BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

Showing posts with label Philosophy. Show all posts
Showing posts with label Philosophy. Show all posts

ఒకసారి పేపర్లో న్యూస్ చూసి అలాగే కూచుండిపోయాను. లినెట్ వచ్చి పిలిచిందాకా అందులో చూసిన విషయం గురించే నా ఆలోచన. అసలు ఆటగాళ్ళు దేని కోసమని ఆడుతారు? దేనికోసమని ఆడాలి? 

డబ్బా? పేరా? అభిమానులకోసమనా? ఆత్మ తృప్తికోసమనా? ఇవేవీ కాకుండా మరేదైనా ఉన్నదా? 

ఒక ఇండియన్ క్రికెట్ అభిమాని తల పగిలి రక్తం కారుతున్న ఫొటో నేనప్పుడు చూసింది. క్రికెట్ కోసం గంగవెర్రులెత్తే జనమున్న దేశమది. క్రికెట్ ఒక మతం, క్రికెట్ ఒక భాష, క్రికెట్ ఒక జీవన విధానం. కులం కోసమనీ, మతం గురించనీ, డబ్బూ హోదాల తేడాలున్నా కూడా "స్కోరెంత?" అన్న ఒక్క మాట మాత్రం అందరినీ ఒక్కటిగా చేస్తుంది. 

ఉక్కబోత వాతావరణం, విపరీతమైన హ్యుమిడిటీ, కడుపెప్పుడు ఖరాబెప్పుడౌతుందో తెలియని పరిస్థితులు, అబ్బో, తొలిసారి అక్కడికి వెళ్ళినప్పుడు మహా ఇబ్బందులెదురయ్యాయి. డీన్ (జోన్స్) కొట్టిన రెండొందల (విఖ్యాత టైడ్ టెస్ట్) గురించి మేమిప్పటికీ ఎందుకంత గొప్పగా చెప్తామంటే ఆ పరిస్థితులలాంటివి మరి. రాను రానూ పరిస్థితులు మారాయి. కానీ ఇక్కడి అభిమాన జనం, వారి ఆశల్లో మాత్రం మార్పులేదు. 

ఆటంటే వారికి ప్రాణం. క్రికెట్ ని ఇంతలా అభిమానించిన వాళ్ళు వేరెక్కడా నాకు కనబడలేదు. వారి ఆ అభిమానమే నాకు వారంటే గౌరవభావాన్ని పెంపొందించింది. దెబ్బలు తిని ఏడ్చుకుంటూ వెళ్ళే అభిమానుల్ని చూసే ఉంటాను. క్తమోడేలా కొట్టే పోలీసుల్నీ చూసి ఉండొచ్చు. కానీ ఆ కుర్రాడిని చూసినప్పుడు కలిగిన ఆవేదన మాత్రం వర్ణనాతీతం. నెత్తి మీద జుట్టుతో ఇండియా బొమ్మ హెయిర్ స్టైల్. త్రివర్ణాలున్నాయి.

ఎందుకు వాళ్ళు అంత తయారయి వచ్చేది? గుర్తింపు కోసమా? ఆట మీద మోజుతోనా? సరదా కోసమా? 

తమ జట్టు గెలిస్తే చూడాలని. తమ అభిమాన ఆటగాడు సెంచురీలు కొడితే చూడాలని, వికెట్లు పడగొడితే కేరింతలు కొట్టాలని. అంత ఖర్చు పెట్టుకుని వస్తున్నది స్టేడియాలకు, తమ జట్టు గెలిస్తే చూడాలని మాత్రమే. ఓడిపోవటమ్మీద వారికసలు ఆలోచన ఉండదు. కేవలం తమ జట్టు గెలవటమ్మీద మాత్రమే వారి దృష్టి. 

అలాంటి అభిమానుల్ని, వారి ఆలోచనలని చూస్తే మేము ఆడాల్సింది కేవలం గెలవటానికే. ఆడినా, ఓడినా మా డబ్బు మాకొస్తుంది. మా జీవితమే క్రికెట్. మాకది తప్ప వేరే లోకం లేదు. కానీ వారికి? వారి జీవితాలున్నాయియి. వారి పన్లున్నాయి. కానీ, అవన్నీ మానుకుని, కేవలం మా కోసం... అంటే తమ అభిమాన ఆటగాళ్ళ కోసం వారు స్టేడియాలకు తరలి వస్తారు. మేము గెలవాలనే.

అందుకనే నేను ఆడేప్పుడు, ఓటమి అంచున ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆ అభిమానులూ, వారి ఆకాంక్షలు. డబ్బే ప్రధానం కాదు. ఒక ఎలక్ట్రానిక్ గా౨డ్జెట్ను కొనే ముందు ఎన్నో ఆరాలు తీస్తాము. పెర్ఫామెన్స్ బాగుంటుందా లేదా అని వంద ప్రశ్నలు వేస్తాము. పెట్టిన ప్రతి డాలర్కూ ఫలితాన్ని పొందగలిగామా లేదా అని ఆలోచిస్తాము. సంవత్సరాలు తీసే సినిమాల భవితవ్యాన్ని కేవలం ఒక్క క్షణంలో తేలుస్తాము. ఎందుకు పెట్టిన పైసకు తగిన పతిఫలం ముట్టిందా లేదా అని. మరలాంటిది మేము ఆడినప్పుడు చూడాలని వచ్చిన జనం పెట్టిన ఖర్చుకు ప్రతిఫలాన్ని ఇస్తున్నామా? 

నా దగ్గరకు వచ్చే యువ ఆటగాళ్ళకు నేను ఈ ఫొటోనే చూపుతాను. పేరూ డబ్బూ సరే, వాటంతట అవే వస్తాయి. కానీ, అభిమానులు వచ్చేది మాత్రం మనం గెలిస్తే చూడాలని మాత్రమే. అందుకే ఆడాల్సింది కేవలం గెలవటానికి మాత్రమే. గెలవాలంటే మనమాడాల్సింది తిరుగు లేని విధంగా. తిరుగులేని ఆటగాడంటే ఎవరికైనా గౌరవమే. అందుకే Play to win. Rest follows. రక్తం ఓడుతున్న ఆ అభిమానిని గుర్తుకు తెచ్చుకోండి. టికెట్ కోసమతను పడ్డ కష్టాన్ని గురించి ఆలోచించండి. ఎండనకా, ఆననకా అతను క్యూలలో నిలబడి మరీ వచ్చేదెందుకా అని ఒక్క క్షణమాలోచించండి. తన విలువైన సమయాన్ని వృధా చేసుకునేది, ఒక విజయాన్ని చూడాలని మాత్రమే. ఆ ప్రతిఫలాన్ని అతనికి దక్కించండి. 

మరి మా తృప్తో అంటారా? గెలవటంలో ఉన్న తృప్తి డబ్బు వల్ల కూడా రాదు. అయినా ఆ విషయాలను మళ్ళా కలిసినప్పుడు...

(ఈసారి సెహ్వాగ్స్ 195).

This one is abridged slightly. Full version in English will be published later :)



Posted by గీతాచార్య Oct 22, 2010


బ్లాగర్ తృష్ణ గారు దసరా శుభాకాంక్షలు చెప్తూ పెట్టిన స్కెచ్ బాగుందనిపించింది. అందుకే అలంటిదేదన్నా ఉంటే B&G కోసమని ఇవ్వమని అడిగాను. వెంటనే ఈ స్కెచ్ గీసి పంపారు. Woman in curves...


చూసి ఎలా ఉన్నదో చెప్పండి... :)

మదిలో ఆలోచనల సుడి గాలి
రేపిందొక వడ గాలి

ప్రశ్నల మీద ప్రశ్నలు
సమాధానాల నెవరి నడగాలి?

జవాబు దొరకక తిరుగుతున్న నాకు 
కనిపించిందొక అంగన
కలిగించింది సాంత్వన
చూపింది నా ఆలోచనలకొక పొంతన

పేరడిగాను
అన్నది కదా...

తెలియదా నేనెవరో
అవుతానా వేరెవరో
నీ అంతరంగాన్ని
అనంత జీవన సారాన్ని


అంటూ మొదలయ్యే నా "ప్రశ్నాంగన" అనే కవితకు చక్కగా సరిపోతుందీ స్కెచ్. అందుకే ఇక్కడ కవిత మొదలునిస్తున్నాను.

అడిగిన వెంటనే స్పందించి చక్కని స్కెచ్ నిచ్చిన తృష్ణ గారికి ధన్యవాదాలు. ThankQ Sis

Posted by గీతాచార్య Oct 19, 2010

Ayn Rand అద్భుతమైన డ్రామా ద నైట్ ఆఫ్ జాన్యువరి సిక్స్టీన్త్ గురించి మన B&G లో ఇంతకు మునుపే ఒక సమీక్ష వ్రాశాను. సెన్స్ ఆఫ్ లైఫ్ గురించి, మొరాలిటీ ఆఫ్ కంపీటెన్సీ గురించీ, ఒక మర్డర్ మిస్టరీతో మేళవించి, ఆద్యంతం చదివించేలా ఉన్న ఈ డ్రామా అనుకోకుండా నెట్లో సెర్చుతుంటే నా కంట పడ్డది. దాన్ని ఇక్కడ పంచుకోవాలని...
లింకందుకోండి ఇక్కడ

ఎంత కాలముంచుతానో తెలియదు మరి!

Don't miss the best of the thriller dramas. And that too by Ayn Rand.


Rating... 4.5 outta 5

Posted by గీతాచార్య Jun 27, 2010

పాత రోజులు __ గతాన్ని గుర్తుకు తెచ్చి ఆనందాన్ని కలిగించేవి.

పాత సంగతులు __ తీరిక వేళళ్లో నెమరువేసుకునే మధుర జ్ఞాపకాలు.

పాత సంఘటనలు __ నేటివారికి గొప్పగా చెప్పుకునే అద్భుత ఘట్టాలు.

పాత మనుష్యులు __ అనుభవాల ఘనులు.

పాత ఆహారపు అలవాట్లు __ ఆధునిక కాలానికి వర్తించే ఆరోగ్యపరమైనవి.

పాత హృదయాలు __ మోసం,కల్మషాలు తెలీనీ స్వచ్చతకు నిలయాలు.

పాత చదువు __ వ్యక్తి వికాసానికి,మనుగడకు తోడ్పడేవి.

పాత పండుగలు __ సాంప్రదాయబద్దమై ఆరోగ్య రక్షణకు తోడ్పడేవి.

పాత వస్తువులు __ నాణ్యత,మన్నికలను కలిగి ఎంతో విలువైనవి.

పాత పాటలు __ శ్రవణానందాన్ని, ప్రశాంతతను కల్గించేవి.

పాత ఫ్యాషన్స్ __ నేటి కొత్త పోకడలకు మూలం.

పాత సామెతలు __ శాశ్వత జీవిత సత్యాలు.

పాత కట్టడాలు __ గత వైభవ చిహ్నాలు.

పాత రోజులు __ గతాన్ని గుర్తుకు తెచ్చి ఆనందాన్ని కలిగించేవి.

పాత సంగతులు __ తీరిక వేళళ్లో నెమరువేసుకునే మధుర జ్ఞాపకాలు.

పాత సంఘటనలు __ నేటివారికి గొప్పగా చెప్పుకునే అద్భుత ఘట్టాలు.

పాత మనుష్యులు __ అనుభవాల ఘనులు.

పాత ఆహారపు అలవాట్లు --- ఆధునిక కాలానికి వర్తించే ఆరోగ్యపరమైనవి.

పాత హృదయాలు __ మోసం,కల్మషాలు తెలీనీ స్వచ్చతకు నిలయాలు.

పాత చదువు __ వ్యక్తి వికాసానికి, మనుగడకు తోడ్పడేవి.

పాత పండుగలు __ సాంప్రదాయబద్దమై ఆరోగ్య రక్షణకు తోడ్పడేవి.

పాత వస్తువులు __ నాణ్యత,మన్నికలను కలిగి ఎంతో విలువైనవి.

పాత పాటలు __ శ్రవణానందాన్ని, ప్రశాంతతను కల్గించేవి.

పాత ఫ్యాషన్స్ __ నేటి కొత్త పోకడలకు మూలం.

పాత సామెతలు __ శాశ్వత జీవిత సత్యాలు.

పాత కట్టడాలు __ గత వైభవ చిహ్నాలు.

Posted by జ్యోతి Jun 25, 2010



నన్నసలు కదిలించ వద్దు. పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాను. Except on emergencies, don't even try to message me. అని గట్టిగా అందరికీ వార్ణింగిచ్చి, ఏమన్నా B&G వ్యవహారాలుంటే నువ్వే చూసుకో, అని ధన కి అప్పగించాక ఓ రెండు గంటల క్రితం వరకూ నాకే డిస్టర్బెన్స్ లేదు. ఇందాకన హట్ఃఆత్తుగా నా ఫోన్ మ్రోగుతుంటే చాలాసార్లు కట్ చేశాను. ఇక లామ్భం లేదనుకున్నాడో ఏమో, మెస్సగెన్ పెట్టాడు ధన, Veturi died. Shall we post anything అని. 

ఏమి చేద్దాము? సంతాపం తెలుపుదామా? అందరూ చేస్తున్నదదే కదా! అయినా వయసు దాటిపోయింది. మాట కూడా సరిగ్గా రావటం లేదు, అని ఈ మధ్యే కదా అనుకున్నది. మనిషిని మనం మిస్సవుతాము నిజమే కానీ, దానికి బాధ పడటమంటే ఆ మనిషిని అవమానించటమే (అదెలాగో మా మోటార్‍సైకిల్ డైరీస్ లో చదువుదురు). 

నువ్వు నీ స్టైల్లో చెపుతావు సరే. అదందరికీ అర్ధం కాదు కదా. నువ్వేమి చెయ్యాలనుకుంటున్నావో అది చెప్పు అన్నాడు.

ఆయన వల్ల నాకు తెలిసిన సత్యాన్నో, జరిగన మేలునో, లేదా నన్ను ఇన్స్పైర్ చేసిన అంశాన్నో అందరికీ చెపుదాము. అదే ఆయనకు నివాళి. మనిషి లేడని బాధ పదటం కాదు. ఆ మనిషి లెగసీని (తెలుగుభాషాభిమానీస్ ఎవరన్నా ఉంటే నా భాషకు అభ్యంతరం చెప్పుద్దు. అది నా సహజమైన భాష. వాడుకలో ఎక్కువ ఆంగ్ల పదాలు దొర్లుతుంటాయి. అవసరమైన సందర్భాల్లో ఒక్క ఆంగ్ల పదం లేకుండా కూడా వ్రాయగలను)

సరే ఆలోచిస్తే ఒకటనిపించింది. వేటూరంటే నాకు గుర్తొచ్చేది ఒకే పాట. అది అర్జున్ సినిమాలోని సంభవామీ పాట. అందులోనూ, మనసు ఉంటే మార్సు దాకా మార్గముందీ చలో (చూశారా సందర్భాన్ని బట్టీ ఆయనా అలాగే వ్రాశారు ;-)) అన్న మాటలు నాకు బాగా నచ్చినవి. అందుకే ఆ పాటను ఇన్స్టెంట్ నివాళిగానూ, నాకు తీరుబాటయ్యాక ఈ పాట గురించిన పెద్ద ఎనాలిసిస్ తో ఇంకా పెద్ద నివాళినీ అర్పిస్తాను.
*** *** ***

WE MISS VETURI. BUT NOT HIS GREAT WORK. ITZ ALWAYS IN OUR HEART.


సంభవామీ సంభవామీ
సాగరాలే దాటిపోనీ
అంబరాలే అంటుకోనీ
సంభవామీ

ఒక్క మాటా ఒక్క బాణం ఒక్కటేలే గురి
ఒక్క చూపుకి దిక్కులన్ని పిక్కటిల్లే ఝరి - ఝరి
ఓటమంటు లేని వాడు ఒక్కడైన సరి
ఓ మనసు ఉంటే మార్సు దాకా మార్గముంది చలొ
చల్రే చలొ చల్రే చలొ
చల్రే చలొ చల్రే చలొ

free ur mind free ur soul
see what u find and take control
high high through the sky through the sky fly high
through the sky fly
through the sky fly high fly
one word one shoot
i am here to stay

చుక్కలు దించెయ్ చక చకా
హక్కులు మనవే పద పదా
రెక్కల గుర్రం ఎక్కిపో
ఆ గగనాన్నే ఏలుకో
స్వాగతం అనదినం గీతికా
జాబిలికే కధచెపుదాం
వెన్నెలతో జతకడదాం
సాహసం చెయ్యర ఇంకా ఢింబకా
చినుకులనే జోడిద్దాం
చేడుగుడునే ఆడేద్దాం
ఆకాశంలో భూకంపాలే సంభవం
సర్వం నీకే సంభవం
రోధసీ నీ ప్రేయసే లే

పరుగులు పెట్టే గంగను ఉరికే కృష్ణ తొ కలపరా
నదులే కాదు యదలను కలిపేస్తేనే గేలుపురా
జీవితం equatorలొ స్నేహితం
స్వరములతో జతకడదాం
శరములతో గురిపేడదాం
యవ్వనం is equal to అద్భుతం
మనసల్లే పరిగెడదాం
మనిషల్లే నిలబడదాం
వేగం వేగం అంతా వేగం సంభవం
సర్వం నీకే సంభవం
ఊర్వశి నీ ప్రేయసేలే

*** *** ***

వేటూరి ఫొటో పెడదామని వెతికితే గూగుల్లో మంచివి, అంటే నాకు నచ్చినవి, దొరకలేదు. అందుకో వేరే ఏదో బ్లాగులో ఈ పాట స్కాన్ దొరికింది. మనిషి కన్నా ఆ మనిషి లెగసీ ఎక్కువనుకున్నాం కదా. :D అందుకే ఆయన వ్రాసిన పాట బొమ్మనే ఇక్కడ పెట్టేద్దాం అనుకున్నా. ఇక ముందు కనబడని ఆయన రూపమెందుకు? శాశ్వతమైన ఆయన పాట ఉండగా. 

పిక్చర్ మీద బ్లాగడ్రస్సు ఉంది. ఆ బ్లాగు వారికి ధన్యవాదాలతో...

Posted by గీతాచార్య May 23, 2010

Iది కొంత మందికి తెలిసిన నా పాత బ్లాగు కాదు. చాలా రోజుల క్రితం నేను వ్రాసుకున్న టపా. అలాని రిపీటింగూ కాదు.
ముందు ఈ ఆకుపచ్చని అక్షరాల్లో ఉన్న దాన్ని చదవండి. తరువాత అసలు విషయం చెపుతాను... :-)

Who is John Galt? అనేది Ayn Rand వ్రాసిన నవల (విశేషణాలు పెట్టలేని నవల) Atlas Shrugged లో తరచూ వినిపించే మాట. ప్రశ్న. దీనికి రకరకాల వ్యాఖ్యానాలున్నాయి. ఆ నవలలో. ఎన్నో కాంట్రడిక్షన్లు, ఎన్నెన్నో ఊహాగానాల మధ్య ఆ సదరు John Galt ని హీరోయిన్ Dagny Taggart కలుస్తుంది. అప్పుడే ఆమెకి సత్యం అవగతం అవుతుంది.

John Galt! Ayn Rand సృష్టించిన characters లో అద్భుతమైనదీ, ఆసక్తికరమైనదీ. అసలింతకీ ఎవరీ John Galt? ఎందుకితనికి అంత ప్రాధాన్యం?

దీనికి సమాధానం...

John Galt ఒక నిరంతర సత్యాన్వేషి. అతని మోటో... "I will never live for the sake of another person, nor ask another person to live for mine."

The world is open to us, and we oughtta explore it.

Moreover, he is The rational being. The truth finder.

Live 'In the Name of the Best Within Us' అని చెప్పగలిగిన గొప్ప సాహసి. తనని తానే మలచుకున్న నిత్య తాపసి.

Atlas Shrugged మీద కొన్ని ప్రత్యేకమైన వ్యాసాలు అందాయి.వాటికి ప్రిల్యూడ్ గా ఉంటుందని ఇది ఇక్కడ ఇచ్చాను. అవన్నీ మరో వారంలో ఒక వరుసలో ప్రచురింపబడుతాయి. 

Note: I thank Srujana for acquiring those articles, and also for the Atlas picture

Posted by గీతాచార్య May 20, 2010

రేయ్ శరత్తూ! కాస్త నన్ను ఇంటిదాకా దింపరాకిరణ్ అడిగాడు.

ఒరే నాకు డబుల్స్ రాదురా. శరత్ అన్నాడు.

ఏముందిలేరా. నేను తొక్కుతాను. నువ్వు వెనకాల కూచో. మా ఇల్లు మీ ఇంటి కెళ్ళే దారే కదా. సరిపోతుంది. కిరణ్ నచ్చజెప్పాడు.

సరే! అలాక్కానీ. అని శరత్ సైకిల్ వెనుక కూచుని అలా లిఫ్టిచ్చాడు.
***   ***   ***  

ఏరా శరత్తూ! ఇందాకన నీ సైకిల్ని తొక్కిందెవర్రా? గోపాల్ బాబాయడిగాడు.

మా ఫ్రెండ్ కిరణ్ బాబాయ్. శరత్ అన్నాడు.

ఇంకెప్పుడూ వాడికి లిఫ్టివ్వకు. నిన్ను కూచోబెట్టి వాడే సైకిల్ తొక్కేస్తాడు. నువ్వు చవటల్లే వెనక్కూచోవాలి.

అలాగే బాబాయ్! శరత్ కాస్త నొచ్చుకుంటూ బెరుకు బెరుగ్గా అన్నాడు.
***   ***   ***

రేయ్ శరత్తూ! కాస్త నన్ను ఇంటి దాకా దింపరా. కిరణ్ అన్నాడు.

కాసేపు కిందా మీదా పడ్డాక శరత్ అన్నాడు. సరే రా! వెనక్కూచో.

అదేంట్రా! నీకు డబుల్స్ రాదుగా? కిరణ్ అన్నాడు.

వచ్చులేరా. నేర్చుకున్నాను. శరత్ సమాధానం చెప్పాడు.
***   ***   ***

ఏరా శరత్తూ! ఆ కిరణ్ గాడు మహరాజులా వెనక కూచుంటే నువ్వు రిక్షా వాడిలా ముందు కూచుని సైకిల్ తొక్కుతా వాడికి లిఫ్టిస్తూ... గోపాల్ బాబాయ్ అన్నాడు.

దీనికి సమాధానంగా శరత్ ఏమన్నాడు? ఏమి చేశాడు?

నీతి: ఇంకెప్పుడూ సైకిల్ వాడ కూడదు. :D

Posted by గీతాచార్య May 7, 2010

యాడ్జనులకు ఉండాలి వక్షపాతాలు,
పురోగతికై కూడదు పక్షపాతాలు.

గురజాడ రచియించిన ముత్యాల సరాలు,
నీ గొంతులో పలికే తేనెలొలుకు స్వరాలు.

సుకవులకుంటుంది కవితావేశం,
నాకిపుడే కలిగింది భవితావేశం.

చిన్న వాడి చేతిలో ఎర్ర గులాబీలు,
కేసీయార్ ఢిల్లీల నడిపేది లాబీలు.

వయారి భామల హంస నడకలు,
వీధి వీధినా ఆకలి కేకలు.

Posted by గీతాచార్య Apr 30, 2010

ఫ్రెండ్స్ తో చాట్లో ఉండగా అలా అలవోగ్గా వచ్చిన నాలుగు మాటలు ఒక చిన్న కవితలా అనిపిస్తే ఇలా పెట్టేస్తున్నాను. బాగుందో లేదో మీరే చెప్పాలి మరి :-)

ఏదో అనుకుంటాము కానీ, 
చచ్చిపోతే మనకొచ్చేదేమీ లేదు

మనకర్థం కాదు కానీ, 
బ్రతికుంటే పోయేదీ లేదు


కవితిచ్చిన ఫ్రెండ్స్ కి కృతఙ్ఞతలు.







చివరలో మరో ఫ్రెండ్ చేసిన కొనసాగింపు చిన్న తవిక ;-)

పోయేదేమీ లేదంటే,
వచ్చేదేదో ఉందనేగా,
రాజుగారి పెద్ద భార్యా :D

Posted by గీతాచార్య Apr 27, 2010


వినగానే శ్రీవైష్ణవుల గుండెలుప్పొంగుతాయి. 

భగవద్రామానుజుల వారి తిరు నక్షత్రమిది. 

అసలు రామానుజ దాసన్ ఏమిటి? మనమేమన్నా ఆయనకు దాసులమా? అని చిన్నప్పుడనుకునే వాడిని. మరీ ట్రెడిషనల్ వ్యవహారం మన వాళ్ళదంతా... ఈ బొట్లూ, శిఖలూ, ఏంటీ గోల అనుకున్నా కూడా. సరే ఇవన్నీ వదిలేద్దాం. ఏదైనా విషయం నాకు సమ్పూర్ణంగా అవగతమైతే తప్ప నేనా విషయాన్ని ఎక్కువ పట్టించుకోను. అసలు పాటించను.

రామానుజుల వారి గురించి నాకు సంపూర్తిగా అవగతమయ్యేదాకా, వారిని గురించి ఒక గొప్ప వ్యక్తి ద్వారా తెలుసుకునే దాకా నాకా ఆలోచన కలుగ లేదు. ఎందుకాయనను నేను తెలుసుకోలేక పోయానా అని. ఆయనలోని అసలు గొప్పతనం గురించి.

ఇంతకీ నాకు అర్థమయ్యింది ఏమిటి? ఆయన నుంచీ నేను నేర్చుకున్నది ఏమిటి?

1. తప్పు చేస్తే, చెప్పితే, వారు ఎంత పెద్దలైనా ఎదిరించి అయినా సరే సత్యాన్ని నిర్ధారితం చెయ్యాలి. 

2. నిరంతర సత్యాన్వేషణలో మునిగి ఉండాలి. ఏ విషయమైనా సమ్పూర్తిగా అవగతం చేసుకోవలసినది మనమే. మనని వేరొకరు ఉద్ధరించరు. మనలను ఉద్ధరించుకోవలసినది మనమే. 

3. అంతిమ సత్యం కొరకు ఎంతటి త్యాగమైనా చేయాలి. మనకు తెలిసిన ఉపయుక్తమైన సత్యాన్ని (సత్యమే ఉపయుక్తమైనది :-)) నలుగురికీ పంచాలి. తిరు మంత్రార్థాన్ని నలుగురికీ పంచిన ఉదాహరణ. 

4. అడియేన్ రామానుజ దాసన్ = అన్వేషించు, సాధించు, ఆచరించు. (నిరంతరం సత్యాన్వేషణలో నిమగ్నమయి, సత్యాన్ని సాధించి ఆచరణలో పెట్టటం). వీటి గురించి మరింత వివరంగా ఎప్పుడైనా ఏక్ నిరంజన్! బ్లాగులో చూద్దాము.

As far as I know, He is the greatest Rationalist. 

కేవలం ఒక మతాచార్యుడే కాదాయన. సంఘ సమ్స్కర్త. అన్యులని ఇతరులు దూరం పెట్టిన వారికి ఆలయ ప్రవేశార్హత కల్పించిన ఘనత ఆయనది. సమ్ప్రదాయాలను పాటిస్తూనే ఆధునికతను అందిపుచ్చుకోవాలని తెలియజెప్పిన మహోన్నతుడాయన. సామర్థ్యముంటే, పాండిత్యముంటే, ప్రతిభ ఉంటే, వారు ఎవరైనా, ఎంత చిన్న వారైనా గౌరవార్హులే అని తన జీవితంలో ఎన్నో మార్లు తెలియజెప్పిన భగవద్రామానుజుల వారికి వన్దనాలతో...

అడియేన్ రామానుజ దాసన్!
అన్వేషిస్తాను, సాధిస్తాను, ఆచరిస్తాను.



Posted by గీతాచార్య Apr 20, 2010

నిన్న ఎంబ్రియో ఆత్మ కథ మొదలెట్టాక కాస్త రీసెర్చ్ మొదలెట్టాక తగిలిన వివిధ జంతువుల ఎంబ్రియోలు (ఎందుకో పిండాలు అన్న మాట నచ్చక ఇలా. తెలుగు భాషాభిమానీస్ అర్థం చేసుకోగలరు) కనిపించాయి. వాటినిక్కడ ఇలా పంచుకుందామని...

                                                         ఇది లియొనార్డో డా విన్చీ వేసిన చిత్రం.

                                                            రకరకాల ఎంబ్రియోల కంపారిజను

                                                  ఎలకెంబ్రియో. అచ్చం ఎలుక మొహం అదీనూ...

                                                    బ్యాటెంబ్రియో, అనగా గబ్బిలమన్నమాట

                                          శునకెంబ్రియో. కాస్త నయం లెండి. ఐనా తెలుస్తూనే ఉంది.

                                    డాల్ఫిను వారి ఇంటి బిడ్డ కాబోయే వీరిని చూడండి. ఎలా ఉన్నారో

                                                                డాల్ఫిను వారే ఇక్కడానూ

                                             మరో శునకెంబ్రియో. అచ్చు కుక్క మొహం అదీనూ

                          మర్కటెంబ్రియో. దాని కోతి మొహం అదీనూ. మరీ పోలికలెలా ఉన్నాయో చూడండి...

                                                               చెప్పుకోండి చూద్దాం!

                                                                   మానవ పిండం

                                                                      గజెంబ్రియో

                                                      కవలలు. ఎంత ముద్దుగా ఉన్నారో...

                                                                    అమ్మ బొజ్జలో

అండ పిండ బ్రహ్మాండాన్నీ తనలో ఇముడ్చుకునే అమ్మతనానికి జోహార్లతో...!

Posted by గీతాచార్య Apr 15, 2010

ప్యాషన్ ఫర్ సినిమాలో నేను వ్రాసిన మూవీ రివ్యూ పబ్లిష్ ఐంది. చూసి ఎలా ఉందొ చెప్పండి. దీనిలో ఇంకో విశేషం ఉంది. ఈ సినిమా గురించి నేను గత సంవత్సరం నవతరంగం లో వ్రాశాను. అది చూసి బాగుందనుకుని అందులోని ఒక ఆతర్ నన్ను అక్కడ కూడా వ్రాయమని ప్రోత్సహిస్తే వ్రాసినది. అందులో వ్రాసిన దానికీ, నవతరంగంలో వ్రాసిన దానికీ చాల తేడా ఉంది. కానీ రెండూ వ్రాసినందుకు నాకు చాలా శాటిస్ఫాక్షన్ వచ్చింది.

లింక్ ఇదిగోండి... ప్యాషన్ ఫర్ సినిమా

నవతరంగం

Posted by గీతాచార్య Apr 14, 2010

జీవితంలో గాలీ, నీళ్ళూ, తిండీ తిప్పలే కాకుండా కంప్యూటర్ ఎలా విస్తరించి పోయిందో చూడండి. ఒక నవ్వేసుకోండి.






And this is the best.......the above one!


ఒక ఫ్రెండ్ పంపిన మెయిల్ ఆధారంగా! ఇప్పటికే చూసుంటే సరే, చూడకపోతే పొట్ట చెక్కలు చేసుకోండి మరి!

Posted by సుజాత వేల్పూరి Mar 15, 2010

Kathryn Bigelow ఆస్కార్ పొందిన మొదటి మహిళా దర్శకురాలు. (అవార్డు పొందటం పైన నాకు కొన్ని ఇబ్బండులున్నాయనుకోండి). నాకు అర్థం కాక ఇబ్బంది పెట్టిన విషయమొకటుంది. 

ఓ ఆస్కార్ల సందడి మొదలైనప్పటి నుండీ చూస్తున్నాను. ఈ మీడియోకరోళ్ళు కామెరాన్ భార్య, కామెరాన్ భార్య అంటున్నారు కానీ, The Hurt Locker దర్శకురాలు అన్న పాపాన పోలేదు. సమయం వచ్చిన ప్రతిసారీ, అదే కూత. పైగా ఇవాళ అంధ కోతి పత్రికలో హెడ్డింగు చూశాక ఇక ఆగలేక పోయాను. కాలేజ్ లైబ్రరీలో ఉన్నా  పెద్దగా నవ్వేసి ఇటు వచ్చాను. ఒక మహిళా ఆస్కార్ని తొలిసారి దర్శకత్వ విభాగంలో పొందటం గొప్ప విషయం. (ఈ సారిచ్చిన ఆస్కార్లలో నాకు నచ్చనివి కొన్ని ఉన్నాయి. అది వేరే విషయం). అసలు విషయం కన్నా, ఆ సినిమా గొప్పతనం కన్నా, కామెరాన్ భార్య అతని పైన విజయం సాధించినట్టు ఈ సోది హెడ్డిన్గులేంటి? Is n't it ridiculing her talent? Why comparing her victory with other trivial things? అంటే ఆ సినిమాలో విషయం లేదనేగా? :D

బిగెలో దర్శకత్వ ప్రతిభ మీద, ఆమె తీసిన సినిమా గురించిన మాటలు ఒక్కటీ కనపడలా. అసలా సినిమాకి అవార్డులోచ్చే దాకా అటు వైపు మన మీడియోకరోళ్ళు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు మాత్రం బాకాలెక్కువయ్యాయి. అసలా సినిమా గురించిన చర్చ కాకుండా కామెరాన్ భార్య, తొక్కన్నర , మాజీ భర్త పైన మాజీ భార్య విజయం? బిగేలోని అవమానించటం కాదా ఇదంతా? సినిమా నాకూ నచ్చలేదు. నా ఉద్దేశ్యం అవతార్ లేక పోతే ఈ సినిమా గురించి ఆలోచించవచ్చని. కానీ కామెరాన్ భార్య అని పడే పడే ఎత్తి చెప్పటం మాత్రం నా దృష్టిలో బిగెలో ని అవమానించటమే...

కొసమెరుపు: ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో ఇచ్చిన ఒక రివ్యూ చూడండి...

One of the most disconnected, unbelievable war movies, 28 January 2010
5/10
Author: tabuno from utah
This hugely disjointed, unbelievable, and sometimes manipulative movie is one of the biggest disappointments of the year. There are so many plot points that don't really portray the consistent character or relational dynamics that are likely to be found in the circumstances this movie presents - the movie comes across more like a script writer's fantasy than an authentic, compelling, and engaging movie. There are so many predictable, stereotypical subplots as well as loosely thought out script points that the movie betrays a sense of incredibility. The obvious emotive plot points designed to illicit audience sympathy only served to distance not involve the audience. An over-rated movie that uses various plot devices to project a political correct movie in the guise of being anti-establishment. 

ఇవన్నే ప్రక్కన పెట్టేద్దాం. నేను చెప్పేది, అడిగేది ఒకటే... బిగెలో కి ఓన్ ఐడెంటిటీ ఇవ్వలేరా మీడియోకరోళ్ళు?   


Posted by గీతాచార్య Mar 9, 2010



ట్రాజన్ యుద్ధం గురించిన ఈ కథలో నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాల కోసం కాస్త కథా గమనాన్ని మార్చవలసి వస్తున్నది. వీలైనంతలో హోమర్ ఇలియాడ్ ని అనుసరించే వ్రాస్తాను


ప్రోలోగ్:


నా గుర్రానికి అలుపు రావటంతో నేను ఒక చెట్టు నీడన ఆపాను. నా వెనుక వస్తున్న నా అనుచరులు కొందరు నాకు కాస్త దూరాన ఆగారు. మిట్ట మధ్యాహ్నం. ఎండ విపరీతంగా ఉంది. వళ్ళంతా చెమటతో తడిసిపోయింది. నా అనుచరులొక్కక్కరే గుర్రాల మీద నుండీ దిగి చెట్ల నీడన గుర్రాలను కట్టేసి నాకేసి రావటం మొదలెట్టారు. ఈ ప్రయాణమంతా నేను మౌనంగానే ఉన్నాను. నాకీ యుద్ధం ఇష్టం లేదు. కానీ తప్పదు. లేందే నా రాజ్యానికి ముప్పు. పైగా ఈ యుద్ధానికి నేను వెళ్ళ వలసి రావటానికి కారణం కూడా నేనే. ఎందుకంటే నేను చేసిన ప్రతిపాదన వల్లే ఈ పని చేయవలసి వస్తున్నది. 

కానీ ఈ యుద్ధానికి వెళ్ళటానికి నాకు మనస్కరించటం లేదు. మామూలుగా ఐతే ప్రయాణాలంటే నాకు చాలా ఇష్టం. చిన్నతనంలో ఎన్నో సాహస కృత్యాలు చేశాను. ఎన్నో యాత్రలు చేశాను. ఇప్పుడు పాతికేళ్ళ వాడిని. వివాహం జరిగింది. ప్రేమను పంచే భార్య ఉంది. ముద్దులొలికే చిన్నారి పుతృడున్నాడు. వృద్ధుడయిన తండ్రిని చూసుకోవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంది. యుద్ధాలంటూ దేశాలు పట్టుకుని తిరుగితే నా రాజ్యంలో ఉన్న అంతర్గత శతృవులు నా రాజ్యాన్ని చేజిక్కించుకోవచ్చు. అందుకే ఎలాగైనా ఈ యుద్ధాన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేశాను. ఇక తప్పక వెళ్ళవలసిన పరిస్థితిని కల్పించి నన్ను రప్పించారు. మొత్తం గ్రీకు రాజ్యాలన్నిటిలో ఉన్న యోధులు అందరూ ఈ యుద్ధానికి సన్నాహాలు చేస్తుంటే ఒక ఆడంగిలా నేను యుద్ధాన్ని మానుకుని కూచున్నానంటే నాకు ఎంత బలమైన కారణముందో అర్థమవుతుందనుకుంటాను. కానీ ఆగమెమ్నాన్ నాకో బృహత్తరమైన బాధ్యతనప్పగించటానికి రప్పించాడు. సైన్యం పరంగా, సైన్యం పరంగా, ప్రస్తుతమున్న నా శారీరక మానసిక పరిస్థితులను బట్టీ యుద్ధంలో నేనంత గొప్ప సహకారిని కాలేక పోవచ్చు. అలా అని నేనేమీ యోధుడను కాకుండా పోను. ఏజాక్స్ తరువాత అంతటి యోధుడిని నేనే. నేను నా పూర్తి శక్తి సామార్థ్యాలతో పోరాడితే నా ముందు శతృవులు నిలువజాలరు. కానీ జీవతమంతా ఈ పోరాటాలకు సరిపుచ్చాల్సిందేనా? ఈ ఆలోచన నన్ను వేధిస్తున్నదీ మధ్య.

అఖిలీస్ (Achilles)!

గ్రీకుల్లోనే కాదు, ప్రపంచంలోనే నాకు తెలిసినంతలో అలాంటి యోధుడు లేడు. వేయ నౌకల్లో గ్రీకు వీరులంతా ట్రాయ్ మీద యుద్ధానికి సన్నద్ధులౌతుంటే, ఇద్దరు మాత్రం యుద్ధ సన్నాహక శిబిరం వద్ద లేరు. యుద్ధం తప్పించుకోవాలనుకున్న నేను, అసలు యుద్ధం గురించి తెలియనే తెలియని అఖిలీస్.

ఆగమెమ్నాన్ కీ అఖిలీస్ కీ అసలు పడదు. యుద్ధ కాంక్ష, సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఎక్కువగా ఉన్న ఆగమెమ్నాన్ ప్రతి దాన్నీ, దేశ భక్తి క్రింద జమకడతాడు. అదే అఖిలీస్ కేవలం తన సామర్థ్యాన్ని చాటటానికీ, తన శౌర్య పరాక్రమాలకు అమరత్వాన్ని కల్పించటానికే యుద్ధం చేస్తాడు. అతని క్రింద మిర్మిడాన్లనే సుశిక్షితులైన వేయి మంది పైన యోధులున్నారు. అతని మాట జవదాటరు. వారు, అఖిలీస్ ఆధ్వర్యంలో ఎవరి పక్షాన యుద్ధంలో తలపడితే వారే విజయ లక్ష్మినందుకుంటారు. అందుకే గ్రీకులకు ఏ కష్టమొచ్చినా, యుద్ధం చేయాల్సి వచ్చినా అఖిలీస్ కోసం చూస్తారు.

ఈసారి అతని ఆచూకీ తెలియలేదు. అందుకోసమే నన్ను అతనిని వెతకమని పంపారు. ఎక్కడని వెతుకను? దారీతెన్నూ లేకుండా వెళుతున్న నాకు ఎథీనా (Pallas Athene/Athena) దక్షిణ దిశగా వెళ్ళమని చెప్పింది. అలా నా ఈ ప్రయాణం మొదలైంది. నా సైనికుల్లో కొందరిని నా వెంట ఉంచుకుని, మిగిలిన వారిని ఏజాక్స్ ఆధ్వర్యంలో ఉంచి, ఇలా వచ్చాను. 
***   ***   ***

"Sometimes you have to serve in order to rule"

1. ముచ్చట గొలిపిన వీరుడు

ఎథీనా చెప్పిన గుర్తులున్న ప్రదేశానికి చేరే సరికి నాతో బయలుదేరిన ఎనిమిది మంది అనుచరుల్లో కేవలమిద్దరే మిగిలారు. ఇద్దరిని ఒక వార్త తెలియజేయటానికి స్పార్టా పంపగా, నలుగురు మరణించారు. తీరా ఇక్కడకు వచ్చాక (నగర పొలిమేరలను సమీపించిన సందర్భంలో) అఖిలీస్ రానంటే? మొదలే ఆగమెమ్నాన్ కీ అఖిలీస్ కీ పడదు. అఖిలీస్ ఇంకా తమతో చేరకపోవటం గురించి ఆగమెమ్నాన్ చిర్రు బుర్రులాడుతూనే అతని గురించి వ్యంగ్యమైన మాటలను మాట్లాడుతున్నాడు..

నేను చేరకు ముందు నన్ను గురించియన్న మాటలను డయామీడీస్ చెప్పగా విన్నాను. నా ముందే అఖిలీస్ ని యుద్ధం తప్పించుకోజూస్తున్న చవట దద్దమ్మగా జమగట్టి మాట్లాడాడు. ఇంకా ఇంకా మాటలన్నాడు. అయినా చివరకు అతనికి ఆఖిలీస్ కావలసి వచ్చాడు. ఈ ఆలోచనల్లో నేనుండి నగరం వైపు అడుగులు వేస్తుంటే రివ్వున వచ్చిన బాణమొకటి నాకు అరంగుళం ప్రక్కనుంచీ దూసుకుని వెళ్ళింది. 

"దూరాన నించుని బాణాలు వేయటం కాదు. నీ వీరత్వాన్ని ప్రదర్శించాలంటే నాతో ద్వంద్వ యుద్ధానికి రా," అని కేక వేశాను నా గుర్రం పై నుండే.

"ఎవరు నీవు?" అంటూ ఒక తాడు సహాయంతో అందమైన బాలిక నా ముందు నిలుచుని కరవాలాన్ని తీసి నా వైపు చూపిస్తూ, యుద్ధానికి సన్నద్ధమే అని సైగ చేసింది. పదహారేళ్ళుంటాయేమో. ఆ ధైర్యానికీ, ఆ కత్తి పట్టుకున్న తీరుకీ అచ్చెరువొందాను. గ్రీకు స్త్రీలలో ఇంత అందమైన యోధురాలుందాని. ఉంటే నాకు తెలియును కదా.కీర్తి ప్రతిష్టలు వ్యాపించటం ఎమ్త సేపు. పైగా ఇదేమీ అఙ్ఞాత భూభాగమేమీ కాదు. మధ్యధరా సముద్ర దేవత థెటీస్ నడయాడు నేల. ఖచ్చితంగా ఎవరో పురుషుడే మారు వేషంలో ఉన్నారని గ్రహించాను. యుద్ధం చేయనిదే నన్ను ముందుకు కదలనివ్వనని బలవంత పెట్టటంతో నాకు కత్తి దూయక తప్పలేదు. ప్రయాణపు బడలికతో, పరిస్థితులను బట్టీ నిర్వేదంలో ఉన్న నేను చాలాసేపు పోరాడినా చివరకు ఓతమి బారిన పదబోతున్నా. ఇతన్ని/ఈమెను గెలిస్తేనేగానీ నాకు నగర ప్రవేశం దొరకదు. ఓడితే వెనుదిరగాలని నియమం పెట్టబడింది. 

కత్తి వేటు నుండీ తప్పించుకుని కాస్త ప్రక్కగా ఆగి మరల రాబోతున్న నన్ను జూసి, "పేరు జెప్పి శరణు వేడు. కనికరించి నగరములోనికి తీసుకుబోతాము," నన్న ప్రతిపాదన చేయబడింది. "పేరుజెప్పి శరణు వేడటం యోధుల లక్షణం కాదు. కాచుకో వస్తునాను," అని మీదకు వెళ్ళి తన కత్తి ధాటికి నా కత్తిపి అడ్డు ఉంచి, "అడుగో అఖిలీస్..." అని అరచాను. ఆ భామ వెనక్కి తిరిగి చూసే క్షణంలో కలిగిన ఏమరుబాటును సొమ్ముజేసుకుంటూ కత్తిని ఎగుర గొట్టాను. ఆశ్చర్యం, కోపంతో నావైపు దూసుకు రాబోతున్న సమయంలో ఒక ఎత్తైన భవనం లోంచీ వచ్చిన స్త్రీ మూర్తి అంది ఆ పిల్లతో, "ఆయనెవరో తెలుసా? ఆయన పైన కత్తిదూస్తావా? ఆయన ఇథాకా నగరాధీశుడు యూలిసీజ్."

ఆ పిల్ల ఆశ్చర్యానందాలతో రెండడుగులు వెనక్కు వేసి, "ఆఁ యూలిసీజ్? అంటే ఆడీశ్యజ్ అని మారు పేరు గల ఇథాకా నగర మహారాజా?" అంది.

(సశేషం)

Posted by గీతాచార్య Feb 3, 2010

గీతాచార్య Says...

ఇవాళ్టికి నేను Atlas Shrugged మొదటి సారి పట్టుకుని ఐదేళ్ళు. అసలా పుస్తకం గురించి నాకు తెలియటమే తమాషాగా జరిగింది. ఆ పుస్తకముందని నాకు తెలిసిప్పటికి పదేళ్ళు కాగా దాన్ని చదవాలని డిసైడ్ అయ్యి ఆరేళ్ళు కావస్తోంది.
ఇంటర్మీడియేట్లో ఉండగా సెక్షన్లకి సంబంధిన ఒక గొడవ చివరికి నేను ఈ నవల చదవటానికి దారి తీసింది. ఫస్టియర్ మేము కొంత మందిమి ఒక కాలేజ్ లో చేరాము. కానీ ఆ కాలేజ్ ని కొన్ని కారణాల వల్ల ఎత్తేశారు. అప్పుడు మేము వేరే కాలేజ్ లో చేరాల్సి వచ్చింది. ఆలస్యంగా చేరామన్న కారణంతో మమల్ని చాలా మందిని డల్లర్స్ సెక్షన్ లో వేశారు. ఎలాగో ఆ ఏడాది పూర్తి చేశాము. డల్లర్స్ అంటే నిజానికి బాగా పట్టించుకోవాలి. ద బెస్ట్ అనే లెక్చరర్స్ ని వాళ్ళకే వేసి బాగా చదివించి మంచి రిజల్ట్ తెప్పించాలి. కానీ వాస్తవంలో దీనికి విరుద్ధంగా జరిగింది(తోంది). రెండో సంవత్సరంలోకి వచ్చాక మాలో కొందరిని మెరిట్ సెక్షన్లోకి పంపారు. ఆ మెరిట్ లిస్ట్ లో నేను లేను. నా ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉంటే నేనొక్కణ్ణే ఈ సెక్షన్లో ఉన్నాను.
అదేరోజు ఇంటికెళ్ళాక పెద్ద గొడవ చేసి నాన్నని కాలేజ్ కి రప్పించి ఒక డైరెక్టర్ తో మాట్లాడించాను. నాన్నతో ఆయన దాదాపూ గంట పైన మాట్లాడి, "మీ వాడు లెక్కల్లో వీక్. ఏవో కొన్ని పర్టిక్యులర్ మోడళ్ళు తప్ప అన్నీ చెయ్యడు. పైగా కాస్త ఎవ్వరినీ లెక్క చెయ్యడు. చూద్దాం. పెద్ద వారు మీరు అడిగారు కనుక ఒక వారం చూద్దాం. ఫీడ్‍బ్యాక్ తీసుకుని లెక్కలాయన మెరిట్ సెక్షన్లో అందుకోగలడనుకుంటే తప్పక పంపిస్తాను," అన్నాడు.
ఇంటికెళ్ళాక నాన్నతో లెక్కల విషయంలో చివాట్లు. నానా అగచాట్లూ పడి లెక్కలాయనని మెప్పించి ఆయనతోనే రికమెండ్ చేయించుకుని మరీ మెరిట్ సెక్షన్లోకి వెళ్ళాననే కానీ, నాకెందుకో అసంతృప్తి. నా సంగతి సరే. మరి ఆ డల్లర్స్ సెక్షన్లో ఉన్న వాళ్ళ సంగతేంటి? వాళ్ళకి చెప్పే లెక్చరర్లు అంత బాగా చెప్పరు. వాళ్ళని ఎక్కువ పట్టించుకోరు కూడా. ఈ తేడా గురించి ఆలో చించి, ఆలోచించి నాకో ఉపాయం తట్టింది. వెంటనే కాలేజ్ ఆశాకిరణం అనుకునేవాణ్ణి ఒప్పించి ఇద్దరం ఎగ్గొట్టాము. ఆరోజు సాయంత్రం కొంత మంది ఫ్రెండ్స్ కలిసి ఎందుకు రాలేదని అడిగారు. (మా ఇద్దరికీ ఏ విషయంలోనూ పడదు. పైగా వాడు నాలా రెగ్యులర్ స్టూడెంట్ కాదు. రోజూ కాలేజ్ కి వస్తుంటాడు). కారణం చెప్పి అందరినీ ఎగ్గొట్టమన్నాము. ఒకరిద్దరు తప్ప వేరేవాళ్ళు ఒప్పుకోలేదు. రెండు రోజులయ్యాక ఆ సెక్షన్లో బాగా చదువుతాడనే పేరున్న కుర్రాడి దగ్గరకు వెళ్ళి మా ఆలోచన చెప్పాము. (ఇక్కడికి ఐదుగురమున్నాము). వాడు ముందు తటపటాయించినా, మేము మామూలుగా ఎగ్గొట్టం లేదనీ, మా ఎగ్గొట్టుడు వెనుక ఒక పర్పస్ ఉందనీ, అది కూడా మా కోసం కాదనీ, వాళ్ళ సెక్షన్ కోసమనీ తెలిశాక/మా మాటలకు కనివిన్స్ అయ్యాక తనే కాదు, ఇంకో ఇద్దరిని ముగ్గులోకి దించాడు. ఎప్పుడూ నాతో తగూ వేసుకునే వాడే నాతో కలిశాక ఇంతకు ముందు అనుమానాలు వ్యక్తం చేసిన మా సెక్షన్ వాళ్ళు కూడా జాయినయ్యారు. 



అలా అలా మొత్తం పాతిక మందిమయ్యాము పది రోజుల్లో ఇళ్ళకు నోటీసులెళ్ళాయి. కాకపోతే మా ఇంట్లో ముందే చెప్పి (ఇంట్లో అంటే నాన్నకి అని అర్థం) ఉండటం వల్ల పెద్ద ప్రాబ్లమ్ కాలేదు. కాకపోతే ఇలా ఎన్నాళ్ళు? దీని వల్ల ఉపయోగం ఏమిటి? ఎప్పటికో ఒక రోజు క్లైమాక్స్ చేరాల్సిందే కదా. అందుకే ఏంచేద్దామని అందరం సమావేశమయ్యాము. అక్కడ చర్చల్లో చాలా మంది నెగటివ్ గానే మాట్లాడారు. మా ప్రయత్నమే తప్పనీ, సెకండియర్లో ఇలాంటి సాహసమే కూడదనీ, ఇంకా ఎగ్గొడితే సిలబస్ అందుకోలేమనీ. ఇంతలో మా సమావేశాన్ని ఒక లెక్చరర్ చూశారు. అది గమనించిన నేను ఆయన్ని ఇంటి దగ్గర కల్సి, మా సమస్యని వినిపించాను. ముందు కాసేప తిట్టినా నా వాదన విన్నాక ఆయన ఎలా ఐనా అందరికీ ఒకే లాంటి కోచింగు వచ్చేలా మాట్లాడతాననీ, రేపటి నుంచీ కాలేజ్ కి రమ్మనీ అన్నారు. 


అలా కాదు సార్. మేమొస్తే మాకు వాయింపుడే తప్ప ఏమీ ఉండదు. ముందు మీరు మాట్లాడండి. సమస్యకి పరిష్కారం వస్తేనే మేము మళ్ళా వస్తామని చెప్పాను. అది పద్ధతి కాదు. రేపు నాతో నువ్వు రా. నేను నీ ఎదురుగానే చెప్తాను. నువ్వు కూడా నీ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చక్కడ. అప్పుడు నువ్వనుకున్నదే జరగొచ్చేమో కదా అని నన్ను తీసుకెళ్ళి డైరెక్టర్లతో సమావేశం పెట్టించారు. ఆరోజంతా అదే గొడవ. కొంత మంది నాకు టీసీ ఇప్పించి పంపాలనే దాకా వెళ్ళారు. నేను మాత్రం కూల్ గా నా ఆర్గ్యుమెంట్ ని వినిపించాను. కనీసం క్లాస్ టాపర్ కూడా కాదు. వాడి మాటకి వాల్యూ ఇస్తారేంటండి అని నన్ను వెనుకేసుకొచ్చిన లెక్చరర్ని విమర్శించారు. 


ఆ మాటన్నాక నాకు నిజంగానే మండింది. అంటే క్లాస్ టాపర్ కాందే మాట్లాడ కూడదా? మిగతా వాళ్ళ కి వాయిస్ ఉండకూడదనా? అదే కదా నా బాధ. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేసి తక్కువ చదువు చెప్తారు. అదే మార్కులెక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ ఫీజు, ఎక్కువ చదువూనా? అందుకే కోపంగా, "పావలా ఫీజోడికి ముప్పావలా చదువా? అదే ముప్పావలా చదువోడికి పావలా ఫీజా? బాగానే ఉంది. చదివే వాడికి ప్రోత్సాహం అనుకుందాము. 


"కాకపోతే నాకో డౌట్. మీ జురాసిక్ పార్కోళ్ళు (రెసిడెన్షియల్ కాలేజోళ్ళు) చెప్ఫే మాటలేమిటి? సామాన్య విద్యార్థులతో అసామాన్య ఫలితాలనే కదా. మరి మీరు చేస్తోందేమిటి? బాగా చదివే వాళ్ళ మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి, వాళ్ళకు మార్కులు తెప్పించటమేనా? మీ ప్రచారానికి అర్థం?" అని అన్నాను. "డల్లర్స్ అనుకునే వాళ్ళలో కూడా బాగా మార్కులొచ్చే వాళ్ళున్నారు. వాళ్ళలో కూడా ఎంసెట్ ర్యాంకులొచ్చేవాళ్ళుంటారు. మీకు పాఠం చెప్పటం రాక పిల్లని అంటే ఎలా? ఏ స్టూడేంట్ కి ఎలా చెప్పాలో కూడా తెలియందే మీరు ఏమి గురువులు? బాగా చెప్తారనే కదా ఇంతలేసి ఫీజులిచ్చి చేరేది? చదవలేని వాళ్ళని వదిలేసేట్టయితే ఇక్కడే ఎందుకు?"


ఇలా వాదించాను. ఇంతలో నాతో ఉన్న నేస్తులిద్దరు కూడా పేరెంట్స్ తో వచ్చారు. వాళ్ళు లోపలకి వస్తే ఏమవుతుందో తెలిసిన పెద్దలు తలొగ్గి, అందరికీ ఒకే లాంటి కోర్స్ ని ఇస్తామని చెప్పారు. 


నేను పనైన సంతోషంలో బయటకొస్తుంటే ఒక డైరక్టర్ నన్ను ఉండమన్నారు. మిగతా వాళ్ళు వెళ్ళాక. ఏమౌతుందో అని భయ పడుతుంటే ఆయన చిన్నగా నవ్వి, "నువ్వంటే నాకు బాగా మంట. నీ మాటలకీ, చేతలకీ. బాగా arrogant. పైకి మాట్లాడవు కానీ... అది సరే. నువ్విప్పుడు చెప్పిమ్ది బాగానే ఉంది. మాకా ఆలోచన రాలేదు. ఏదేమైనా చేసిన పద్ధతి బాలేకున్నా, చేసింది మంచి పనే," అన్నారు. 


నేను నవ్వుతూ తల పైకెత్తి నించున్నాను. ఆయన కళ్ళలోకి చూస్తూ. ఆయన కొనసాగించారు. "ఇలాగే ఒక నవలలో హీరో చేస్తాడు. అచ్చమ్ ఇలాగే. కాకపోతే అతను నీలా స్టూడెంటు కాదు. ఒక ఫిజిసిస్టు. ఆ పుస్తకంలో ఒక భాగం నా దగ్గర ఉంది. అది నీకిస్తాను. అర్థమవుతుందేమో చూడు." 


ఆయన ఇచ్చిన పుస్తకం పేరు Atlas Shrugged. అది 2000 ఆగస్టు. నేనా పుస్తకాన్ని తీసుకున్నాననే కానీ, నాకు దాని మీద ఆసక్తి కలుగలా. పైగా నన్ను ఒకళ్ళతో కంపేర్ చేస్తే మంట. దాన్నో ప్రక్క పడేశాను. పడేశానంటే ఆయన గిఫ్ట్ ని అగౌరవ పరచటం కాదు. ఆ పుస్తకాన్ని చదవలేదంతే.


2003 లో ఒక ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి సండే స్పెషల్ లో The Fountainhead గురించి వ్రాశారు. "వికాసం" అనే శీర్షిక క్రింద. ఆ వ్యాసం నన్నాకర్షించింది. పైగా Howard Roark కాలేజ్ నుంచీ expel చేయబడటం నా దృష్టిలో ఆ హీరోని గ్లోరిఫై చేసింది. అందులోనే అట్లాస్ ష్రగ్డ్ గురించి చెపుతూ ఆ నవల ప్రపచాన్ని నిజంగానే ష్రగ్ చేసిందని ఉంది. అంతే. నాకా పుస్తకాల మీద ఆసక్తి పెరిగిపోయి, చాలా మందినడిగాను. నాకు తెలిసిన ఎవరూ ఆ పేర్లే వినలేదనీ, ఆ పుస్తకాలు ఇక్కడెక్కడా దొరకవనీ చెప్పారు. అప్పుడప్పుడే ఇంటర్‍నెట్ వాడకం మొదలెడుతున్న నేను గూగుల్ గాదినడిగాను. అలా అట్లాస్ సొసైటీ గురిమ్చి తెలిసింది. అందులో అట్లాస్ ష్రగ్డ్ ప్లాట్ సినాప్సిస్ ఉంటే అది ప్రింటు తీయించుకుని చదవాలని పది రోజులు డబ్బులు సేవ్ చేసి, (మొత్తం పేజీలు పదహారు. అప్పట్లో మా ఊళ్ళో ప్రింటు ఐదు రూపాయలు. బొమ్మలుంటే పదిహేను. రెండు బొమ్మలున్నాయందులో) అది ప్రింటు తీసుకుని చదివాను. నాకా కథ బాగా నచ్చి, ఎలాగైనా నవలని చదవాలని డిసైడ్ అయ్యాను. నా వెతుకులాటలో The Fountainhead సినాప్సిస్ లాంటిదేదీ దొరకలేదు. పైగా ఆ నవల గురించి AS లాగా అర్థమయ్యే సమాచారం దొరకలేదు. దాంతో నాకు Roark కన్నా, గాల్ట్ బాగా దగ్గరయ్యాడు. 

కాలం గిర్రున తిరిగి 2005 విజయవాడ బుక్ ఫెస్టివల్ సమయం. వెళ్ళాలి. వెళ్ళాలి అనుకుంటూ వాయిదాలేసి, చివరకి జనవరి తొమ్మిదిన కదిలాను. కనిపించిన ప్రతి కౌంటర్లో ఆ పేర్లు చెపుతూ తిరిగాను తిరిగాను. విశాలాంధ్రాలో అడిగితే వాడు కాస్త గట్టిగానే విసుక్కున్నాడు. కాస్త అసభ్య కరమైన పదం కూడా వాడాడు. అప్పుడే డిసైడ్ అయ్యా. ఎలాగైనా విశాలాంధ్రాలో రాండ్ పుస్తకాన్ని కొనాలని. మధ్యలో కొన్ని పుస్తకాలు కొనుక్కుంటూ నవోదయా వాళ్ళ స్టాల్ దగ్గరకెళ్ళి పాత కథ మొదలెట్టాను. అక్కడో పెద్దాయన, "బాబూ ఆ పుస్తకాన్ని ఇందాకన జ్యోతీ బుక్ డిపోలో చూశాను." అని ఆ స్టాల్ నంబరు చెప్పారు. 


అంతే. టైటానిక్ టికెట్లు గెల్చుకున్న జాక్ డాసన్ లా గంతులేస్తూ పరిగెత్తాను ఆ స్టాల్ దగ్గరకు. తీరా వెళ్ళాక TF, AS రెండూ ఉన్నాయి కానీ రేటు మాత్రం 264. నా దగ్గర ఉంది 169. ఎలా? ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న పుస్తకాలు. ఆలోచించి ప్రీతికి ఫోను చేసి, ఓ రెండొందలు పట్టుకొస్తే, వచ్చే నెల్లో ఇస్తానన్నాను. రెండొందలు లేవు కానీ, వందైతే ఇప్పుడే వస్తానంది. సరే. ఏదోకటి. అసలు లేకుండే దానికన్నా ఏదోకటి తీసుకుంటే సరి అని ఓకే అన్నాను. ఇంతకీ దేన్ని తీసుకోవాలి? ప్రీతీ వచ్చెసరికి పావు గంట పడుతుంది. ఆలోగా ఆలోచించి, రెండు పుస్తకాలనీ తీసుకుని అటు తిప్పీ, ఇటు తిప్పీ, చివరకి ఏడొందల పేజీలు కూడా లేని (694) TF కన్నా వెయ్యి పేజీల పైన (1069) ఉన్న AS బెటరని దాన్నే డిసైడయ్యా. అలా ఈ జనవరికి AS దొరికి ఐదేళ్ళైంది. So, this is a celebration time. 5 years of Atlas Shrugged.

కొసమెరుపేంటంటే... ఈ నవలని నేను 169 రోజులు చదివితే కానీ పూర్తి కాలేదు (జీర్ణించుకుంటూ).

*** *** ***


ఈ నవలలోని ప్రధాన పాత్ర, లెజండరీ కారక్టర్ (హూ ఈజ్... అనే ప్రశ్నతో అజరామరంగా నిల్చిన జాన్ గాల్ట్ గురించి గీతాచార్య రాసిన చిరు వ్యాసం ఇక్కడ.

Who is John Galt? అనేది Ayn Rand వ్రాసిన నవల (విశేషణాలు పెట్టలేని నవల) Atlas Shrugged లో తరచూ వినిపించే మాట. ప్రశ్న. దీనికి రకరకాల వ్యాఖ్యానాలున్నాయి. ఆ నవలలో. ఎన్నో కాంట్రడిక్షన్లు, ఎన్నెన్నో ఊహాగానాల మధ్య ఆ సదరు John Galt ని హీరోయిన్ Dagny Taggart కలుస్తుంది. అప్పుడే ఆమెకి సత్యం అవగతం అవుతుంది.
John Galt! Ayn Rand సృష్టించిన characters లో అద్భుతమైనదీ, ఆసక్తికరమైనదీ. అసలింతకీ ఎవరీ John Galt? ఎందుకితనికి అంత ప్రాధాన్యం?
దీనికి సమాధానం...
John Galt ఒక నిరంతర సత్యాన్వేషి. అతని మోటో... "I will never live for the sake of another person, nor ask another person to live for mine."
The world is open to us, and we oughtta explore it.
Moreover, he is The rational being. The truth finder.
Live 'In the Name of the Best Within Us' అని చెప్పగలిగిన గొప్ప సాహసి. తనని తానే మలచుకున్న నిత్య తాపసి.


Thank you,


Srujana Ramanujan

Posted by Srujana Ramanujan Jan 9, 2010



గీతాచార్య SAYS...

చాలా కష్టపడి సంపాదించిన పుస్తకం. దానికి తగ్గ మజానే, అనుభూతినే, ఆలోచనలే నాకు కలిగించింది.

ఆ పుస్తకం పేరు 'పెంట్ హౌస్ లెజెండ్'. అది రచయిత పెట్టుకున్న, మనసు పడ్డ పేరు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒక తలుస్తాడు అనేది మనకందరికీ తెలిసిందే. అలా ఆ పుస్తకం పేరు 'Night of January 16th' గా మారి పోయింది. చివరికి అలాగే స్థిరపడి పోయింది.

ఆ కథ కూడా ఇంకో క్రొత్త కథ. దాని గురించి తెలుసుకోవాలన్నా ఈ పుస్తకాన్ని చూడాల్సిందే.

'Night of January 16th' ఒక డ్రామా. కోర్ట్ రూమ్ లో నే ప్రారంభం అయి అందులోనే కొనసాగి అందులోనే ముగిసే అద్భుతమైన డ్రామా. దీనికున్న ప్రత్యేకత ముగింపు మనకిష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. మన మనసుకి ఎలా అనిపిస్తే... కాదు కాదు. మన మనోఫలకం పైన ఎలాంటి భావాలు ఉంటాయో అలాంటి ముగింపుని మనం ఇవ్వవచ్చు. అందుకే ఇది మన మనసు చిత్రాన్ని మనకే గీసి చూపే చిత్రకారుని వంటి పుస్తకం.

కథ ఏమిటంటే... (డ్రామా ప్రధానాంశం) Bjorn Faulkner అనే ఒక bussinessman తన ఇన్వెస్టర్లని ముంచేస్తాడు. ఇంతలో అతను ఆత్మహత్య చేసుకుంటాడు, కానీ అది ఆత్మహత్య కాదు. అతనిని అతని మాజీ ప్రియురాలు Karen Andre చంపిందని ఆమెని accuse చేస్తారు. ఆ murder trial trial ఈ డ్రామా ప్రధానాంశం.

డ్రామా అంతటిలోనూ హీరో/విలన్ (మన మనసుని, మన జీవిత దృక్కోణాన్నీ అనుసరించి) ఐన Bjorn Faulkner కనపడ్డు. కానీ కథాంశం అంతా అతని మీదే. A sense of life గురించే, అతని జీవన గమనం ఆధారం గా రచయిత్రి వివరిస్తుంది.

డ్రామా అంతా for/against సాక్షుల విచారణ, చివరికి తీర్పు అంతే. వేరే ఏమీ ఉండదు.

తీర్పుని ఆ రోజుల్లో ప్రేక్షకులలోనుంచీ select చేసిన jury ఇచ్చే విధం గా ఉండేది. మన చదవటానికి మాత్రం ఆ తీర్పు మనమే ఇవ్వాలి.

for/against వాదనలు రెండూ చాలా balanced గా రెండువైపులా నిష్పాక్షికంగా ఉండటం లో..., ఎక్కడా 'చదువరి'/ప్రేక్షకుని influence చేయని విధం గా మలుచటం లో రచయిత్రి విజయం సాధించిందని అనటం చాలా చిన్న మాట. (అసలు ఇలాంటి వాటిని స్త్రీలే సమర్ధంగా వ్రాయగలరు. ఒప్పుకుని తీరాలి).

మన తీర్పు మన జీవన దృక్పథాన్ని అనుసరించే ఉండాలని రచయిత్రి నియమం పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన value judgments ని ఒక్క క్షణం లో నిర్ణయించుకోవటమే. The metaphysics of our life at a glance. Decisions are made quick. హహహ.

ఇందులో ఒక అద్భుతమైన dialogue ఉంది. దాన్ని చదివి మనం ఈ పుస్తకాన్ని చదవాలా లేదా అని నిర్ణయించుకోవచ్చు.

"మనిద్దరిలో ఒకరే నిజం చెపుతున్నారు. అదెవరో మనిద్దరికీ తెలుసు." The greatest ever metaphysical statement in a crime drama I ever read.

Heroin/Villain Karen Andre, మొదటి act చివరిలో విలన్/హీరోయిన్ Nancy Lee Faulkner తో అంటుంది.

Artist తన కళని with liberty స్వీకరించే అవకాశాన్ని ఇవ్వటం చాలా అరుదు. ఆ అవకాశాన్ని మనకి Ayn Rand ఇచ్చింది. ఇక చదవటం మనదే ఆలశ్యం.

విన్నపం: నా రీవ్యూ చూసి మాత్రం ఎవరూ పుస్తకాన్ని చదవవద్దు. మీ judgement మీద depend అయి చదవండి. అదే రచయిత్రికీ, నాకూ ఇష్టం. లేనిదే ఆ పుస్తకం యొక్క లక్ష్యం నెరవేరదు.


హెచ్చరిక: "It's not a question of right or wrong. It's only whether you can do it or not."

అనేది కథకి ఆయువు పట్టు లాంటి dialogue. దాని గురించి రచయిత్రి వ్రాసిన ముందు మాట చదివితే మనకి అర్ధం అవుతుంది. లేకుంటే అపార్ధం అవుతుంది. అందులోనూ ఈ మధ్య జరిగిన సంఘటనలని చూశాక.



వివరం: ఈ పుస్తకం చాలా అరుదుగా దొరుకుతున్నది. కానీ entertainment, thrill, లేదా నిజంగానే మన గురించి తెలుసుకునే ఆసక్తితోనైనా చదవాలంటే ఈ literary master piece కోసం WALDEN (హైదరాబాద్) లో లేదా చెన్నై spencers లోనైనా ట్రై చేయవచ్చు.

ఈ డ్రామా గురించి మరికొన్ని వివరాలకోసం వేచి చూడండి.

చైతన్య కల్యాణి.

Posted by Anonymous Jan 4, 2010



క్షీరగంగ బ్లాగర్ రచయిత శ్రీధర్ గారు ఇచ్చిన ఆణిముత్యం...

నిందాస్తుతులు మన తెలుగుసాహిత్యంలో చాలా ఉన్నాయి. స్తుతులు చేసి చేసి ఆలసి, సొలసిపోయిన భక్తులు దైవసహాయాన్నో లేక దైవసాక్షాత్కారాన్నో కోరి వాటిని పొందలేని నిస్సహాయ స్థితిలో కడుపు మండి చేసిన ఆర్తనాదాలుగా వాటిని పరిగణించవచ్చు. అలాటిదే కంచెర్ల గోపన్న(రామదాసు) కీర్తన “సీతమ్మకి చేయిస్తి చింతాకు పతకము---“ అన్నదాన్ని చెప్పుకోవచ్చు.

అలా కాకుండా సామాజికస్పృహతో సంఘవిద్రోహ శక్తులు విజృంభించి చేసిన సర్వనాశనాన్ని చూడలేక, నిరంకుశుడైన కవి హృదయస్పందన దావానలమై పొంగి పొరలగా వచ్చిన నిందాస్తుతి మన తెలుగు సాహిత్యంలో ఒకటుంది. “శతృసంహార! వేంకటాచల విహార!” అనేది.ఈ శతకంలో 98 పద్యాలు ఉన్నాయి. చివరి రెండు దొరకకపోవడం వల్ల కవి పేరు తెలియదు. అయితే కవి, “ననుబోటి బాపడైనను,” అన్నాడు కాబట్టి ఇతడు తప్పకుండా బ్రాహ్మణుడై వుంటాడు. పైగా “దేవ! నీ సొమ్ము గట్టిగాఁదిన్న కవిని గాన” అన్నాడు కాబట్టి ఇతడు ఆలయోద్యోగియో లేక అర్చకుడో అయి ఉండాలి.. ” అకట! లలాట శూన్యము పాపమెట్లు మానగనేర్తు నుదుటను నామమిడక!” అన్నాడు గనక, అతడు వైష్ణవుడుని చెప్పవచ్చు.

తురుష్కులు దేవాలయాల లో ప్రవేశించి దేవుళ్లను బ్రద్దలు చేసారు. జిగురు పాలకని రావిమ్రాకులను నజ్జు నజ్జుగా కొట్టారు. వైష్ణవుల పట్టి నామములు నాకినారు. బ్రహ్మణులపిల్ల జూట్టు పీకినారు. తిరుమలయ్యా! నీవిదంతా చూస్తున్నావు గదయ్యా? అని నొచ్చుకొంటాడు.అదే! ఆ వేదనలోంచే వచ్చిందొక పద్యం.చూడండి.

సీ:-
వడిగుళ్లు సొచ్చి దేవళ్ల బద్దలు చేసి> థట్టించి తేజీలఁ గట్టునపుడు
జిగురు పాలకటంచుఁ జిగిరించు, రావి మ్రాఁ, కులనజ్జు నజ్జుగాఁ గొట్టునపుడు
గురు సార్వభౌముల గోడుపోనుక పట్టె నామము ;ల్మొదలంట నాకునపుడు
గద్దించి వెన వైదికపు బాపనయ్యల, పిల్ల జుట్లూడంగఁ బెరుకునపుడు

తే :-

సెక్కమా నీకుఁ దురకలఁ జిక్కుసేయ విన్నవించితి నా వెఱ్రి విన్నపంబు
పరగ మీ చిత్తమిదె నాదు భాగ్య మౌర, శతృ సంహార వేంకటాచల విహార!

సీ:-

గతిబట్టి బోడి సన్యాసుల, ఢీయని త్రాకులాడించునొకడు
సోమయాజుల బ్రహ్మసూత్రముల్ ధ్రెంచిపిం గాణివిండ్లకు నల్లెఁ గట్టు నొకడు
పైకాలు గొమ్మని బల్మిఁ గోమటి వారి. చెలువ పైఃబడి బూతుసేయునౌకడు

తే :-

ఈయవన సమ్మర్ద దుర్దినంబైన దిగువ తిరుపతిని జూడుమిటువంటి తఱిని నిదుర
పోవుచున్నాడు మీయన్న లేవలేక శతృ సంహార! వేంకటాచల విహార!


సీ:-
మామిడి క్రింది సోమరిపోతు శ్రీభాష్య కారుల కేల నంగరము గొధువ
అలుమేలు మంగ సొమ్ముల పెట్టియలు కాచు కొని యుండుటే చాలు హనుమనికిని
ఠీవిని బంకమంటి విరు ల్సమర్పించి తెరు గాటు కరగెను గురువ నంబి
మించుమిఠారితో బంచ బాణ క్రిడ లౌలుడయ్యెను కప్పడాల నృహరి


తే:-
నీకు మరి గోపమింతయు లేకపోయెఁ బోయె గాకేమి తొండమా న్భూపాలుఁ
డున్న నింతకుఁ దురకల మన్ని గొనడె శత్రు సంహార! వేంకటాచల విహార!

ఈ శతకము మొత్తము, దక్షిణ దేశమున తురుష్కుల దండ యాత్రకు సంబంధించిన విషయాలతో నిండిఉంది.. కవి దీన్ని వ్రాయడానికి ముందు ఎంతభాధపడ్డాడో? ఆ కవి హృదయం ఎంత యాతనకు గురి అయిందో వేరే చెప్పాలా?


సామాజిక స్పృహ లేని కవిత్వం స్పందన లేని కవి హృదయం ఎక్కువ కాలం మనలేవని అంటారు. ఆ విషయంలోఈ శతకకర్త కృతకృత్యుడయ్యాడని చెప్పక తప్పదు.


ఇదండీ! నిందా సాహిత్యం యొక్క నమూనా!

Posted by జ్యోతి Dec 21, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!