BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

Showing posts with label Cinema/సినిమా. Show all posts
Showing posts with label Cinema/సినిమా. Show all posts

This article was published in Navatarangam two years ago. After a surprising incident, I wish to republish this one here for B&G. You can know about that incident here...

పొద్దున్నే అంటే, నాలుగు గంటలకు, లేచి సంధ్యోపాసన చేసి, దైవ ప్రార్ధన చెసి, నిర్మలమైన మనస్సుతో కూర్చుంటే, నాలోని భ్రమలు తొలగి, అహం అణగి, మదమాత్సర్యాలు నశించి, ఆకాశాన సందె చుక్క కనిపించింది. దాని అందానికి ముగ్ధుడనై నే నాకసము వైపు నా దృక్కుని సారించగా తారల తళుకు బళుకులు నన్నమితాశ్చర్యమునకు గురి చేసినవి. అప్పుడే నాకు నేనెంత చిన్న వాడిననే భావన కలిగినది.

ఈ అందమైన పృకృతిని సృష్టించిన ఆ భగవానునికి మ్రొక్క బోగా, “నన్ను కాదు నాయనా, నన్ను గూర్చి తెలుసుకున్న వారి గురించి ఆలోచింపుము.  నీ సత్యాన్వేషణ ఫలిస్తుంది,” అన్న మాటలు ఎక్కడినుంచో వినవచ్చాయి. ఎవరా అని ఆలోచింపక, ఆ మాటల సారాన్ని అవగతం చేసుకునే ప్రయత్నమున మునిగి నాను. 

అంత నాకొకటే భావన…

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్,
శివాది షణ్మతముల గూఢములన్,
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావముల నెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన వారెందరో మహానుభావులూ……ఆఆఆ…..

ఇక మనసాగలేదు. అందుకే ఆ త్యాగ బ్రహ్మని తలంచుచూ… నా ఈ చిరు ప్రయత్నమును ప్రారంభించాను.
నాగయ్య గారు నటించిన త్యాగయ్యని అప్పట్లో చూడని తెలుగు వారు ఉండి ఉండరు. మా నాన్నగారి మాటల్లోనైతే మా ఊళ్ళో వాళ్లు బళ్ళు కట్టుకుని మరీ చూసిన సినిమా అది. సినిమా అనే మాట తక్కువ. చిత్రరాజం… ఊహూఁ. చూద్దాం. ఏమంటామో చివరకు. నటీ నటుల గురించి చెప్పనవసరం లేదు. ఈ కళాఖండానికి కర్త, కర్మ, క్రియ అన్నీ చిత్తూరు వి. నాగయ్య. అంటే నాగయ్యగారు. (ఇప్పుడు దొరికే DVD/VCD ల మీద లేబెల్ అలాగే ఇస్తున్నారు).

ఆయన ప్రతిభ గురించి మాటలాడే సాహసం చేయను. కానీ అతి కొద్ది మాటలలో నా అనుభూతులను పంచుతాను. మొదటి సారి గా నేను ఒక వేమన సినిమాని చూశాను. నా వయసుకప్పటికి అది మహా విసుగు అనిపించింది. నటీ నటుల గురించి నేను చెప్పను. కానీ కొన్ని రోజులతరువాత నేను ‘భక్త పోతన’ సినిమా చూశాను. అందులో పోతన పాత్ర దారి శాంత గంభీరమైన నటన, సరళ గంభీరమైన గాత్రం, నన్ను ఏవేవో లోకాలకి తీసుకుని పోయి, మైమరపించి, అలా టీవీకి నన్ను కట్టి పడేసినాయి.

అప్రస్తుతమైనా ప్రస్తుతమే ఇది. అందుకే ఇక్కడ వ్రాస్తున్నాను. ‘బొబ్బిలిరాజా’ సినిమా చూసి, అందులో వెంకటేష్ నటనకి My మరిచి కొన్నాళ్ళు ఆ అనుకరణ చేసిన నాకు, ఈ వ్యక్తీ నటన నచ్చటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. (అదే నా జీవితం లోని తొలి, ఆఖరి అనుకరణ. ఎందుకో నాకు అనుకరణ అంత నచ్చదు. ఎప్పుడన్నా ప్రయత్నించినా పొత్తు కుదరదు). కానీ నాకు ఆశ్చర్యం కలుగలేదు. ఆ నటునిలోని మహత్తు అలాంటిది. అందుకే ఇంకొటేదో సినిమా వస్తుంటే చూశాను. అందులోనూ ఆ పోతనే. అంతే. నేను మళ్ళీ టీవీ కి అతుక్కుని పోయి చూసిన ఆ సినిమా ‘నాగయ్యగారి వేమన’.

నా వయసు వారికి ఆ రోజుల్లో ఉండే అభిమాన నటులు కాకుండా Break the Rules అంటూ నాకు అభిమానం లో ఒక కొంగ్రొత్త కోణాన్ని చూపించిన నాగయ్యకి నివాళిగా…

ఈ చిత్రానికి ‘ఎందఱో మహానుభావులు’ పని చేశారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది, ‘జపేశన్’ పాత్రధారి ఐన ‘ముదిగొండ లింగమూర్తి’ గురించి. అసలు మన ముందు ఆ జపేశనే ఉన్నాడా అనేటంత సహజమైన నటనని ప్రదర్శించారు. ‘ఏమిరా త్యాగూ’ అంటూ ఆయన చెప్పే డైలాగ్ అప్పట్లో వాళ్ల బడిలో ఎవరన్నా మాట వినక పోతే వాళ్ల మాష్టారు వాడేవారని మా గురువు గారు చెప్పేవారు. అంటే అంత నలిగి ఉంటుంది ఆ తరం వారి నోళ్ళలో. ‘సుకవి నిల్చు జనుల నాల్కల పైన…’ అని చిన్నప్పుడు చదువుకున్నాను. గొప్ప నటులు కూడా అంతే. వారి వారి మేనరిజాల వల్ల. (ఇప్పుడూ ఉన్నారు. అది నా బాధ్యత కాదు).

కానీ ఆ మాటలు త్యాగరాజ మహాకవి విషయంలో మాత్రం ఎవరికీ చెప్పనవసరం లేదు. ఆయన సుకవే కాదు భక్త కవి కూడా. అంతేనా ఒక గొప్ప సృష్టి కర్త కూడా. ఎన్నెన్నో రాగాలని సృజియించిన సృజనశీలి ఆయన.
అంతటి ఆ మహా వాగ్గేయకారుని చరిత్రని తెరక్కెక్కించే సాహసానికి ఒడిగట్టారు నాగయ్యగారు. ఎంతో సాహసంతో, భక్తితో ఎన్నో విమర్శలు ఎదుర్కుని, ఖర్చుకోర్చి, తీసిన ఆ చిత్రం ఆయనని భక్తి చిత్ర నటునిగా అమరత్వాన్ని కలుగజేసింది.

త్యాగరాజ మహాకవి జీవితం లోని కొన్ని మధుర ఘట్టాలనూ, ఆయన మనకి ప్రసాదించిన గీతాలలో కొన్నింటిని, నాగయ్య గారు తనకే సాధ్యమైన శైలిలో మనకి అందజేసి మనలను ధన్యులని చేశారు. ఆయన గళం లో నుంచీ జాలువారిన ఆ త్యాగరాజ కృతులు ఎంతటి ఆనందాన్ని కలిగిస్తాయో… ఆ చక్కని పద ఉచ్ఛారణ అంత మహత్తరంగా ఉంటుంది. (కొందరు పెద్దలు పాడినప్పుడు వారి పాండిత్య ప్రదర్శనే తప్ప హావ భావాలలో త్యాగరాజ హృదయాన్ని అందుకోలేక పోయారు. ఎన్నోసార్లు విని నేను చెపుతున్న మాట ఇది. ఆ భక్తి కూడా కానరాదు). కానీ నాగయ్యగారి ప్రత్యేకత అక్కడే మనలని కట్టి పడేస్తుంది. ఆయన లీనమై, మనని కూడా లీనం చేస్తారు. భక్తి తప్ప ప్రదర్శనా ధోరణులు ఎంతమాత్రం కానరావు. ఆ రోజుల్లోనే కారులో తిరిగిన భోగి ఐన ఆయన ఈ భక్తి యోగి పాత్రని అంత గొప్పగా పోషించారంటే ఎంత ఆశ్చర్యమో నాకు. చేసే పని మీద దృష్టి తప్ప అన్యం తెలియదేమో ఆ మహా నటునికి. తప్పు తప్పు. మహానుభావునికి. కేవలం నటించటమే కాదు. దర్శకత్వాన్ని కూడా నేరిపి, సంగీతాన్ని అందించి, గానామృతాన్ని పంచ గలిగారంటేనే ఆయన బహుముఖ ప్రజ్ఞ, శక్తి సామర్ధ్యాలూ, చేసే పని పట్ల అనురక్తీ మనకి అర్ధం అవుతాయి.

ఇక సినిమా గురించి చెప్పాలంటే ముందు ఆయన ఇచ్చిన వివరణని గురించి చెప్పాలి. కొంచం అటూ ఇటూ గా ‘This is not an historically accurate account. Many popular legends are taken into account. This is for dramatization’s sake.” అందుకే కొన్ని చరిత్రకందని విషయాలూ ఉన్నాయి ఆ చిత్రం లో. అందులో ముఖ్యమైనది… ‘నారద మహర్షి’ మారు రూపం లో ప్రత్యక్షం అయ్యే సన్నివేశం.

అంతకు మునుపు స్వరార్ణవం కొరకు త్యాగయ్య బాధ పడే సన్నివేశాలని ఎంతో హృద్యంగా చిత్రీకరించ బడినాయి. అర్ధరాత్రి పూట స్వర రచనకు పూనుకుని, సాధించలేక (శిష్యుడు ‘బాగుంది గురువుగారూ’ అన్నా ఆయన తృప్తి పడరు.) ఆ తరువాత ఒక రోజున ఆయన వద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చి, ఎంతో దూరం నుండీ నేను మీ పాటను వినటానికి వచ్చాను. అని ఆయనను అడుగుతారు. అప్పుడు ‘రామానుగ్రహం పొందలేని మంద భాగ్యుని’ అని బాధపడటం, ఆ వ్యక్తి ఒక పోత్తమునిచ్చి ఆయనను పరిశీలించమనటం వెనువెంటనే జరిగిపోతాయి.
ఆయన పరిశీలించే సమయం లో ఆ సంగీత జ్ఞానం, సరస్వతీ కటాక్షం అక్షరాల రూపం లో అక్షరంగా ఆయనలో కలిసి పోవటం అప్పటి టెక్నికల్ స్టాండర్డ్స్ అనుసరించి అద్భుతమనే చెప్పాలి.
“ఎవరు స్వామీ మీరు?” అని అడుగగా ఆయనకు ప్రాప్తమైన సమాధానం… “మా అమ్మ వీణ వాయిస్తుంది.”
ఈ సమాధానం మరో మహానుభావుడు సముద్రాల రాఘవాచార్య (సముద్రాల సీనియర్) వ్రాసినది. ఈ చిత్రానికి వీరే సంభాషణలను కూర్చారు. వీరి గురించీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరు మా స్వగ్రామానికి చెందిన వారు.
ఈ సన్నివేశంలో చిత్రం ఏమిటంటే అప్పటి దాకా త్యాగరాజు పొందిన ఆవేదనంతా చేత్తో తీసేసినట్టుగా పోతుంది. అప్పుడు కలిగిన పులకరింతలో ‘శ్రీ నారదా మౌనీ’ అనే కీర్తనని పాడుతారు. మనకీ మనసు పులకరిస్తుంది. అరె! నారద మహర్షి ఇలాగే ఉంటారా? అని అనిపిస్తుంది. అతిశయోక్తి కాదు. ఒక్క సారి నారద మహర్షి రూపం (ఈ సినిమాలో వచ్చే క్షణకాలంలో) చూస్తే మన మనసులలో నుంచీ తొలగిపోదు. అనుభవించాలే గానీ వర్నించనలవిగాని ఆనందం కలుగుతుంది ఆ ఒక్క సన్ని వేషంతోనే. చారిత్రకంగా జరిగిందని చెప్పలేక పోయినా ఆ నారద మౌని అనుగ్రహం కలుగనిదే త్యాగ బ్రహ్మ ఇంతటి వ్యక్తిగా నిలిచేవారు కాదేమో. నా ఉద్దేశ్యం నాగయ్యగారు కూడా ఆ దేవర్షి అనుగ్రహం పొందారేమో!.

మరొక సన్నివేశం… “ఎందఱో మహానుభావులు” కీర్తన వచ్చే సమయంలో. ఆ సన్నివేశంలో ఎందఱో మహానుభావులు, సంగీత విద్వాంసులు ఒక సభలో కూడి ఉంటారు. త్యాగయ్య తన గురువు గారి ఆజ్ఞ మేరకు అచటికి వెళ్లి వారి ఆశీర్వాదములను, ఆనతిని (ఆయనే పాడమని కోరుతారు) పొంది ప్రారంభించే “ఎందఱో మహానుభావులు” అజరామరమై నిలిచి ‘పంచరత్నా’లలో ఒకటిగా కీర్తిని పొందగా, నాగయ్య గారి సన్నివేశ రూపకల్పన, imagination, గాత్రం, స్వరకల్పనా, తోటి నటుల నుంచీ తనకు కావలసిన effect ని పొందిన తీరూ, తెలుగు చిత్ర పంచరత్నాలలో ఒకటిగా చేశాయి.

త్యాగయ్య పాడటం అవగానే ఒక విద్వాంసుడు ‘బ్రహ్మానందం కలిగించారండీ త్యాగయ్య గారూ’ అనటం ఆ సన్నివేశంలో అక్కడి వారికే కాదు. చూసిన మనకి కూడా నాగయ్య గారు ‘బ్రహ్మానందాన్ని’ కలుగ జేశారు. అక్కడ త్యాగయ్య పాడే సందర్భంలో ఉన్నా వ్యక్తులు నిజంగానే లీనమైపోయి ఉంటారు. ఆ సహజత్వం చాలా అరుదు.

I planned a follow up for this article long ago. But did not finish it as I felt can I maintain the same standards. But now I finished one. And will publish it here in 10 days. 

Posted by గీతాచార్య Sep 16, 2010

This is a series on James Cameron's movies, and the technology he introduced in the movies. This is to be treated a tribute to that poineering legend. The series starts now

By గీతాచార్య

Prologue:

అవతార్ ఫ్లాప్ అయితే అసలు సినిమాలు తీయటం (కామెరాన్ కాదు) మానేయ వచ్చు. ఇది నేను సినిమా చూడటానికి రెండు రోజుల ముందన్న మాట. అవతల విన్న వాళ్ళు నవ్వారు.
*** *** ***

Chapter 0 మే నెలాఖరులోనువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా…” పాట విని గో గో గో (ఉరఫ్ పో పో పో) చూడాలనుకున్నాను. సినిమా వచ్చిందాకా ఎదురుజూస్తూనే ఉన్నాను. సినిమా ()చ్చింది. expectations అన్నీ గల్లంతు. పాట సినిమాని నిలబెట్టిందని కొందరు సినీ పే(ట్రియాట్)కేయులన్నా అది ఉత్తుత్తి సినిమానే, వంశీ ఏదో అలా అలా లాగించాడని అందరికీ (ఈవెన్ వంశీకి కూడా తెలిసిన విషయమే).

దరిదాపుల దసరా టైమ్. ఒకరోజు విజయవాడ మ్యూజిక్ వరల్డ్ లో ఉన్నా. నాతో పాటు వచ్చిన రవి అక్కడ హెడ్ఫోనులు పెట్టుకుని పాటలు వింటుండటం గమనించాను. సర్లే అని ఊరుకుని నాక్కావాల్సిన సీడీల్ని తీసుకుని బయటకొస్తున్నప్పుడు చెప్పాడు. ఏక్ నిరంజన్ పాటలు నెట్లో దొరికితే ట్రై చెయ్. బాగున్నాయి. ఏదో తలూపాను. ఇంటికొచ్చాక మర్చిపోయాను. పుదొవ్కిన్ ఫొటో కోసం వెతుకుతూ ఆయన సినిమాల గురించి యూట్యూబులో వెతుకుతుంటే అప్పుడు ఇందాకన వాడన్న సంగతి గుర్తొచ్చి రాగా ఓపెన్ చేసి ఏక్ నిరంజన్ పాటల కోసం చూశాను. ముందుగా మణి శర్మ మీద నమ్మకంతో (టైటిలు/హీరోగారి సోలో సాంగులు బాగా చేస్తాడని) ఏక్ నిరంజన్ అని ఉన్న పాట మీద క్లిక్కాను. అప్పుడు టైము రెండూ ఇరవై నాలుగు. నైటౌట్లో రాత్రంతా పాట మ్రోగుతూనే ఉంది. మధ్య మధ్యలో మిగతా పాటలు. అసలు సినిమా ఎనౌన్స్ చేయగానే మాంఛి అంచనాల మీదున్నా. పాటలు బాగుండటంతో ఇంకా అంచనాలు పెరిగాయి. (జనం కూడా టైటిల్ సాంగు వినే సినిమాకెళ్ళారని...) LOL. సినిమా కూడా తుస్సంది. పూరీ కూడా ముంచేశాడు. (సినిమా నాకు కొన్ని angles లో బాగా నచ్చింది. అది వేరే విషయం).

Chapter 1 "మీరు అనుకున్న విధమైన వ్యాఖ్య వీటిలో ఒక్కటైనా ఉందా? మీరు వ్రాసిన వ్యాసాన్ని ఒక్కరైనా మీరెలా అనుకున్నారో అలా అర్థం చేసుకున్న వాళ్ళెవరైనా ఉన్నారా?" ఆయన్ని అడిగాను. సమాధానం నాకు బాగానే గుర్తుంది.

అవతార్!

ప్రపంచం మొత్తం ఎదురుజూసిన సినిమా. లేదా అలా అని జనం అనుకున్న/లేదా మార్కెటింగు మాయాజాలం నమ్మించిన సినిమా. టైటానిక్ డైరెక్టర్ అద్భుత సృష్టి. ప్రచార సాధనాల హోరు. నేనూ, నా స్నేహితుడూ మాట్లాడుకుంటున్న సందర్భంలో మా మాటలు అవతార్ మీదకి వెళ్ళాయి. నేను అన్నా, "ఇన్నాళ్ళు కష్టపడి తీశాడు. సినిమా ఫ్లాపైతే ఇక మునిగినట్టే. ఇన్నాళ్ళ శ్రమా బూడిదలో పోసిన పన్నీరే"

మా వెనుక ఉన్న మా నాన్న గారన్న మాట... "ఆడుతుంది. ఇది కామెరాన్ సినిమా కదా." ఎప్పుడో టెర్మినేటర్ (నేను ఇంగ్లీషు సినిమాలు చూడటానికి గేట్లెత్తిన సినిమా) చూసిన నమ్మకం. టైటానిక్ తో పెరిగింది.

Chapter 2 పనామా, వెనిజులా, ప్యూర్టోరికో, మొదలైన లాటిన్ మెరికన్ దేశాలు, ఆయిలుత్పత్తులున్న అర()బ్బు దేశాలు, ఇంకేమన్నా చిన్నా చితకా దేశాలు. ఇవి దొరికితే అమెరికన్లు వదిలిపెట్టరని ప్రతీతి. రేంజిలో అంటే ఒక కన్సల్టెంటునక్కడికి పంపి, వాళ్ళ చేత ఫాల్స్ అంచనాలు జేయించి, అనవసరపు ప్రాజెక్ట్లకి ఉసిగొల్పి, అభివృద్ధి పేరుతో దేశాలకప్పులిచ్చి, వాళ్ళని వల్లో వేసుకుని...

లేదా తీవ్రవాదమనే బూచో, అణ్వాయుధాలనే మిథ్యా శతృవులను చూపెట్టి దాడులకు తెగబడి అక్కడ తమకు అనుకూలుడైన వ్యక్తిని డమ్మీగా కూచోబెట్టి...

దాదాపూ ఒక అర్థ శతాబ్దపు కథ ఇది. ఇప్పుడు మరో క్రొత్త దోపిడి మొదలైంది. ఈ కథలన్నీ మనకి చెప్పి పుస్తకాలు వ్రాసి, అయ్యో అప్పుడు నేను ఆ వ్యూహంలో పావుగా వాడుకోబడ్డాను. నన్ను క్షమించమని కూడా అడగను. కానీ ఎంతకాలమో ఆ దురాగతాలు జరుగ కూడదు. అందుకే ఆ రహస్యాలు నాతోనే అంతం కాకుండా బహిరంగ పరుస్తున్నాను (ఎంతైనా అమెరికన్లు అమెరికన్లే) అంటూ డబ్బు చేసుకునే... జనానికిచ్చే పెర్కులు. ;)

జేమ్స్ కామెరాన్ కథని కాస్త ముందుకు జరిపాడు. 2154 సంవత్సరం. భూమ్మీద వనరులు అయిపోయాయి. మనాసీయులు క్రొత్త గ్రహం ఉనికిని కనుక్కున్నారు. అక్కడ బ్రహ్మాండమైన వనరులున్నాయి. We are desperate to have a control on them.

Chapter 3 చాలా సాదా సీదా కథ. కానీ ఎంతో లోతైన ఆలోచనలున్నాయందులో. లాటినో/అరబ్బు జనాల బదులు పండోరా అనే అద్భుతమైన గ్రహాన్ని సృష్టించాడు. అందులో ఏలియన్లని కాస్త మనసున్న జీవుల్లా ఊహించుకుని, వాళ్ళకీ మమతలూ అనుబంధాలూ ఉంటాయని నమ్మాడు. ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరించాడు.

మరి మన మనుషులు? ఆ గ్రహమ్మీదున్న వనరుల మీద కన్నేశారు కదా. వారెలా ఆ లక్ష్యాన్ని చేరేందుకు ఒక ప్రణాలిక వేశారు. దానికోసం ఒకరిని అక్కడ జనాలతో కలిసిపోయేలా చేస్తే! ఆ మనిషక్కడ రహస్యాలను ఛేదించి వివరాలందజేస్తే... ఆ గ్రహం మీద ఉన్న నిధులనలా ఆ వ్యక్తి సాయంతో దక్కించుకోవచ్చనేదే ఆ ప్రణాళిక.

Chapter 4 ప్లాను సరే. దాన్ని అమలు జరిపే మార్గమేది? ఇతర గ్రహమంటే మనకనుకూలమైన వాతావరణ పరిస్థితులుండవు. తగినంత ఆక్సిజనుండదు. ఎలా? అక్కడికి పంపబడిన మనిషి మనుగడ ఎలా?

అందుకే ఆ గ్రహాన్ని తట్టుకోగలిగే శరీరాలను సృష్టించారు. వాటిలోకి బుద్ధి జీవుల్ని ప్రవేశ పెట్టారు. ఇక్కడ వారిని బజ్జోపెట్టి ఆ గ్రహమ్మీద క్రొంగొత్త శరీరాలతో పనిజేసేలా ప్రయోగం చేశారు. అలా వాళ్ళనుకున్న హిట్మాన్లని అక్కడకు పంపగలిగారు. మెదడు ద్వారా ఆపరేషన్. దీన్నే విఠలాచార్య పరకాయ ప్రవేశంగా చూపెట్టాడు. కామెరాన్ ఒక సైన్సు ప్రయోగంగా మార్చాడు.

Chapter 5 కామెరాన్ కథని సాదా సీదాగా ఊహించలేదు. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా ఊహించాడు. అసలు నాదో ప్రశ్న! కామెరానీ సినిమా ఎందుకు తీశాడు? ఎవరికోసం తీశాడు?

జేమ్స్ కామెరాన్ సినిమాని కేవలం తన కోసమే తీశాడు. Yes. Only for himself. అందుకే తను అనుకున్న రీతిలో టెక్నాలజీ డెవలప్ కానంత వరకూ కథ మీద దృష్టి పెట్టాడు. సినిమాని ఆత్రంగా తీసేసి సొమ్ముజేసుకోవాలనుకోలేదు. కారణం... ప్రేక్షకులో, ఇతరులో ఇచ్చే జజ్‍మెంట్ కన్నా తన జజ్‍మెంట్ ముఖ్యం. తాను అనుకున్నది అనుకున్న రీతిలో తీశాడా లేదా అన్నది మాత్రమే తనకు ముఖ్యం.

ద టెర్మినేటర్... ఒకప్పుడు సంచలనం సృష్టించింది. అలా ఇలా కాదు. సైఫి లో ఒక లాండ్ మార్క్ ఆ సినిమా. ఉన్న అతి తక్కువ బజెట్ తో అనుకున్న ఎఫెక్ట్ ని రాబట్టిన ప్రతిభ. దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చేందుకు స్క్రిప్ట్ ని కేవలం ఒక్క డాలర్ అంటే ఒక్క డాలర్ కి అమ్మేశాడు. అదీ తన మీదా, తన సామర్థ్యం మీదా కామెరాన్ కి ఉన్న నమ్మకం.

ఏలియన్స్ గురించి నాకంతగా తెలియదు.

ఎబ్బీస్... అండర్ వాటర్ సన్నివేశాలను అత్యంత చాకచక్యంగా, నిజమనే అనుభూతి కలిగేలా తెరకెక్కించి సినిమా దర్శకత్వానికి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు.

టెర్మినేటర్ 2 జజ్‍మెంట్ డే... అందులో చూపిన ఛేజింగు సన్నివేశాలని పదేళ్ళ తరువాత వచ్చిన టీత్రీ లో కూడా వాడుకున్నారంటేనే తెలుస్తుంది కామెరాన్ చిత్రీకరణ సామర్థ్యం. అందులో విలన్ కి సంబంధించిన సన్నివేశాలు, విలన్ జాన్ కానర్ ని చంపబోయినప్పుడు ఆర్నాల్డ్ పిల్లాడిని రక్షించేందుకు రావటం, అప్పుడు జరిగిన ఛేజింగ్ భూతో నభవిష్యతి అన్నరీతిలో ఉంటాయి. సినిమా మొదటి నుంచీ చివరిదాకా కామెరాన్ దర్శకత్వ ప్రతిభ (తక్కువ మాటేమో), స్క్రీన్ ప్లే ని గ్రిప్పింగ్ గా నడిపించిన తీరూ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ట్రూ లైస్ ఎంత బాగుంటుంది?

ఆపైన టైటానిక్. మూడున్నర గంటల సినిమాని మూడు నిమిషాలే అన్నంత ఈజీగా జనం చూశారంటే అది చాలదూ. పన్నెండేళ్ళ పాటూ ఒక్క సినిమా కూడా తీయకుండా ఉన్నా, జనం ఇంకా టైటానిక్ డైరెక్టర్ అని గుర్తుంచుకున్నారంటేనే తెలుస్తుంది ఆ సినిమా సంచలన విజయం. కేవలం టెక్ ఓరియంటెడ్ సన్నివేశాలే కాదు. హీరో విలన్ పాత్రల మధ్య ఉన్న కాంట్రాస్ట్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా గొప్పగా ఉంటుంది. వయొలిన్ వాయించే వారి సన్నివేశాలూ, హీరో హీరోయిన్ని కాపాడబోయి రేప్ కేసులో ఇరుక్కునేటప్పుడు హీరోయిన్ అసలు విషయం చెప్పే తీరూ (ఆ సమయంలో హీరోయిన్ వ్యక్తిత్వాన్ని మనకు ఎస్టాబ్లిష్ చేసిన తీరు గమనించ దగ్గది), హీరో అప్పర్ క్లాస్ పార్టీకి వెళ్ళిన సన్నివేశాల్లో వచ్చే డైలాగులు... చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంటుంది. లోపాలున్నాయి. కానీ, వాటిని మించిన మ్యాజిక్ చేశాడు కామెరాన్.

డాన్స్ చేస్తూ కేట్ లెన్ (డికాప్రియో) మీద పడే సన్నివేశం ఒక్కటి చాలు. కామెరాన్ టచ్చేసిన హైట్స్ ని అర్థం చేసుకునేందుకు. ఆ సినిమా వచ్చిన క్రొత్తల్లో ఆంధ్రజ్యోతి మహిళా పేజీలో రోజ్ లవ్యూ అన్న పేరుతో వచ్చిన ఒక వ్యాసం ఈ విషయాన్ని చాలా కూలంకుషంగా చర్చిస్తుంది. మన హీరోయిన్లకీ, కామెరానియన్ హీరోయిన్లకీ మధ్య ఉన్న తేడానీ, ఆ రోజ్ పాత్రని మలచిన తీరూ, కామెరాన్ కహనీ, పాత్రలనీ ఎస్టాబ్లిష్ చేసిన, నడిపించిన విధానం గురించి చాలా గొప్ప వ్యాఖ్యానం అది. నా పీజీ ముగిసే దాకా ఆ కటింగుండేది నా దగ్గర. ఎప్పుడైనా టైటానిక్ గుర్తొస్తే అది తీసి చూసుకునేవాడిని. (ఎవరికన్నా అది గుర్తు ఉంటే/తెలిసి ఉంటే చెప్పండి. చాలా మంచి వ్యాసం).

ఇక్కడ చెప్పినవి వేటి కవే గొప్ప చిత్రాలు. విమర్శకులు గుర్తించినా గుర్తించక పోయినా తాను ఎలా తీశానన్నది కామెరాన్ కి తెలుసు.
*** *** ***
As of his intentions, it is an articlein the FAMEnator series.

Posted by Dhanaraj Manmadha Jul 17, 2010



తెలుగువారందరూ మరువలేని మహానటి సావిత్రి . ఆమె నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంధాలయం. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6న గురవయ్య, సుభద్రమ్మలకు జన్మించారు. నాట్యంలోనూ, సంగీతంలోనూ ప్రవీణ్యురాలై, ఎన్నో ప్రదర్శనలిచ్చారు. పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నోకష్టాలకోర్చి, తిరుగులేని అభినేత్రి గా పేరు పొందారు.

తెలుగు వారు మరచిపోలేని పాత్ర సావిత్రి నటించిన "దేవదాసు"లోని పారు. అప్పటికీ,ఇఫ్పటికీ వన్నె తరగని చిత్రమది. అలాగే "మాయాబజార్"లోని శశిరేఖ పాత్ర. ఇప్పటికీ "అహనా పెళ్ళంట...." పాటని ఆ సన్నివేశాన్ని ఎవరూ మరువలేరు . ఆ చిత్రంలో చిలిపి చూపులతో, పెదవి కదలికలతో, తన నటనతో ఎందరినో మంత్రముగ్ధులను చేశారు ఆమె. "నర్తనశాల", "శ్రీకృష్ణపాండవీయం", "సుమంగళి", "నాదీ ఆడజన్మే", "నవరాత్రి" ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు ఆమె నటనాకౌశలానికి దీపికలు. "దొంగరాముడు", "తోడికోడళ్ళు", "అభిమానం"," మురిపించే మువ్వలు (1960)", "మంచిమనసులు(1961)", "డా. చక్రవర్తి (1964)", "దేవత(1965)", "మనసే మందిరం (1971)"... వంటి చిత్రాలు ఆమె నటనకి మైలు రాళ్ళు. తెలుగు తమిళ, హిందీ చిత్రాలన్నిటిలో కలిపి 318 సినిమాలలో నటించారు. హిందీలో "బహుత్ దిన్ హుమై", "ఘర్ బసాకే దేఖో", "బలరామ్ శ్రీకృష్ణ", "గంగాకి లహరే" మొదలైన చిత్రాలు చేశారు.


తెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్ని అలరించిన సావిత్రి తెలుగు సినీ సామ్రాజ్ఞి. సినీ జీవితంలో అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినా, నిజ జీవితంలో అతిఘోరంగా విఫలమయ్యారు. ఆ బాధలో తాగుడు,మత్తుపదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యం చెడి , అప్పులపాలై, అతి దయనీయ పరిస్థితుల్లో, చిన్నవయసులోనే మృత్యువుతో పోరాడిన ఆమె జీవిత చరమాంకం అందరికీ ఒక పాఠం. ఆమె నటజీవితం ఎందరో నటీమణులకి మార్గదర్శకం.

సావిత్రికి క్రికెట్ అన్నా, ఛెస్ అటలన్నా మిక్కిలి ప్రీతి. ఆమెకి ఎడమచేతి వాటం ఎక్కువ. తన పిల్లలని ప్రేమతో చూసుకునేవారు. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి అని అందరూ ఒప్పుకునేవారు. ఒకసారి సావిత్రి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసారు.




అటువంటి మహానటికి Durga Dingari ఇస్తున్న సుమధుర నీరాజనం. ఈ కార్యక్రమం దుర్గ తెలుగువన్ కోసం చేసారు. నా అభ్యర్తన మేరకు BG కోసం ఈ ఆణిముత్యాన్ని అందించారు. థాంక్స్ దుర్గా..

Posted by జ్యోతి Jun 11, 2010



నన్నసలు కదిలించ వద్దు. పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాను. Except on emergencies, don't even try to message me. అని గట్టిగా అందరికీ వార్ణింగిచ్చి, ఏమన్నా B&G వ్యవహారాలుంటే నువ్వే చూసుకో, అని ధన కి అప్పగించాక ఓ రెండు గంటల క్రితం వరకూ నాకే డిస్టర్బెన్స్ లేదు. ఇందాకన హట్ఃఆత్తుగా నా ఫోన్ మ్రోగుతుంటే చాలాసార్లు కట్ చేశాను. ఇక లామ్భం లేదనుకున్నాడో ఏమో, మెస్సగెన్ పెట్టాడు ధన, Veturi died. Shall we post anything అని. 

ఏమి చేద్దాము? సంతాపం తెలుపుదామా? అందరూ చేస్తున్నదదే కదా! అయినా వయసు దాటిపోయింది. మాట కూడా సరిగ్గా రావటం లేదు, అని ఈ మధ్యే కదా అనుకున్నది. మనిషిని మనం మిస్సవుతాము నిజమే కానీ, దానికి బాధ పడటమంటే ఆ మనిషిని అవమానించటమే (అదెలాగో మా మోటార్‍సైకిల్ డైరీస్ లో చదువుదురు). 

నువ్వు నీ స్టైల్లో చెపుతావు సరే. అదందరికీ అర్ధం కాదు కదా. నువ్వేమి చెయ్యాలనుకుంటున్నావో అది చెప్పు అన్నాడు.

ఆయన వల్ల నాకు తెలిసిన సత్యాన్నో, జరిగన మేలునో, లేదా నన్ను ఇన్స్పైర్ చేసిన అంశాన్నో అందరికీ చెపుదాము. అదే ఆయనకు నివాళి. మనిషి లేడని బాధ పదటం కాదు. ఆ మనిషి లెగసీని (తెలుగుభాషాభిమానీస్ ఎవరన్నా ఉంటే నా భాషకు అభ్యంతరం చెప్పుద్దు. అది నా సహజమైన భాష. వాడుకలో ఎక్కువ ఆంగ్ల పదాలు దొర్లుతుంటాయి. అవసరమైన సందర్భాల్లో ఒక్క ఆంగ్ల పదం లేకుండా కూడా వ్రాయగలను)

సరే ఆలోచిస్తే ఒకటనిపించింది. వేటూరంటే నాకు గుర్తొచ్చేది ఒకే పాట. అది అర్జున్ సినిమాలోని సంభవామీ పాట. అందులోనూ, మనసు ఉంటే మార్సు దాకా మార్గముందీ చలో (చూశారా సందర్భాన్ని బట్టీ ఆయనా అలాగే వ్రాశారు ;-)) అన్న మాటలు నాకు బాగా నచ్చినవి. అందుకే ఆ పాటను ఇన్స్టెంట్ నివాళిగానూ, నాకు తీరుబాటయ్యాక ఈ పాట గురించిన పెద్ద ఎనాలిసిస్ తో ఇంకా పెద్ద నివాళినీ అర్పిస్తాను.
*** *** ***

WE MISS VETURI. BUT NOT HIS GREAT WORK. ITZ ALWAYS IN OUR HEART.


సంభవామీ సంభవామీ
సాగరాలే దాటిపోనీ
అంబరాలే అంటుకోనీ
సంభవామీ

ఒక్క మాటా ఒక్క బాణం ఒక్కటేలే గురి
ఒక్క చూపుకి దిక్కులన్ని పిక్కటిల్లే ఝరి - ఝరి
ఓటమంటు లేని వాడు ఒక్కడైన సరి
ఓ మనసు ఉంటే మార్సు దాకా మార్గముంది చలొ
చల్రే చలొ చల్రే చలొ
చల్రే చలొ చల్రే చలొ

free ur mind free ur soul
see what u find and take control
high high through the sky through the sky fly high
through the sky fly
through the sky fly high fly
one word one shoot
i am here to stay

చుక్కలు దించెయ్ చక చకా
హక్కులు మనవే పద పదా
రెక్కల గుర్రం ఎక్కిపో
ఆ గగనాన్నే ఏలుకో
స్వాగతం అనదినం గీతికా
జాబిలికే కధచెపుదాం
వెన్నెలతో జతకడదాం
సాహసం చెయ్యర ఇంకా ఢింబకా
చినుకులనే జోడిద్దాం
చేడుగుడునే ఆడేద్దాం
ఆకాశంలో భూకంపాలే సంభవం
సర్వం నీకే సంభవం
రోధసీ నీ ప్రేయసే లే

పరుగులు పెట్టే గంగను ఉరికే కృష్ణ తొ కలపరా
నదులే కాదు యదలను కలిపేస్తేనే గేలుపురా
జీవితం equatorలొ స్నేహితం
స్వరములతో జతకడదాం
శరములతో గురిపేడదాం
యవ్వనం is equal to అద్భుతం
మనసల్లే పరిగెడదాం
మనిషల్లే నిలబడదాం
వేగం వేగం అంతా వేగం సంభవం
సర్వం నీకే సంభవం
ఊర్వశి నీ ప్రేయసేలే

*** *** ***

వేటూరి ఫొటో పెడదామని వెతికితే గూగుల్లో మంచివి, అంటే నాకు నచ్చినవి, దొరకలేదు. అందుకో వేరే ఏదో బ్లాగులో ఈ పాట స్కాన్ దొరికింది. మనిషి కన్నా ఆ మనిషి లెగసీ ఎక్కువనుకున్నాం కదా. :D అందుకే ఆయన వ్రాసిన పాట బొమ్మనే ఇక్కడ పెట్టేద్దాం అనుకున్నా. ఇక ముందు కనబడని ఆయన రూపమెందుకు? శాశ్వతమైన ఆయన పాట ఉండగా. 

పిక్చర్ మీద బ్లాగడ్రస్సు ఉంది. ఆ బ్లాగు వారికి ధన్యవాదాలతో...

Posted by గీతాచార్య May 23, 2010

ప్యాషన్ ఫర్ సినిమాలో నేను వ్రాసిన మూవీ రివ్యూ పబ్లిష్ ఐంది. చూసి ఎలా ఉందొ చెప్పండి. దీనిలో ఇంకో విశేషం ఉంది. ఈ సినిమా గురించి నేను గత సంవత్సరం నవతరంగం లో వ్రాశాను. అది చూసి బాగుందనుకుని అందులోని ఒక ఆతర్ నన్ను అక్కడ కూడా వ్రాయమని ప్రోత్సహిస్తే వ్రాసినది. అందులో వ్రాసిన దానికీ, నవతరంగంలో వ్రాసిన దానికీ చాల తేడా ఉంది. కానీ రెండూ వ్రాసినందుకు నాకు చాలా శాటిస్ఫాక్షన్ వచ్చింది.

లింక్ ఇదిగోండి... ప్యాషన్ ఫర్ సినిమా

నవతరంగం

Posted by గీతాచార్య Apr 14, 2010

ఎన్నో గదులున్న కోటలాంటి ఇల్లు, మెరిసే చీరలు, లెక్కలేనన్ని నగలు, ఎప్పటికీ అందుబాటులో ఉండే పనివారు, అధికారం అన్నీ ఉన్న ఒక గృహిణి అదృష్టవంతురాలేనా? ఇవేనా ఆమెకు ఆనందాన్నిచ్చే సాధనాలు.. వీటన్నింటికి మించి భర్త సాంగత్యం, సాన్నిహిత్యం కూడా కోరుకుంటుంది ఆ ఇల్లాలు. స్త్రీకి వివాహమయ్యాక భర్తతోడిదే లోకం. అతని తర్వాతే మిగతా భోగభాగ్యాలు. కాని ఎన్ని భాగ్యాలున్నా కూడా భర్త ఆదరణ లేకుంటే ఆ ఇల్లాలు పడే మనసిక వేదన, భర్తకోసం పడే తపన, అతని కోసం ఏమైనా చేయగలిగే ప్రేమ .. ఇవన్నీ కలగలిపి చోటీ బహూ. సాహిబ్ బివి ఔర్ గులాం చిత్రంలోని నాయిక మరియూ కథాంశం కూడా..

సహచర్యం, ఎడబాటు, ప్రేమ, విరహం, భావుకత గాంభీర్యం కలగలిసిన మనుషులూ, మానవ సంబంధాలూ ఇవన్నీ ఏరి కూర్చి గురుదత్ నిర్మించిన చిత్రం "సాహిబ్ బీవీ ఔర్ గులాం" 19వ శతాబ్దం నాటి ఓ జమిందారి కుటుంబంలో చోటీబహు అనుభవాల్ని, ఆమె ఎదురుతిరిగీ, తనని తాను ఆర్పించుకున్న సందర్భాన్ని ఇందులో అద్భుతంగా చిత్రించారు.. బెంగాల్లో 19వ శతాబ్దంలో చౌదరీలది గొప్ప పేరున్న కుటుంబం. ఇద్దరు సోదరులు మజ్లే బాబు, చోటేబాబుల ఆధిపత్యంలో సాగే ఆ కుటుంబం ఓ పెద్ద హవేలీలో నివాసముంటుంది. ఆ ఇద్దరు సోదరులూ తమకు వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిపాస్తుల్ని అనుభవిస్తూ మందులో తేలియాడుతూ క్రీడలు, వేశ్యాస్త్రీల సాంగత్యం తదితర అలవాట్లతొ కాలం గడిపేస్తూ ఉంటారు. ఇదంతా అలాంటి గృహాల్లో సర్వసాధారణం. ఎవ్వరూ ఆక్షేపించరు. వారి భార్యలు కూడా తమ భర్తల ఉదాసీనత , అలవాట్లకు ఎదురు మాట్లాడక సర్దుకుపోతుంటారు. కాని చిన్నవాడి భార్య చోటీ బహు మాత్రం భర్త నిర్లక్ష్యం సహించలేకపోతుంది. ఎన్ని విలాసాలు, ఆడంభరాలు ఉన్నాకూడా భర్త చెంతలేకపోవడంతో ఒంటరితనంతో విలవిలలాడిపోతుంది. ఆ సమయంలో ఆ హవేలీలో పనిచేసే తన బంధువు వద్ద ఉండడానికి వచ్చిన భూత్‌నాధ్ ఆమెకు పరిచయమవుతాడు. అతను ఒక సిందూర్ కంపెనీలో పని చెస్తుంటాడు. చోటీ బహూకు సిందూర్ తెచ్చి ఇస్తుంటాడు. ఆమె బాధను అర్ధం చేసుకుని ఒదారుస్తుంటాడు.

ఒకరోజు చోటీబహూ రోజులాగే వేశ్య దగ్గరకు వెళ్ళడానికి తయారవుతున్న భర్తను నిలదీస్తుంది. ఒక్కరోజైనా తనతో ఉండమంటుంది. భార్య కొంగు పట్టుకుని ఇంట్లో కూర్చునే దద్దమ్మనుకాదు. అందమైన భార్య ఉన్నా కూడా ఇలా విలాసవంతంగా ఉండడం, వేశ్యలతో తిరగడం మగవాడి హక్కు. ఎదురుచెప్పడం మీకు మంచిది కాదు. మీ జీవితం ఇంతే అని అంటాడు. ఐతే వేశ్య దగ్గర దొరికేది , ఆమె ఇచ్చేది ఇక్కడ కూడా దొరికిటే తనతో ఉంటారా అని అడుగుతుంది చోటీ బహూ,అతను తనతో ఉండేలా చేసుకోవాలనే ఆవేదనతో. ఐతే సరే నువ్వు నాకు ఇష్టమైన విధంగా ఉండగలవా? అందంగా తయారై నాకు మత్తెంకించేలా పాటలు పాడగలవా? ఆటలు ఆడగలవా? నాతో పాటు మధుపానం చేయగలవా? అని ప్రశ్నిస్తాడు భర్త. ముందు నిర్ఘాంతపోయినా భర్తను ఆకర్శించడానికి, బయటకు వెళ్లకుండా నిలువరించడానికి ఇవన్నీ చేయడానికి సిద్ధపడుతుంది. చేస్తుంది కూడా. అలా మొదలుపెట్టిన తాగుడు అలవాటుగా మారి చివరకు వ్యసనం అవుతుంది.

ఈ నేపధ్యంలో భూత్ నాధ్ పని చేసే చోట యజమాని కూతురు జాబాతొ పరిచయం కలిగి సాన్నిహిత్యం పెరుగుతుంది. భూత్ నాధ్ చోటీబహూ తాగుడు మాంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కాని, ఆమె ప్రతిరోజూ తాగకుండా ఉండలేకపోతుంది. ఒకరోజు హవేలీ వాతావరణంలో ఇమడలేక చోటీబహూ , భూత్ నాద్ తో కలిసి పారిపోవాలనుకుంటుంది. కాని ఆమె కుటుంబ సభ్యులు ఇది గమనించి కుటుంబ పరువు, ప్రతిష్ట అని ఆలోచించి ఆమెను తీసికెళ్లి చంపి, అదే హవేలీలో ఎవరికీ తెలీకుండా భూస్థాపితం చేస్తారు. అందరికీ ఆమ్ ఏమైందో తెలీదు. ఎక్కడికో వెళ్లిపోయింది అని చెప్తారు. కాని చాలా ఏళ్ల తర్వాత ఆ హవేలీ పునర్నిర్మాణ కార్యక్రమంలో పని చేస్తున్న భూత్ నాద్ ఆ తవ్వకాలలో బయటపడ్డ ఒక అస్థిపంజరాన్ని చూసి నిశ్చేష్టుడవుతాడు. అది ఎవరిదో అక్కడున్నవారెవ్వరికీ తెలీదు . కాని ఆ అస్థిపంజరం మీద ఉన్న నగలను గుర్తించిన భూత్ నాద్ అది చోటీ బహూ అని. ఆమెను చంపి అక్కడ భూస్థాపితం చేసారని అర్ధం చేసుకుంటాడు.

చిత్రం మొత్తం ఫ్లాష్ బ్యాక్ లో జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది చోటీబహూగా చేసిన మీనాకుమారి అద్భుతమైన నటన. భర్త కోసం తపన పడే సన్నివేశాలలో ఆమె అడిగే ఒక్కో ప్రశ్న అందరినీ కదిలించేస్తుంది. భర్త కోసం ఒక ఇల్లాలు మరీ ఇంతగా దిగజారిపోవాలా అని కూడా అనిపిస్తుంది ఆమె తన భర్తను ఇంట్లోనే ఉండేలా చేసుకోవడానికి తాగడం మొదలుపెట్టినప్పుడు. అలా మొదలై చివరకు ఆమెనే బానిసగా మార్చుకుంటుంది ఆ తాగుడు .. చివరకు అందరినీ ఎదిరించినా ప్రాణాలు కోల్పోక తప్పలేదు చోటీ బహూకు.

నటుడు, నిర్మాత, దర్శకుడిగా 21 ఏళ్లపాటు చిత్రసీమలో వెలుగొందిన గురుదత్ హృదయావిష్కరణ చేయడంలోనూ, తన ఆలోచనలనీ, అనుభూతులనీ దృశ్యమానం చేయడంలోనూ తనకు తానే సాటి. హిందీ చిత్రసీమ స్థాయిలో గమనిస్తే గురుదత్ ఎనలేని భావుకత కలిగిన అద్భుత చలన చిత్రకారుడు. ముఖ్యంగా ఆయన ప్యాసా, కాగజ్ కే ఫూల్, సాహిబ్ బీబీ ఔర్ గులాం తదితర చిత్రాలు భారతీయ చలన చిత్రసీమలో, ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాయి. గురుదత్ ఎన్నో ప్రేమాస్పదమైన చిత్రాలకి రూపకల్పన చేశారు. అలాంటి చిత్రాల్లో ఒకటి ' సాహిబ్ బీబీ ఔర్ గులామ్' 19వ శతాబ్దం నాటి ఓ జమిందారి కుటుంబంలో చోటీబహు అనుభవాల్ని, ఆమె ఎదురుతిరిగీ, తనని తాను ఆర్పించుకున్న సందర్భాన్ని ఇందులో అద్భుతంగా చిత్రించారు

మంచి కథ, నటన, అన్నింటికి మించి సంగీతం ఈ సినిమాను ఒక ఆణిముత్యంగా మలిచాయి అని చెప్పవచ్చు. పాటలన్నీ ప్రజాధరణ పొందినవే ఐనా "నా జావొ సయ్యా " అనే పాట మాత్రం అన్నింటికి మించి హైలైట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా నిర్మించి 48 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఆదరించతగ్గ, అభినందిచ్చదగ్గ అద్భుత చిత్రం ఈ సాహిబ్ బివి ఔర్ గులాం..

సాహెబ్ బీబీ ఔర్ గులాం (హిందీ)

కథ : బిమల్ మిత్ర

సంగీతం : హేమంత్ కుమార్

దర్శకత్వం : అబ్రార్ అల్వి

నటీనటులు : గురుదత్, మీనాకుమారి, రెహ్‌మాన్, నాజర్ హుస్సేన్ మొ...


మరి పాటలు విందామా....

Posted by జ్యోతి Mar 27, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!