BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

ఉన్న మాటంటే ఉలుకెక్కువ అని మన పెద్దలు చెప్పిన మాట. కానీ అదే పెద్దలు (ఇక్కడ పెద్దలు అంటే జనాలు అని తీసుకోండి) ఉన్న మాట అంటే ళేనిపోని భేషజాలకు పోతారు. లౌక్యముండాలంటారు.

సరే మనకవన్నీ ఇక్కడ ఎందుకులేగానీ, ఒక సరదా అయిన ఆలోచించదగ్గ విషయం గురించి చెప్దామని...

మొన్నా మధ్య బంగ్లా పర్యటనల్లో వీరూ సెహ్వాగ్ బంగ్లాని సాధారన జట్టన్నాడు. దానికి ’మీడియా’కరోళ్ళు పెద్ద దుమారం లేపారు. ప్రశ్నని అటు కొంతసేపు, ఇటు కొంతసేపు త్రిప్పి త్రిప్పి వదిలారు. ఇంతకీ వాళ్ళకు కావలసిన సమాధానమెలా ఉండాలి? వాళ్ళది బాగా టాలెంట్ ఉన్న జట్టు, అపార ప్రతిభా పాటవాలున్నాయి, ఎవరినీ తక్కువంచనా వెయ్యము అని cliched సమాధానాలు చెప్పాలా?

ఒక్క నిజం చెప్పినమ్దుకు సెహ్వాగ్ విలనైపోయాడు. స్థాయిని మించి వాకృచ్చల్లా, బంగ్లాదేశీయులు రెచ్చిపోయారు. వాళ్ళకి తగ్గట్టూ మీడియోకర్లు ప్రతి రోజూ అదే ప్రశ్న. పిచ్ సహకారం, కాస్తంత కంప్లాసెన్సీ వల్ల మనవాళ్ళు తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలగానే అందరూ సెహ్వాగ్ వ్యాఖ్యలని భూతద్దమ్లో పెట్టి మరీ చూశారు. కానీ అతను అన్న దానిలో ఉన్న నిజాన్ని చూడలేదు. ఏదో ఒక రోజో, కొన్ని ప్రత్యేక సమ్దర్భాల్లో తప్ప బంగ్లా అంత విషయమున్న జట్టేమీ కాదు. సరే ఆ ఒక్క ఇన్నింగ్సులో ఐనా మన వికెత్లు పడ్డయంటే ఆ సమ్దర్భంఓ వాళ్ళు కాక మీదున్న కారణాన. అంతే తప్ప వాళ్ళ గొప్పదనమేమీ లేదు. ద్రవిడ్ ని గాయపరిచారు అంటారా? అది కూడా వనాఫ్ మూమెంటే తప్ప పట్టించుకోదగ్గ విషయం కాదు. అస;ఉ సచిన్, ద్రావిడ్లకు రెస్టిచ్చినా పెద్ద ఇబ్బంది ఉండని సిరీస్ అది. మీడియాకర్లు అనవసరపు ప్రాధాన్యం కల్పించి జనానికి వినోదం పంచారు. చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూడటం వల్ల జరిగే పన్లివి. మీడియాకి ఏదో మేత కావాలెప్పుడూ.
***   ***   ***

ఇక మరో సంగతి. మనం టెన్త్ నుంచీ ఫేర్వెల్ పార్టీలూ, వెల్కం పార్టీలూ అలవాటే. వాటికి లెక్చరర్లనీ, మహేష్ బాబుల్నీ, రావు గోపాల రావుల్నీ (ప్రిన్సిపల్, సెక్రటరీ కమ్ కరస్పాండెంట్) పిల్చుకుని స్పీచిప్పించుకోటం అలవాటే. These are all bromides. కానీ జనం ఎమ్దుకు ఇవే చేస్తారో నాకు అర్థం కాలేదు. ఏవో నాలుగు కామెడీ స్కిట్లూ, ఓ పది పదైది సినిమా పాటలూ ప్రాక్టీసు చేసుకెళ్ళి అక్కడ ఎగరడాలూనూ. అంతకు మించి ఏమన్నా చేస్తారా? ఈ మధ్య పుట్టుకొస్తున్న చిన్న చిన్న కాలేజుల్లో ఈ ఫంక్షన్లంటే ఏదో డబ్బు గుమ్మరించటమే తప్ప ఒక పద్ధతీ, ప్లానింగూ లేకుండా వాళ్ళు ఏమి చేస్తున్నారు? ఈళ్ళు ఏమి చేస్తున్నారు అని అనుకుని ఏదో అలా వాతలెట్టుకుంటూ చుట్టబెట్టెయ్యటమే. అసలు ఆ పార్టీల్లో ఉన్న అసలు సారం గ్రహించకుండా నాలుగు పాటలూ, రెండు స్కిట్లూ అన్న రీతిలో తయారయ్యాయి. చిరంజీవి ననుకరిస్తూనో, ఇంకొకరిననుకరిస్తూనో ఎగరటం ఒక గొప్ప హీరోయిక్ డీడ్. కానీ, పాఠాలు చెప్పే లెక్చరర్లంటే లోకువ. సగం స్కిత్ల నిండా ఇవే జోకులు. అనుకరణ, అనుసరణల్లో ఉన్న శ్రద్ధని (వీళ్ళు ఈ నాలుగ్గంటల షో కోసం వృధా పర్చే సమయాన్ని చదువు మీద పెడితే చాలా లాభాలు జరుగుతాయి. ఈ ఫంక్షన్లకున్న విలువను పోగొట్టే బదులు చక్కగా ఆ సమయాన్ని వేరొక రకంగా ప్రొడక్టివ్‍గా వినియోగించుకో వచ్చు కదా... ఈ విషయమెవరన్నా అంటే అబ్బోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ ఆళ్ళంతా పెద్ద ఛాదస్తమ్ రాయుళ్ళు.
***   ***   ***

పిల్లగాళ్ళు నోట్సులివ్వరని ఏడుస్తారు గానీ, (ఇంటర్ లెవెల్లో ఓకే. ఇంజినియరింగు, డిగ్రీ, పీజీ లెవెళ్ళలోనూ ఇదే గోలా?)  వాళ్ళిచ్చే నోట్సుల పరిథి తక్కువ, అదే మనమైతే నాలుగైదు పుస్తకాలు తిరగేసి రాసుకుంటే నాలుగు రకాలైన మెథడ్స్ తెలుస్తాయని ఆలో చించటమ్... ప్చ్. ఈ సాఫ్టీగాళ్ళ రోజుల్లో కుదరని పని. అన్నిటికీ ఇన్స్టెంట్ పరిష్కారాల్లాగే ఇన్స్టెంట్ సొల్యూషన్లు కావాలి. కాస్త డెరివేషనాపి మిగిలింది ఆలోచించి డెడ్యూస్ చెయ్యండ్రా అంటే ఆ పంతులుకి చెయ్యటం రాదురా అనే కామెంట్లు. మరి ఆ పోరగాళ్ళకేమి వచ్చు? గట్టిగా యాభై లోపున్న ప్రైమ్ నంబర్లు కూడా తెలియవు. ఈళ్ళందరూ పంతులోర్లని ఎక్కిరించే వాళ్ళే. కరంట్ యూనిట్ ampere అని కూడా తెలియని వాళ్ళకి కూడా క్లాసు ఫస్టు రావటాలూ, ప్రైజులు కొట్టటాలూ. అలా ఒక ప్రైజు తచ్చుకుని నా ముందు కాలరెగరేసిన ఒక స్టూడెంటు పిల్లతో ఈమాటే అంటే పడ్డ ఉలుకు మామూలుదా? చివరికి ఎన్విరాన్మెంట్ స్టడీసులో కూడా తప్పితేగానీ తనలో ఉన్న అసలు విషయమర్థం కాలేదు.
***   ***   ***

ఎవరి స్థాయిని వాళ్ళు తెలుసుకునుండటం పెద్ద కష్టం కాదు. కనీసం తమ గురించి తెలియక పోయినా పెద్ద వాళ్ళకి పేర్లు పెట్టటమన్నా మానుకోవాలి. లచ్చ పైన ర్యాంకులొచ్చినా సీట్లిచ్చి ఫ్రీగా చదివిస్తున్న ప్రభుత్వాలున్నంత కాలం ఇలాంటివి మామూలే... :-D

అక్కడ సెహ్వాగూ ఇక్కడ మేమూ అంతే తేడా. నిజాన్ని నిజంగా తీసుకోలేరు. అన్నిటికీ క్లిషెడ్ సమాధానాలు కావాలి. ఒక్కోసారీ బ్రోమైడ్లని భరించటం మహ విసుగ్గా ఉంటుంది. 

ఇ;ఆంటిదే మరో సంఘటన. ఒక సారి ప్యాట్రిక్ రాప్టర్ కీ తనకూ ఉన్న తేడా ఏమితని పీట్ సాంప్రాస్ ని మీడియాకరోళ్ళు అడిగితే, దానికి సాంప్రాస్ సమాధానం, "పది గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు." అని. దానికి రాఫ్టర్ని ఆ ప్రశ్నకు మీ రియాక్షనేంటని? మళ్ళా రాఫ్టర్ సమాధానానికి మీ ప్రతి సమాధానమేంటనీ? హ్మ్ అలా జరిగిపోయాయి. పైన చెప్పుకున్న బంగ్లా గాళ్ళ ఉక్రోషం లాగే రాఫ్టరు ఆ ఒక్క సారికి సాంప్రాసునోడించాడుగానీ, ఆ పైన ఒక్క ప్రథాన టైటిల్ని గెల్చుకోలేదు. 

మరోసారీ విషయాన్ని చర్చించుకుందాము.  అంతదాకా సెలవ్!

గీతాచార్య,

రామేశ్వరం

Posted by గీతాచార్య Feb 1, 2010

Subscribe here