BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

మొన్న డిసెంబరులో బ్లాగర్స్ డే నాడు జరిగిన ఆన్లైన్ చాట్ సందర్భంలో ఓపెన్/ఫ్రీ సోర్స్ సాఫ్ట్వేర్ల గురించిన చర్చ జరిగింది.  అదే సమయంలో వీవెన్ గారు ఫాస్తె (FOSS-TE) అనే ఓపెన్/ఫ్రీ సాఫ్ట్వేర్ల గురించి ఒక గూగుల్ గుంపును ప్రారంభించమన్న మా (ధనరాజ్ మన్మధ, నేను) అభ్యర్థనను మన్నించి ప్రారంభించారు. ఆరోజు చర్చలో కంప్యూటర్ ఎరా సంపాదకులు, నల్లమోతు శ్రీధర్ గారు కూడా పాల్గొన్నారు. డిగ్రీ పీజీ రోజుల్లో ఆ పత్రిక చదివి ఎన్నో విషయాలను తెలుసుకున్న మాకు ఆ రోజు శ్రీధర్ గారి నుంచీ ఫోను రావటం itz just like a dream come true.

అలాగే మన బ్లాగోజినా B&G లో ఓపెన్/ఫ్రీ సాఫ్ట్వేర్ల గురించిన సమాచారం (ఇప్పటికిచ్చింది కొంచమే అయినా, బ్రౌజర్లకు సంబంధించిన రికమెండేషన్ల లాంటివి) ఇస్తున్న సంగతి తెలిసిందే. FOSS నిపుణుడు, ఫెదొరా, ఫైర్ఫాక్స్ లకు సంబంధించి ప్రస్తుతం పని చేస్తున్న ధన ఇందులో active గా పాల్గొనాలనున్నా సమయాభావం వల్ల పూర్తి స్థాయిలో టపాలింకా వెలువరించలేదు. అలాంటి సందర్భంలో శ్రీధర్ గారిని ఉబుంటూకు సంబంధించిన సమచారం మన మేగజైన్లో ఇస్తుంటే కనుక దానిని B&G లో కూడా పెడతామని అడినాను. అందుకు ఆయన సమ్మతించారు. సో, ఆ ఉబుంటూ కు సంబంధించిన సమాచారం ప్రతి శనివారం B&G పాఠకుల సౌకర్యార్థం సాయంత్రం పోస్టుల (ప్రతి మొదటి, మూడవ) రూపంలో అందిస్తాము. అంతే కాకుండా వీలుని బట్టీ మరింత FOSS సమాచారాన్ని శనివారాల్లో అందించే ప్రయత్నం చేస్తాము.

శ్రీధర్ గారు మేగజైన్ సమాచారాన్ని (ఉబుంటూ గురించిన) ఉపయోగించుకోనివ్వటం ఒక ఎత్తయితే, ఆ మేగజైన్లో ఉన్న దానిని టైపు చేసుకోలేని  స్థితిని (భువన సుందరి, నా రీసెర్చ్ కాలేజ్ లో సెమెస్టర్. రెండో సెమెస్టర్ అంటే సమయం తక్కువ. పైగా ఈ మధ్యన జరిగిన ఉద్యమాల వల్ల విలువైన వర్కింగు దినాలు మిస్సయ్యాయి) గమనించిన జ్యోతి గారు మాకు వాటిని టైపు చేసి ఇస్తామని చెప్పారు.

So, a BIG THANKS to నల్లమోతు శ్రీధర్ గారు.

అలాగే జ్యోతి గారికి కూడా నెనెర్లు.

Posted by గీతాచార్య Feb 4, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!