BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

Showing posts with label Announcement. Show all posts
Showing posts with label Announcement. Show all posts

ఫ్రెండ్ ద్వారా మెయిల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది...

Heart surgery free of cost for children (0 to 10 years).

For more information, 08028411500

Please let it be known to as many as possible in your circles. It may help those who are in need.

Information is not verifies still, but please give it a look

Posted by Srujana Ramanujan Nov 14, 2010



నన్నసలు కదిలించ వద్దు. పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాను. Except on emergencies, don't even try to message me. అని గట్టిగా అందరికీ వార్ణింగిచ్చి, ఏమన్నా B&G వ్యవహారాలుంటే నువ్వే చూసుకో, అని ధన కి అప్పగించాక ఓ రెండు గంటల క్రితం వరకూ నాకే డిస్టర్బెన్స్ లేదు. ఇందాకన హట్ఃఆత్తుగా నా ఫోన్ మ్రోగుతుంటే చాలాసార్లు కట్ చేశాను. ఇక లామ్భం లేదనుకున్నాడో ఏమో, మెస్సగెన్ పెట్టాడు ధన, Veturi died. Shall we post anything అని. 

ఏమి చేద్దాము? సంతాపం తెలుపుదామా? అందరూ చేస్తున్నదదే కదా! అయినా వయసు దాటిపోయింది. మాట కూడా సరిగ్గా రావటం లేదు, అని ఈ మధ్యే కదా అనుకున్నది. మనిషిని మనం మిస్సవుతాము నిజమే కానీ, దానికి బాధ పడటమంటే ఆ మనిషిని అవమానించటమే (అదెలాగో మా మోటార్‍సైకిల్ డైరీస్ లో చదువుదురు). 

నువ్వు నీ స్టైల్లో చెపుతావు సరే. అదందరికీ అర్ధం కాదు కదా. నువ్వేమి చెయ్యాలనుకుంటున్నావో అది చెప్పు అన్నాడు.

ఆయన వల్ల నాకు తెలిసిన సత్యాన్నో, జరిగన మేలునో, లేదా నన్ను ఇన్స్పైర్ చేసిన అంశాన్నో అందరికీ చెపుదాము. అదే ఆయనకు నివాళి. మనిషి లేడని బాధ పదటం కాదు. ఆ మనిషి లెగసీని (తెలుగుభాషాభిమానీస్ ఎవరన్నా ఉంటే నా భాషకు అభ్యంతరం చెప్పుద్దు. అది నా సహజమైన భాష. వాడుకలో ఎక్కువ ఆంగ్ల పదాలు దొర్లుతుంటాయి. అవసరమైన సందర్భాల్లో ఒక్క ఆంగ్ల పదం లేకుండా కూడా వ్రాయగలను)

సరే ఆలోచిస్తే ఒకటనిపించింది. వేటూరంటే నాకు గుర్తొచ్చేది ఒకే పాట. అది అర్జున్ సినిమాలోని సంభవామీ పాట. అందులోనూ, మనసు ఉంటే మార్సు దాకా మార్గముందీ చలో (చూశారా సందర్భాన్ని బట్టీ ఆయనా అలాగే వ్రాశారు ;-)) అన్న మాటలు నాకు బాగా నచ్చినవి. అందుకే ఆ పాటను ఇన్స్టెంట్ నివాళిగానూ, నాకు తీరుబాటయ్యాక ఈ పాట గురించిన పెద్ద ఎనాలిసిస్ తో ఇంకా పెద్ద నివాళినీ అర్పిస్తాను.
*** *** ***

WE MISS VETURI. BUT NOT HIS GREAT WORK. ITZ ALWAYS IN OUR HEART.


సంభవామీ సంభవామీ
సాగరాలే దాటిపోనీ
అంబరాలే అంటుకోనీ
సంభవామీ

ఒక్క మాటా ఒక్క బాణం ఒక్కటేలే గురి
ఒక్క చూపుకి దిక్కులన్ని పిక్కటిల్లే ఝరి - ఝరి
ఓటమంటు లేని వాడు ఒక్కడైన సరి
ఓ మనసు ఉంటే మార్సు దాకా మార్గముంది చలొ
చల్రే చలొ చల్రే చలొ
చల్రే చలొ చల్రే చలొ

free ur mind free ur soul
see what u find and take control
high high through the sky through the sky fly high
through the sky fly
through the sky fly high fly
one word one shoot
i am here to stay

చుక్కలు దించెయ్ చక చకా
హక్కులు మనవే పద పదా
రెక్కల గుర్రం ఎక్కిపో
ఆ గగనాన్నే ఏలుకో
స్వాగతం అనదినం గీతికా
జాబిలికే కధచెపుదాం
వెన్నెలతో జతకడదాం
సాహసం చెయ్యర ఇంకా ఢింబకా
చినుకులనే జోడిద్దాం
చేడుగుడునే ఆడేద్దాం
ఆకాశంలో భూకంపాలే సంభవం
సర్వం నీకే సంభవం
రోధసీ నీ ప్రేయసే లే

పరుగులు పెట్టే గంగను ఉరికే కృష్ణ తొ కలపరా
నదులే కాదు యదలను కలిపేస్తేనే గేలుపురా
జీవితం equatorలొ స్నేహితం
స్వరములతో జతకడదాం
శరములతో గురిపేడదాం
యవ్వనం is equal to అద్భుతం
మనసల్లే పరిగెడదాం
మనిషల్లే నిలబడదాం
వేగం వేగం అంతా వేగం సంభవం
సర్వం నీకే సంభవం
ఊర్వశి నీ ప్రేయసేలే

*** *** ***

వేటూరి ఫొటో పెడదామని వెతికితే గూగుల్లో మంచివి, అంటే నాకు నచ్చినవి, దొరకలేదు. అందుకో వేరే ఏదో బ్లాగులో ఈ పాట స్కాన్ దొరికింది. మనిషి కన్నా ఆ మనిషి లెగసీ ఎక్కువనుకున్నాం కదా. :D అందుకే ఆయన వ్రాసిన పాట బొమ్మనే ఇక్కడ పెట్టేద్దాం అనుకున్నా. ఇక ముందు కనబడని ఆయన రూపమెందుకు? శాశ్వతమైన ఆయన పాట ఉండగా. 

పిక్చర్ మీద బ్లాగడ్రస్సు ఉంది. ఆ బ్లాగు వారికి ధన్యవాదాలతో...

Posted by గీతాచార్య May 23, 2010

Iది కొంత మందికి తెలిసిన నా పాత బ్లాగు కాదు. చాలా రోజుల క్రితం నేను వ్రాసుకున్న టపా. అలాని రిపీటింగూ కాదు.
ముందు ఈ ఆకుపచ్చని అక్షరాల్లో ఉన్న దాన్ని చదవండి. తరువాత అసలు విషయం చెపుతాను... :-)

Who is John Galt? అనేది Ayn Rand వ్రాసిన నవల (విశేషణాలు పెట్టలేని నవల) Atlas Shrugged లో తరచూ వినిపించే మాట. ప్రశ్న. దీనికి రకరకాల వ్యాఖ్యానాలున్నాయి. ఆ నవలలో. ఎన్నో కాంట్రడిక్షన్లు, ఎన్నెన్నో ఊహాగానాల మధ్య ఆ సదరు John Galt ని హీరోయిన్ Dagny Taggart కలుస్తుంది. అప్పుడే ఆమెకి సత్యం అవగతం అవుతుంది.

John Galt! Ayn Rand సృష్టించిన characters లో అద్భుతమైనదీ, ఆసక్తికరమైనదీ. అసలింతకీ ఎవరీ John Galt? ఎందుకితనికి అంత ప్రాధాన్యం?

దీనికి సమాధానం...

John Galt ఒక నిరంతర సత్యాన్వేషి. అతని మోటో... "I will never live for the sake of another person, nor ask another person to live for mine."

The world is open to us, and we oughtta explore it.

Moreover, he is The rational being. The truth finder.

Live 'In the Name of the Best Within Us' అని చెప్పగలిగిన గొప్ప సాహసి. తనని తానే మలచుకున్న నిత్య తాపసి.

Atlas Shrugged మీద కొన్ని ప్రత్యేకమైన వ్యాసాలు అందాయి.వాటికి ప్రిల్యూడ్ గా ఉంటుందని ఇది ఇక్కడ ఇచ్చాను. అవన్నీ మరో వారంలో ఒక వరుసలో ప్రచురింపబడుతాయి. 

Note: I thank Srujana for acquiring those articles, and also for the Atlas picture

Posted by గీతాచార్య May 20, 2010



B & G కోసం మీ రచనలను ఆహ్వానిస్తున్నాము. బ్లాగులున్నా , లేకున్నా కూడా మీ రచనలను మాకు పంపించవచ్చు. సినిమా సమీక్షలు, విశ్లేషణలు, పుస్తక పరిచయాలు,సమీక్షలు, సంగీతం, సాహిత్యం, సాంకేతికం, ఆటలు,ఫోటోలు మొదలైన అంశాలలో మీ వ్యాసాలను పంపించండి. మీ వ్యాసాలూ పంపవలసిన చిరునామా..

the.geethaacharya@gmail.com

jyothivalaboju@gmail.com



మరో విశేషం..

ప్రతి శుక్రవారం B & G లో మహిళలకు ప్రత్యేకం . ఈ రోజు మహిళల ,మహిళలకు సంబంధించిన వ్యాసాలు ప్రచురించబడతాయి. అతివలు త్వరపడండి. మీ రచనలు పంపండి.

Posted by జ్యోతి

ప్యాషన్ ఫర్ సినిమాలో నేను వ్రాసిన మూవీ రివ్యూ పబ్లిష్ ఐంది. చూసి ఎలా ఉందొ చెప్పండి. దీనిలో ఇంకో విశేషం ఉంది. ఈ సినిమా గురించి నేను గత సంవత్సరం నవతరంగం లో వ్రాశాను. అది చూసి బాగుందనుకుని అందులోని ఒక ఆతర్ నన్ను అక్కడ కూడా వ్రాయమని ప్రోత్సహిస్తే వ్రాసినది. అందులో వ్రాసిన దానికీ, నవతరంగంలో వ్రాసిన దానికీ చాల తేడా ఉంది. కానీ రెండూ వ్రాసినందుకు నాకు చాలా శాటిస్ఫాక్షన్ వచ్చింది.

లింక్ ఇదిగోండి... ప్యాషన్ ఫర్ సినిమా

నవతరంగం

Posted by గీతాచార్య Apr 14, 2010

Internet Movie data Base. Simply IMDB.

దానిలో నేను అవతార్ సినిమా గురించి వ్రాసిన ఆర్టికల్ ఎప్రూవ్ అయింది. రాసింది కొద్దిగానే అయినా అది మన తెలుగు వారికే కాకుండా ఇంకాస్త పెద్ద పరిధిలోకి వెళ్ళటం బాగుంటుంది కదూ. తొందరగా ఏ విషయానికీ అంత ఎక్జైట్ కాను కానీ ఇది మాత్రం కాస్త పంచుకోవాలనిపించింది.

ఇప్పటికి చిన్నదే వ్రాసినా ఇక ముందు మరింత బాగా వ్రాస్తాను.

నేను వ్రాసిన దాన్ని ఇక్కడ చదవండి. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకందే... ;-)

IMDB లో B&G

Posted by గీతాచార్య Mar 25, 2010

ట.

ఇంటర్నెట్ లో ఏదో వెతుకుతుంటే ఇది కనిపించింది. కాస్త అందరితో పంచుకోవాలనే ఆత్రం, అలాగే ఈ పుస్తకాలను గురించి వ్రాయటానికి కాస్త రిమెయిన్డెర్   లాగా ఉంటుందనీ. అయితే ఈ లిస్టు తో నేను ఒప్పుకుంటానా  అంటే... నాకు కొన్ని అబ్జెక్షన్లున్నాయనే చెప్పాలి. కాకపోతే ఒక పెద్ద లిస్టు. అంతే.

మరి దీని పైన మీ అభిప్రాయం, అలాగే మీకు నచ్చిన పుస్తకాల గురించి ఇక్కడ పంచుకుంటారని అనుకుంటున్నాను.
గీతాచార్య 




  1. ATLAS SHRUGGED by Ayn Rand
  2. THE FOUNTAINHEAD by Ayn Rand
  3. BATTLEFIELD EARTH by L. Ron Hubbard
  4. THE LORD OF THE RINGS by J.R.R. Tolkien
  5. TO KILL A MOCKINGBIRD by Harper Lee
  6. 1984 by George Orwell
  7. ANTHEM by Ayn Rand
  8. WE THE LIVING by Ayn Rand
  9. MISSION EARTH by L. Ron Hubbard
  10. FEAR by L. Ron Hubbard
  11. ULYSSES by James Joyce
  12. CATCH-22 by Joseph Heller
  13. THE GREAT GATSBY by F. Scott Fitzgerald
  14. DUNE by Frank Herbert
  15. THE MOON IS A HARSH MISTRESS by Robert Heinlein
  16. STRANGER IN A STRANGE LAND by Robert Heinlein
  17. A TOWN LIKE ALICE by Nevil Shute
  18. BRAVE NEW WORLD by Aldous Huxley
  19. THE CATCHER IN THE RYE by J.D. Salinger
  20. ANIMAL FARM by George Orwell
  21. GRAVITY'S RAINBOW by Thomas Pynchon
  22. THE GRAPES OF WRATH by John Steinbeck
  23. SLAUGHTERHOUSE FIVE by Kurt Vonnegut
  24. GONE WITH THE WIND by Margaret Mitchell
  25. LORD OF THE FLIES by William Golding
  26. SHANE by Jack Schaefer
  27. TRUSTEE FROM THE TOOLROOM by Nevil Shute
  28. A PRAYER FOR OWEN MEANY by John Irving
  29. THE STAND by Stephen King
  30. THE FRENCH LIEUTENANT'S WOMAN by John Fowles
  31. BELOVED by Toni Morrison
  32. THE WORM OUROBOROS by E.R. Eddison
  33. THE SOUND AND THE FURY by William Faulkner
  34. LOLITA by Vladimir Nabokov
  35. MOONHEART by Charles de Lint
  36. ABSALOM, ABSALOM! by William Faulkner
  37. OF HUMAN BONDAGE by W. Somerset Maugham
  38. WISE BLOOD by Flannery O'Connor
  39. UNDER THE VOLCANO by Malcolm Lowry
  40. FIFTH BUSINESS by Robertson Davies
  41. SOMEPLACE TO BE FLYING by Charles de Lint
  42. ON THE ROAD by Jack Kerouac
  43. HEART OF DARKNESS by Joseph Conrad
  44. YARROW by Charles de Lint
  45. AT THE MOUNTAINS OF MADNESS by H.P. Lovecraft
  46. ONE LONELY NIGHT by Mickey Spillane
  47. MEMORY AND DREAM by Charles de Lint
  48. TO THE LIGHTHOUSE by Virginia Woolf
  49. THE MOVIEGOER by Walker Percy
  50. TRADER by Charles de Lint
  51. THE HITCHHIKER'S GUIDE TO THE GALAXY by Douglas Adams
  52. THE HEART IS A LONELY HUNTER by Carson McCullers
  53. THE HANDMAID'S TALE by Margaret Atwood
  54. BLOOD MERIDIAN by Cormac McCarthy
  55. A CLOCKWORK ORANGE by Anthony Burgess
  56. ON THE BEACH by Nevil Shute
  57. A PORTRAIT OF THE ARTIST AS A YOUNG MAN by James Joyce
  58. GREENMANTLE by Charles de Lint
  59. ENDER'S GAME by Orson Scott Card
  60. THE LITTLE COUNTRY by Charles de Lint
  61. THE RECOGNITIONS by William Gaddis
  62. STARSHIP TROOPERS by Robert Heinlein
  63. THE SUN ALSO RISES by Ernest Hemingway
  64. THE WORLD ACCORDING TO GARP by John Irving
  65. SOMETHING WICKED THIS WAY COMES by Ray Bradbury
  66. THE HAUNTING OF HILL HOUSE by Shirley Jackson
  67. AS I LAY DYING by William Faulkner
  68. TROPIC OF CANCER by Henry Miller
  69. INVISIBLE MAN by Ralph Ellison
  70. THE WOOD WIFE by Terri Windling
  71. THE MAGUS by John Fowles
  72. THE DOOR INTO SUMMER by Robert Heinlein
  73. ZEN AND THE ART OF MOTORCYCLE MAINTENANCE by Robert Pirsig
  74. I, CLAUDIUS by Robert Graves
  75. THE CALL OF THE WILD by Jack London
  76. AT SWIM-TWO-BIRDS by Flann O'Brien
  77. FARENHEIT 451 by Ray Bradbury
  78. ARROWSMITH by Sinclair Lewis
  79. WATERSHIP DOWN by Richard Adams
  80. NAKED LUNCH by William S. Burroughs
  81. THE HUNT FOR RED OCTOBER by Tom Clancy
  82. GUILTY PLEASURES by Laurell K. Hamilton
  83. THE PUPPET MASTERS by Robert Heinlein
  84. IT by Stephen King
  85. V. by Thomas Pynchon
  86. DOUBLE STAR by Robert Heinlein
  87. CITIZEN OF THE GALAXY by Robert Heinlein
  88. BRIDESHEAD REVISITED by Evelyn Waugh
  89. LIGHT IN AUGUST by William Faulkner
  90. ONE FLEW OVER THE CUCKOO'S NEST by Ken Kesey
  91. A FAREWELL TO ARMS by Ernest Hemingway
  92. THE SHELTERING SKY by Paul Bowles
  93. SOMETIMES A GREAT NOTION by Ken Kesey
  94. MY ANTONIA by Willa Cather
  95. MULENGRO by Charles de Lint
  96. SUTTREE by Cormac McCarthy
  97. MYTHAGO WOOD by Robert Holdstock
  98. ILLUSIONS by Richard Bach
  99. THE CUNNING MAN by Robertson Davies
  100. THE SATANIC VERSES by Salman Rushdie
Ayn Rand నవలలు పైన ఉంటం మాత్రం నాకు బాగా నచ్చింది. 

Posted by గీతాచార్య Mar 20, 2010

మొత్తానికీ మహిళా బిల్లు బార్బేరియన్ల చేతి క్రింద నలక్కుండా గట్టెక్కింది. ఈ బిల్లు విషయంలో నా భావాలు, అభిప్రాయాలూ వేరైనా (అది తరువాతెప్పుడైనా తప్పక చెపుతాను) ఇప్పటికి మాత్రం శుభాకాంక్షలు.

ఈ సందర్భంగా వేరొక సమస్య అలాగే మిగిలుంది. సరిగ్గా నాలుగు రోజుల క్రితం కూడా ఆ విషయాన్ని నేను అబ్జర్వ్ చేశాను. దానికి సంబంధించిన కథ, ఇప్పటికే నాది చదివి ఉంటారు, అయినా అది నిరంతరం జరుగుతున్న విషయానికే 
సంబంధించింది కనుకా, క్రొత్త బ్లాగర్లున్నారు కనుకా, మరోసారి...
***   ***   ***

ఈ రోజు న్యూస్ పేపర్ చూసి నేను షాక్ తిన్నాను. ఇంతలో నాకు ఎవరో పెద్దగా నవ్వటం వినిపించింది. ఆ షాకులో నాకు అది నిజమైన నవ్వో లేక నా చిత్తభ్రాంతో అర్థం కాలేదు.

కాలం సాగిపోయింది. అది నాకు గాలిలో తెలుస్తోంది. నీటిలో తెలుస్తోంది. అలా అయిదువందల సెకనులు గడిచిపోయాయి. THE LORD OF THE RINGS: THE FELLOWSHIP OF THE RING సినిమాలో VOICE OF THE RING తెలుగు డబ్బింగ్ లాగా ఉందా! ఇంతలో మావారు రావటంతో నేను ఈ లోకంలోకి వచ్చాను.

మా ఇంట్లో పనిమనిషిగా చేసిన సుబ్బి హత్య చేసింది. తన మొగుడిని. ఆ న్యూసే నన్ను షాకుకి గురి చేసింది. సెలయిను బాటిల్తో పొడిచి భర్తను చంపిన భార్య. అదే నేను చుసిన హెడ్డింగు.

"భలే కామెడీ కదూ!" మా ఆయన నా ముక్కు పట్టుకుంటూ అడిగారు. నేను ఆయన చేతిని నేట్టేస్తూ కుర్చీలోకూలబడ్డాను.
*** *** ***
నాలుగు రోజుల తర్వాత నేను సుబ్బిని కలిసాను. అప్పుడు జరిగన సంభాషణ ఇదీ.
నన్ను చూడగానే ఆత్మీయంగా నవ్వింది.

"ఏమి జరిగింది?" నేను అడిగాను.

"ఎప్పుడో జరగాల్సింది అమ్మగారూ. ఇప్పుడు జరిగింది." తను అన్నది.
తర్వాత జరిగిందంతా నాకు చెప్పింది.
*** *** ***
సుబ్బి కోన సీమ నుంచీ వచ్చింది. మా ఉద్యోగం నిమిత్తం మేము గుంటూరు వచ్చాము. మా పనిమనిషి గా తననే పెట్టుకున్నాము. చక చక పనులు చేస్తూ మా అభిమానాన్ని పొందింది. ఏడాది క్రితం పెళ్లి అయిన మేము ఇద్దరమూ ఉద్యోగాలు చేస్తూ ఉండటంతో మా అత్తగారికి సహాయంగా ఉండటానికి పనిలో పెట్టుకున్నాము. మా అత్తగారు మంచి మాటకారి. అవతలవారిని తేలికగా ఆకట్టుకుంటుంది. సుబ్బి మా అత్తగారితో మాటల సందర్భంలో తన సంసారం గురించి చెపుతూ తనకి ఇద్దరూ ఆడపిల్లలే అనీ, తనను ఆడపిల్లలను కన్నందుకు తన భర్త ఎన్ని రకాలుగా హింసిస్తాడో చెప్పుకునేది. రోజూ రాత్రి భోజనాల సమయంలో ఆవిడ ఈ విషయాలని మాతో చెప్పేది.
*** *** ***
సాయంకాలాల్లో మేము ట్యూషన్లు చెప్పుకుంటూ ఉంటాము. ఒక రోజు మా ఆయన Human Reproduction గురించి పిల్లలకి చెపుతూ x x chromosomes కలిస్తే ఆడపిల్లలు, x y chromosomes కలిస్తే మగ పిల్లలూ పుడుతారని చెపుతుంటే సుబ్బి ఆయన దగ్గరకు వెళ్ళింది. సుబ్బి ఆయనను ఏదో విషయం అడగటం ఆయన ఏదో చెప్పటం నేను వంట ఇంట్లో నుంచీ గమనించాను.
*** *** ***
కొన్నాళ్ళకు సుబ్బి మళ్ళీ గర్భవతి అయింది. మావారికి విజయవాడలో ఒక కాలేజిలో ఎక్కువ జీతంతో ఉద్యోగం రావటంతో మేము షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ సుబ్బికి భర్త వేధింపుకు ఎక్కువ అయ్యాయి. మా అత్తగారికీ తన గురించి దిగులు ఎక్కువ అయింది. నెలలు నిండటంతో సుబ్బి ఆసుపత్రిలో చేరింది. కానుపుకి రెండు గంటల ముందు తాగి వచ్చిన సుబ్బి మొగుడు ఈసారి మగ పిల్లాడు పుట్టకపోతే నరికేస్తానని అల్టిమేటం ఇచ్చాడు. సుబ్బి బిక్క చచ్చిపోయింది.
*** *** ***
సుబ్బి ఖర్మో ఏమో గానీ ఈసారీ ఆడపిల్ల పుట్టింది. ఇంతలో దాని మొగుడు గదిలోకి వచ్చాడు.
అయితే "రేయ్ నా కొడకా y క్రోమోజోము ని పంపకుండా x క్రోమోజోము ని పంపుతావుట్రా!" అంటూ సుబ్బి పక్కనే ఉన్న సెలయిను బాటిల్ ని పగల కొట్టి దాంతో తననికొట్టటానికి వస్తున్న మొగుడిని పొడిచింది.
*** *** ***
నేను ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాను. మా ఆయన పెద్దగా నవ్వాడు.

"ఇలాంటి వాడికి తగిన శిక్ష పడింది." మా అత్తగారు అంది. ఆడపిల్లే తనకు మొదటి కానుపులో కావాలనే మా ఆయనతో నేను "x క్రోమోసోముని పంపకపోతే చంపేస్తాను," అన్నా. ఈసారి పెద్దగా నవ్వింది మా అత్తగారు.

Posted by గీతాచార్య Mar 10, 2010

Kapil was inducted into the ICC Hall of Fame. A deserved winner, and a late inductor...

Much more to follow. ఎప్పుడో చెప్పలేను :D


Hearty Congratulations on behalf of B&G. He is THE MAN who changed the face of the world cricket

Posted by గీతాచార్య Mar 9, 2010

Kathryn Bigelow ఆస్కార్ పొందిన మొదటి మహిళా దర్శకురాలు. (అవార్డు పొందటం పైన నాకు కొన్ని ఇబ్బండులున్నాయనుకోండి). నాకు అర్థం కాక ఇబ్బంది పెట్టిన విషయమొకటుంది. 

ఓ ఆస్కార్ల సందడి మొదలైనప్పటి నుండీ చూస్తున్నాను. ఈ మీడియోకరోళ్ళు కామెరాన్ భార్య, కామెరాన్ భార్య అంటున్నారు కానీ, The Hurt Locker దర్శకురాలు అన్న పాపాన పోలేదు. సమయం వచ్చిన ప్రతిసారీ, అదే కూత. పైగా ఇవాళ అంధ కోతి పత్రికలో హెడ్డింగు చూశాక ఇక ఆగలేక పోయాను. కాలేజ్ లైబ్రరీలో ఉన్నా  పెద్దగా నవ్వేసి ఇటు వచ్చాను. ఒక మహిళా ఆస్కార్ని తొలిసారి దర్శకత్వ విభాగంలో పొందటం గొప్ప విషయం. (ఈ సారిచ్చిన ఆస్కార్లలో నాకు నచ్చనివి కొన్ని ఉన్నాయి. అది వేరే విషయం). అసలు విషయం కన్నా, ఆ సినిమా గొప్పతనం కన్నా, కామెరాన్ భార్య అతని పైన విజయం సాధించినట్టు ఈ సోది హెడ్డిన్గులేంటి? Is n't it ridiculing her talent? Why comparing her victory with other trivial things? అంటే ఆ సినిమాలో విషయం లేదనేగా? :D

బిగెలో దర్శకత్వ ప్రతిభ మీద, ఆమె తీసిన సినిమా గురించిన మాటలు ఒక్కటీ కనపడలా. అసలా సినిమాకి అవార్డులోచ్చే దాకా అటు వైపు మన మీడియోకరోళ్ళు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు మాత్రం బాకాలెక్కువయ్యాయి. అసలా సినిమా గురించిన చర్చ కాకుండా కామెరాన్ భార్య, తొక్కన్నర , మాజీ భర్త పైన మాజీ భార్య విజయం? బిగేలోని అవమానించటం కాదా ఇదంతా? సినిమా నాకూ నచ్చలేదు. నా ఉద్దేశ్యం అవతార్ లేక పోతే ఈ సినిమా గురించి ఆలోచించవచ్చని. కానీ కామెరాన్ భార్య అని పడే పడే ఎత్తి చెప్పటం మాత్రం నా దృష్టిలో బిగెలో ని అవమానించటమే...

కొసమెరుపు: ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో ఇచ్చిన ఒక రివ్యూ చూడండి...

One of the most disconnected, unbelievable war movies, 28 January 2010
5/10
Author: tabuno from utah
This hugely disjointed, unbelievable, and sometimes manipulative movie is one of the biggest disappointments of the year. There are so many plot points that don't really portray the consistent character or relational dynamics that are likely to be found in the circumstances this movie presents - the movie comes across more like a script writer's fantasy than an authentic, compelling, and engaging movie. There are so many predictable, stereotypical subplots as well as loosely thought out script points that the movie betrays a sense of incredibility. The obvious emotive plot points designed to illicit audience sympathy only served to distance not involve the audience. An over-rated movie that uses various plot devices to project a political correct movie in the guise of being anti-establishment. 

ఇవన్నే ప్రక్కన పెట్టేద్దాం. నేను చెప్పేది, అడిగేది ఒకటే... బిగెలో కి ఓన్ ఐడెంటిటీ ఇవ్వలేరా మీడియోకరోళ్ళు?   


Posted by గీతాచార్య

ఐడియా ఏమిటంటే బ్లాగుల్లో వచ్చిన కొన్ని కొన్ని మంచి టపాల్ని, కవితల్నీ ఎంపిక చేసి, వాటిన VSAX పద్ధతి ద్వారా eBook గా మార్చిపరిచయం, సమీక్ష, విశ్లేషణ చేస్తూ, డౌన్లోడ్ కోసం పెట్టాలనేది. 


కొన్ని, మంచి అన్న మాటలున్నాయే... అబ్బ! చాలా చెడ్డవి. వాటిని ఏ శ్టాండర్డ్స్ ప్రకారం ఎన్నుకోవాలి? ;-)


ఒక్క విషయం చెప్పి, నా సమీక్ష మొదలెడతాను. సుజ్జి గారి కవితలనున్నింటిని ఎంపిక చేసి, eBook గా మార్చి, B&G ద్వారా మరోసారి గుర్తుచేద్దామని గీతాచార్య పర్మిషన్ సంపాదించాక నాకు చేసిన మెయిల్ లో ఇద్దరం ఎవరికి వాళ్ళంగా పిక్ చేద్దాము. వాటిని ఇద్దరమూ, ఎవరికి వాళ్ళంగా రాసి కలిపి అందిద్దాము అని. 


ఆశ్చర్యమేమిటంటే, ఎంపిక చేసుకున్న పదకొండూ, ఇద్దరమూ, ఒకరికి తెలియకుండా ఒకరం ఎంపిక చేసినవే. :-) ఒక్కటి కూడా మార్పు లేదు. ఆ వదిలేయబడ్డ ఒక్కటీ సమానమే. కారణాలూ దాదాపూ ఒకటే. ఆ కవిత కి వ్యాఖ్యగా గీతాచార్య రాసిన మాటలే దానికి కారణం. 


ఇక సమీక్ష...


I CAN ONLY SAY THAT I FEEL EXTREMELY PROUD TO BE SELECTED TO WRITE A FEW WORDS ABOUT THIS ONE. 


ఇంతకన్నా ఒక్క మాట ఎక్కువ చెప్పినా, that would be a great offence to the poetess. Its an insult for her.


A review is a sort of defense as to why read a book. This work needs no defense. Simply, 


THE DEFENSE RESTS NOW.  


మీకుగా మీరే మరోసారి (ఎందుకంటే కొంతమందైనా చదివే ఉంటారు. కాకపోతే ఒక్కఛోటే అన్నీ ఉంటాయనేది ఇక్కడ ఇలా అందించటానికి కారణం) చదివి, కాదు కాదు, అనుభవించి చూడండి. అలా అని రివ్యూలు అవసరంలేదా అంటారా..., కొన్ని కొన్ని సార్లు కేవలం మనకోసం రాసుకునేందుకు, మరోసారి ఆ ప్రపంచంలో విహరించటానికి అవసరం. But Sujji's books needs no such thing. సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోండి. చదివేసెయ్యండి.


కొసమెరుపు


B&G లోగోని మరీ అలా పెట్టినందుకు గీతాచార్య అబ్జెక్ట్ చేశారు. దానికి నా సమాధానం... That you picked her work to present, and that too as first in the series. అదే మీకా అర్హతనందించింది.


నా మాటలు నిజమో కాదో మీరే నిర్ణయిస్తారు చదివాక.


ప్రియ అయ్యంగార్


P. S. ఈ కవితలకి సమాధానం/ఎల్స్టెన్షన్/ వ్యతిరేకంగా మరో రెండు మూడు చిన్న కవితలున్నాయి. వాటిని నా బ్లాగులో అందించేందుకు అనుమతి లభించింది. Wait and see... 

ఇక్కడ నుంచీ డౌన్లోడ్ చేసుకోండి

మౌనం - Straight from the Heart

Posted by గీతాచార్య Mar 5, 2010

ఇందాకన నుంచీ సోర్స్ కోడ్ లో ఏమి మార్పులు చెయ్యాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ఒక మెయిలొచ్చింది. దానిచివరెక్కడో... blackle.com అని ఉంది. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు బ్లాకిల్ గురించి. నేను చెప్పను కానీ, ఒకసారి దాన్ని గురించి ఏమి చెప్పుకున్నారో చదివి, మీకు నచ్చితే కనీసం రోజులో ఒక్కసారైనా గూగులుపయోగించే బదులు దాన్ని వాడండి. కాస్త పవర్ సేవ్ చేయండి.


How is Blackle saving energy?

Blackle was created by Heap Media to remind us all of the need to take small steps in our everyday lives to save energy. Blackle searches are powered by Google Custom Search.

Blackle saves energy because the screen is predominantly black. "Image displayed is primarily a function of the user's color settings and desktop graphics, as well as the color and size of open application windows; a given monitor requires more power to display a white (or light) screen than a black (or dark) screen." Roberson et al, 2002

In January 2007 a blog post titled Black Google Would Save 750 Megawatt-hours a Year proposed the theory that a black version of the Google search engine would save a fair bit of energy due to the popularity of the search engine. Since then there has been skepticism about the significance of the energy savings that can be achieved and the cost in terms of readability of black web pages.

We believe that there is value in the concept because even if the energy savings are small, they all add up. Secondly we feel that seeing Blackle every time we load our web browser reminds us that we need to keep taking small steps to save energy.
How can you help?

We encourage you to set Blackle as your home page. This way every time you load your Internet browser you will save a little bit of energy. Remember every bit counts! You will also be reminded about the need to save energy each time you see the Blackle page load.

Help us spread the word about Blackle by telling your friends and family to set it as their home page. If you have a blog then give us a mention. Or put the following text in your email signature: "Blackle.com - Saving energy one search at a time".

Have a look at our energy saving tips page for ideas on steps you can take to save energy or you can follow Blackle on Twitter and we will keep you updated with simple energy saving tips. (అక్కడిది కాపీ పేస్ట్ చేశాను. ;-))

అలాగే మరో చిన్న మంచి పని చెయ్యవచ్చు.

freerice.com వినే ఉంటారు. ఒకసారి దాన్ని కూడా సందర్శించి ఉపయోగించి చూడండి. ఎంతోసేపక్కర్లేదు. కంప్యూటర్ ముందు నుంచీ లేచి టీ తాగాలనిపించినప్పుడు లేవ బోయే ముందు సరిగ్గా రెండంటే రెండు నిమిషాలు ఆవైపో కన్నేసినా చాలు.

*** *** ***

ఇవాళ మా (గీతాచార్య వాళ్ళ అనుకోండి. తన వల్ల నాకు కూడా :-)) ప్రొఫెసర్ గారు, శ్రీ ఇగోర్ మథ్యూస్ గారి పుట్టిఅ రోజు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పగలిగే సన్నివేశం నాకు లేదు. అందుకే ఒక రెండు మంచి పనుల గురించి చెప్పి అసలు విషయానికొచ్చాను.

సో ఒక మంచి పని చేశా కదా... ఇప్పుడు టీ త్రాగటానికి వెళుతున్నాను. :-D

ఈ టపా చూశాక ఫ్రీ రైస్ ఒక్క రెండు నిమిషాలైనా ఆడమని మనవి.

Posted by Dhanaraj Manmadha Mar 2, 2010

ఓ ఫైన్ సాయంత్రం (ఎంతేశారంటే నేను సమాధానం చెప్పను) సుజాత గారి అవుడియాను బట్టీ మొదలైన మా పేట్రియాటిక్ బ్లాగు ఇవాళ్టితో అనగా కోటప్పకొండ కథతో నాలుగు వేల కొట్టుడు కొట్టింది. అసలు ఈ ఐడియా సుజాతగారిదండీ. టైటిలు కూడా సుజాత గారే పెట్టారండీ. :-D

మా ఊరి గురించి మొదలెట్టుకున్న మా చిన్న బ్లాగు సక్సెస్ గురించి నాకైతే ఎప్పుడూ అనుమానం లేదు. మొదటి కారణం... దీన్లో సుజాత గారి హస్తముండటం. రెండో కారణం... మా ఊరి గొప్పతనం. మేమెక్కడా మిగిలిన కైఫియ్యత్తులలా కాకుండా మావైన కాంట్రాస్టింగ్ స్టైల్స్ ని ఫాలో అవుతూ వ్రాయటం. సరే మా డప్పా ఎందుకులే కానీ ఇప్పుడు, నాలుగు వేల హిట్స్ అన్నది ఇప్పటి బ్లాగ్ standards లో పెద్ద లెక్కలోకి రావు కానీ, ఇలాంటి బ్లాగులు మాత్రం ఇలా ఇన్ని హిట్స్ సాధించాయంటే అది గొప్ప విషయమే. దాదాపూ ప్రతీ టపా కూడా ఇరవై పైన వ్యాఖ్యలే కాకుండా, ఐదొందలదాకా హిట్స్ ని కూడా సాధించింది.

ఈ మధ్య దురదృష్టం కొద్దీ నేను వ్రాసిన టపాలు డిలీట్ అయినా, వేణూ శ్రీకాంత్ గారి పేట్రియాటిజం వల్ల ఒకటీ, ప్రియ ఇంటెరెస్ట్ వల్ల మరొకటీ, దొరికాయి. అసలు వ్యాఖ్యలయితే పూర్తిగా పోయాయనే అనుకున్నా గానీ, ధన మొత్తానికీ అన్నిటినీ సాధించాడు. టైమ్ చూసుకుని అన్నిటినీ రీపోస్ట్ చేసుకోవాలి ఓల్డ్ డేట్లతో.

ఈ సందర్భంగా మా బ్లాగునాదరించిన అందరికీ (జనానికి నచ్చందే ఇన్నాళ్ళు నిలువదు కదా. అప్పుడే ఎనిమిది నెలలు గడిచాయి. ఒక వైజాగు బ్లాగరు కూడా మా బ్లాగుకి టపా పంపగా... ఆరుగురు నేస్తాలు ఫాలో అవుతున్నారు. ఈ సందర్భంగా మా (మన) పేట్రియాట్లందరికీ శుభాకాంక్షలు. అలుపెరుంగక... అన్న రీతిలో మేమింకా ముందుకు పోతా ఉండాలని మాకు విషెస్ చెప్పమని కోరుకుంటూ..., ముందు మరిన్ని మంచి కబుర్లు చెపుతామని హామీ ఇస్తూ, మాకెవరైనా పెద్దలను దిష్టి తీయమని కూడా అడుగుతున్నాం ;-)

సెలవ్,

గీతాచార్య

P. S. : We are here with no history. But We are here to create history. అదీ నేను మొదలు పెట్టిన కొత్తల్లో వ్రాసుకున్న ఎందుకింత పేట్రియాటిజమనే టపాలోని వాక్యం. (కాపీ రైట్ నాదే). అదేదో నిజమైనట్లుంది...? :-)

ThankQ one and all.

Posted by గీతాచార్య Feb 10, 2010

మొన్న డిసెంబరులో బ్లాగర్స్ డే నాడు జరిగిన ఆన్లైన్ చాట్ సందర్భంలో ఓపెన్/ఫ్రీ సోర్స్ సాఫ్ట్వేర్ల గురించిన చర్చ జరిగింది.  అదే సమయంలో వీవెన్ గారు ఫాస్తె (FOSS-TE) అనే ఓపెన్/ఫ్రీ సాఫ్ట్వేర్ల గురించి ఒక గూగుల్ గుంపును ప్రారంభించమన్న మా (ధనరాజ్ మన్మధ, నేను) అభ్యర్థనను మన్నించి ప్రారంభించారు. ఆరోజు చర్చలో కంప్యూటర్ ఎరా సంపాదకులు, నల్లమోతు శ్రీధర్ గారు కూడా పాల్గొన్నారు. డిగ్రీ పీజీ రోజుల్లో ఆ పత్రిక చదివి ఎన్నో విషయాలను తెలుసుకున్న మాకు ఆ రోజు శ్రీధర్ గారి నుంచీ ఫోను రావటం itz just like a dream come true.

అలాగే మన బ్లాగోజినా B&G లో ఓపెన్/ఫ్రీ సాఫ్ట్వేర్ల గురించిన సమాచారం (ఇప్పటికిచ్చింది కొంచమే అయినా, బ్రౌజర్లకు సంబంధించిన రికమెండేషన్ల లాంటివి) ఇస్తున్న సంగతి తెలిసిందే. FOSS నిపుణుడు, ఫెదొరా, ఫైర్ఫాక్స్ లకు సంబంధించి ప్రస్తుతం పని చేస్తున్న ధన ఇందులో active గా పాల్గొనాలనున్నా సమయాభావం వల్ల పూర్తి స్థాయిలో టపాలింకా వెలువరించలేదు. అలాంటి సందర్భంలో శ్రీధర్ గారిని ఉబుంటూకు సంబంధించిన సమచారం మన మేగజైన్లో ఇస్తుంటే కనుక దానిని B&G లో కూడా పెడతామని అడినాను. అందుకు ఆయన సమ్మతించారు. సో, ఆ ఉబుంటూ కు సంబంధించిన సమాచారం ప్రతి శనివారం B&G పాఠకుల సౌకర్యార్థం సాయంత్రం పోస్టుల (ప్రతి మొదటి, మూడవ) రూపంలో అందిస్తాము. అంతే కాకుండా వీలుని బట్టీ మరింత FOSS సమాచారాన్ని శనివారాల్లో అందించే ప్రయత్నం చేస్తాము.

శ్రీధర్ గారు మేగజైన్ సమాచారాన్ని (ఉబుంటూ గురించిన) ఉపయోగించుకోనివ్వటం ఒక ఎత్తయితే, ఆ మేగజైన్లో ఉన్న దానిని టైపు చేసుకోలేని  స్థితిని (భువన సుందరి, నా రీసెర్చ్ కాలేజ్ లో సెమెస్టర్. రెండో సెమెస్టర్ అంటే సమయం తక్కువ. పైగా ఈ మధ్యన జరిగిన ఉద్యమాల వల్ల విలువైన వర్కింగు దినాలు మిస్సయ్యాయి) గమనించిన జ్యోతి గారు మాకు వాటిని టైపు చేసి ఇస్తామని చెప్పారు.

So, a BIG THANKS to నల్లమోతు శ్రీధర్ గారు.

అలాగే జ్యోతి గారికి కూడా నెనెర్లు.

Posted by గీతాచార్య Feb 4, 2010

నాకు మొదటి నుంచీ చందమామ కన్నా బాలజ్యోతి అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకో కారణం చెప్పలేను. బాలజ్యోతి 1980 లో విడుదలైనప్పటి నుంచీ ఎనభై ఆరు దాకా మా ఇంట్లో ఉన్న కాపీలను దాదాపూ ప్రతి రోజూ పారాయణం చేసినందువల్ల కావచ్చు. అలా అని చందమామంటే గౌరవభావం లేదని కాదు. లిటరల్లీ చందమామంటే గౌరవం, భక్తీ, బాలజ్యోతి అంటే ఒక రకమైన సన్నిహితత్వం. 

పిశాచ గిరి, మహావీరుడు భిల్లూ, కిట్టిగాడు, నాకున్నది ఒక చక్కని బొమ్మ, దక్షిణ ధృవ యాత్ర, అగ్నిదత్తుడు, మొదలైన సీరియళ్ళు, నేను పుట్టక ముందు వ్రాయబడినవే అయినా, నా నాలుగైదు తరగతుల చదువు సమయంలో వాతితో పెనవేసుకున్న బంధం ఇప్పటికీ అలాగే ఫ్రెష్‍గా...

దానికితోడు అందులో ఇచ్చిన మినీ సీరియళ్ళు భలే ఉండేవి. వాటి ముందు నాకు ఎందుకో చందమామ వెల వెల బోయినట్లుండేది. అప్పుడప్పుడూ ఎవరన్నా తెచ్చినప్పుడు మాత్రం చందమామ చదివేవాడిని. ఆరో తరగతిలో ట్రాజన్ వార్, ఆపైన ఏడొ తరగతిలో ఆడిస్సి (Odyssey ) నేను చదివిన తొలి పాశ్చాత్య సాహిత్యం. అందులో నాకు యూలిసీజ్ (Ulysses or Oddysseus ఆడీశ్యజ్) బాగా నచ్చాడు. భుజ బలం కన్నా బుద్ధి బలం కలిగిన వాడు, పైగా మన సరస్వతీ దేవికి సమాంతరంగా చెప్పబడే ప్యాలస్ ఎతీనీ (Pallas Athene) అనుగ్రహం ఉన్న వాడు. ఎక్కడికక్కడ తన తెలివితేటలను ప్రాక్టికల్ పర్పస్ కోసం ఉపయోగించుకునే తీరు భుజ బలం కన్నా బుద్ధి బలాన్ని ఎక్కువగా వాడాల్సిన నాకు బాగా యూలిసీజ్ నచ్చటానికి కారణమయ్యాయి. మరి అలాంటి ట్రాజన్ వార్ ని చందమామలో ఇస్తున్నట్టు తెలిశాక తెలుగులో అయితే మరింత బాగా ఎంజాయ్ చెయ్యొచ్చనే ఆత్రమ్ తో చందమామ తెచ్చుకునే వాడిని. 

నరసరావుపేట ఈశ్వర్ కూల్ డ్రింక్స్ దగ్గరున్న మేగజైన్ల స్టాల్ వద్ద నేను పరిచయమ్ పెంచేసుకుని (వాడి కూతురు శ్రియ కాదు లెండి ;-)) ఎప్పుడన్నా డబ్బులు లేకున్నా పుస్తకమక్కడే కూచుని చదివేసిచ్చి వెళ్ళేవాడిని. సరిగ్గా పావుగంట వదిలేవాడు. అది నాకు సరిపోయేది. అయినా మధ్యలో కొన్ని ఎపిసోడ్లు మిస్ అయ్యాను. ఒక్కోసారి ఆలశ్యంగా రావటం, లేకపోతే ఆయన కూతురు కూచోటమో అలా మిస్ అయ్యేవి. నాన్న కన్నా కూతురు తెగ ఇబ్బంది పెట్టేది. పుస్తకమిట్లా ఇస్తే బేరాలు తగ్గుతాయని.

ఆ కథనానికి చందమామలో పెట్టిన పేరు భువన సుందరి. కాస్త నేను చదూకున్న ఇంగ్లీషు కథనానికన్నా మార్పులున్నా, అబ్బబ్బ ఆ కథనమే వేరు ఎంతైనా చందమామ చందమామే. లేని పుస్తకాలెటూ లేవు. ఉన్న పుస్తకాలు కూడా ఇంటి సర్దుళ్ళలో గవించాయి. అప్పటి నుంచీ చందమామ 1995/96 సంచికల వేట మొదలెట్టానిగానీ, అవి దొరకలేదు. 

ఇందు మూలంగా (ఎవరా ఇందు? ఏమా కథ అని మాత్రం అడగొద్దు. ఈ కారణాన అని అర్థం తీసుకోండి) చంపి లకు నా రిక్వెస్టు. కాస్త పుస్తకాలాచూకీ తెలిస్తే నాకు ఇవ్వగలరు. మనం, మనం, మాట్లాడుకుందాం... 

ఆ భువన సుందరి ఉరఫ్ ట్రాజన్ వార్ అలియాస్ ఇలియాడ్ ని ట్రాయ్ అనే పేరుతో బ్రాడ్ పిట్ ని పెట్టి తీశారుగానీ, చేసిన మార్పులన్నీ మహాస్యాస్పదంగా ఉన్నాయి. మరొక్కసారి ఆ కథని చదవాలని ఉంది. ఇప్పటికి పుస్తకాలు లేవు. అందుకనే నాకు తెలిసిన కథని నా మాటల్లో ఇక్కడ B&G లో సీరియల్ లాగా అందించే ప్రయత్నం చేసే సాహసం చేస్తున్నాను. చదివి నన్ను ప్రోత్సహించండి. తప్పులుంటే సరిదిద్దండి. 

అలాగే జై హనుమాన్ ఉన్న కాపీలు కూడా ఆచూకీ తెలిస్తే చెప్పండి.



ఇకపై ప్రతి బుధవారం చూడండీ భువన సుందరి కోసం

Posted by గీతాచార్య Feb 2, 2010


ఎలెక్ట్రికల్ ఇంజినియరింగు కి సంబంధించిన పుస్తకాలు కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఎవరైనా ఎలెక్ట్రికల్ ఇంజినియరింగు చదివే వారికి ఏమన్నా సమాచారం కావాలంటే నాకు చేతనైనంతలో చెయ్యగలను.


మన B&G లో నాకు తెలిసిన పుస్తకాలకు సంబంహించిన రివ్యూలూ, డౌన్లోడు లింకులూ ఇస్తాను. అలాగే ఇంజినియరింగుకి సంబమ్ధించి ఏవన్నా సమాచారం పంచుకోవాలన్నా ఇక్కడ పంచుకుంటే మరింత మంది స్టూడెంట్లకి తెలుస్తుంది.

Introduction to Electrical circuits అనే పుస్తకాన్ని దింపుకోండి.

ఇక ముందు కూడా ప్రతి వారం ఏదన్న సమాచారం కానీ, పుస్తకాలు కానీ దొరికితే B&G లో Engineering Info అనే సెక్షన్ లో పంచుకుంటాను.

యోగి

Posted by s.yogendra reddy Jan 26, 2010

నెట్ దిగ్గజం గూగుల్ యొక్క బ్రౌజర్... క్రోమ్ నాలుగవ వెర్షన్ విడుదలైంది. గూగుల్ బేస్డ్ సర్వీసెస్ బ్రహ్మాండంగా నడిపించేందుకు క్రోమ్ వాడటమే ఉత్తమం. నా టెస్టింగులో మాత్రం సఫారీ, ఫైర్ఫాక్స్ 3.6, ఆ పైన క్రోమ్.


ఇక్కడ డౌన్‍లోడ్ చేసుకోండి. ఓపెన్/ఫ్రీ సోర్స్ దిగ్గజాలైన (???) మోజిల్లా, గూగుల్ వారి బ్రౌజర్ల సరి కొత్త వెర్షన్లని దాదాపూ ఒకే సమయంలో విడుదల చేశారు. వాటి పైన నా ప్రయోగాలు చేసి ఇస్తున్న రేటింగులు...

సఫారీ... 4.7

ఫైర్ఫాక్స్ 3.6... 4.5

క్రోమ్... గూగుల్ ఆధారిత సర్వీసులకి అయితే 4.6, ఇతర సాధారణ బ్రౌజింగుకి అయితే మాత్రం 4.1.

Posted by Dhanaraj Manmadha Jan 25, 2010

Some of you may know this news. But want to share it.

Just a coupla hours back Dhanaraj Manmadha smsed me to check for the FF latest version. The FF 3.6

I checked it out, and found it wonderful, and feel like sharing the news. As B&G is committed to campaign Free and Open Source Softwares... (FOSS) here is the link to download it.


http://www.mozilla.com/en-US/

Why late, try the most stylish of all the FF's right now. Experience itz personas too... (themes) :-)

Thank you,

Srujana Ramanujan

Posted by Srujana Ramanujan Jan 22, 2010

గీతాచార్య Says...

ఇవాళ్టికి నేను Atlas Shrugged మొదటి సారి పట్టుకుని ఐదేళ్ళు. అసలా పుస్తకం గురించి నాకు తెలియటమే తమాషాగా జరిగింది. ఆ పుస్తకముందని నాకు తెలిసిప్పటికి పదేళ్ళు కాగా దాన్ని చదవాలని డిసైడ్ అయ్యి ఆరేళ్ళు కావస్తోంది.
ఇంటర్మీడియేట్లో ఉండగా సెక్షన్లకి సంబంధిన ఒక గొడవ చివరికి నేను ఈ నవల చదవటానికి దారి తీసింది. ఫస్టియర్ మేము కొంత మందిమి ఒక కాలేజ్ లో చేరాము. కానీ ఆ కాలేజ్ ని కొన్ని కారణాల వల్ల ఎత్తేశారు. అప్పుడు మేము వేరే కాలేజ్ లో చేరాల్సి వచ్చింది. ఆలస్యంగా చేరామన్న కారణంతో మమల్ని చాలా మందిని డల్లర్స్ సెక్షన్ లో వేశారు. ఎలాగో ఆ ఏడాది పూర్తి చేశాము. డల్లర్స్ అంటే నిజానికి బాగా పట్టించుకోవాలి. ద బెస్ట్ అనే లెక్చరర్స్ ని వాళ్ళకే వేసి బాగా చదివించి మంచి రిజల్ట్ తెప్పించాలి. కానీ వాస్తవంలో దీనికి విరుద్ధంగా జరిగింది(తోంది). రెండో సంవత్సరంలోకి వచ్చాక మాలో కొందరిని మెరిట్ సెక్షన్లోకి పంపారు. ఆ మెరిట్ లిస్ట్ లో నేను లేను. నా ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉంటే నేనొక్కణ్ణే ఈ సెక్షన్లో ఉన్నాను.
అదేరోజు ఇంటికెళ్ళాక పెద్ద గొడవ చేసి నాన్నని కాలేజ్ కి రప్పించి ఒక డైరెక్టర్ తో మాట్లాడించాను. నాన్నతో ఆయన దాదాపూ గంట పైన మాట్లాడి, "మీ వాడు లెక్కల్లో వీక్. ఏవో కొన్ని పర్టిక్యులర్ మోడళ్ళు తప్ప అన్నీ చెయ్యడు. పైగా కాస్త ఎవ్వరినీ లెక్క చెయ్యడు. చూద్దాం. పెద్ద వారు మీరు అడిగారు కనుక ఒక వారం చూద్దాం. ఫీడ్‍బ్యాక్ తీసుకుని లెక్కలాయన మెరిట్ సెక్షన్లో అందుకోగలడనుకుంటే తప్పక పంపిస్తాను," అన్నాడు.
ఇంటికెళ్ళాక నాన్నతో లెక్కల విషయంలో చివాట్లు. నానా అగచాట్లూ పడి లెక్కలాయనని మెప్పించి ఆయనతోనే రికమెండ్ చేయించుకుని మరీ మెరిట్ సెక్షన్లోకి వెళ్ళాననే కానీ, నాకెందుకో అసంతృప్తి. నా సంగతి సరే. మరి ఆ డల్లర్స్ సెక్షన్లో ఉన్న వాళ్ళ సంగతేంటి? వాళ్ళకి చెప్పే లెక్చరర్లు అంత బాగా చెప్పరు. వాళ్ళని ఎక్కువ పట్టించుకోరు కూడా. ఈ తేడా గురించి ఆలో చించి, ఆలోచించి నాకో ఉపాయం తట్టింది. వెంటనే కాలేజ్ ఆశాకిరణం అనుకునేవాణ్ణి ఒప్పించి ఇద్దరం ఎగ్గొట్టాము. ఆరోజు సాయంత్రం కొంత మంది ఫ్రెండ్స్ కలిసి ఎందుకు రాలేదని అడిగారు. (మా ఇద్దరికీ ఏ విషయంలోనూ పడదు. పైగా వాడు నాలా రెగ్యులర్ స్టూడెంట్ కాదు. రోజూ కాలేజ్ కి వస్తుంటాడు). కారణం చెప్పి అందరినీ ఎగ్గొట్టమన్నాము. ఒకరిద్దరు తప్ప వేరేవాళ్ళు ఒప్పుకోలేదు. రెండు రోజులయ్యాక ఆ సెక్షన్లో బాగా చదువుతాడనే పేరున్న కుర్రాడి దగ్గరకు వెళ్ళి మా ఆలోచన చెప్పాము. (ఇక్కడికి ఐదుగురమున్నాము). వాడు ముందు తటపటాయించినా, మేము మామూలుగా ఎగ్గొట్టం లేదనీ, మా ఎగ్గొట్టుడు వెనుక ఒక పర్పస్ ఉందనీ, అది కూడా మా కోసం కాదనీ, వాళ్ళ సెక్షన్ కోసమనీ తెలిశాక/మా మాటలకు కనివిన్స్ అయ్యాక తనే కాదు, ఇంకో ఇద్దరిని ముగ్గులోకి దించాడు. ఎప్పుడూ నాతో తగూ వేసుకునే వాడే నాతో కలిశాక ఇంతకు ముందు అనుమానాలు వ్యక్తం చేసిన మా సెక్షన్ వాళ్ళు కూడా జాయినయ్యారు. 



అలా అలా మొత్తం పాతిక మందిమయ్యాము పది రోజుల్లో ఇళ్ళకు నోటీసులెళ్ళాయి. కాకపోతే మా ఇంట్లో ముందే చెప్పి (ఇంట్లో అంటే నాన్నకి అని అర్థం) ఉండటం వల్ల పెద్ద ప్రాబ్లమ్ కాలేదు. కాకపోతే ఇలా ఎన్నాళ్ళు? దీని వల్ల ఉపయోగం ఏమిటి? ఎప్పటికో ఒక రోజు క్లైమాక్స్ చేరాల్సిందే కదా. అందుకే ఏంచేద్దామని అందరం సమావేశమయ్యాము. అక్కడ చర్చల్లో చాలా మంది నెగటివ్ గానే మాట్లాడారు. మా ప్రయత్నమే తప్పనీ, సెకండియర్లో ఇలాంటి సాహసమే కూడదనీ, ఇంకా ఎగ్గొడితే సిలబస్ అందుకోలేమనీ. ఇంతలో మా సమావేశాన్ని ఒక లెక్చరర్ చూశారు. అది గమనించిన నేను ఆయన్ని ఇంటి దగ్గర కల్సి, మా సమస్యని వినిపించాను. ముందు కాసేప తిట్టినా నా వాదన విన్నాక ఆయన ఎలా ఐనా అందరికీ ఒకే లాంటి కోచింగు వచ్చేలా మాట్లాడతాననీ, రేపటి నుంచీ కాలేజ్ కి రమ్మనీ అన్నారు. 


అలా కాదు సార్. మేమొస్తే మాకు వాయింపుడే తప్ప ఏమీ ఉండదు. ముందు మీరు మాట్లాడండి. సమస్యకి పరిష్కారం వస్తేనే మేము మళ్ళా వస్తామని చెప్పాను. అది పద్ధతి కాదు. రేపు నాతో నువ్వు రా. నేను నీ ఎదురుగానే చెప్తాను. నువ్వు కూడా నీ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చక్కడ. అప్పుడు నువ్వనుకున్నదే జరగొచ్చేమో కదా అని నన్ను తీసుకెళ్ళి డైరెక్టర్లతో సమావేశం పెట్టించారు. ఆరోజంతా అదే గొడవ. కొంత మంది నాకు టీసీ ఇప్పించి పంపాలనే దాకా వెళ్ళారు. నేను మాత్రం కూల్ గా నా ఆర్గ్యుమెంట్ ని వినిపించాను. కనీసం క్లాస్ టాపర్ కూడా కాదు. వాడి మాటకి వాల్యూ ఇస్తారేంటండి అని నన్ను వెనుకేసుకొచ్చిన లెక్చరర్ని విమర్శించారు. 


ఆ మాటన్నాక నాకు నిజంగానే మండింది. అంటే క్లాస్ టాపర్ కాందే మాట్లాడ కూడదా? మిగతా వాళ్ళ కి వాయిస్ ఉండకూడదనా? అదే కదా నా బాధ. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేసి తక్కువ చదువు చెప్తారు. అదే మార్కులెక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ ఫీజు, ఎక్కువ చదువూనా? అందుకే కోపంగా, "పావలా ఫీజోడికి ముప్పావలా చదువా? అదే ముప్పావలా చదువోడికి పావలా ఫీజా? బాగానే ఉంది. చదివే వాడికి ప్రోత్సాహం అనుకుందాము. 


"కాకపోతే నాకో డౌట్. మీ జురాసిక్ పార్కోళ్ళు (రెసిడెన్షియల్ కాలేజోళ్ళు) చెప్ఫే మాటలేమిటి? సామాన్య విద్యార్థులతో అసామాన్య ఫలితాలనే కదా. మరి మీరు చేస్తోందేమిటి? బాగా చదివే వాళ్ళ మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి, వాళ్ళకు మార్కులు తెప్పించటమేనా? మీ ప్రచారానికి అర్థం?" అని అన్నాను. "డల్లర్స్ అనుకునే వాళ్ళలో కూడా బాగా మార్కులొచ్చే వాళ్ళున్నారు. వాళ్ళలో కూడా ఎంసెట్ ర్యాంకులొచ్చేవాళ్ళుంటారు. మీకు పాఠం చెప్పటం రాక పిల్లని అంటే ఎలా? ఏ స్టూడేంట్ కి ఎలా చెప్పాలో కూడా తెలియందే మీరు ఏమి గురువులు? బాగా చెప్తారనే కదా ఇంతలేసి ఫీజులిచ్చి చేరేది? చదవలేని వాళ్ళని వదిలేసేట్టయితే ఇక్కడే ఎందుకు?"


ఇలా వాదించాను. ఇంతలో నాతో ఉన్న నేస్తులిద్దరు కూడా పేరెంట్స్ తో వచ్చారు. వాళ్ళు లోపలకి వస్తే ఏమవుతుందో తెలిసిన పెద్దలు తలొగ్గి, అందరికీ ఒకే లాంటి కోర్స్ ని ఇస్తామని చెప్పారు. 


నేను పనైన సంతోషంలో బయటకొస్తుంటే ఒక డైరక్టర్ నన్ను ఉండమన్నారు. మిగతా వాళ్ళు వెళ్ళాక. ఏమౌతుందో అని భయ పడుతుంటే ఆయన చిన్నగా నవ్వి, "నువ్వంటే నాకు బాగా మంట. నీ మాటలకీ, చేతలకీ. బాగా arrogant. పైకి మాట్లాడవు కానీ... అది సరే. నువ్విప్పుడు చెప్పిమ్ది బాగానే ఉంది. మాకా ఆలోచన రాలేదు. ఏదేమైనా చేసిన పద్ధతి బాలేకున్నా, చేసింది మంచి పనే," అన్నారు. 


నేను నవ్వుతూ తల పైకెత్తి నించున్నాను. ఆయన కళ్ళలోకి చూస్తూ. ఆయన కొనసాగించారు. "ఇలాగే ఒక నవలలో హీరో చేస్తాడు. అచ్చమ్ ఇలాగే. కాకపోతే అతను నీలా స్టూడెంటు కాదు. ఒక ఫిజిసిస్టు. ఆ పుస్తకంలో ఒక భాగం నా దగ్గర ఉంది. అది నీకిస్తాను. అర్థమవుతుందేమో చూడు." 


ఆయన ఇచ్చిన పుస్తకం పేరు Atlas Shrugged. అది 2000 ఆగస్టు. నేనా పుస్తకాన్ని తీసుకున్నాననే కానీ, నాకు దాని మీద ఆసక్తి కలుగలా. పైగా నన్ను ఒకళ్ళతో కంపేర్ చేస్తే మంట. దాన్నో ప్రక్క పడేశాను. పడేశానంటే ఆయన గిఫ్ట్ ని అగౌరవ పరచటం కాదు. ఆ పుస్తకాన్ని చదవలేదంతే.


2003 లో ఒక ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి సండే స్పెషల్ లో The Fountainhead గురించి వ్రాశారు. "వికాసం" అనే శీర్షిక క్రింద. ఆ వ్యాసం నన్నాకర్షించింది. పైగా Howard Roark కాలేజ్ నుంచీ expel చేయబడటం నా దృష్టిలో ఆ హీరోని గ్లోరిఫై చేసింది. అందులోనే అట్లాస్ ష్రగ్డ్ గురించి చెపుతూ ఆ నవల ప్రపచాన్ని నిజంగానే ష్రగ్ చేసిందని ఉంది. అంతే. నాకా పుస్తకాల మీద ఆసక్తి పెరిగిపోయి, చాలా మందినడిగాను. నాకు తెలిసిన ఎవరూ ఆ పేర్లే వినలేదనీ, ఆ పుస్తకాలు ఇక్కడెక్కడా దొరకవనీ చెప్పారు. అప్పుడప్పుడే ఇంటర్‍నెట్ వాడకం మొదలెడుతున్న నేను గూగుల్ గాదినడిగాను. అలా అట్లాస్ సొసైటీ గురిమ్చి తెలిసింది. అందులో అట్లాస్ ష్రగ్డ్ ప్లాట్ సినాప్సిస్ ఉంటే అది ప్రింటు తీయించుకుని చదవాలని పది రోజులు డబ్బులు సేవ్ చేసి, (మొత్తం పేజీలు పదహారు. అప్పట్లో మా ఊళ్ళో ప్రింటు ఐదు రూపాయలు. బొమ్మలుంటే పదిహేను. రెండు బొమ్మలున్నాయందులో) అది ప్రింటు తీసుకుని చదివాను. నాకా కథ బాగా నచ్చి, ఎలాగైనా నవలని చదవాలని డిసైడ్ అయ్యాను. నా వెతుకులాటలో The Fountainhead సినాప్సిస్ లాంటిదేదీ దొరకలేదు. పైగా ఆ నవల గురించి AS లాగా అర్థమయ్యే సమాచారం దొరకలేదు. దాంతో నాకు Roark కన్నా, గాల్ట్ బాగా దగ్గరయ్యాడు. 

కాలం గిర్రున తిరిగి 2005 విజయవాడ బుక్ ఫెస్టివల్ సమయం. వెళ్ళాలి. వెళ్ళాలి అనుకుంటూ వాయిదాలేసి, చివరకి జనవరి తొమ్మిదిన కదిలాను. కనిపించిన ప్రతి కౌంటర్లో ఆ పేర్లు చెపుతూ తిరిగాను తిరిగాను. విశాలాంధ్రాలో అడిగితే వాడు కాస్త గట్టిగానే విసుక్కున్నాడు. కాస్త అసభ్య కరమైన పదం కూడా వాడాడు. అప్పుడే డిసైడ్ అయ్యా. ఎలాగైనా విశాలాంధ్రాలో రాండ్ పుస్తకాన్ని కొనాలని. మధ్యలో కొన్ని పుస్తకాలు కొనుక్కుంటూ నవోదయా వాళ్ళ స్టాల్ దగ్గరకెళ్ళి పాత కథ మొదలెట్టాను. అక్కడో పెద్దాయన, "బాబూ ఆ పుస్తకాన్ని ఇందాకన జ్యోతీ బుక్ డిపోలో చూశాను." అని ఆ స్టాల్ నంబరు చెప్పారు. 


అంతే. టైటానిక్ టికెట్లు గెల్చుకున్న జాక్ డాసన్ లా గంతులేస్తూ పరిగెత్తాను ఆ స్టాల్ దగ్గరకు. తీరా వెళ్ళాక TF, AS రెండూ ఉన్నాయి కానీ రేటు మాత్రం 264. నా దగ్గర ఉంది 169. ఎలా? ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న పుస్తకాలు. ఆలోచించి ప్రీతికి ఫోను చేసి, ఓ రెండొందలు పట్టుకొస్తే, వచ్చే నెల్లో ఇస్తానన్నాను. రెండొందలు లేవు కానీ, వందైతే ఇప్పుడే వస్తానంది. సరే. ఏదోకటి. అసలు లేకుండే దానికన్నా ఏదోకటి తీసుకుంటే సరి అని ఓకే అన్నాను. ఇంతకీ దేన్ని తీసుకోవాలి? ప్రీతీ వచ్చెసరికి పావు గంట పడుతుంది. ఆలోగా ఆలోచించి, రెండు పుస్తకాలనీ తీసుకుని అటు తిప్పీ, ఇటు తిప్పీ, చివరకి ఏడొందల పేజీలు కూడా లేని (694) TF కన్నా వెయ్యి పేజీల పైన (1069) ఉన్న AS బెటరని దాన్నే డిసైడయ్యా. అలా ఈ జనవరికి AS దొరికి ఐదేళ్ళైంది. So, this is a celebration time. 5 years of Atlas Shrugged.

కొసమెరుపేంటంటే... ఈ నవలని నేను 169 రోజులు చదివితే కానీ పూర్తి కాలేదు (జీర్ణించుకుంటూ).

*** *** ***


ఈ నవలలోని ప్రధాన పాత్ర, లెజండరీ కారక్టర్ (హూ ఈజ్... అనే ప్రశ్నతో అజరామరంగా నిల్చిన జాన్ గాల్ట్ గురించి గీతాచార్య రాసిన చిరు వ్యాసం ఇక్కడ.

Who is John Galt? అనేది Ayn Rand వ్రాసిన నవల (విశేషణాలు పెట్టలేని నవల) Atlas Shrugged లో తరచూ వినిపించే మాట. ప్రశ్న. దీనికి రకరకాల వ్యాఖ్యానాలున్నాయి. ఆ నవలలో. ఎన్నో కాంట్రడిక్షన్లు, ఎన్నెన్నో ఊహాగానాల మధ్య ఆ సదరు John Galt ని హీరోయిన్ Dagny Taggart కలుస్తుంది. అప్పుడే ఆమెకి సత్యం అవగతం అవుతుంది.
John Galt! Ayn Rand సృష్టించిన characters లో అద్భుతమైనదీ, ఆసక్తికరమైనదీ. అసలింతకీ ఎవరీ John Galt? ఎందుకితనికి అంత ప్రాధాన్యం?
దీనికి సమాధానం...
John Galt ఒక నిరంతర సత్యాన్వేషి. అతని మోటో... "I will never live for the sake of another person, nor ask another person to live for mine."
The world is open to us, and we oughtta explore it.
Moreover, he is The rational being. The truth finder.
Live 'In the Name of the Best Within Us' అని చెప్పగలిగిన గొప్ప సాహసి. తనని తానే మలచుకున్న నిత్య తాపసి.


Thank you,


Srujana Ramanujan

Posted by Srujana Ramanujan Jan 9, 2010

మా ఊరి ఆంజనేయ స్వామి గుడి అంటే మాకు బాగా అభిమానం. ఊళ్ళో ఆంజనేయస్వామి గుళ్ళు ఇంకా ఉన్నా, అసలు ఊరు పుట్టినప్పటి గుడే ఉన్నా కూడా అంతకన్నా ఆంజనేయ స్వామి గుడి అంటే అదే అనుకునేంత ఫేమస్ స్టేషన్ రోడ్డులోని గుడి.

అక్కడి విశేషాలనీ, నా ఙ్ఞాపకాల్నీ కథల రూపంలో మా నరసరావుపేట్రియాటిక్ బ్లాగులో ఇక్కడ.

చదివి ఎలా ఉన్నాయో చెప్పండి.

బ్లాగర్లో వచ్చిన అనూహ్య ఎర్రర్ వల్ల నేను వ్రాసిన ఆంజనేయ స్వామి గుడి కథ పోయింది. దాన్ని, డిలీట్ కాక ముందు వరకూ వచ్చిన వ్యాఖ్యలతో సహా ప్రచురించాము. గమనించ గలరు. అసౌకర్యం కలిగిస్తే సారీ :-)

Posted by గీతాచార్య Jan 5, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!