BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

Showing posts with label ఆటనే మాట కర్ధం/Sports. Show all posts
Showing posts with label ఆటనే మాట కర్ధం/Sports. Show all posts

ఒకసారి పేపర్లో న్యూస్ చూసి అలాగే కూచుండిపోయాను. లినెట్ వచ్చి పిలిచిందాకా అందులో చూసిన విషయం గురించే నా ఆలోచన. అసలు ఆటగాళ్ళు దేని కోసమని ఆడుతారు? దేనికోసమని ఆడాలి? 

డబ్బా? పేరా? అభిమానులకోసమనా? ఆత్మ తృప్తికోసమనా? ఇవేవీ కాకుండా మరేదైనా ఉన్నదా? 

ఒక ఇండియన్ క్రికెట్ అభిమాని తల పగిలి రక్తం కారుతున్న ఫొటో నేనప్పుడు చూసింది. క్రికెట్ కోసం గంగవెర్రులెత్తే జనమున్న దేశమది. క్రికెట్ ఒక మతం, క్రికెట్ ఒక భాష, క్రికెట్ ఒక జీవన విధానం. కులం కోసమనీ, మతం గురించనీ, డబ్బూ హోదాల తేడాలున్నా కూడా "స్కోరెంత?" అన్న ఒక్క మాట మాత్రం అందరినీ ఒక్కటిగా చేస్తుంది. 

ఉక్కబోత వాతావరణం, విపరీతమైన హ్యుమిడిటీ, కడుపెప్పుడు ఖరాబెప్పుడౌతుందో తెలియని పరిస్థితులు, అబ్బో, తొలిసారి అక్కడికి వెళ్ళినప్పుడు మహా ఇబ్బందులెదురయ్యాయి. డీన్ (జోన్స్) కొట్టిన రెండొందల (విఖ్యాత టైడ్ టెస్ట్) గురించి మేమిప్పటికీ ఎందుకంత గొప్పగా చెప్తామంటే ఆ పరిస్థితులలాంటివి మరి. రాను రానూ పరిస్థితులు మారాయి. కానీ ఇక్కడి అభిమాన జనం, వారి ఆశల్లో మాత్రం మార్పులేదు. 

ఆటంటే వారికి ప్రాణం. క్రికెట్ ని ఇంతలా అభిమానించిన వాళ్ళు వేరెక్కడా నాకు కనబడలేదు. వారి ఆ అభిమానమే నాకు వారంటే గౌరవభావాన్ని పెంపొందించింది. దెబ్బలు తిని ఏడ్చుకుంటూ వెళ్ళే అభిమానుల్ని చూసే ఉంటాను. క్తమోడేలా కొట్టే పోలీసుల్నీ చూసి ఉండొచ్చు. కానీ ఆ కుర్రాడిని చూసినప్పుడు కలిగిన ఆవేదన మాత్రం వర్ణనాతీతం. నెత్తి మీద జుట్టుతో ఇండియా బొమ్మ హెయిర్ స్టైల్. త్రివర్ణాలున్నాయి.

ఎందుకు వాళ్ళు అంత తయారయి వచ్చేది? గుర్తింపు కోసమా? ఆట మీద మోజుతోనా? సరదా కోసమా? 

తమ జట్టు గెలిస్తే చూడాలని. తమ అభిమాన ఆటగాడు సెంచురీలు కొడితే చూడాలని, వికెట్లు పడగొడితే కేరింతలు కొట్టాలని. అంత ఖర్చు పెట్టుకుని వస్తున్నది స్టేడియాలకు, తమ జట్టు గెలిస్తే చూడాలని మాత్రమే. ఓడిపోవటమ్మీద వారికసలు ఆలోచన ఉండదు. కేవలం తమ జట్టు గెలవటమ్మీద మాత్రమే వారి దృష్టి. 

అలాంటి అభిమానుల్ని, వారి ఆలోచనలని చూస్తే మేము ఆడాల్సింది కేవలం గెలవటానికే. ఆడినా, ఓడినా మా డబ్బు మాకొస్తుంది. మా జీవితమే క్రికెట్. మాకది తప్ప వేరే లోకం లేదు. కానీ వారికి? వారి జీవితాలున్నాయియి. వారి పన్లున్నాయి. కానీ, అవన్నీ మానుకుని, కేవలం మా కోసం... అంటే తమ అభిమాన ఆటగాళ్ళ కోసం వారు స్టేడియాలకు తరలి వస్తారు. మేము గెలవాలనే.

అందుకనే నేను ఆడేప్పుడు, ఓటమి అంచున ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆ అభిమానులూ, వారి ఆకాంక్షలు. డబ్బే ప్రధానం కాదు. ఒక ఎలక్ట్రానిక్ గా౨డ్జెట్ను కొనే ముందు ఎన్నో ఆరాలు తీస్తాము. పెర్ఫామెన్స్ బాగుంటుందా లేదా అని వంద ప్రశ్నలు వేస్తాము. పెట్టిన ప్రతి డాలర్కూ ఫలితాన్ని పొందగలిగామా లేదా అని ఆలోచిస్తాము. సంవత్సరాలు తీసే సినిమాల భవితవ్యాన్ని కేవలం ఒక్క క్షణంలో తేలుస్తాము. ఎందుకు పెట్టిన పైసకు తగిన పతిఫలం ముట్టిందా లేదా అని. మరలాంటిది మేము ఆడినప్పుడు చూడాలని వచ్చిన జనం పెట్టిన ఖర్చుకు ప్రతిఫలాన్ని ఇస్తున్నామా? 

నా దగ్గరకు వచ్చే యువ ఆటగాళ్ళకు నేను ఈ ఫొటోనే చూపుతాను. పేరూ డబ్బూ సరే, వాటంతట అవే వస్తాయి. కానీ, అభిమానులు వచ్చేది మాత్రం మనం గెలిస్తే చూడాలని మాత్రమే. అందుకే ఆడాల్సింది కేవలం గెలవటానికి మాత్రమే. గెలవాలంటే మనమాడాల్సింది తిరుగు లేని విధంగా. తిరుగులేని ఆటగాడంటే ఎవరికైనా గౌరవమే. అందుకే Play to win. Rest follows. రక్తం ఓడుతున్న ఆ అభిమానిని గుర్తుకు తెచ్చుకోండి. టికెట్ కోసమతను పడ్డ కష్టాన్ని గురించి ఆలోచించండి. ఎండనకా, ఆననకా అతను క్యూలలో నిలబడి మరీ వచ్చేదెందుకా అని ఒక్క క్షణమాలోచించండి. తన విలువైన సమయాన్ని వృధా చేసుకునేది, ఒక విజయాన్ని చూడాలని మాత్రమే. ఆ ప్రతిఫలాన్ని అతనికి దక్కించండి. 

మరి మా తృప్తో అంటారా? గెలవటంలో ఉన్న తృప్తి డబ్బు వల్ల కూడా రాదు. అయినా ఆ విషయాలను మళ్ళా కలిసినప్పుడు...

(ఈసారి సెహ్వాగ్స్ 195).

This one is abridged slightly. Full version in English will be published later :)



Posted by గీతాచార్య Oct 22, 2010

మన క్రికెట్ చంటి గాడు, టెస్ట్ క్రికెటరాఫ్ ద యియర్ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టిన రోజివాళ.



ఓపాలి ఇషింగులు సెప్పుకుందామా?

ఈ సంవత్సరమ్మొత్తం ఇరక్కుమ్మాలని కోరుకుంటూ...

Posted by గీతాచార్య Oct 20, 2010


Just got a mail from Harsha to name my all time XI for Indian cricket team. Cricinfo is listing of all teams.

I gave him the 15 choice of mine. Letz see some more time for their list, and how comparable mine will be...

1. Sunil Gavaskar 

Greatest Opener. Only Indian player that can be a sure shot for the All time world XI. Can anybody bat against jockers like Brett Lee, let alone those pace quartet without a helmet?

2. Virender Sehwag 

Game changer, best in the world now

3. Rahul Dravid

Who else at no. 3?

4. Sachin Tendulkar 

Irreplaceable. Must be the no. 4 not only in any all time XI, but also the all time world XI

5. Gundappa Vishwanath (VVS Laxman)

I prefer Vishy for his sexy Square cut, but can not omit VVS

6. Vinoo Mankad

Traditionally India is fed with atleast 2 spinners, also, we need 3 quickies when playing abroad. So, if the spinner can bat a bit? Thatz right, hez more than just a spinner apart from stunningly defencive and also scoring opener too). I could have placed Sourav Ganguly, had it not for this logic. What a pity that India's all time great captain can not command a place in the all time XI!

7. Mahendra Dhoni (Farukh Engineer) (Probably VC) (WK)

I like Farookh Engineer, but Mahi could be a deputy for Kapil do dil do

8. Kapil Dev (C)

Can any one bring better?

9. Anil Kumble (VC)

Hahaha. He too is a captaincy material, greatest spinner, and match winner country produced, and could bat a bit. Most of the Indian teams did not bat deep, but this one with Srinath too, can be worth watching

10. Javegal Srinath

Kapil might have been feel blesed if he be there a decade ago and

11. Mohammed Nissar [Irresistible choice]  (Some one world class, but I can not find anybody worth a place in an All time XI. May be Zaheer Khan)

I'l try for the All time world XI later...

Posted by గీతాచార్య Jul 23, 2010

Rafael Nadal won a bit uncomfortably against Nicolas Almagro. Most of his fans expect him to play againt the red-hot Robin Soderling this year's final, who giant killed Roger Federer this year in the Quarter Finals. He was also the one proved Rafael Nadal can be beaten on the French clay last year.

Now I was lucky that the match was not prolonged into a 4th set or third set tie-breaker. Otherwise I would not have got a chance to have a few words with him due to time crunch. As promised he spent a few minutes with me, and obliged a couple of autographs for me :-)

A small memory of the chat...

Q: Rafa, let me congratulate you for the resurgence of your previous form... (Am about to say some thing, but he laughed coolly, and shrugged before saying, I never felt like that). Okay how's this game gone as per your... I smiled at the obvious answer

A: Not on expected lines, but me go a bit of warm up sort of thing for the even bigger match.

Q: Whom do you expect to face in the finals?

A: (A wide grin and running his fingers through his wet hair) Let me finish the kill in the Semis.

Q: Many people wanted a RaFedEx in the Roland Garros finals. But the script was not like the same this time like the last year. And me visualizing a final with Robin. What say?

A: Let me put it this way. A RaFedEx, quite a sexy word. (Another cool grin). I feel bitter sweet if I defeat him for my 5th RG. But Soderling' a different story, and a talk of last year upset Oh deja vu.

Q: (While he was obliging an autograph to a small guy), How do you feel about the crowed support, and the wishes of your fans (Me a BIG fan of Rafa)?

A: (The answer surprised me sweetly) When people think and pray for your good, and those are around you, I believe, I can achieve success. Part of my resurgence the word you used (laughter)is due to the blessings. When people around you feel positive for you, it just happens that you can be at a great... (he smiled as I felt the obvious finish)

Q: One more question... (but he was to go, so the chat finished)

But to my surprise, he rushed back as quickly as his on court reflexes, pulled the book from my hands, and autographed with an apologetic smile.

I said, Thank you Rafa, and best of luck, and pushed another book from my bag for one more autograph, saying itz for my kid (he laughed), and I wished him an advanced BIRTHDAY.

Yesterday is Chanti's birthday, and this one is a sort of a birthday gift.

Though the match atmosphere was hot because of stiff opposition, Rafa is cool.

2DAY (June 3rd) IS RAFAEL NADAL'S BIRTHDAY. B&G wishes him a great birthday. We wish him a fifth RG title.

Posted by Srujana Ramanujan Jun 4, 2010

Kapil was inducted into the ICC Hall of Fame. A deserved winner, and a late inductor...

Much more to follow. ఎప్పుడో చెప్పలేను :D


Hearty Congratulations on behalf of B&G. He is THE MAN who changed the face of the world cricket

Posted by గీతాచార్య Mar 9, 2010

ఉన్న మాటంటే ఉలుకెక్కువ అని మన పెద్దలు చెప్పిన మాట. కానీ అదే పెద్దలు (ఇక్కడ పెద్దలు అంటే జనాలు అని తీసుకోండి) ఉన్న మాట అంటే ళేనిపోని భేషజాలకు పోతారు. లౌక్యముండాలంటారు.

సరే మనకవన్నీ ఇక్కడ ఎందుకులేగానీ, ఒక సరదా అయిన ఆలోచించదగ్గ విషయం గురించి చెప్దామని...

మొన్నా మధ్య బంగ్లా పర్యటనల్లో వీరూ సెహ్వాగ్ బంగ్లాని సాధారన జట్టన్నాడు. దానికి ’మీడియా’కరోళ్ళు పెద్ద దుమారం లేపారు. ప్రశ్నని అటు కొంతసేపు, ఇటు కొంతసేపు త్రిప్పి త్రిప్పి వదిలారు. ఇంతకీ వాళ్ళకు కావలసిన సమాధానమెలా ఉండాలి? వాళ్ళది బాగా టాలెంట్ ఉన్న జట్టు, అపార ప్రతిభా పాటవాలున్నాయి, ఎవరినీ తక్కువంచనా వెయ్యము అని cliched సమాధానాలు చెప్పాలా?

ఒక్క నిజం చెప్పినమ్దుకు సెహ్వాగ్ విలనైపోయాడు. స్థాయిని మించి వాకృచ్చల్లా, బంగ్లాదేశీయులు రెచ్చిపోయారు. వాళ్ళకి తగ్గట్టూ మీడియోకర్లు ప్రతి రోజూ అదే ప్రశ్న. పిచ్ సహకారం, కాస్తంత కంప్లాసెన్సీ వల్ల మనవాళ్ళు తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలగానే అందరూ సెహ్వాగ్ వ్యాఖ్యలని భూతద్దమ్లో పెట్టి మరీ చూశారు. కానీ అతను అన్న దానిలో ఉన్న నిజాన్ని చూడలేదు. ఏదో ఒక రోజో, కొన్ని ప్రత్యేక సమ్దర్భాల్లో తప్ప బంగ్లా అంత విషయమున్న జట్టేమీ కాదు. సరే ఆ ఒక్క ఇన్నింగ్సులో ఐనా మన వికెత్లు పడ్డయంటే ఆ సమ్దర్భంఓ వాళ్ళు కాక మీదున్న కారణాన. అంతే తప్ప వాళ్ళ గొప్పదనమేమీ లేదు. ద్రవిడ్ ని గాయపరిచారు అంటారా? అది కూడా వనాఫ్ మూమెంటే తప్ప పట్టించుకోదగ్గ విషయం కాదు. అస;ఉ సచిన్, ద్రావిడ్లకు రెస్టిచ్చినా పెద్ద ఇబ్బంది ఉండని సిరీస్ అది. మీడియాకర్లు అనవసరపు ప్రాధాన్యం కల్పించి జనానికి వినోదం పంచారు. చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూడటం వల్ల జరిగే పన్లివి. మీడియాకి ఏదో మేత కావాలెప్పుడూ.
***   ***   ***

ఇక మరో సంగతి. మనం టెన్త్ నుంచీ ఫేర్వెల్ పార్టీలూ, వెల్కం పార్టీలూ అలవాటే. వాటికి లెక్చరర్లనీ, మహేష్ బాబుల్నీ, రావు గోపాల రావుల్నీ (ప్రిన్సిపల్, సెక్రటరీ కమ్ కరస్పాండెంట్) పిల్చుకుని స్పీచిప్పించుకోటం అలవాటే. These are all bromides. కానీ జనం ఎమ్దుకు ఇవే చేస్తారో నాకు అర్థం కాలేదు. ఏవో నాలుగు కామెడీ స్కిట్లూ, ఓ పది పదైది సినిమా పాటలూ ప్రాక్టీసు చేసుకెళ్ళి అక్కడ ఎగరడాలూనూ. అంతకు మించి ఏమన్నా చేస్తారా? ఈ మధ్య పుట్టుకొస్తున్న చిన్న చిన్న కాలేజుల్లో ఈ ఫంక్షన్లంటే ఏదో డబ్బు గుమ్మరించటమే తప్ప ఒక పద్ధతీ, ప్లానింగూ లేకుండా వాళ్ళు ఏమి చేస్తున్నారు? ఈళ్ళు ఏమి చేస్తున్నారు అని అనుకుని ఏదో అలా వాతలెట్టుకుంటూ చుట్టబెట్టెయ్యటమే. అసలు ఆ పార్టీల్లో ఉన్న అసలు సారం గ్రహించకుండా నాలుగు పాటలూ, రెండు స్కిట్లూ అన్న రీతిలో తయారయ్యాయి. చిరంజీవి ననుకరిస్తూనో, ఇంకొకరిననుకరిస్తూనో ఎగరటం ఒక గొప్ప హీరోయిక్ డీడ్. కానీ, పాఠాలు చెప్పే లెక్చరర్లంటే లోకువ. సగం స్కిత్ల నిండా ఇవే జోకులు. అనుకరణ, అనుసరణల్లో ఉన్న శ్రద్ధని (వీళ్ళు ఈ నాలుగ్గంటల షో కోసం వృధా పర్చే సమయాన్ని చదువు మీద పెడితే చాలా లాభాలు జరుగుతాయి. ఈ ఫంక్షన్లకున్న విలువను పోగొట్టే బదులు చక్కగా ఆ సమయాన్ని వేరొక రకంగా ప్రొడక్టివ్‍గా వినియోగించుకో వచ్చు కదా... ఈ విషయమెవరన్నా అంటే అబ్బోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ ఆళ్ళంతా పెద్ద ఛాదస్తమ్ రాయుళ్ళు.
***   ***   ***

పిల్లగాళ్ళు నోట్సులివ్వరని ఏడుస్తారు గానీ, (ఇంటర్ లెవెల్లో ఓకే. ఇంజినియరింగు, డిగ్రీ, పీజీ లెవెళ్ళలోనూ ఇదే గోలా?)  వాళ్ళిచ్చే నోట్సుల పరిథి తక్కువ, అదే మనమైతే నాలుగైదు పుస్తకాలు తిరగేసి రాసుకుంటే నాలుగు రకాలైన మెథడ్స్ తెలుస్తాయని ఆలో చించటమ్... ప్చ్. ఈ సాఫ్టీగాళ్ళ రోజుల్లో కుదరని పని. అన్నిటికీ ఇన్స్టెంట్ పరిష్కారాల్లాగే ఇన్స్టెంట్ సొల్యూషన్లు కావాలి. కాస్త డెరివేషనాపి మిగిలింది ఆలోచించి డెడ్యూస్ చెయ్యండ్రా అంటే ఆ పంతులుకి చెయ్యటం రాదురా అనే కామెంట్లు. మరి ఆ పోరగాళ్ళకేమి వచ్చు? గట్టిగా యాభై లోపున్న ప్రైమ్ నంబర్లు కూడా తెలియవు. ఈళ్ళందరూ పంతులోర్లని ఎక్కిరించే వాళ్ళే. కరంట్ యూనిట్ ampere అని కూడా తెలియని వాళ్ళకి కూడా క్లాసు ఫస్టు రావటాలూ, ప్రైజులు కొట్టటాలూ. అలా ఒక ప్రైజు తచ్చుకుని నా ముందు కాలరెగరేసిన ఒక స్టూడెంటు పిల్లతో ఈమాటే అంటే పడ్డ ఉలుకు మామూలుదా? చివరికి ఎన్విరాన్మెంట్ స్టడీసులో కూడా తప్పితేగానీ తనలో ఉన్న అసలు విషయమర్థం కాలేదు.
***   ***   ***

ఎవరి స్థాయిని వాళ్ళు తెలుసుకునుండటం పెద్ద కష్టం కాదు. కనీసం తమ గురించి తెలియక పోయినా పెద్ద వాళ్ళకి పేర్లు పెట్టటమన్నా మానుకోవాలి. లచ్చ పైన ర్యాంకులొచ్చినా సీట్లిచ్చి ఫ్రీగా చదివిస్తున్న ప్రభుత్వాలున్నంత కాలం ఇలాంటివి మామూలే... :-D

అక్కడ సెహ్వాగూ ఇక్కడ మేమూ అంతే తేడా. నిజాన్ని నిజంగా తీసుకోలేరు. అన్నిటికీ క్లిషెడ్ సమాధానాలు కావాలి. ఒక్కోసారీ బ్రోమైడ్లని భరించటం మహ విసుగ్గా ఉంటుంది. 

ఇ;ఆంటిదే మరో సంఘటన. ఒక సారి ప్యాట్రిక్ రాప్టర్ కీ తనకూ ఉన్న తేడా ఏమితని పీట్ సాంప్రాస్ ని మీడియాకరోళ్ళు అడిగితే, దానికి సాంప్రాస్ సమాధానం, "పది గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు." అని. దానికి రాఫ్టర్ని ఆ ప్రశ్నకు మీ రియాక్షనేంటని? మళ్ళా రాఫ్టర్ సమాధానానికి మీ ప్రతి సమాధానమేంటనీ? హ్మ్ అలా జరిగిపోయాయి. పైన చెప్పుకున్న బంగ్లా గాళ్ళ ఉక్రోషం లాగే రాఫ్టరు ఆ ఒక్క సారికి సాంప్రాసునోడించాడుగానీ, ఆ పైన ఒక్క ప్రథాన టైటిల్ని గెల్చుకోలేదు. 

మరోసారీ విషయాన్ని చర్చించుకుందాము.  అంతదాకా సెలవ్!

గీతాచార్య,

రామేశ్వరం

Posted by గీతాచార్య Feb 1, 2010

ఎన్నాళ్ళ నుంచో గీతూ ఈ టపా రాయాలని కోరిక. కానీ వీడియో దొరక్క ఆగారు. ఇది జాంటీ రోడ్స్ ని అమాంతం సూపర్ స్టార్ ని చేసిన ఫీల్డింగ్ విన్యాసం.

గీతాచార్య Says...

1992 world cup సమయంలో నాకు క్రికెట్ పరిచయం కావటం జరిగింది. మనోళ్ళు ఎటూ ఓడిపోయే మొహాలే అమ్దులో. జస్ట్ రెండు మ్యాచులు గెల్చి, రెండు మ్యాచులు గెలవబోయి పోగొట్టుకుని, ఇంటీ ముఖం పట్టారు. అప్పట్లో మా ఇంట్లో ఇండియా కాకపోతే వెస్టిండీస్ కి మద్దతు. సరే. నాకు ఆంబ్రోజ్ మీద ఉన్న వ్యక్తిగత కక్షల వల్ల వెస్టిండీసు కి నా సపోర్ట్ లేదు. (నీ సపోర్ట్ ఉంటే ఎంత లేకపోతే ఎంత? అంటే నా సమాధానం ఇదీ. ఈ సపోర్టులూ రిపోర్టులూ మన తుత్తి కోసం కానీ మననెవడు పట్టించుకుంటాడు) . కానీ ఒక రోజు పాకీస్తాన్, సౌతాఫ్రికా మ్యాచ్ వస్తోంది. నాకప్పటికి కాస్త టెన్నిస్ తెలుసు కానీ క్రికెట్ అప్పుడప్పుడే పరిచయమవుతోంది. హఠాత్తుగా చిన్నమామయ్య పెద్దగా అరిచాడు. ఏంటా అని చూస్తే ఈ సన్నివేశం.


ఆశ్చర్యపోయి అలాగే చూస్తుండి పోయను. జాంటీ రోడ్స్. ఒక కొత్త సూపర్ స్టార్. అంతవరకూ బ్యాటింగులోనో, బౌలింగులోనో మనకి స్టార్లు తెలుసు. కానీ ఫీల్డింగు కూడా ఒక కళ అని చాటిన ఆ సన్నివేశం నా మదినుండి తొలగిపోదు. ఆ ఫీల్డింగు విన్యాసమే సౌరవ్ గంగూలీ మన కెప్టెన్ అయ్యే దాకా నాకు సౌతాఫ్రికా అంటేనే క్రికెట్ టీమ్ అనేంత ఫావరిట్ టీమ్ గా నిలచింది.

ఇంజమామ్ ని స్టార్ ని చేసిన ఆ ప్రపంచ కప్పే, జాంటీనీ ప్రపంచానికి పరిచయం చేసింది.
*** *** ***

సో ఎంజాయ్ ద వీడియో.

చైతన్య కళ్యాణి

Posted by చైతి Dec 27, 2009

వంద కిలోమీటర్ల పైన బండి నడుస్తుంటే వెనుక కూచుని ఫొటోలు తీయటం ఎలా ఉంటుందో తెలుసా? అసలా ఆలోచన ఎవరికైనా ఎప్పుడైనా వచ్చిందా? వస్తే అలాంటి వారిలో ముందుండేది... Dhanaraj Manmadha. వెనుకుండి నడిపించేది (కెమేరాని) గీతాచార్య.

నరసరావుపేట నుంచీ గుంటూరుకి సుమారు 50 కిలో మీటర్లు. బస్సులో గంట పైమాటే (ఎర్ర బస్సెకకుండా ఉంటే). బళ్ళ మీద వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టీ 40-60 నిమిషాల్లో లాగిస్తారు.


ఈ క్రింద ఇచ్చిన ఫొటోలు చూడండి. ఆఁ ఆమాత్రం ఫొటోలు మేము తీయలేమా? ఇందులో వింతేముందీ అంటారా? ఏమిటా వింతంటే గంటకు వందకు పై బడిన స్పీడులో బైకు నడుస్తుంటే వెనుక కూచుని అన్ని దిశలలో ఫొటోలు తియ్యటమంటే చూడండి. మా ప్రయాణ కాలం కేవలం 29 నిమిషాలే. అందులోనూ కొంచం మధ్యలో స్లో కావల్సి వచ్చి. గేదెలూ ఎట్సెట్రాదులూ అడ్డం వచ్చి.


మబ్బుల్లో విహరించండి. ఈ మబ్బుల పైన కవితలెన్నో అల్లొచ్చు. అల్లుతానేమో మరి. ఈలోగా మా adventurous ride లో ఒక ఘట్టాన్ని చూడండి. మరో సారి వేరేలా కలుద్దాం.



ప్రేయసి బుగ్గ కొరుకుతున్నట్టు లేదూ? క్రింది పెదవి, పై పెదవి ముక్కు... ;-)




యుద్ధమా?  దయ్యాల నృత్యమా? భలే చిత్రం కదూ! :-)


UFO నా? పుష్పకమా?
ఇది తీసేటప్పుడు నెలకి దాదాపూ సమాంతరంగా వంగాను. సరైన angle కోసం. Of course చుట్టుప్రక్కల వాహనాలు లేవులేండి.


 మహాకాళమో, అనకొందో నోరు తెరచి దేన్నో మ్రింగుతున్నట్టు లేదూ?  
దీనికోసం ధన భుజం చెయ్యి వేసి బైకు మీద నించోవాల్సి వచ్చింది. స్పీడా? చెప్పినా నమ్మరు లెండి.

 
తాటి సెట్టేక్కలేవు, తాటి కల్లు...   అనలేరు ఇది చూస్తే. తాటి చెట్ల మధ్య నుంచీ మబ్బులు.





టెడ్డీ బేరా? ఏదో అర్థం కాని బొమ్మ. :-)




ఉంగరమో, క్రికెట్ వరల్డ్ కప్పులానో అనిపిస్తోందిది. 



ఆకాశంలో కరంటు స్థంభం. నా డొక్కు వీజీయే కెమెరాలో సూరిబాబిలా అయిపోయాడు.


ఒక గాడ్జిల్లా మరో దానికి షేక్ హ్యాండ్  ఇస్తూ...




మన గాడ్జిల్లా గారే. కానీ ఆ కరంటు స్థంభం, చెట్టూ చూడండి. ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది.



మరోసారి మేఘాల చుంబనం. ఛీ పాడు...!!! ;-)




బండి బండి మబ్బూ బందీ. ఆకాశంలో తేలేనండీ... 





పేరిచర్ల బ్రిజ్ దగ్గర కొండలు. బ్రిజ్ మీద నుండీ తీసిన ఫోటో. ఒక పెయింటింగ్ లా లేదూ? ఆ ఎఫెక్ట్ కోసం ఎంత కష్ట పడాల్సి వచ్చిందో!
 ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పటికివి చాలు. ఇదో చిన్న adventure. స్పీడ్ బైకింగ్. 


Posted by గీతాచార్య Dec 12, 2009

ఒక వ్యక్తి చేసిన తప్పులు గుర్తున్నంతగా అతనిలోని గొప్పతనం గుర్తుండదు జనానికి. మానవాళి చేసుకున్న అతి పెద్ద దౌర్బాగ్యం ఇదే...

- రామానుజన్

నా చిన్నప్పుడు నాకు సౌతాఫ్రికా అంటే ఇష్టం. అద్భుతమైన ఫీల్డర్లూ, డొనాల్డ్ లాంటి అగ్రెసివ్ బౌలర్లూ, లెక్కలేనంత మంది ఆల్రౌండర్లూ, క్రోన్యే లాంటి గొప్ప ఇన్నోవేటివ్ కెప్టెన్... ఆహాహా... ఆటంటే అదీ అనిపించేలా ఉండేది.


                                                            Hansie, the HERO

శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటన మొదలెట్టింది. అర్జున రణతుంగ సారథి. సరిగ్గా గుర్తు లేదు కానీ, అది మార్చో ఏప్రిలో. ఆ జట్ల మధ్య రెండో తెస్టు. డొనాల్డ్, క్రోన్యే, రోడ్స్ అంటే ఇష్టమున్న నేను, ఆ మ్యాచ్ మీద ఒక, కాది కాదు, రెండు కళ్ళూ వేశాను. అసలే తొలిటెస్టు SA గెల్చింది. ఇది కూడా గెలిస్తే ఇక సీరీస్ వశం అన్నది నా ఆశ.

ఆశ దోశ అప్పడం వడ అన్న తరహాలో మొదట శ్రీలంక మూడొందల పదో పన్నెండో చేసి, SA ని రెండొందలకే పొడుం కొట్టింది. డారిల్ కలినన్ సెమ్చురీ లేందే ఆమాత్రం స్కోరైనా వచ్చుండేది కాదు.

కానీ ఇక్కడో విషయం చెప్పాలి. అప్పట్లో, అంటే హాన్సీ క్రోన్యే కెప్టెన్‍గా ఉన్న రోజుల్లో SA ఎంత తక్కువ స్కోరుకాలౌటైనా ప్రత్యర్థిని అంతకన్నా తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసే బౌలర్లున్నారు. డొనాల్డో, పొల్లాకో, డివిల్లియర్సో, అదరగొట్టి మరీ గెలిపించేవారు. ఏదో ఒక ముక్కోణపు టోర్నీలో ఇంగ్లాండు వాళ్ళని 149 కి ఆలౌట్ చేస్తే SA ఇంగ్లాండుని నూట పాతిక లోపే ఆలౌట్ చేసి గెలిచింది. డొనాల్డు, క్రోన్యే దెబ్బకి శ్రీలంక మూడొందలకే ఔటైనా, మురళీధరన్ ధాటికి ఆఫ్రికా కూడా తలొంచి వాళ్ళకి విలువైన ఆధిక్యాన్ని సమర్పించుకుంది.

ఇలాంటి సన్నివేశమే ఈ మధ్య ఇండియా ఇంగ్లాండు టెస్టులో జరిగింది, ముమ్బై అల్లర్ల తరువాత చెన్నైలో జరిగిన టెస్టులో. మనందరికీ గుర్తుండిపోయే రీతిలో ఇండియన్ క్రికెట్ చంటి గాడు సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్స్ మాదిరి సంటనా ఇక్కడ జరిగింది. శ్రీలంకని రెండో ఇన్నింగ్స్ లో SA గుక్క త్రిప్పుకోనివ్వలేదు. వైట్ లైటెనింగ్ అలన్ డొనాల్డ్ నిప్పుకు చెరిగి ఐదు వికెట్లు తీయటంతో పాటూ క్రోన్యే కూడా మరో రెండు వికెట్లు సాధించాడు.  లంకేయులు ఈ తడవ 122 కే చాపచుట్టి 226 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. తమ రెండో ఇన్నింగ్సుని తడబడుతూనే ప్రారంభించింది SA. తొంభై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పిచ్ బాగా తిరుగుతోంది. మురళీ మళ్ళా అదరగొడుతున్నాడు. SA కీ విజయానికీ మధ్య మురళీనే తేడా అనిపించేలా కనిపిస్తున్నది సన్నివేశం. అప్పటికే మూడు వికెట్లు తీసి మాంఛి ఊపుమీదున్నాడు కుర్రాడు. (సిద్ధూ, దెబ్బని మర్చిపోయి అప్పుడప్పుడే స్పిన్నర్ గా కాస్త పుంజుకుంటున్న సమయమది.

అప్పుడొచ్చాడు హాన్సీ క్రోన్యే.




కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఇదే అనేలా ఉన్న ఆ ఇన్నింగ్స్ సెహ్వాగ్ ఇన్నింగ్స్ కి ఏ మాత్రం తీసి పోదు. మొత్తం 63 బంతుల్లో, ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 82 పరుగులు సాధించాడు. అందులో తన అర్థ సెంచురీని సాధించిన తీరు ఇంకా నా కళ్ళలో మెదులుతూనే ఉంది. తనకు మాత్రమే సాధ్యమైన స్లాగ్ స్వీపులూ, గార్జియస్ కవర్ డ్రైవులూ, లాఫ్టెడ్ షాట్లూ, ఒకటేమిటి? ఎన్నిరకాలుగా చెండాడాలో అన్ని రకాలుగా చీల్చి చెండాడి, విజయానికి కేవలం పది పరుగులున్న సమయంలో ఔటయ్యాడు. నలుగురు ఫీల్డర్లని తప్పించి ఫ్లిక్ బౌండరీ, ఆ పైన లెగ్ సైడ్ కొట్టిన సిక్సర్, మరో లాఫ్టెడ్ షాట్... అబ్బబ్బ. తల్చుకుంటేనే వళ్ళు పులకరిస్తోంది. చూసి తీరాల్సిందే. ఇక అర్థ సెంచురీ సాధించి పెట్టిన మూడో (వరుసగా మూడేశాడు) సిక్సర్ అద్వితీయం. కాలు వంచి స్లాగ్ స్వీప్ కీ పుల్  షాట్  కీ మధ్యస్తమైన ఆ షాట్ ఇప్పటికీ నేను మర్చిపోలేదు. తనకే సాధ్యమైన ఒకరకమైన చూపుతో, బ్యాటునలా గాల్లోనే ఉంచి, చిన్నగా చేతులెత్తి అభివాదం చెయ్యటం ఏవరు మర్చిపోతారు? ఒక్కసారి చూస్తే. బంతి అలా గాల్లో తేలిపోతుంటే కాలమాగిపోతే బావుణ్ణనిపించిందప్పుడు. Real heroism. The sight of a  WINNER, whose brutality has a sense of beauty, and and unforgettable grace. నిజమైన ఆల్రౌండ్ షో అది.
CHAMPION CAPTAIN. Hansie

అర్థ సెంచురీ దాటాక కూడా ఆ దూకుడు తగ్గలేదు. అంతిమంగా డొనాల్డ్ కి man of the match అవార్డు వచ్చినా, ఆ మ్యాచ్, ఆ గెలుపు మాత్రం హాన్సీవే. ఆ కసీ, ఆ ఠీవీ, మళ్ళా చూడలేమనేదే బాధ కలిగించే అంశం. మ్యాచ్ ఫిక్సింగ్ సరే. ఇదొకసారి ఎవరన్నా చూసిన వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటే నేను చెప్పిన పులకరింత కలుగదూ?
***   ***   ***

This account is purely based on my memory. It was a match taken place more than a decade ago. So, small mistakes might have crept in. If you notice any mistakes, kindly help me to correct.

Posted by గీతాచార్య Dec 11, 2009

ఏడది క్రితమే వర్త్యువల్ గా మూత పడి, అప్పుడప్పుడూ నా తుత్తి కోసం ఏదో అలా ఒక టపా రాలుస్తున్న వింబుల్డన్ విలేజ్ బ్లాగు మీకేమైనా గుర్తుందా? తెలుగులో ఉన్న అతి కొద్ది sports special blogs లో అదొకటి. మొదలెట్టింది పాపం నేనే. 


అందులో వ్రాసిన టపాల్లో బాగా పాప్యులర్ అయ్యి, నాకో గుర్తింపు నిచ్చిందీ టపా. ఎంత గుర్తింపంటే నా డల్ అనే మాట ఊకదంపుడు గారి హజ్బెండ్ గాడు పతి దేవుడికి అచ్చ ఆంగ్లానువాదం అని చెప్పినంత. Of course, అందరిలోనూ కాదనుకోండీ. కొందరిలోనే. జనానికి గీతాచార్య అంటే తెలిసింది కూడా ఈ బ్లాగు వల్లే. నాకు ఒక బ్లాగులో పది పైన కామెంట్స్ వచ్చిందీ మొదటిసారి ఈ బ్లాగులోనే.


అలాగే ఎక్కువ మంది చదవకపోయినా, కొంత మంది లాయల్ ఫాన్స్ ఉన్న నా ఈ బ్లాగులో కొందరు విదేశీయులు కూడా కామెంటారు. చూడూడీ వ్యాఖ్యలు. పైగా చాలా సార్లు రాయటంలేదెందుకని అందరి చేతా అడిగించుకున్నా కూడా. ఈ వింబుల్డను ఫైనలు తరువాత అసలు మొహమే చూడక, ఈ మధ్యనే పూర్తిగా కట్టేశా కూడా. 


సరే ఇప్పుడు ఈ సుత్తేంటంటారా? ఈ వింబుల్డన్ విలేజ్ వల్లే త్వరలో నాకు అనగా ఓ నాలుగు నెల్లలో, విఖ్యాత స్పోర్ట్స్ అనలిస్ట్ శ్రీ నిర్మల్ శేఖర్ గారిని కలిసే అవకాశం వచ్చింది. ఎప్పుడు కలవాలో కూడా ఫిక్స్ అయింది. 


మరో వార్తేంటంటే వింబుల్డన్ అఫీషియల్ బ్లాగ్ లో ఒక ఎనలిస్ట్ గా కూడా అవకాశం వచ్చింది. వివరాలు త్వరలో.


సో, ఇప్పుడెవరైనా బ్లాగుల వల్ల సాధించిందేంటంటే... I can show my blog... వింబుల్డన్ విలేజ్. ఒక తెలుగు బ్లాగు వల్ల ఇదంతా సాధ్యమవటం మన తెలుగోళ్ళాకి గొప్పే కదూ...!


2009 Wimbledon Finals గురించి రాసింది ఇది.


ఎంత అందమైన వింబుల్డన్ ఇదీ. అద్భుతమైన టెన్నిస్, అర్హత కలిగిన విజేత, కోరుకున్న రిజల్ట్స్, కనివిందు చేసిన ఆటతీరూ...ఓహ్! వాట్ ఎ టోర్నీ?




ఇల్లు మారే హడావిడిలో ఉన్నా ఈ బ్లాగు గురించే ఆలోచింపచేయగల సత్తా ఈ వింబుల్డన్ సొంతం.




ఈసారి డయలోగ్: "ఎ సర్ఫేస్లో ఆడాము అన్నది ముఖ్యం కాదన్నయ్యా! ఎడ్జస్ట్ అయ్యామా లేదా?"

రాఫెల్ నాదల్ ఈ సారి ఈ డయలోగ్ కొట్టాడు. ఫెదరర్ దిమ్మ తిరిగేలా చేసిన సందర్భం అది.


"విజేతంటే గెలవడమే కాదు, ఓటమిని అంత తొందరగా అంగీకరించరు కూడా" అని ఫెదరర్ నిరూపించిన సందర్భం ఇది.




మరో వైపు విలియమ్స్ ఆల్ విలియమ్స్ ఫైనల్ తో పాటూ, డబుల్స్ లో కూడా నెగ్గి తమ పూర్వ వైభవాన్ని ప్రదర్శించిన సందర్భం ఇది. అయినా ఈ విషయాన్ని మరుగున పడ వేసింది మటుకూ Gentlemen's singles Final. అందులో అంత ఏముందీ? అంటారా?


 నా చిన్నప్పటినుంచీ సింహం పెద్దపులీ తలబడుతుంటే చూడాలని కోరిక. ఒకసారి మా నాన్నని ఈ విషయమే అడిగి, ఏది గెలుస్తుంది అని అడిగాను. అప్పుడు తరువాత చెపుతాను అని ఊరుకున్నారు. ఈ మ్యాచ్ చూసిన తరువాత ఆయన "నీ ప్రశ్న కి ఇదే సమాధానం," అన్నారు. కానీ ఇందులో ఎవరు సింహం, ఎవరు పెద్దపులి అని నాకు సరికొత్త డౌట్ వచ్చింది. కానీ అత్యున్నత స్తాయి టెన్నిస్ ని రుచి చూడాలంటే ఈ మ్యాచ్ తప్పక చూడాల్సిందే.


నాదల్: ఈసారి హీరో నాదలే. ఫెదరర్ని గత కొంత కాలం గా పీడకలలా వెంటాడుతున్న నాదల్, ఫెదరర్ కళాత్మకమైన ఆటని తన టాప్ స్పిన్ షాట్స్ తో గడగడ లాడించాడు. ఎ సర్ఫేస్ మీదైనా నేను ఆడగలనని నిరూపించుకున్నాడు.


ఫైనల్ కు ముందు కేవలం ఒక సెట్ ని మాత్రమే కోల్పోయిన నాదల్ ఫైనల్ లో మొదటి సెట్ లో తన ప్రతాపాన్ని చూపించాడు. తొందరలోనే బ్రేక్ సాధించినా 47 నిమిషాలపాటూ ఆడాల్సి రావటం ఫెదరర్ లోని పోరాట పటిమకు నిదర్శనం.




ఇక రెండో సెట్ లో నాదల్ ని ఫెదరర్ అదరగొట్టి ఆదిక్యంలోకి దూసుకుని పోయాడు. కానీ నాదల్ మరోలా ఆలోచించాడు. ఫెదరర్ నిరుటిలా పుంజుకున్నాడు. తనది కాని సర్ఫేస్ మీద నాదల్ పని అయిపోతున్నది అని అందరూ అనుకుంటుండగానే నాదల్ వింబుల్డన్ దయలోగ్ కొట్టాడు. మాటలతో కాదు. తన ఆటతో. అంటే రెండో సెట్ కూడా నాదల్ వశం.


మ్యాచ్ మొదలైన అప్పటినుంచీ ఇప్పటి దాకా నేను ఇంట్లో లేను వింబుల్డన్ విలేజ్ మొదటి బ్లాగు "ఎందుకు" వ్రాస్తున్నాను. ఇంతలో వర్షం వచ్చింది. వింబుల్డన్లో కాదు. మా ఊళ్ళో. నేను బ్లాగు రాసి ఇంటికి బయలుదేరే సరికి ఒకటే వాన. అయితే కరంట్ పోలేదు. దాంతో నేను ఫైనల్ కోసం వర్షం లోనే సైకిల్ మీద పరిగెత్తాను. తడిసి ముద్దై నేను ఇంటికి వెళ్ళేసరికి నాన్న "అక్కా వాన" అన్నారు. హ్హు హ్హు హ్హు. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి బోర్గ్, మెకెన్రో 1980 ఫైనల్ మ్యాచ్ వేస్తున్నారు. మధ్య మధ్య లో అసలు మ్యాచ్ (ఇప్పటి ఫైనల్) లోని ముఖ్య ఘట్టాలని వేసేసరికి 


"ఎలాంటి ఆటను మిస్ అయ్యాను" అనుకోకుండా ఉండలేక పోయాను.


నేను ఒక సారి అన్నం తిని లేచే సరికి మ్యాచ్ మళ్ళీ మొదలైంది. 6-4, 6-4, 4-5. నాదల్ వైపు నుంచీ స్కోర్ అది. నేను టెన్షన్ తో చూస్తుందా గానే కరంట్ ఆఫ్.


ఫెదరర్: ఫెదరర్ మోములో నవ్వు మాయమైంది. నాదల్ హుషారు గా ఉన్నాడు. నాదల్ మధ్యలో క్రింద పడ్డాడని, తన పని అయిపోయిందని అనుకున్నానని, నాన్న అన్నారు.




విజేతలెప్పుడూ అందరిలా ఆలోచించరు కదా! ఫెదరర్ అట్టాక్ మొదలెట్టాడు. నాదల్ ఆటలో సమస్య ఏమిటంటే తన షాట్లు ఫెదరర్ తో పోలిస్తే ఒకింత స్లో గా ఉంటాయి. బంతులు స్పిన్ అవుతూ వస్తాయి. వింబుల్డన్ గ్రాస్లో బంతికి అంత పట్టు చిక్కదు. ఈలోగా ఫెదరర్ కోర్ట్ కవర్ చేయ గలడు. సరిగ్గా ఈ సూత్రాన్నే ప్రయోగించి నాదల్ మనసులో అనుమానపు బాజాలని నాటాడు. సాధారణం గా వర్షం వల్ల బ్రేక్ వస్తే వెనుక బడిన ఆటగాళ్ళు పున్జుకుంటారు. (2001 లో ఇవానిసెవిచ్ హెన్మన్ ఆట గుర్తుందా? లేక పాయినా పర్లేదు. నేను తరువాత గుర్తు తెప్పిస్తాను). బ్రేక్ సమయంలో నాదల్ తను మరి కాసేపట్లో వింబుల్డన్ ట్రోఫీని పట్టుకున్తానని డిసైడ్ అయ్యి ఉంటాడు. కళ్ళ ముందు కప్ తో తను కనిపించి ఉంటాడు. అదే ఎప్పుడూ ప్రమాదం. పని చేస్తున్నప్పుడు ఫలితం గురించి ఆలోచించ కూడదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా! నాదల్ లో ఒక రకమయిన ఉద్వేగం కలిగింది. రాఫా గాడు వింబుల్డన్ విజేత. అంతే.


"గెలిచామా లేదా అని కాదన్నయ్యా! 100 పెర్సెంట్ ఇచ్చామాలేదా" అంటూ ఫెదరర్ ఆడుకున్నాడు. సెట్ టై బెర్క్ కి దారి తీసింది. టై బ్రేక్ లో నాదల్ పోరాడటానికి ప్రయత్నం చేసినాఫెదరర్ వకాశం ఇవ్వ లేదు. టై బ్రేక్ లో 5-౩ వద్ద పాయింట్ అద్భుతం. ఏస్ తో సెట్ని గెలుచుకున్నాడు.



ఇంట్లో అందరూ నిద్ర పోతున్నారు. నాన్న కూడా. లేట్ అయింది కదా!




నాకు నాదల్ మీద కోపం వచ్చింది. నాలుగో సెట్లో ఫెదరర్ ఊపు ఇంకా పెరిగింది. నడక లో హుషారు కనబడుతున్నది. నాకేమో మండుతున్నది. నేను నాదల్ ని తిట్టుకున్టున్డగానే సెట్ టై బ్రేక్ లోకి వెళ్ళింది. అందులో ఈ సారి నాదల్ ఆధిక్యం 5-2. మళ్ళీ నాదల్ వత్తిడికి గురి అయ్యాడు. రా గాడు వింబుల్డన్ విజేత సీన్ కళ్ళ ముందు మెదిలింది. అంతే. మనకు తెలిసిందేగా.


నేను మ్యాచ్ ని తక్కువ సౌండ్ తో చూస్తున్నాను. అక్కడ నాదల్ సెర్వింగ్ ఫర్ ది మ్యాచ్ అనగానే సౌండ్ కొంచం పెంచాను. ఫెదరర్ అదరి పోయే షాట్. ఇంక నాకు సెంటిమెంట్ పట్టుకుంది. వెంటనే సౌండ్ తగ్గించాను. ఈ సారి మ్యాచ్ పాయింట్. మళ్ళీ సౌండ్ పెంచాను. మళ్ళీ ఫెదరర్ పక్షమే. సౌండ్ డౌన్. మూడోసారీ ఇదే పరిస్థితి. ఏదయితే అది అయిందని సౌండ్ పెంచాను. ఇక పో ఫెదరర్ నభూతో అనే లాంటి బ్యాక్ హ్యాండ్ షాట్ తో సెట్ గెలుచుకున్నాడు. "చచ్చినోడా, వెధవా, ముండా, శుంఠా... అంటూ నాదల్ ని తిట్టుకున్నాను. స్లోర్ ఐదవ సెట్లో 2-2.


మళ్ళీ వర్షం పట్టుకుంది. నేను తట్టుకోలేక టీవీ ఆఫ్ చేసి పడుకున్నాను. నిద్రలో అంతా ఫెదరర్-నాదల్ ఆటే. మంచి మంచ్ పాయింట్ లన్నీ కలలోనే. నేను దొర్లుతున్నాను. "లే చూద్దాం," అంటూ ఫెదరర్ తట్టి పిలిచాడు. కళ్లు తెరిస్తే నాన్న. అప్పుడు టైం 1:37. స్కోర్ ఫైవ్ ఆల్. ఇంక అక్కడ నుంచీ నేనూ నాన్నా ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పుకుంటూ మ్యాచ్ ని చూడటమే. పాత విషయాలు కొత్త విషయాలూ అన్నీ మాటలలోనే. ఇంతలో సెవెనాల్. ఫెదరర్ సర్వ్ ని నాదల్ బ్రేక్ చేసాడు. నేను సౌండ్ పెంచుదామనుకున్నా సెంటిమెంట్ గుర్తు వచ్చి పెంచకుండా మంచానికి అతుక్కు పోయాను. డ్యూస్ దాటి నాదల్ గెలవంగానే చూడాలీ నా మొహం thousand watts.




వింబుల్డన్ సామెత: "ప్రతి ఫెదెరెర్కీ ఒక నాదల్ వస్తాడు."



గతనుభావలనుంచీ నేర్చుకున్న పాఠాలని ఉపయోగించుకున్న నాదల్ గెలిచాడు.




శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు, "कर्मण्ये वाधि कारस्ते माफलेशु कदाचन!" పని చెయ్యటమే మన విధి. ఫలితం భగవానుడే చూసుకుంటాడు. 




అందుకే మ్యాచ్ మధ్యలో ఒత్తిడికి గురి అవుతుంటారు, అనుభవం లేని వారు. నాదల్ కి వింబుల్డన్ గెలిచిన అనుభవం లేదు. అందుకే మొదటి మ్యాచ్ పాయింట్ అప్పుడు అలా. 




మన పంథాकर्मण्ये वाधि कारस्ते माफलेशु कदाचन

Posted by గీతాచార్య Dec 8, 2009




రెండేళ్ళ క్రితం అనిల్ కుంబ్లేకి మతి పోయిందనుకున్నారు. పదహారో ఆటగాడిగా ఆస్ట్రేలియా టూర్ కి వీరేంద్ర సెహ్వాగ్ ని ఎంపిక చేయించినప్పుడు. జాఫర్, ఒక ఓపెనర్ గా సెటిల్ అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. దినేష్ కార్తిక్ కూడా ఫర్లేదనిపిస్తున్నాడు. అలాంటి సమయంలో సెహ్వాగ్ ని జట్టులోకి తీసుకున్నాడు.

యువరాజ్ కి జట్టులో స్థానం కోసం సెగ్గీ దాదాని త్యాగం చేసి ద్రవిడ్ ని ఓపెనింగ్ చేయించాక యువీ ఫైల్యూర్ కళ్ళుతెరిపించాక సెహ్వాగ్ ని మూడో టెస్టులో తెచ్చారు. అప్పటిదాకా నత్త నదకన సాగిన ఓపెనింగుకి కాస్త ఊపునిచ్చిన సెగ్గీ, ఆ మ్యాచ్ లో మమ్చి ఆరంభాలనివ్వటమే కాకుండా రెండు వికెట్లు తీశాడు. తరువాత మ్యాచ్ లో మ్యాచ్ సేవింగ్ ఇన్నింగ్స్ తో సెంచరీ సాధించి, ఆ పైన జరిగిందంతా ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది.

ఆ సెలెక్షన్ సమయమ్లో సెహ్వాగ్ దేశవాళీ ఫామ్ కూడా అంతంత మాత్రమే. అనిల్ కుంబ్లే చెప్పిన మాటలు... "సెహ్వాగ్ లాంటీ ఆటగాడు డకౌట్ ఐనా ఫర్లేదు కానీ, జట్టు బైట ఎక్కువ కాలం ఉండ కూడాదు."

619 వికెట్లు, కెరియర్ చరమాంకంలో చేసిన సెంచరీ, ఇవే కాదు. చాపెల్ చలవతో దెబ్బతిని, మూలన పడి ఉన్న మహా వీరుడు సెహ్వాగ్ ని మళ్ళా బయటకు తెచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేలా చేసినదే అతను భారత క్రికెట్ కి చేసిన గొప్ప సేవ.

చూశాము కదా ఇవాళ్టీ ఇన్నింగ్స్. రెండేళ్ళలో మూడూ డబుల్ సెంచురీలు, వీలుంటే రేపటితో మూడు ట్రిపుళ్ళేసినా ఆశ్చర్యం లేదు. అవును మరి. భారత క్రికెట్ చంటిగాడు ఓపెనింగ్ కి లోకల్ కదా. అలాగే రేపు ట్రిపుల్ వేస్తే క్రీడామరత్వానికి కూడా లోచల్. ఎప్పుడూ అక్కడే ఉంటాడు.


లారా రికార్డు దాటాలని సెహ్వాగ్ కి శూభాకాంక్షలు చెపుదాం

ఆదివారం నాడు సెహ్వాగ్ స్పెషల్ టపా.

Posted by గీతాచార్య Dec 4, 2009


"కమీషనర్లు వస్తారు పోతారు. చంటి గాడు  లోకల్. ఇక్కడే ఉంటాడు."

కానీ మన క్రికెట్ చంటిగాడు గ్లోబల్. వికెట్ ఏదైనా సరే, బౌలర్ ఎవడైనా సరే, (జట్టు)పొజిషన్ ఎలా ఉన్నా సరే, "సిట్యుయేషన్ ఎలా ఉందని కాదన్నాయ్యా! రన్స్ కొట్టామా లేదా" అదే సూత్రం.


వందేసేలోపల కనీసం ఇరవై బంతులు మ్రింగే batsmen చాలా మంది. ఇక batting తాపీ ధర్మారావుల సంగతి సరే సరి!మరాంటిది మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో 2003 December 26 న ఆడిన విధ్వమ్సకరమైన ఇన్నింగ్స్ చిరస్మరణీయమైంది. కానీ అతని ఆటకే కాదు. 195 దగ్గర సిక్స్ కి ప్రయత్నించి ఔటైన విధానానికి, అక్కడి నుంచీ ఇండియా 3/311 నుంచీ 366 కి ఆలౌటై చివరికి మ్యాచ్ ని తొమ్మిది వికెట్ల తేడాతో కోల్పోయినందుకు. అదే వేరే ఆటగాడైతే ఆ పాటికి తన ఆటలో మార్పునో సంయమనాన్నో అలవర్చుకునే ప్రయత్నం చేస్తాడు. 


రెండు మ్యాచుల తరువాత... 295 పరుగులు. ఆ 195 ని గుర్తుంచుకున్న batsman అవడూ మళ్ళా కల్లో కూడా సాహసించని షాట్. Sixer. Only player in the world to get his triple with a sixer. I hope only player on Earth to think of that shot. 


ఈపాటికే అర్థమయ్యుంటుందందరికీ... 







ఎవడు జస్టలా గంటాడితే పీటర్సన్గాడికి దిమ్మతిరిగి కెప్టెన్సీ పోగొట్టుకున్నాడో ఆడే సెగ్గీ... (Indian) cricket చంటిగాడు. (పీటర్సన్ కెప్టెన్సీ పోవటానికి వేరే కారణాలున్నాయనుకోండీ)

వీరేందర్ సెహ్వాగ్... పేరు చెబితేనే ప్రత్యర్థి బౌలర్లకి ముచ్చెమటలు పోసి ఆ సెగ తగలకుంటే బావుణ్ణని కోరుకుంటారు.

అన్నీ ప్రక్కన పెడితే ప్రపంచ క్రికెట్ లో ఎలాంటి బంతి నైనా బౌండరీకి పంపగలిగిన ఏకైక ఆటగాడు. ఏ సందర్భంలో ఐనా, ఎలాంటి పిచ్ పైనైనా ధాటిగా పరుగులు సాధించగలిగిన ఆటగాడు.


"వంద మంది చాపెళ్ళొస్తారు పోతారు. సెహ్వాగ్ లోకల్. అక్కడే (ఓపెనర్ గా) ఉంటాడు."
*** *** ***

"కమీషనర్ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు కావా? కమీషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా?"

టెస్టుల్లో ఓపెనర్ అంటే డిఫెన్స్ ఆడుతూ ముందున్న batsmen కి బాట వేసే వాడనే భ్రమని (చూ|| గవాస్కర్, చేతన్ చౌహాన్, Geoff Boycott to our own Akash Chopra, and others) కొద్ది కొద్దిగా ఆస్ట్రేలియన్లు తొలగిస్తే దాన్ని రూపుమాపినవాడు సెహ్వాగ్. "ఏఁ ఓపెనర్లు దూకుడుగా ఆడితే పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేరా? సెంచరీలు రావా?"

ఎందుకు రావూ? బ్రహ్మాండంగా వస్తాయి. అది కూడా ఆషామాషీ సెంచరీలు కాదు. అతి భారీ సెంచరీలు. గత పదకొండు సెంచరీలూ, 150 పై మాటే. అందులోనూ రెండు ట్రిపుళ్ళూ మరో రెండు డబుళ్ళూనూ. పాక్ మీద కొట్టిన ట్రిపుల్ ఒక తరహా ఐతే సౌతాఫ్రికా మీద బాదిన త్రిశతకం మరో తరహా. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది. ఇందులోనూ 293 దగ్గర సిక్సర్ కొట్టినప్పుడు నేను ఎగిరిన ఎగురుడు ఇంకా మా ఇంట్లో ఫోక్లోర్. వీడి ఆనందం కొయ్యా అని. అంతే కదా మరి. His batting is pure magic. Divine grace. అంటే ఎంత ఆడితే అంత మంచిదని జట్టుకు.

ఈసారిక్కడ సిక్సరంటే చచ్చాడే అని కామెంట్లు. నేను పెట్టిన పందెం కట్టాను. ఖచ్చితంగా 290 దాటాక సిక్స్ కొడతాడాని.

అనిల్ కుంబ్లే దేశానికి చేసిన అతిగొప్ప ఉపకారం బౌలర్ గా వికెట్లు కొట్టి మ్యాచులను గెలిపించటం కాదు. 2007 ఆస్ట్రేలియా సీరీస్ కి సెహ్వాగ్ ని జట్టులోకి తేవటం. లేందే... అప్పటి దేశవాళీ ఫాం, జట్టు పరిస్థితిని బట్టీ అతని రాక అసాధ్యమే.

Form is temporary, class is permanent. ఎక్కువగా వినే మాట. కానీ సెగ్గీదాదా "Defence is temporary. Shot making is permanent" అంటాడు.

He has guts to win glory.

భారత క్రికెట్ కి గంగూలీ ఇచ్చిన వరప్రసాదం సెహ్వాగ్. (జట్టులోకి తెచ్చిందీ, ఓపెనర్ని చేసిందీ). సెహ్వాగ్ ఆటను చాలా సందర్భాల్లో గుర్తుచేసుకోవచ్చు. వాటి గురించి క్రమంగా సరిక్రొత్త కోణంలో తెలుసుకుందాం.

Time Magazine లో సెహాగ్ గురించిన ఆర్టికిల్ చదవాలంటే ఇదిగో లింకు...

Off-side slaughter అంటూ క్రికిన్ఫో లో ఇచ్చిన ఈ వ్యాసాన్ని చూడండి.


బ్లాగ్మిత్రులందరికీ Happy weekend

Posted by గీతాచార్య Nov 1, 2009

అనిల్ కుంబ్లే. భారత దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్ విన్నర్. నిబద్ధతకీ, హుందాతనానికీ నిలువెత్తు నిదర్శనం. అవును మరి. ఆరడుగుల పైన ఎత్తు.


భారత దేశనికి captain గానూ సేవలందించి Sidney టెస్టు సందర్భంగా ఒక నాయకుడు అంటే ఎలా ఉండలో మనకి అర్థంఅయ్యేలా చెప్పినవాడు.

రిటైర్ అయినప్పుడు ధోనీ భుజాల పైన మోసి మరీ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

అంతేనా? ట్రోఫీ ని కుంబ్లేతోనే పంచుకుని, తన గౌరవాన్ని చాటిచెప్పాడు.

కుంబ్లే. ద లెజండ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.

సచిన్ కి కూడా సాధ్యపడనన్ని విజయాలని జట్టుకు కట్టబెట్టినా జనంలో అంత పాప్యులారిటీ రాలేదు కానీ ఎనటికీ తరగని గౌరవాన్ని మాత్రం అందుకున్నాడు.


ఇప్పుడు Royal Challengers Bangalore ని విజయాల బాట పట్టించి తానెప్పుడూ ఎవర్గ్రీన్ అని చాటాడు. కోట్లకట్టలు విరజిమ్మి పీటర్సెన్ ని కొన్నా, ద్రవిడ్ ని captain గా వద్దన్నా, నిరుడు టెస్ట్ జట్టుని కొన్నాడని విమర్శలు ఎదుర్కొన్నా... మాల్యా ఈ సారి చేసిన మంచి పని కుంబ్లేకి captaincy అప్పజెప్పటం. ఫోర్స్ ఇండియా, ఈ ఛాలెంజర్స్ దెబ్బకి విదేశీ మోజు దిగటంతో కాస్త మెదడు ఉపయోగించి సరైన నిర్ణయాలు తీసుకుని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.

రాజస్తాన్ పై 5/5 తో మొదలెట్టిన కుంబ్లే ఈ IPL లో most successful spinner. ద్రావిడ్ కన్నా గొప్ప captain అయిన కుంబ్లేకి భారత captaincy ఆలస్యంగానే దక్కింది. దానికి తోడు జట్టు కాస్త అలసత్వంతో ఉన్న సమయం అది. తనూ కాస్త ఫామ్ కోల్పోయాడు. ధోనీ మేనియా కూడా ఊపందుకుంటోంది. ఆ సమయామ్లో కూడా తన సంయమనం కోల్పోని ధీరోదాత్తుడు. మన జంబో.

’భారత క్రికెట్ టార్జాన్’ గా పరిచయం అయిన మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఎవరికీ చెప్పనవసరం లేదు. వికెట్‍కీపింగ్ అంత గొప్పగా లేకున్నా తన batting విన్యాసాలతో ఆకట్టుకుని, క్రమంగా టెస్ట్ స్థాయికి ఎదిగన ధోనీ గత టి20 ప్రపంచ కప్ లో నాయకత్వం నెరిపే అవకాశం రావటాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ముందు వన్డే టీమ్ కి, ఆ తరువాత టెస్ట్ టీమ్ కి captain అయి, ఇప్పుడు IPL లో చెన్నై సూపర్ కింగ్స్ ని సెమీస్ కి చేర్చి, తనలాంటి వాళ్ళకి గురుతుల్యుడైన కుంబ్లేకి ఎదురు నిల్చాడు.

ధోనీ కి అచ్చొచ్చిన, కుర్రాళ్ళ ఆట అనే ఈ ఫార్మాట్ లో కుంబ్లే గెలిస్తే భలే మజా.

ఓల్డ్ హార్సెస్ ఆర్ మేకింగ్ వేవ్స్ హియర్ ఇన్ దిస్ IPL.

ఇది మొదలెట్టి చాలా సేపైనా కరన్ట్ పోయి ఇదిగో ఇప్పుడు స్కోరు RCB 98/3 while chasing 147, అన్న సమయంలో వచ్చింది.


ద్రవిడ్ ఔటట. మా బాబాయి కొడుకు చెన్నై అంటున్నాడు. But Heros must win. Kumble is one. So, RCB జైహో.

కమాన్ జంబో కమాన్.

కుంబ్లేకి శుభాకాంక్షలు చెప్పండి. నేను మ్యాచ్ చూడటానికి వెళ్తున్నాను.

మీరు చూసే సమయానికి ఫలితం తేలి పోతుంది కదా...! :-)

*** *** ***

తాజా వార్త: కుంబ్లే టీమ్ విన్స్.


ధోనీ కా ఇలాకా మే కుంబ్లే కా ధమాకా.

Posted by గీతాచార్య May 23, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!