వంద కిలోమీటర్ల పైన బండి నడుస్తుంటే వెనుక కూచుని ఫొటోలు తీయటం ఎలా ఉంటుందో తెలుసా? అసలా ఆలోచన ఎవరికైనా ఎప్పుడైనా వచ్చిందా? వస్తే అలాంటి వారిలో ముందుండేది... Dhanaraj Manmadha. వెనుకుండి నడిపించేది (కెమేరాని) గీతాచార్య.
నరసరావుపేట నుంచీ గుంటూరుకి సుమారు 50 కిలో మీటర్లు. బస్సులో గంట పైమాటే (ఎర్ర బస్సెకకుండా ఉంటే). బళ్ళ మీద వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టీ 40-60 నిమిషాల్లో లాగిస్తారు.
ఈ క్రింద ఇచ్చిన ఫొటోలు చూడండి. ఆఁ ఆమాత్రం ఫొటోలు మేము తీయలేమా? ఇందులో వింతేముందీ అంటారా? ఏమిటా వింతంటే గంటకు వందకు పై బడిన స్పీడులో బైకు నడుస్తుంటే వెనుక కూచుని అన్ని దిశలలో ఫొటోలు తియ్యటమంటే చూడండి. మా ప్రయాణ కాలం కేవలం 29 నిమిషాలే. అందులోనూ కొంచం మధ్యలో స్లో కావల్సి వచ్చి. గేదెలూ ఎట్సెట్రాదులూ అడ్డం వచ్చి.
మబ్బుల్లో విహరించండి. ఈ మబ్బుల పైన కవితలెన్నో అల్లొచ్చు. అల్లుతానేమో మరి. ఈలోగా మా adventurous ride లో ఒక ఘట్టాన్ని చూడండి. మరో సారి వేరేలా కలుద్దాం.
ప్రేయసి బుగ్గ కొరుకుతున్నట్టు లేదూ? క్రింది పెదవి, పై పెదవి ముక్కు... ;-)
యుద్ధమా? దయ్యాల నృత్యమా? భలే చిత్రం కదూ! :-)
UFO నా? పుష్పకమా?
ఇది తీసేటప్పుడు నెలకి దాదాపూ సమాంతరంగా వంగాను. సరైన angle కోసం. Of course చుట్టుప్రక్కల వాహనాలు లేవులేండి.
మహాకాళమో, అనకొందో నోరు తెరచి దేన్నో మ్రింగుతున్నట్టు లేదూ?
దీనికోసం ధన భుజం చెయ్యి వేసి బైకు మీద నించోవాల్సి వచ్చింది. స్పీడా? చెప్పినా నమ్మరు లెండి.
తాటి సెట్టేక్కలేవు, తాటి కల్లు... అనలేరు ఇది చూస్తే. తాటి చెట్ల మధ్య నుంచీ మబ్బులు.
టెడ్డీ బేరా? ఏదో అర్థం కాని బొమ్మ. :-)
ఉంగరమో, క్రికెట్ వరల్డ్ కప్పులానో అనిపిస్తోందిది.
ఆకాశంలో కరంటు స్థంభం. నా డొక్కు వీజీయే కెమెరాలో సూరిబాబిలా అయిపోయాడు.
ఒక గాడ్జిల్లా మరో దానికి షేక్ హ్యాండ్ ఇస్తూ...
మన గాడ్జిల్లా గారే. కానీ ఆ కరంటు స్థంభం, చెట్టూ చూడండి. ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది.
మరోసారి మేఘాల చుంబనం. ఛీ పాడు...!!! ;-)
బండి బండి మబ్బూ బందీ. ఆకాశంలో తేలేనండీ...
పేరిచర్ల బ్రిజ్ దగ్గర కొండలు. బ్రిజ్ మీద నుండీ తీసిన ఫోటో. ఒక పెయింటింగ్ లా లేదూ? ఆ ఎఫెక్ట్ కోసం ఎంత కష్ట పడాల్సి వచ్చిందో!
ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పటికివి చాలు. ఇదో చిన్న adventure. స్పీడ్ బైకింగ్.