వారి వహవ్వారియే మహవీర వహవ్వాహురే...


ఊగే చెవి రింగు వంపుల్లో ఉందే స్వింగూ
హల్లో డార్లింగూ లేటెందుకు తొడిగెయ్ రింగూ


రాయే రాయే రాయే ఊరంతా నిద్దరోయే
రాయే రాయే రాయే కుర్రాడూ రాలూగాయే
రాయే రాయే రాయే ఊరంతా నిద్దరోయే
రాయే రాయే రాయే కుర్రాడూ రాలూగాయే


మహమ్మారి మహమ్మారి మహమ్మారివే అందాల మహమ్మారివే...

వహవ్వారి వహవ్వారి వహవ్వారియే మహవీర వహవ్వాహురే...


నీ చూపే టకీలా నా షకీరా దిల్ ధదక్కు ధడక్కు రంగీలా
నీ హైటే అకీలా పిచ్చెకేలా వయస్సుడిక్కి ఉడిక్కి పోయేలా 
షరపోవా స్టెఫీ గ్రాఫూ మడోన్నానీ మిక్సీ వేస్తే నడిచొచ్చే ఆ బొమ్మ నీలా ఉంటుందే...
హీమానూ కౌబాయీ జేమ్స్‍బాండూ ఒకటై పుట్టీ ఎదురైతే అచ్చం నీలా ఉంటుందే


అచ్ఛా బహుతచ్ఛా కాబట్టే గిల్లీ గిచ్చా 
నచ్చే చనువిచ్చా నీ బండికి సిగ్నల్ ఇచ్చా
రాయే రాయే రాయే ఊరంతా నిద్దరోయే
రాయే రాయే రాయే కుర్రాడూ రాలూగాయే
రాయే రాయే రాయే ఊరంతా నిద్దరోయే
రాయే రాయే రాయే కుర్రాడూ రాలూగాయే


నువ్వే నా హనీబీ నా హబీబీ నరనరాల్లో సడన్‍గా హైబీపీ
ఫైవ్ ఫీటూ గులాబీ లవ్ జిలేబీ నీ తళుక్కు పెళుక్కు సో హ్యాపీ
హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ గాలించేశా నీ లాంటీ మొనగాడూ నో నో నో నో నో
పీకాసో నీకేసి ఆనాడే చూసే ఉంటే మోనాలిసా పెయింటింగ్ మానేసుంటాడే


నువ్వే హమ్మింగు నా గూటికి నువ్వే కింగూ
రమ్గూ నీ హంగూ నీ నడుమే కాదా స్ప్రింగూ
రాయే రాయే రాయే ఊరంతా నిద్దరోయే
రాయే రాయే రాయే కుర్రాడూ రాలూగాయే
రాయే రాయే రాయే ఊరంతా నిద్దరోయే
రాయే రాయే రాయే కుర్రాడూ రాలూగాయే


ఆ ఒరిజినల్ పాట The Anthem by Pitbull. వెతికితే దొరికింది. ఆ సాగ్జాఫోన్ బిట్టుని మణి బాగా లాంచింగుకుపయోగించుకుని, ఆ ఊపునే కొనసాగించాడు చివరిదాకా. ఆ బిట్టు ఉంది ఈ పాటలో. చూడండి.

అలాంటి బిట్టే ఉన్న మరో పాట...***   ***   ***   
ఇకిప్పుడు ఇళయరాజా చేసిన అత్యంత అద్భుతమైన పాటల్లో ఒకటిక్కడ చూడండి.

లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిది
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
అమ్రుత కలశముగా ప్రతినిమిషం
అమ్రుత కలశముగా ప్రతినిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది

||లలిత||

రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేలా నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి రాగ చరితర గలమ్రుదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను

||లలిత||

కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినది
మనసు హిమగిరిగా మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన బిలిబిలి గమకము
కాలి మువ్వగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగచించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి

ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ

||లలిత||

ఈ పాటంతా ఒక ఎత్తూ, ఆ గులాబీ రంగులో ఇచ్చిన లైన్లు ఒక ఎత్తు. పాడుతుంటేనో, వింటుంటేనో మనసెక్కడికో వెళ్ళిపోతుంది. అందులోనూ ఈ పాటలోని సాహిత్యం సంగీతంతో ఒక అద్భుతమైన పోటీ సాగించింది. యేసుదాసు దాసులమైపోవాల్సిందే ఆ స్వరంలోని మార్దవానికి.యేసుదాసు గానం, చిరంజీవీ నటనా, శోభన నాట్యం... ఓహ్! ఒక modern classic అనటానికి కావలసిన అర్హతలన్నీఉన్నాయీ పాటకి. BLESSED ARE THOSE WHO INVOLVED IN IT.

హుషారైన పై పాట విని సిరివెన్నెలలు కురిపించిన ఈ పాటని ఆస్వాదించి, మీ వారాంతాన్ని ఆనందంగా గడపండి

గీతాచార్య

Posted by గీతాచార్య Dec 11, 2009

Subscribe here