BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

Showing posts with label Fun/సరదా. Show all posts
Showing posts with label Fun/సరదా. Show all posts

నవ్వితే నవ్వండి అంటూ మనందరినీ నవ్వేట్టు చేస్తున్న బులుసు సుబ్రహ్మణ్యంగారు మీ సినిమా అనుభవం ఏదైనా చెప్పండి అంటే ఇదిగో ఇలా చెప్పారు.





నేను ఆనర్స్ ప్రీ ఫైనల్లో ఉండగా అంటే 1963 సంవత్సరం, నా రూమ్మేటు వీరేంద్ర చౌదరి వివాహం జరిగింది. నువ్వు తప్పకుండా రావాలిరా అని వాడు వేడుకోవడంవల్లా, వాళ్ళ నాన్నగారు ఇంతింత మీసాలు పెంచుకొని, కరుకుగా మాట్లాడుతూ పంతులూ నువ్వు రెండు రోజులు ముందర వచ్చెయ్యి అని ఆజ్ఞ జారిచేయడం వల్ల నేను ఆ పెళ్ళికి వెళ్ళేను ఒక రోజు ముందర. నేను వాళ్ళ ఊరు వెళ్ళడానికి సకల వాహనాలు ఉపయోగించ వలసి వచ్చింది. నిడదవోలు దాకా రైలు, ఆపైన బస్సు, ఆ తరవాత, రెండెడ్ల బండి ఎక్కి సుమారు మధ్యాహ్నం మూడు గంటలకు వాళ్ళ ఇల్లు చేరాను. నన్ను చూసి వాళ్ళ నాన్నగారు “ఆ వచ్చేసావా ?” అని అడిగేరు. నేను వచ్చినందుకు ఆనందించాడో, లేక మొహమాటానికి పిలుస్తే వచ్చేసాడేమిటి అన్న భావమో నాకు అర్ధంకాలేదు. “ఒరేయ్ రంగా! పంతుల్ని అబ్బాయి దగ్గరకు తీసుకెళ్ళు” అని చెప్పి వెళ్ళిపోయారు. రంగాగారు రండి మాష్టారు అంటూ నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళాడు.
అలాంటి ఇల్లు నేను అప్పటి దాకా చూడలేదు, పెద్ద హాలు. హాలుకి అరడజను గుమ్మాలు, వాటిలో గదులు. వాటిని దాటి వెళ్ళితే మధ్యన వరండా, మళ్ళీగదులు. ఈ గది లోంచి ఆ గదిలోకి పరుగు పెట్టే పిల్లలు, ఉంగరాలు లేని వేళ్ళు లేని వాళ్ళు, సిల్కు లాల్చీలు, సిల్కుపంచెలు ధరించిన మగవారు హడావిడి గా తిరిగేస్తున్నారు. పట్టు చీరలు కట్టుకొని, చీర కూడా కనిపించకుండా నగలు పెట్టేసుకొని, కదిలే మార్వాడీ కొట్టు లాగ అడుగులో అడుగు వేసుకుంటూ, బంగారం వాసన వేస్తూ తిరిగే మహిళామణుల మధ్య నించి, నన్ను లాక్కెళ్లి అబ్బాయి దగ్గర దిగపెట్టేడు. వచ్చావా, రా అన్నాడు అబ్బాయి. ఇంతలోనే ఓ పెద్ద ప్లేటు నిండా నాలుగు స్వీట్లు, అన్నేరకాల కారం పలహారాలు పట్టుకొచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఓ పెద్దమనిషి. అబ్బాయి చుట్టూ అమ్మలు, మధ్యలో అమ్మాయిలు పరాచికాలు, పగలబడి నవ్వడాలు. ప్లేటులోవి తినాలో, వాళ్ళ మాటలు వినాలో అర్ధం కావట్లేదు. అబ్బాయితో మాట్లాడటానికి కూడా సందు దొరకటంలేదు. సరేనని చేతిలోపని మీద దృష్టి పెట్టేను. ఎల్లాగో సందు చూసుకొని అబ్బాయి గారు నాదగ్గరికి వచ్చాడు.
“ఒరేయ్! నీ బస మా శాస్త్రి గారింట్లో ఏర్పాటు చేసారు నాన్నగారు. మా జనాల మధ్యన ఉండగలను అనుకుంటే ఇక్కడ ఉండు లేకపోతే అక్కడికి వెళ్ళు”. “ఒరేయ్ రంగా సార్ ని జాగ్రత్తగా చూసుకో”. పెళ్ళికొడుకు నాకు జాగ్రత్తలు చెప్పి మళ్ళీ ఆడవారి మధ్య కెళ్ళిపోయాడు. రంగా గారు అక్కడేఉన్న ఆడవారిని, అటూఇటూ తిరుగుతున్న మగవారిని పరిచయం చేస్తున్నాడు. నాకు ఆ బంగారం వెనకాల మనుషులు కనిపించడం లేదు.అంతా బంగారమే కనిపిస్తోంది. మీఇంట్లో ఘోషా ఉన్నట్టు ఉంది రంగా అన్నాను రంగా నవ్వేసాడు. రండి. మిమ్మల్ని శాస్త్రి గారింటికి తీసుకెళ్ళతాను అని నా బేగ్ భుజాన తగిలించుకుని బయల్దేరాడు.
ఓ ఐదు నిముషాలు, రెండు వీధులు తిరిగిం తర్వాత ఓ ఇంటి ముందు ఆగి శాస్త్రి గారూ అని పిలుస్తూ లోపలికి తీసుకు వెళ్ళాడు. టైము చూసాను అప్పుడే నాలుగు అయింది. ఈ ఊరు వచ్చి గంట దాటిందా అని ఆశ్చర్య పోయాను.
ఇంతలో శాస్త్రిగారు వచ్చారు లోపలి నించి.
“రా బాబూ కూర్చో” అన్నారు ఒక కుర్చీ నాముందుకు తోసి. నేను కూర్చున్నాను
“మీది భీమవరమా?”
నేను అవును అన్నట్టు తల ఊపాను
“చౌదరి గారి అబ్బాయి స్నేహితుడవా?”
“విశాఖపట్టణం లో కలసి చదువు కుంటున్నారా?”
“మీ నాన్న గారు తెలుగు పండితులా?”
“మీరిద్దరూ హాస్టల్లో ఒకే రూము లో ఉంటారా?”
నేను అన్నింటికి తలఊపాను. అన్నీ ఆయనకి తెలిసిన ప్రశ్నలే వేసారే అని ఆశ్చర్యపోయాను. నాభావం తెలుసుకున్న వాడై రంగా చెప్పాడు. మీ గురించి అబ్బాయి గారు అన్నీ చెప్పారు అన్నాడు. శాస్త్రిగారి భార్య కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది ఆవిడ కూడా అవే జవాబు అఖ్ఖర్లేని ప్రశ్నలు వేసింది. నేను షరా మామూలుగానే తలనూచాను.
“మొహమాటకు పడకు నాయనా. ఏమైనా కావల్సివస్తే అడుగు.” అని మళ్ళీ లొపలికి వెళ్ళి పోయింది ఆవిడ.
ఏమి అడగాలా అని ఆలోచిస్తుంటే, ఏదైనా అవసరం అనుకుంటే అడుగు నాయనా అని శాస్త్రి గారు వీధిలోకి వెళ్ళారు. ఇప్పుడు అనుమానం వచ్చేసింది. అవసరం అంటే ఏమిటీ అని ఆలోచించడం మొదలు పెట్టాను. “మీరు ఏమీ ఆలోచించకండి. మై హూ హై” అన్నాడు రంగా. “ఈ మధ్యనే హిందీ నేర్చేసుకుంటున్నాను. బొంబాయి వెళ్ళాలి”అన్నాడు రంగా. నేనేం మాట్లాడలేదు. మళ్ళీ హిందీ లో వాయించేస్తాడని. మనకి బొత్తిగా అర్ధంకాని భాష అది. ఇంగ్లీషు సినిమా లైనా కొంచెం అర్ధం అవుతాయేమో కాని హింది అసలు నహీ. “సరే సార్ మీరు ఓ గంట విశ్రాంతి తీసుకోండి. నేను మళ్ళీ వస్తాను” అని చక్కాపోయాడు.

సరే అని నేను మంచం మీద నడ్డి వాలుద్దామనుకుంటుంటే, శాస్త్రి గారి భార్య వచ్చేసింది. మాఊరు వాళ్ళ ఊరూ దగ్గరే అని కనిపెట్టేసి మాఅమ్మ వాళ్ల గురించి, నాన్న వాళ్ల గురించి, మా గోత్రాలు, ఋషులు మొదలగు వారిగురించి కూలంకషంగా చర్చించి, ఔఇంకా పెళ్ళి ఎందుకు కాలేదు నాయనా?” అని అడిగేసింది ఆవిడ. అప్పుడే తొందరేమండి. “ఇంకా చిన్న వాడినే గదా” అని అన్నాను. “అయ్యో అదేమిటి నాయనా! నీవయసు లో ఈయన మా మామగారిని తాతని చేసేసారు”. నాకు అర్ధం కాలేదు. ఆవిడ నవ్వింది. మట్టి బుర్ర ఆప్పుడు అర్ధం అయింది. ఇక్కడే ఉంటే ఈవిడ నాకు సంబంధాలు చూస్తుందేమోనని భయం వేసింది ఊరు చూసోస్తానని ఆవిడ కి చెప్పి బయట పడ్డా. అన్ని పల్లెటూర్ల లాగే ఉంది. పచ్చగా, హాయిగా చల్లగాలి వీస్తోంటే మెల్లగా నడుచుకుంటూ వెడుతున్నాను

రెండు వీధులు తిరిగే టప్పటికి రంగా వచ్చేసాడు. “అప్పుడే బోరు కొట్టేసిందా మాఉరు అంటూ “రండి ఆచివర సినిమా హాల్ ఉంది. అందులో కూర్చుందురు గాని మంచి కాలక్షేపం” అన్నాడు. ”ఇప్పుడా?” అన్నాను టైము చూస్తూ ఐదు అయింది. “ఇంకో గంటన్నర ఆట ఉంటుందండి. ఏదో పేరు చెప్పేడు జానపద సినిమా” అన్నాడు. హాల్ మనదే అన్నాడు. సరే ఆవిడ తో కబుర్ల కన్నాఇదే మంచిది అనుకొని “టూరింగ్ టాకిసా?” అని అడిగాను . “కాదండి ఫుల్ సినిమా హాల్” అన్నాడు. నాకు అర్ధం కాలేదు. “మీ పట్నం లాగానేనండి. సిమెంటు బిల్డింగ్, నేలా, బెంచి, కుర్చీ, రిజర్వుడు పైగా బాల్కని కూడా ఉందండి. ఈ చుట్టుపక్కల పదిహేను ఊర్లకి ఇదే పెద్ద సెంటరండి సినిమాలకి . చుట్టుపక్కల ఊళ్ళలో నాలుగు టూరింగ్ టాకీసు లున్నాయండి మన ఊర్లోనే ఫుల్ సినిమా హాలండి. మూడు అభిమాన సంఘాలున్నాయండి మా ఊర్లో”. అని అడగకుండానే ఆ సినిమా హాలు హిస్టరీ మొత్తం చెప్పేసాడు. “అబ్బో పెద్ద చరిత్రే ఉందే మీ ఊరుకి” అన్నాను. “అప్పుడప్పుడు కొత్తసినిమాలు కూడా వస్తాయండి విడుదలయిన నెలరోజుల్లో”. ఆహా అన్నాను. ఇంతలో హాలు దగ్గరికి వచ్చేసాం. నన్ను తీసుకెళ్ళి బాల్కనీ లో కూర్చో పెట్టేడు. నేను మళ్ళి సినిమా అయేటప్పటికి వస్తానండి అని వెళ్లి పోయాడు.

నేను కూర్చుని చుట్టుపక్కల సర్వే చేసాను.మొత్తం 12 సీట్లు ఉన్నాయి మొదటి వరుస మూడు, రెండోవరుసలో నాలుగు, మూడో వరుస లో ఐదు ఉన్నాయి.చివరి వరుసలో నలుగురు కూర్చున్నారు. రెండో వరుసలో ముగ్గురు ఉన్నారు. మొదటి వరుసలో నేను మధ్య సీటులో ఫాన్ కింద కూర్చున్నాను. తెరమీదకి చూసాను. రాజుగారు గుఱ్ఱం మీద, వెనకాల సైనికులు గుఱ్ఱాల మీద, కాల్బంటులు, శూలాలు, గదలు, కత్తులు పట్టుకొని పరుగెడుతున్నారు. వెనకాల సంగీతము దడదడ లాడించేస్తోంది. వ్యతిరేక దిశలో ఇంకో రాజు గారు అంతమంది సైనికులతో వచ్చేస్తున్నారు. సరిగ్గా అదే టైము లో నాపక్కన రెండు సీట్లలో ఇద్దరువచ్చి కూర్చున్నారు. కొద్దిగా మందు వాసన వేస్తోంది. “యుద్ధం మొదలవుతోందిరా” అన్నాడు ఒకడు. “సిగతరగా! నిన్నా ఇదే టైముకి వచ్చాం రా” అన్నాడు ఇంకోడు. రెండు సైన్యాలు ఒకరి కెదురుగా ఇంకోరు పరిగెడుతున్నారు.

ఒకడు: అబ్బాయి గారి స్నేహితుడు గారు రా
రెండో వాడు: అవును రా సినిమాకు వచ్చినట్టున్నారు.
సినిమాలో సైన్యాలు పరిగెత్తేస్తున్నాయి.
ఒ: పావుగంట ముందు వస్తే పాట వినేవాళ్ళం గదా
రెం: ఇంకో పాట ఇప్పుడు వస్తుంది గదా
సి: రెండు సైన్యాలు ఒక దాని ఎదురుగా ఒకటి నిల్చున్నాయి.
నేను జేబు లోంచి సిగరెట్టు తీసి వెలిగించాను.
ఒ: ఫ్రెండుగారు సిగరెట్లు కాలుస్తారనుకుంటాను రా
రెం: అబ్బాయి గారు కూడా కాలుస్తారాండి
నే: కాలుస్తాడండి
సి: ఇద్దరు రాజులు కత్తులు దూసారు
ఒ:, రెం:, చుట్టలు వెలిగించారు
సి: రాజులెక్కిన గుఱ్ఱాలు గుండ్రంగా పరిగెడుతున్నాయి.
నే: ఉత్సాహంగా చూస్తున్నాను ఎప్పుడు యుద్ధం మొదలవుతుందా అని
గుఱ్ఱాలు ఆగాయి.రాజు ఒకటికి రాజు రెండుకి ఓ ఇరవైగజాల దూరం
ఒ.రా: ఓరోరి దురాత్మా!. కదనమున నన్ను గెలవగలవా?
రె.రా:నీచా! దుష్టా! నీ పొగరణచెద కాచుకొమ్ము
ఒ: ఈళ్ళిప్పుడు ఇంకో పది మాటల యుద్ధం చేస్తారండి. అప్పుడు కత్తి యుద్ధం మొదలు
రె: అబ్బాయి గోరు అవి నిజంకత్తులేనంటారా
ఒ.: నీ మొహం. నిజంకత్తులైతే చస్తారు. అట్ట కత్తులు
రె: సౌండ్ వస్తుంది కదరా
ఒ: అది ఎనకాల మూజిక్ రా
సి: కత్తి యుద్ధం మొదలయింది టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
చేగోడీలు చేగోడీలు మధ్యలో అమ్మేవాడు రంగప్రవేశం
ఒ: అర్ధరూపాయివి ఇవ్వరా
వాడు ఇచ్చాడు వీళ్ళు నమలడం మొదలు పెట్టారు. రెండు చెవుల్లోను కర్ ఖర్ ఖ్ఖర్
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ: ఇప్పుడు ఆడి పెళ్ళాం ఈడి పెళ్ళాం పాట పాడుతారు డూయెట్టు
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కరుణించుమా కనకదుర్గా నా నాధుని గెలిపింపుమా
రె.రా.పె.: కాపాడుమా పరమేశ్వరా నాపతికి జయము నీయుమా
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ.: పరమేస్వరుడు గెలుస్తాడా పార్వతీ దేవి గెలుస్తుందా
నే: నిన్న చూసారుగా. మీకు తెలిసే ఉండాలి కదా
రె.: నిన్న సరిగ్గా పాట అయేటప్పటికి కరెంటు పోయింది
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కరుణించుమా కనకదుర్గా ఆఆఆఆ ఆఆఆఆ
రె.రా.పె.: కాపాడుమా పరమేశ్వరా ఆఆఆఆ ఆఆఆఆ
ఇంతలో ఒ.రా. చేతిలో కత్తి విరిగిపోతుంది. ఒ.రా దొర్లుకుంటూ ,రె.రా కత్తి విసురుతూ, దొర్లుకుంటూ, విసురుతూ ఒక నది దగ్గరకు వచ్చేస్తారు. నదికి ఒక తాళ్ళ వంతెన ఉంటుంది.
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కరుణించుమా స సా రి రీ రిర్రీ గగ్గా గ్గాఆఅ పదనిస పాదానీసా
రె.రా.పె.: కాపాడుమా గా గా పాప్పానా న్నా అమామ్మామాపాదనిసాఆఆ
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఇక్కడ ఒ.రా రె.రా లు వంతెన మీద యుద్ధం ఒ.రా, రె. రా చేతిలో కత్తి ఎగర కొట్టేస్తాడు. ఇద్దరు ముష్టి యుద్ధం మొదలు పెడతారు.
ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కనకదుర్గా
రె.రా.పె.: పరమేశ్వరా
ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం
అప్పుడు రె.రా నీళ్ళలో పడిపోతాడు. ఒ.రా నీళ్ళలోకి దూకేస్తాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి
ఢుషుం ఢుషుం బుడుంగ్ బుడుంగ్ ఢుషుం ఢుషుం బుడుంగ్ బుడుంగ్ ఢుషుం
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ.రా.పె.: కరుణించుమా
రె.రా.పె.: పరమేశ్వరా
ఇంతలో రెండు మొసళ్ళు నీళ్ళలో కొట్టుకుంటున్న వారి దగ్గరగా వచ్చి ఘ్ర్యీ: ఘ్ర్యీ: అంటాయి
ఒ.రా.పె.: కనక దుర్గా దుర్గా దుర్గా ఆఆఆఆఆఅ
రె.రా.పె.: కాపాడుమా మా మాఆఆఆఆఆఆఆ
రె.రాపె గారి దగ్గర ప్రమిద ఆరిపొతుంది. ఒరా గారి దీపం ఆరి, వెలిగి, వెలిగి ఆరిపోయేటట్టు ఉన్నట్టుంటే కరెంటు పొతుంది.
రె.: సిగతరగా, సరిగ్గా నిన్నా ఇక్కడే కరంటు పొయిందండి.
ఒ.: ఇప్పుడు ఏమవుతుందండీ అబ్బయి గొరూ,
నే.: నాకు తెలియదు ఈ సినీమా నేను చూడలేదు
రె.: మీరు డైట్రు అయితే ఏం చేస్తారు
నే.: రెండో దీపం కూడా ఆర్పేస్తాను.రెండు మొసళ్ళూ ఇద్దరిని తినేస్తాయి. ఇద్దరు పెళ్ళాలు ఆత్మహత్య చేసుకుంటారు. అప్పుడు రెండు రాజ్యాలలో ప్రజలు సుఖంగా జీవిస్తారు.
హహహహహ్హహ్హహ్హ అని ఘట్టిగా నవ్వి నేను అక్కడనించి పారిపోయాను.

Posted by జ్యోతి Oct 31, 2010

B & G మొదటి అతిథి రచయిత్రి శ్రీమతి మాల గారికి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన కానుక ఈ విరుల స్వరమాలిక. ఈ పాటకు సంగీతాన్నిచ్సింది మలక్పేట్ రౌడీ ఉరఫ్ భరద్వాజ.. రచన శ్రీమతి సీతాలక్ష్మి (భరద్వాజ్ తల్లిగారు) ఇక ముద్దు ముద్దుగా పాడింది అనఘ (భరద్వాజ కూతురు ) .. ఇంతమంచి బహుమతి ఇవ్వడానికి కృషి చేసిన వీరు ముగ్గురికి ధన్యవాదాలు.


మల్లెమాల గంధమా వెన్నెలమ్మ నేస్తమా
రెల్లుపూల జల్లే కానుకమ్మ ఈ రోజు
మల్లెమాల గంధమా వెన్నెలమ్మ నేస్తమా
అందుకో అందుకో శుభాకాంక్షలు

స్నేహశీలీవైన సన్నజాజి చెలువమా
ప్రేమమూర్తివైన పారిజాత పుష్పమా
స్నేహశీలీవైన సన్నజాజి చెలువమా
ప్రేమమూర్తివైన పారిజాత పుష్పమా
అందుకో అందుకో శుభాకాంక్షలు
మల్లెమాల గంధమా వెన్నెలమ్మ నేస్తమా
రెల్లుపూల జల్లే కానుకమ్మ ఈ రోజు
మల్లెమాల గంధమా వెన్నెలమ్మ నేస్తమా
అందుకో అందుకో శుభాకాంక్షలు

మంచితనమే రూపమైన మందారమా
అక్షరాల రూపమైన విరులదామమా
మంచితనమే రూపమైన మందారమా
అక్షరాల రూపమైన విరులదామమా
అందుకో అందుకో శుభాకాంక్షలు

మల్లెమాల గంధమా వెన్నెలమ్మ నేస్తమా
రెల్లుపూల జల్లే కానుకమ్మ ఈ రోజు
మల్లెమాల గంధమా వెన్నెలమ్మ నేస్తమా
అందుకో అందుకో శుబాకాంక్షలు.

రచన : డా. సీతాలక్ష్మి
గానం : అనఘ
సంగీతం : భరద్వాజ

Posted by జ్యోతి Jul 25, 2010



ప్రతీ స్త్రీకి ప్రీతికరమైనది నుదుట బొట్టు, చేతికి రంగు రంగుల గాజులు. ముత్తైదువ ధరించే మట్టిగాజులైనా, అమ్మాయిలు వేసుకునే తళుకులు ,మెరుపుల మ్యాచింగ్ గాజులైనా, రత్నాలతో పొదిగిన బంగారు గాజులైనా.. వేటికవే ప్రత్యేకమైనవి.  రెండుచేతులనిండుగా అలంకరించుకున్న రంగు రంగుల గాజులకు శతాబ్దాలుగా సాంస్కృతిక, సామాజిక మతపరమైన గుర్తింపు , ప్రాధాన్యత ఉంది. ఆచార వ్యవహారాల్లో కూడా గాజులకు ప్రత్యేక స్థానం ఉంది. హైందవ స్త్రీలు, ముస్లీం స్త్రీలు వివాహమైన తర్వాత ఎళ్ల వేళలా తమ చేతులకు గాజులు ధరించి ఉంటారు. మట్టిగాజులు మాత్రం తప్పనిసరిగా ధరించాలి అంటారు. ఏ మహిళ ఐనా కులం, సంస్కృతి, వయసు, వైవాహిక స్థాయితో నిమిత్తం లేకుండా , ఆర్ధిక స్తోమతు బంగారు గాజులు ధరిస్తారు. 




గుజరాతీ, రాజస్థానీ వధువులకు పుట్టింటివారు ఒక దంతపుగాజును బహూకరిస్తారు. గుజరాతీ వధువు తొలిసారిగా గర్భవతి ఐనప్పుడు ఆమె ఆడపడుచు వెండి బ్రాస్‌లెట్ ను బహూకరిస్తుంది.  ఏడో నెలలో  నల్లదారం, ఐదు కౌడీల (ఒక రకమైన గవ్వలు)తో తయారైన బ్రాస్లెట్ ధరించాలని పెద్దలు చెప్తారు. ఆమెకు సుఖ ప్రసవం కోసం ఇలా చేస్తారని అంటారు.

దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఆచారాలు , సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గర్భవతి ఐన స్త్రీకి ఏడవనెలలో పుట్టింటికి తీసుకువచ్చే ముందు "వలైకప్పు (సీమంతం)" అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అన్ని రకాల , రంగుల గాజులు ఆమె చేతులకు అలంకరిస్తారు. ఓ చేతికి 21 గాజులు, ఇంకో చేతికి 22 గాజులు తొడుగుతారు. అంతే కాక ఆమెకు కొక్కేలతో ఉండే సన్నని వెండిగాజునిస్తారు. ప్రసవ సమయంలో ఈ కొక్కేల్ని విడదీస్తారు.  ఇక హైదరాబాదీ లక్కగాజుల అందాలు వర్ణింపతరమా?? మతం, వయసు తేడా లేకుండా ప్రతి మహిళను అకర్షించే ఈ లక్కగాజులు సోయగాలే వేరు.

క్రీ.పూ. 2300 - 1000 సంవత్సరాల నటి సింధు నాగరికతకాలం నాటినుండి ముంచేతులకు, మణికట్టుకు ఆభరణాలు ధరించే అలవాటు , ఆచారం ఉంది. మొహంజొదారోలో బయల్పడిన స్త్రీ బొమ్మ చేతినిండా గాజులు కప్పేసి ఉంటాయి. 

బెంగాలి వివాహితలు తమ వైవాహిక స్థాయికి గుర్తుగా "లోహా" లేదా "ఐరన్ కడా" అని పిలవబడే గాజును ధరిస్తారు. ఈ రోజుల్లో  ఉన్నవాళ్లు లోహాను బంగారంలో అందంగా పొదుగుతున్నారు. వధువుకు అందమైన శంఖు గాజులు, ఎర్రని లక్క గాజులు ధరింపచేస్తారు. పంజాబీ వధువుకు సన్నని దంతపు గాజులను తెలుపు, ఎరుపు రంగుల్లో ధరింపచేస్తారు. కాలానుగుణంగా లక్క, ప్లాస్టిక్ గాజులు వచ్చినా ఆచారం మాత్రం కొనసాగుతుంది. కొత్త కోడలు ఈ గాజులను మూడు నుండి ఆరు నెలలపాటు ధరిస్తుంది. అవి ఆమె చేతులకు ఉన్నంతకాలం ఆమెను నవవధువుగానే పరిగణించి ఇంటిపని, వంటపని అప్పచెప్పరు. ఆమె వంటగది ప్రవేశం చేసినప్పుడు ఆ గాజులను తీసి పూజారులకో, దేవాలయానికో బహుమతిగా ఇచ్చేస్తుంది.


క్రీ.పూ. 2300 - 1000 సంవత్సరాల నటి సింధు నాగరికతకాలం నాటినుండి ముంచేతులకు, మణికట్టుకు ఆభరణాలు ధరించే అలవాటు , ఆచారం ఉంది. మొహంజొదారోలో బయల్పడిన స్త్రీ బొమ్మ చేతినిండా గాజులు కప్పేసి ఉంటాయి. ముంజేతి కడియాలను చాలా అరుదుగా ధరిస్తున్నారు. లతలు, మొసళ్లు, సింహాలు, ఏనుగులు,నెమళ్లవంటి ముఖాకృతిలొ్రో ఉండే ముంజేతి కడియాలు ఇష్టపడని మహిళ ఉంటుందా. ఈనాడు మట్టిగాజులు, లక్క గాజులు, ప్లాస్టిక్ గాజులు, రాళ్ల గాజులు , నవరత్నాల గాజులు అంటూ విభిన్నమైన , వినూత్నమైన గాజులు అందుబాటులో ఉండి అతివలను అలరిస్తున్నాయి. కళ్లు చెదిరే మరికొన్ని గాజులను ఇక్కడ చూడండి.



సరోజని నాయుడు రాసిన ఈ కవిత గుర్తుచేసుకుందామా?


Bangle sellers are we who bear
Our shining loads to the temple fair...
Who will buy these delicate, bright
Rainbow-tinted circles of light?
Lustrous tokens of radiant lives,
For happy daughters and happy wives.

Some are meet for a maiden's wrist,
Silver and blue as the mountain mist,
Some are flushed like the buds that dream
On the tranquil brow of a woodland stream,
Some are aglow wth the bloom that cleaves
To the limpid glory of new born leaves

Some are like fields of sunlit corn,
Meet for a bride on her bridal morn,
Some, like the flame of her marriage fire,
Or, rich with the hue of her heart's desire,
Tinkling, luminous, tender, and clear,
Like her bridal laughter and bridal tear.

Some are purple and gold flecked grey
For she who has journeyed through life midway,
Whose hands have cherished, whose love has blest,
And cradled fair sons on her faithful breast,
And serves her household in fruitful pride,
And worships the gods at her husband's side.

Posted by జ్యోతి Jun 18, 2010

01. If all the nations in the world are in debt (i am not joking. Even US has got debts), where did all the money go? (Weird).

 02. When dog food is new with improved tasting, who tests it? (To be given a thought).

 03. What is the speed of darkness? (Absurd).

 04. If the "black box" flight recorder is never damaged during a plane crash, why isn't the whole airplane made out of that stuff? (Very good thinking).

 05. Who copyrighted the copyright symbol? (Who Knows?)

 06. Can you cry under water? (Let me try).

 07. Why do people say, "you've been working like a dog" when dogs just sit around all day? (I think they meant something else).

 08. Why are the numbers on a calculator and a phone reversed? (God knows.)

 09. Do fish ever get thirsty? (Let me ask and tell).

 10. Can you get cornered in a round room? (By ones eyes).

 11. What does OK actually mean? (Ok you tell)

 12. Why do birds not fall out of trees when they sleep? (Tonight I will stay and watch).

 13. What came first, the fruit or the color orange? (Seed).

 
14. If a person suffered from amnesia and then was cured would they remember that they forgot? (Can somebody help).

 15. Can you blow a balloon up under water?

 16. Why is it called a "building" when it is already built? (Strange isn't it).

 
17. If you were traveling at the speed of sound and you turned on your radio would you be able to hear it? (Got to think scientifically).

 18. If you're traveling at the speed of light and you turn your headlights on, what happens? (I didn't have a chance to try).

 19. Why is it called a TV set when there’s only one? (Very nice).

 20. If a person owns a piece of land do they own it all the way down to the core of the earth? (This is nice?).

 21. Why do most cars have speedometers that go up to at least 130 when you legally can't go that fast on any road? (Stupid, break the law).


 Sent by a friend via mail. Wanted to be unknown. I truely promise these evoke some laughter, and make u think other way. But, THESE ARE NOT MINE.


It is the unwritten policy of B&G, and also of గీతాచార్య to give original content. But here, I can not help but share these with my blogger friends.


ThankQ,

Chatanya Kalyani

Posted by Anonymous May 21, 2010


"నేను మేస్టర్ని. ఎం. బీ. ఎస్ ప్రసాద్ కి కేవలం ఫస్ట్ క్లాస్ కాక డిస్టింక్షన్ ఇస్తున్నాను" అని కవన శర్మ గారు చెప్పిన ముందుమాటే చాలు ఈ పుస్తకం విలువ చెప్పడానికి. ఆంగ్ల సాహిత్య అభిమానుల్లో పీ. జీ. ఉడ్ హౌస్ నీ, అతని రచనలలో వెల్లి విరిసే సున్నితమైన, విభిన్నమైన హాస్యాన్నీ ఎరుగని వారు ఉండరు. ఇద్దరు ఉడ్ హౌస్ అభిమానుల (శర్మగారూ, ఈ పుస్తక రచయత ఎం. బి. ఎస్ ప్రసాద్ గారూ) సాహిత్య చర్చలు ఒక ముఖ్య కారణంగా ప్రసాద్ గారి కలం నుంచి వెలువడి, ఎంతో ప్రాచుర్యం పొందిన రచనలు ఇవి. ' అచలపతి కధలు ఎంత బావుంటాయో, రాంపండు లీలలు కూడా అంతే బావుంటాయి. జీవ్స్, వూస్టర్ పాత్రల స్పూర్థితో 'అచలపతి కధలూ ఎందుకు రాసారో రచయత ఈ పుస్తకం ముందు మాటలో చెప్పారు, అవి ఉడ్ హౌస్ అభిమానులకి కూడా నచ్చడం పట్ల సంతోషం వెలిబుచ్చారు కూడా. ఆ సునిశితమైన హాస్యం అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో మరొక రెండు, మూడు పాత్రలని కలగలిపి తయారు చేసిన పాత్రే మన హీరో రాంపండు. ఈ పుస్తకం లో ఉన్న పదిహేడు కధలూ, చిత్ర విచిత్రం గా సాగే అతని ప్రేమ లీలలు.



సూర్యుడు ఒక దేశంలో అస్తమించినా మరొక దేశంలో ఉదయిస్తూనే ఉంటాడు. అచ్చం మన రాంపండు ప్రేమ లాగే. అతని ప్రేమ కి ఆది, అంతం లేదు. అది అనంతంగా సాగుతూనే ఉంటుంది. అనంత్ అనబడే అనంత శయనానికి ప్రాణం మీదకి తెస్తూనే ఉంటాయి. రాంపండు కి ప్రేమించడం తప్ప వేరే పనేమీ లేదు. ఎందుకంటే నెల నెలా పాకెట్ మనీ ఇచ్చే బాబాయి ఉన్నాడు కనక అందరిలా ఉద్యోగం లాంటి మామూలు వ్యవహారాలు పెట్టుకోడు. అతనో ఏకలవ్యుడు అంటే ఒకసారి ఒక్కరినే ప్రేమిస్తాడు, ఎవరిని ప్రేమించినా అది పాపం అతని బాల్యమిత్రుడైన పాపానికి అనంతంగా శయనించే (అంటే పనీ పాటా లేదని అర్ధం) అనంత శయనం మెడకే చుట్టుకుంటుంది. అది ప్రేమకధని విజయవంతం చెయ్యడానికే మొదలయినా, చివరికి అభాసుపాలుగానే ముగుస్తుంది. ఈ ప్రయాణంలో రరకాల సంఘటనలూ, సన్నివేశాలూ.. నవ్వుల వానలో తడిపేస్తాయి.



'తా వలచింది రంభ' అన్నది పాత నిజమే.. అది రాంపండు విషయంలో మరింత నిజం.. అందుకే అందరికళ్ళకీ షాండోలా కనబడే షాలిని కూడా అతనికి లతాంగిలాగానూ, పరమపాతకాలపు పేరైన సుబ్బి కూడా ముగ్గులో గొబ్బిలాగానూ కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి. ప్రతీ కధలోనూ రాంపండు విధిగా ఎవరో ఒక అమ్మాయితో తలమునకలు అయ్యేటట్లు ప్రేమలో పడటమూ, దానిని సఫలం చేసే బాధ్యత అనంతు మీద అతని ప్రమేయం లేకుండా పెట్టడమూ ( నీకంత బుర్ర ఎక్కడ ఏడ్చిందిలే? నువ్వంటే అచలపతి అని అంటూ మరీ), అచలపతి సలహాల వల్ల అనంతు వాటిల్లోంచి బయట పడటమూ హుషారుగా జరిగి పోతూ ఉంటాయి. ఈ ప్రక్రియలో అనంతు ఒకసారి ప్రేమకధలు రాసే కల్పనారాణీ అవతారం ఎత్తవలసి వస్తే (రాంపండూ- పెసరట్ల సుబ్బీ), మరొకసారి రాంపండు ని హీరోలా చూపించడానికి తనే అతని ప్రేమికురాలి తమ్ముడుని నీళ్ళల్లో తోసేయ్యడం (రాంపండూ-షాండో షాలినీ), అతను ప్రేమించిన అమ్మాయిని, తన ఇంటికే భోజనానికీ, టీ కీ పిలవవలసి రావడమూ, ఆ 'వాలెంతింటా' అది తింటా, ఇది తింటా అంటూ అతని బుర్రతో సహా తినడమూ (కామ్రేడ్ రాంపండు). అంతే కాక కవిత్వపు పందాలూ, ఆటల పోటీలూ, వాటిల్లో ఎదురయ్యే పందాలూ, పరాభవాలూ ఒక ఎత్తు అయితే.. రాంపండు కి తెలిసిన వాళ్ళతో తను తిట్లూ, మైదా పిండి తలకి పోయించుకోవడమూ ( రాంపండూ- హెడ్మాస్టారూ), ఐస్ దిండు తో తడిసిన పక్కమీద పడిన అవస్థలూ,(రాంపండూ- ఐస్ దిండూ), శునకదానాల పేరిట కుక్కలని కాపలా కాయడమూ, కావలసినప్పుడు మార్చడమూ (రాంపండూ- శునకదానమూ) లాంటివన్నీ మరొక ఎత్తు. ఈ మధ్యలో సింపుల్ గా ఒకరు తలుపుకొట్టి వచ్చిన వారి ధ్యాస మళ్ళిస్తే మరొకరు లోపలకి వెళ్ళగలిగే అవకాశం ఉన్నచోట, అక్కరలేని పూలకుండీల ఉపాయాలూ (రాంపండూ- రెసిడెన్షీల్ స్కూలూ), ఇలా రకరకాల సరదా కధలమధ్యన సమయం తొందరగా కరిగిపోతుంది.



ఇలా సుబ్బీ, షాండో షాలినీ, సులోచనా, వాలెంతింటా, సుమనోహరీ, వీణాపాణీ, కోకిలలని వరసగా ప్రేమించిన రాంపండు చివరికి అనుకోని పరిస్థుతుల్లో ఊహని పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. ఇన్నాళ్ళూ "ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టుగా వీడు ప్రేమిచడమూ అది నా పీకకి చుట్టుకోవడమూ" అని చిరాకు పడే అనంతు ఊహతో అతని పెళ్ళి జరిగిందని తెలియగానే ఎగిరి గంతేస్తాడు. తన బాబాయి ఈ పెళ్ళిని ఆశీర్వదించేట్టు చెయ్యమని ప్రాధేయపడితే జాలి పడి అతనిని కలుస్తాడు. ఊహే అసలు కల్పనారాణి అని షాకింగ్ నిజం తెలియడమే కాక, ఆవిడ రాంపండు బాబాయి మీదా, తన మీద పరువు నష్టం దావా కూడా వేసే పరిస్థితి రావడం తో మరో దారి లేక అచలపతి దయవల్ల మతిస్థిమితం లేనివాడిగా ముద్ర వేయించుకోవలసి వస్తుంది పాపం అనంతుకి. అనంతుతో కలిసి కల్పనారాణి డ్రామా ఆడినందుకు రాంపండు పాకెట్ మనీ అలవెన్స్ కట్ అయిందని వేరే చెప్పక్కర్లేదు.. ఇలా పాపం రాంపండు ప్రేమే కాక పెళ్ళి కూడా అనంతు ముప్పుకే రావడంతో ఆఖరు కధ ముగుస్తుంది.



కధల్లో ఉన్న చమత్కారాలూ, ఉడ్ హౌస్ తరహా సంభాషణలూ, చమత్కార బాణాలూ కధల్ని వదలకుండా చదివిస్తాయి. ఈ తరహా హాస్యం తెలుగు పాఠకులకి అంత పరిచయం లేకపోయినా, కొత్తగా, సుతిమెత్తగా హాయిగా ఉండి అలరిస్తాయి. ఈ మూడు ముఖ్య పాత్రలూ, రాంపండు ప్రియురాళ్ళ పాత్రలే ,కాక మధ్యలో వచ్చిపోయే అత్తయ్యలూ, వారి స్నేహితులూ, వారి పిల్లలూ ఇలా అనేక పాత్రలు మనల్ని పలకరించి వారివంతు హాస్యాన్ని చిలికించి వెళతాయి.



'మొగుడు పారిపోయినా పర్వాలేదు కానీ పనిమనిషి పారిపోతే మాత్రం మళ్ళీ దొరకదు" అని వంట మనిషి భీమారావు ని పణంగా పెట్టడం గురించి చెప్పే ఉషారత్తయ్యా ఎప్పుడైనా అవలీలగా స్టమక్ లైనింగ్ గురించి మాట్లాడేసే కామేశం బాబయ్యా, చిన్నదెబ్బసాయంతో క్షతగాత్రుడినంటూనే అన్ని కులాసాలూ జరిపించుకునే ఫల్గుణుడూ.. వీటిల్లో కొన్ని.


చదవగానే పకపకా నవ్వించేది హాస్యంలో ఒకరకంగా అలరిస్తే.. సున్నితంగా చక్కలిగిలులు పెట్టే ఈ సునిశితమైన హాస్యం మరొకరకంగా మనల్ని మురిపిస్తుంది. ప్రసాద్ గారి శైలి గురించి కానీ, ఆయన కలానికున్న పదును గురించి కానీ, అది చేసిన, చేస్తున్న ప్రయోగాలని గురించి కానీ నేను కొత్తగా, ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు.. అందుకే శ్రీ కవనశర్మ గారు చెప్పిన రెండు మాటలు చెప్పి ముగిస్తాను. "ఈ రచనలు మనల్ని ఆసాంతం చదివిస్తాయి, అలరిస్తాయి. కొని చదివినందుకు సంతోషిస్తాం. కనక మీరు కొనవచ్చు అని సిఫార్సు చేస్తున్నాను" అన్నారు.

"కధలకీ, కధనానికీ అతికినట్టుగా ఉన్న ప్రముఖ చిత్రకారులు శ్రీ బాలి వేసిన బొమ్మలు కూడా ఈ పుస్తకానికి హైలైట్ గా నిలుస్తాయి. శ్రీ బాపూ రమణలకి అంకితమిచ్చిన ఈ పుస్తకం విశాలాంధ్ర వారిచే ప్రచురించబడింది.

ఈ పుస్తక సమీక్షను రాసినవారు ప్రసీద పేరుతో మనసు పలికే అని బ్లాగుతూ , కౌముదిలో అగ్రహారం కధలతో అందరి మనసు దోచుకున్న డా.సుభద్ర వేదుల

Posted by జ్యోతి

రేయ్ శరత్తూ! కాస్త నన్ను ఇంటిదాకా దింపరాకిరణ్ అడిగాడు.

ఒరే నాకు డబుల్స్ రాదురా. శరత్ అన్నాడు.

ఏముందిలేరా. నేను తొక్కుతాను. నువ్వు వెనకాల కూచో. మా ఇల్లు మీ ఇంటి కెళ్ళే దారే కదా. సరిపోతుంది. కిరణ్ నచ్చజెప్పాడు.

సరే! అలాక్కానీ. అని శరత్ సైకిల్ వెనుక కూచుని అలా లిఫ్టిచ్చాడు.
***   ***   ***  

ఏరా శరత్తూ! ఇందాకన నీ సైకిల్ని తొక్కిందెవర్రా? గోపాల్ బాబాయడిగాడు.

మా ఫ్రెండ్ కిరణ్ బాబాయ్. శరత్ అన్నాడు.

ఇంకెప్పుడూ వాడికి లిఫ్టివ్వకు. నిన్ను కూచోబెట్టి వాడే సైకిల్ తొక్కేస్తాడు. నువ్వు చవటల్లే వెనక్కూచోవాలి.

అలాగే బాబాయ్! శరత్ కాస్త నొచ్చుకుంటూ బెరుకు బెరుగ్గా అన్నాడు.
***   ***   ***

రేయ్ శరత్తూ! కాస్త నన్ను ఇంటి దాకా దింపరా. కిరణ్ అన్నాడు.

కాసేపు కిందా మీదా పడ్డాక శరత్ అన్నాడు. సరే రా! వెనక్కూచో.

అదేంట్రా! నీకు డబుల్స్ రాదుగా? కిరణ్ అన్నాడు.

వచ్చులేరా. నేర్చుకున్నాను. శరత్ సమాధానం చెప్పాడు.
***   ***   ***

ఏరా శరత్తూ! ఆ కిరణ్ గాడు మహరాజులా వెనక కూచుంటే నువ్వు రిక్షా వాడిలా ముందు కూచుని సైకిల్ తొక్కుతా వాడికి లిఫ్టిస్తూ... గోపాల్ బాబాయ్ అన్నాడు.

దీనికి సమాధానంగా శరత్ ఏమన్నాడు? ఏమి చేశాడు?

నీతి: ఇంకెప్పుడూ సైకిల్ వాడ కూడదు. :D

Posted by గీతాచార్య May 7, 2010

యాడ్జనులకు ఉండాలి వక్షపాతాలు,
పురోగతికై కూడదు పక్షపాతాలు.

గురజాడ రచియించిన ముత్యాల సరాలు,
నీ గొంతులో పలికే తేనెలొలుకు స్వరాలు.

సుకవులకుంటుంది కవితావేశం,
నాకిపుడే కలిగింది భవితావేశం.

చిన్న వాడి చేతిలో ఎర్ర గులాబీలు,
కేసీయార్ ఢిల్లీల నడిపేది లాబీలు.

వయారి భామల హంస నడకలు,
వీధి వీధినా ఆకలి కేకలు.

Posted by గీతాచార్య Apr 30, 2010

ఫ్రెండ్స్ తో చాట్లో ఉండగా అలా అలవోగ్గా వచ్చిన నాలుగు మాటలు ఒక చిన్న కవితలా అనిపిస్తే ఇలా పెట్టేస్తున్నాను. బాగుందో లేదో మీరే చెప్పాలి మరి :-)

ఏదో అనుకుంటాము కానీ, 
చచ్చిపోతే మనకొచ్చేదేమీ లేదు

మనకర్థం కాదు కానీ, 
బ్రతికుంటే పోయేదీ లేదు


కవితిచ్చిన ఫ్రెండ్స్ కి కృతఙ్ఞతలు.







చివరలో మరో ఫ్రెండ్ చేసిన కొనసాగింపు చిన్న తవిక ;-)

పోయేదేమీ లేదంటే,
వచ్చేదేదో ఉందనేగా,
రాజుగారి పెద్ద భార్యా :D

Posted by గీతాచార్య Apr 27, 2010

రాహుల్’ ‘ అనికేత్వీరిద్దరూచంద్ర  టి.వి’  ఛేనల్ కి   మూలస్తంభాలు. రాహుల్ ఎం.డి   అయితే,   అనికేత్  ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్. ‘చంద్రుడిని పట్టి  పీడించే  రాహు_కేతువులనే  ఛాయా గ్రహాలు వీళ్లుఅని   లోపాయ కారీగా     యూనిట్   సభ్యులు   అనుకోవడం  కద్దుకాని     మాట   బయటికి   చెప్పే  సాహసం  ఎవరికీ   లేదు.
కామిని’, ‘పిపాస’  వీరిద్దరూ   తమ  తమ  ఆకొట్టుకొనే  అందాలతోమురిపించే  మాటలతో,   ఆహ్లాద  పరిచేవిన్యాసాలతో    చంద్ర  లోకం  లోనిఅభినవ  తారామణులుకాదు  కాదు  కామినీ   పిశాచాలు’  అని   సదరు  సభ్యులు  అనుకొంటూ ఉంటారు, కాని  బయటికి  మాత్రం  చెప్పరు.
సదరు  సభ్యులుతోకలు  కోసినకిష్కింధ   సైన్యాలు’  అని  అధికారుల  అంచనాఅయినా   వారు     మాట   బయటికి   చెప్పరు.
బోర్డు  మీటింగు  మొదలయింది.  ‘రాహు_కేతువులు’ , ‘కామినీ  పశాచాలు’  ‘ తోకలేని  కోతులు’  అందరూ  కలిసారు.   మధ్యనే   వారందరూ  కలిసి, ఒక   ప్రత్యక్ష  రామాయణాన్ని ( రియాల్టీ  షో )   నిర్వహించారుఅడవిలోకిఆర్టిస్టులని తీసుకెళ్లి  వాళ్లచేత  పురుగులుఎలకలుబల్లులుతినిపించి,   పాములుబొద్దింకలుక్రిమి  కీటకాలతో  సహవాసం  చేయించిజయప్రదంగా  కార్యక్రమాన్ని  ముగించారుకాని  ఒక   ఆపశృతి   జరిగి  పోయింది.   కేతువు   అడవి  లోపలికి  వెళ్లిపోయిఅదృశ్యమయ్యాడు.  అందరికీ  ఆందోళన  కలిగిందిఅయిదు  రోజుల  తరువాత  తిరిగి  వచ్చిఅడవిలో  దారి  తప్పి  ఆటవికుల  ఆశ్రయం  పొందానని  చెప్పాడువివరాలు  మీటింగులో  చెప్తానన్నాడు.    
అందుకే  ఏర్పాటయింది     మీటింగు !
  ఆటవిక  జాతుల  వారిది  కాకా  తండా’ ! ‘కాకి’  వారి  అభిమాన  ఆరాధ్య   పక్షి.! కృష్ణునికినెమలి  ఫింఛంఎలాగో వాళ్లకి  కాకి ఈక’  అలాంటిదిఆఢా_మగా  అందరూ   కాకి   ఈకలతో  అలంకరించు    కొంటారు---కేతువు  వాక్ప్రవాహానికి  అడ్డు  పుల్ల  వేసాడొక   కోతి !    ”వాళ్లకి  భాష  ఉందా   అనికేతువు  గారూ ?”  అంటూ.
ఉందికాని  అది  భాష  కాదుపిట్టలుకాకులు   కూతల  నుంచివాటి  బాడీ  లాంగ్వేజి (!!నుంచి  పుట్టిన   భాష   అదికేవలం  శబ్దజాలం.!  పాతిక  ముఫ్ఫయి  కన్న ఎక్కువ   శబ్దాలు  లేవు  వాళ్ల   భాషలోఒకే   శబ్దానికి, రక  రకాల  అర్థాలు  ఉంటాయి. ఉదాహరణకి  ‘ కా ‘  అనే  శబ్దానికినేనునానా  కొరకునాకైనన్ను”  అనే  అర్థాలు,  ‘ కీ ‘  అనే  శబ్దానికినువ్వునీ,   నీ కొరకునీకైనిన్ను’,  అనే  అర్థాలు  ఉన్నాయి.
తో.లే  కోతి  ఊరుకోలేదు. అదెలాఅనికేతువు  గారూఅయోమయంగా  ఉండదూ ?”  అని  ప్రశ్నించాడు.
ఎందుకుండదు ? కాని  భావ  ప్రకటనబాడీ  లాంగ్వేజిని  బట్టి  అంతా  అర్థమయి పోతుంది. మన ‘ “తెలుగు’  .లాగే   ప్రాచీన   హోదా   పొందిన  ఒక   భాషలో   ఒకే  అక్షరాన్ని   నాలుగు  రకాలుగా  సంభోదించడం  లేదూ !  ‘ ’  అనే ఒకే  అక్షరాన్ని, , ’  లు  గాను,   అలాగే  . . ’  లనే  నాలుగేసి   రకాలుగా   పలకడం  లేదూఅంత   మాత్రాన    భాషకి   గౌరవం  తగ్గిందా,   చెప్పండి ?
“  సరేఅనికేతువు  గారూ ! ‘   లవ్యూని  ఏమంటారు   కాకా  తండా  వారి   శబ్దజాలంలో.
కాకీకువ  కువ  కోఅంటారుకా’  అంటే  నేను, కీ’  అంటే  నిన్ను,కువకువ కో  అంటే  ప్రేమిస్తున్నాను. అని   అర్థం.
నాకు   ఆకలేస్తోంది. అనడానికి ?”
కా  బూకా  కో”  అర్థమయిందా ?”
“  అర్థమయింది,     భాషని   మీరు   అధ్యయనం  చేసారా ?
“  అధ్యయనం మాత్రమే  కాదు, భాషలో ఒక స్క్రిప్టు  తయారు చేసానుఅని చెప్పి, కేతువు తన కుర్చీలో   కూర్చొన్నాడు.  కేతువు   కూర్చోగానేరాహువులేచి  నిల్చొన్నాడు. “  డియర్   ఫ్రెండ్స్అనికేత్   స్క్రిప్టు  నేను   చదివాను. చాలా ఆసక్తికరంగా  వాస్తవానికి  దగ్గరగా  ఉంది. కాకా  తండాలో   స్త్రీలని  పోరి  అని, పురుషులని  పోకిరి  అని  అంటారుపిల్లలని  శాకిరి  అని  వారిలో  మగపిల్లలని   మాకిరి  అని   ఆడ   పిల్లలని   ఆకిరి  అని  పిలుస్తారు. అనికేతువు స్వయంగా చూసిన  .రెండు  కుటుంబాల   కథ  అదిముంబకంబపోకిరీలుచిత్తిమిత్తి  పోరీలువీళ్లలో   కంబచిత్తి   దంపతులకి,   ముగ్గురు   మాకిరీలుఇద్దరు   ఆకిరీలు  సంతానంమిత్తిశాకిరీలు   లేరనే  చింతతో   అనేక  ప్రయత్నాలు  చేసింది. వాటిలోనక్క  మాంసం’  భర్తకి   తినిపించడమేనేది  ఒకటి !   ప్రయత్నాలు  ఎలా  ఫలిస్తాయి   అన్నదే  కథ !   స్క్రిప్టుని   అదే  అడవిలోకాకా  తండావారి   వేష  భాషలలో  తీయాలని   నేను  నిర్ణయించాను.మన   అడవి   సీరియల్కి,   ఇది  చక్కని  అనుబంధంగా  తయారవుతుందిఅందుకే  మన   ఆర్ట్  ఢైరక్టర్నిటెక్నీషియన్లనీ,   అడవిలో   సెట్    నిర్మించడానికి   పంపించానుత్వరలోనే  మనమందరం  తిరిగి,   అరణ్య  వాసం   చేయాలి.”  అన్నాడు   రాహువు


సీన్   నెంబరు  1 అడవిలో  కాకా   తంఢాలు’  నివశించే  గ్రామంలో  ఒక    సెక్టర్ .
ఆర్టిస్టు   స్టేటస్ :   ‘ ____’  స్ట్రైట్  లైను( స్త్రైట్ లైను అంటే  ఇద్దరు.  ట్రై ఏంగిల్  అంటే  ముగ్గురుస్కేర్  అంటే  నలుగురుపెంటాగన్ అంటే  ఐదుగురుసర్కిల్  అంటే  చాలామంది )
దుస్తులు:
పోకిరీకిజంతు   చర్మంతో  చేసిన  వాటిలాగ  కనిపించే   బెర్ముడా వీపుకి  క్రాస్ గా  వెడల్పైన పటకా,    పటకాకి  కట్టిన   అంబుల   పొది!
పోరికి,   పువ్వులు,   ఆకులు  లతలు   ప్రింటు   చేసిన  నైలాన్  మేటుతో  చేసిన   పొడవైన   లంగాభుజానికి  ఒక  వైపు   మాత్రమే  పట్టీ   కలిగిన  బ్రాసరీ  లాంటి  టాప్ !
ఆభరణాలు:    పూసలుగవ్వల  దండలు,   తాయెత్తులు,   కాకి ఈకలు !
దృశ్యం: ఒక   గుడిశె  బయట,   చెట్టు   మాను  మీద   కూర్చొనిపోరి’  ఏడుస్తూ ఉంటుంది.                           పోకిరీ   గుడిశె    లోంచి వస్తాడు.
డైలాగులు:  కాకా   తండావారి    భాషలో   ఉంటాయి.                                                                           ( బ్రేకెట్లో   వ్రాసినవాటి    తెలుగు   అనువాధం,   స్కీన్   దిగువ   డిస్ప్లే   చేయాలి)
ఏక్షన్ డైలాగ్ :   మిత్తిచెట్టు  మాను  మీద   కూర్చొని,   కన్నీరు   చెంపల   మీద   ధారగా   కట్టగా
( నోట్   మేకప్   చెదర   కూడదు ! )  దుఃఖిస్తూ    ఉంటుంది.
ముంబ :  ,   మిత్తి   పోరికీ  ఏకే   నక్కో ! (   నువ్వు   ఏడ్వకు  )
మిత్తి :   హే,   ముంబ   పోకిరీకాకువ  కువ ,   దోన్  సలాబీకిశాకిరీ   నక్కో !
నా   పెళ్లయి   రెండేళ్లయింది,   పిల్లలు  లేరు  )
ముంబ:    కీ,   ఏకే   నక్కో !   కా,   నక్కనేచి   చిక్క !
ఏడవకునేను   నక్కని   వేటాడి    తెస్తాను  )
మిత్తి :   హే,   పోకిరీనక్క  వాలి   తోకచ,   హొంబ  భాగ్యాచి,   నక్క  నేచి  చిక్క  హొంబహొంబ   భాగ్యాచి !
నక్క  తోక   తొక్కి  రావడమే ఎంతో   అదృష్టం !   నక్కనే  వేటాడి   తేస్తే,   చాల   చాల   అదృష్టం ! )
  ఏక్షన్ :     మిత్తి   సంతోషంతో   ముంబకి   గుడ్ బై ,   గుడ్   లక్   చెప్తుంది.  ముంబ   హీరో  స్టైలులో  క్లోజప్   ఇచ్చి,    అడవి   వైపు   వెళ్తాడు.   విల్లు   చేత్తో   పట్టుకొని .
సీన్   నెంబరు   1   కట్ ! )
సీన్   నెంబరు  అడవి   లోపల   వేటాడే   సెక్టర్.
ఆర్టిస్ట్   స్టేటస్ :  “  ___”   (ఇద్దరు )ఒకరు    ముంబ !  ఇంకొకరు   నక్క   తోక   కప్పుకొన్న   చిన్న  కుర్రాడు/  జుజ్జొ
దుస్తులు:   ముంబకి   బెర్ ముడా,  వీపు  మీద పటకా, విల్లు,  అంబుల   పొది                                     జుజ్జొకి,   నక్క  తోలు  కప్పి,  నక్క  ముఖం  మాస్క్, 
ఆభరణాలు:    ముంబకి   పూసల   దండలు,   తాయెత్తులు,  కాకి   ఈక,                                             జుజ్జుకి  ఏమీ  ఉండవు,   తోక  మాత్రం  ఉంటుంది.
ప్రొపర్టీ :    అచ్చు నక్కలా  కనిపించే  సాఫ్ట్  టాయ్.  దానికి  పొట్టలో బాణం  గ్రుచ్చి  ఉంటుంది                   గాయం   దగ్గర  టమోటో  సాస్ !
ఏక్షన్ :    ముందుగా జుజ్జొ   పరుగు పెడుతూ  ఉంటాడు.  నక్కలాగ !  ముంబ  దానిని   తరిముతూ ఉంటాడు     చివరికి    గురిచూసి   బాణం  వదులుతాడు.
 డైలాగ్స్:   జుజ్జొ    నక్కలాగ ఊళ   పెడతాడు.                                                                            ముంబ    :హైహై !   కాక   దేవాచిహొంబ,   హొంబ   భాగ్యాచి !                                                            (  కాక  దేవా ! నీ  దయకి  చాలా చాలా  సంతోషం )                                                                        ఏక్షన్    ముంబ,  నక్క  బొమ్మని,   వెదురు   బొంగుకి   వేలాడ   దీసి,   సంతోషంతో                              గెంతుతూ గుడిశె  వైపు దారి  తీస్తాడు.
( సీను   నెంబరు 2   కట్ ! )

సీను   నెంబరు 3_________రిపీట్   సీను   నెంబరు 1
imageఆర్టిస్ట్   స్టేటస్ : సర్కిల్ (చాలమంది.,అయిదు  కన్న ఎక్కువ !
 ఆభరణాలు:    పూసలు,   దండలు,  కాకి  ఈకలు,   తాయెత్తులు,  
  ఏక్షన్ :   ముంబ  గెంతుతూ   నాట్యం  చేస్తూ,  వేటని   తీసుకొని   వస్తాడు.  రెండవ  గుడిశె   దగ్గర  మిత్తి,  చిత్తి    మాట్లాడుతూ ఉంటారు. కంబ  విల్లుకి   తాడు  బిగిస్తూ ఉంటాడు.  శాకిరీలు  వీళ్లందరి  చుట్టూ   తిరుగుతూ    ఆడుకొంటూ  ఉంటారు. 
డైలాగ్ :   ముంబ:     పోరీపోరీ !   మిత్తి   పోరీకా నక్క   నేచి  చిక్కా !
మిత్తి :   హే ! పోకిరీహొంబ   భాగ్యాచి , హొంబ   భాగ్యాచిచిత్తి   పోరీకంబ  పోకిరీ !   హేఆకిరీ,     మాకిరీముంబ   పోకిరీ   నక్క  నేచి   చిక్కా ! చూరే,   చూరే !
 ఏక్షన్ :   అందరూ   ముంబని   చుట్టు   ముట్టి,    నక్కని   అతని   భుజం  మీద   నున్న  వెదురు   బొంగు   నుంచి   దించుతారు   సంతోషంతో    చప్పట్లు !.   
( సీన్   నెంబరు  3  కట్ )
సీను   నెంబరు 4 రిపీట్   సీను   నెంబరు 3
imageఆర్టిస్ట్   స్టేటస్ : సర్కిల్ (చాలమంది.,అయిదు  కన్న ఎక్కువ !)
దుస్తులు    రిపీట్   సీను  నెంబరు 3
ఆభరణాలు:  రిపీట్  సీని   నెంబరు 3
దృశ్యం   వండిన   నక్క  మాంసం .  రెండు   కుండలలో ఉంటుంది.   మిత్తి ఒక   కుండని   శాకిరీలకి ఇస్తుంది.   రెండో    కుండని  ఒక  రాతి   బండ   మీద   పెడుతుంది.
ఏక్షన్:  శాకిరీలు,    కుండని పట్టుకొని గెంతుకుంటూ, మరొక  రాతి బండ మీద పెట్టి,  చుట్ఠూ   చేరి,  అందులోని   మాంసాన్ని   పీక్కు   తింటూ  ఉంటారు.  రెండవ   కుండ  ఉన్న   రాతి బండ  చుట్టూ  మిత్తి,   చిత్తి,    ముంబ,  కంబ   కూర్చొంటారు.
అంతలో  అనుకోని   అవాంతరం   జరిగింది.
ఒక  పోకిరీ, ఎక్కడి  నుంచో   వచ్చి,   ‘ మిత్తి’  నడుముని   చేత   చిక్కించుకొనిఆమెని   లేవ  దీసిభుజాల   మీద  వేసుకొని,   అడవిలోకి   పరిగెడుతాడు !
అది  స్క్రిప్టులో   భాగమే  ననుకొని,   తో.లేకోతులు  చూస్తూ   ఉంటారుఅనికేత్  ఒక్కడే   అలర్ట్  అవుతాడు. “  కామినీనిన్ను ఎత్తుకు  పోతున్నపోకిరీఅసలు  సిసలు  పోకిరీనువ్వు  మంచిగా   మాట్లాడి,   వాణ్ని నీ మాకిరీని   చేసుకో !” అని బిగ్గరగా  అరుస్తాడు. `కామినికి   విషయం   అర్థమయిందితనని  మోసుకెళ్తున్న  పోకిరీ   భుజం  తట్టి   చెప్తుంది.  “    పోకిరీకా,   కీ,   కువ  కువ  నక్కోకా   కాచ  చుచ్చుచ్చు   మాకిరీ  ఆహే !  ( ఓరేయ్పోకిరీ !   నేను  నిన్ను  ప్రేమించడం  లేదు,   నువ్వు  నా  కొడుకు   లాంటి   వాడివి !)
పోకిరీ  నిర్ఘాంత  పోయి, ఆమెని  క్రిందకి దించుతాడుకామిని   వెంటనే   వాడి  తలని   తన   గుండెల   కేసి  అదుముకొంటుంది. వాడు ఆమె పాదాలకి  దండం పెట్టి, వెనక్కి   తిరిగి  చిత్తి  దగ్గరకు  వస్తాడు. విషయాన్ని   అర్థం చేసుకొన్న   చిత్తి  వేషం   లోని   పిపాస  కూడా,  “    పోకిరీ ! కాకీ  కువ  కువ  నక్కోకీకాచ  మాకిరీ  ఆహే !”  అంటూ  వాడి   తలని   తన   గుంఢెల   కేసి,   అదుముకొంటుంది.  వాడు   ఆమె   పాదాలకి   మొక్కి,    నిరాశతో  అడవి   లోకి  పారిపోతాడు.
అంతే !  అడవిలో   ఆట   విడుపు   అయిపోతుంది.
రాహు  కేతువులుకామినీ   పిశాచాలు,   తో,లేకోతులుమళ్లీ   విల్లంబులతో     పోకిరీలు    వెంట   పడతారేమోనని   కాలికి  బుద్ధి   చెప్తారు !

Posted by గీతాచార్య Apr 21, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!