కాసుల గలగలు అంటే ఎవరికీ ఇష్టముండదు . మానవుడు డబ్బులను సృష్టించాడు.కాని నేడు తన సృష్టికే తాను బానిసైపోతున్నాడు. అయినా డబ్బంటే ఎవరికీ చేదు చెప్పండి. డబ్బుకు లోకం దాసోహం అని పెద్దలు ఊరకే అన్నారా? కుటుంబంలో భర్త ఎంత సంపాదించినా ఆ డబ్బును సరియైన రీతిలో ఖర్చుపెట్టి, అందులోనే కొంత దాచిపెట్టేది వివేకవంతురాలైన ఇల్లాలు. అలా దాచిపెట్టిన సొమ్ము కష్టసమయంలో కుటుంబానికే ఉపయోగపడతాయి. సొమ్ములు ఉన్నప్పుడు కొద్దిగానైనా దాచుకుని లేనప్పుడు ఒకరిని చేయిచాచకుండా వాడుకోవచ్చు. ఈ ప్రాధమిక సూత్రం దాదాపు అందరూ మధ్యతరగతి గృహిణులు పాటిస్తుంటారు. (ఇందులో కొందరు స్పెషల్ మహిళలు ఉన్నారనుకోండి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ పెడుతుంటారు) . అలా తన జీవితంలో ఈ డబ్బుల అనుభవాలను మనతో పంచుకుంటున్నారు మాలగారు . గతంలో ఈ విషయమై ఆవిడ తన బ్లాగులో రాసిన పోస్టులన్నింటిని ఒక్కచోట చేర్చి అందిస్తున్నాం.. ఈ డబ్బులపై మీ ఎలుక ముక్కుతో నొక్కి ఆ విశేషాలు ఎంటో చూడండి.
లేదంటే ఇక్కడే చదువుకోండి.. అలాగే మాలగారు చెప్పిన చిట్కాలు గుర్తుపెట్టుకోండి మరి..
వీధి కుక్క
వీధిలోనే ఉంది
కానీ వీథికి కొంచెం వారగా...
ఇంటి వాకిలి గట్టు మీద;
దానికేం తెలుసు, వీథే అనుకొంది
***
సరిహద్దుల గురించి బాగా తెలిసిన
మనిషి గట్టు మీద అది ఉందని దానికి తెలీదు
వీథి కుక్క అది కూడా వీథే అనుకొంది
***
అంతే, గేటు తీసుకుని బయటికొచ్చిన
సైకిలు చక్రం దాని మీదకి కావాలని ఎగిరింది
బిత్తరపోయి నిలుచుంది, ఏమీ అర్ధం కాక;
ఈ సారి రాయి ఒకటి వీపుకు తగిలి చుర్రుమంది
***
కాస్త దూరం పరిగెత్తి అటువైపు చూసింది
ఈ హఠాత్ బలప్రయోగం ఏమిటా అని
కోపపు చూపులు ఇంకా బలంగా గుచ్చుకున్నాయి.
ఇంకాస్త దూరం పోయి మరో మారు అటువైపు చూసింది
చక్రాలు రెండూ అప్పటికే ఎక్కడికో వెళ్ళిపోయాయి
***
వీథి కుక్క
వీధిలోనే ఉన్న చోట నెమ్మదిగా చతికిలబడింది
మళ్ళీ ఎప్పుడు పరిగెత్తాలో అని బిత్తర చూపులు చూస్తూ!
***
మరి దానికి సరిహద్దుల గీతల
మనసు మనసుకీ మధ్య
అవిభేద్యమైన గోడల గురించి తెలియదుగా...
రచన - సౌమ్య మాకినీడు
అతివలకు, అందాలు , అలంకరణలకు అవినాభావ సంబంధముంది. ఇది అబద్దమని ఎవరూ అనలేరు కదా. నాటి రాతియుగం నుండి నేటి నాగరిక యుగంవరకు స్త్రీ వస్త్రధారణ గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే తన మాటలను అందమైన పద్యాలలో ఇమిడ్చి మనకందించారు పద్యమంజూష బ్లాగర్ శ్రీ టేకుమళ్ల వెంకటప్పయ్య గారు. ధన్యవాదాలు వెంకట్ గారు..
తే.గీ..ఆకులలములు దేహాన నావరించ
రాతి యుగమున జీవించు రమణులెల్ల
వాన ఎండల కాగిరి వారలెల్ల
వాడసాగిరి పత్రాలు వాటికొరకె.
తే.గీ..లోహయుగమునవారలే లోకమెరిగి
శీత వాతాతపంబులు రోత దోయ
మేని నిండుగ గప్పుట మేలు యనుచు
చుట్టె దామర యాకులు సుఖముదెలిసి.
తే.గీ...మధ్యయుగమున యువతులు మారె జాల
కుట్టు యంత్రాలు రాకనె పట్టుదలగ
మేను దాచుటె గాకుండా మేలురకము
వేల రకముల దుస్తులు వేసిరకట
తే.గీ...రాచనగరున యుండేటి రాణులంత
కోరి జనులను నియమించి కోర్కెదీర
కోటిరకముల దుస్తులు కుట్టెరనఘ
వారే దర్జీలు మనకాయె వరసులుగా.
ఆ.వె..ఘల్లు ఘల్లు మనగ గజ్జెల పాదాలు
పట్టుపావడె కనికట్టు జేయ
బుట్ట చేతుల రవిక పొంగెడి వయసున
కుర్రకారుకెటుల కునుకు వచ్చు?
తే.గీ..మెల్ల మెల్లని నడకలు మేని హొయలు
కాళ్ళ జీరాడు ఓణీలు కాకవయసు
కావ్య నాయిక రీతిగా నవ్యశోభ
పసిడి పాదాల గోరింట పండి మెరయ.
తే.గీ. శారి యనగానె అమ్మకు సారి జెప్పు,
చీరెలిచ్చును సాక్ష్యము సారె లందె,
డ్రస్సు సులభము ఇంతికి బస్సులందు.
ఉరుకు పరుగుల బతుకున ఉచితమౌర!
తే.గీ..కాల మహిమన దుస్తులు చాల మారె
వళ్ళు దాచుట మరచిరి వగలు నేర్చి
కురచ చేతుల రవికలు గుండెలదర
దేశ దేశాల పోకడ దేహమంత.
తే.గీ..హద్దులోపల యుండిన ముద్దు తల్లి
హద్దు మీరిన ఫ్యాషన్లు వద్దు చెల్లి
రెచ్చగొట్టెడి దుస్తులు మెచ్చగలమ
మానభంగాలు హత్యలు మారుమోగు.
తే.గీ..సకలలోకము మెచ్చేటి చక్కనయిన
దుస్తులొసగును మీకెల్ల మస్తు పేరు
శీలమన్నది ముఖ్యము చాల చాల
పుట్టినింటి పేరు నిలబెట్టి జూపు.
కొన్ని నెలల క్రింద గీతాచార్య ,ధనరాజ్ కలిసి బైక్ మీద అఖిల భారత యాత్ర చేసారు. ఉత్తరభారత యాత్రలో సందర్శించిన అక్షరధాం అందచందాలు ...
అక్షరధాం గుడి పరిసరాలలో ఉన్న క్రికెట్ గ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లలు ...
డిల్లీ నగరానికి గొడుగుగా ఉన్న సూరీడు..
గుడి లోపల వసారా...
గుడి లోపలి మంటపాలు...
ఆలయంలోని పాలరాతి శిల్పాలు..
అక్షరధాంలో అస్తమిస్తున్న సూరీడు..
మరో యాంగిల్ లో సూరిబాబు..
కామన్వెల్త్ క్రీడా గ్రామం..
ఉప శీర్షిక 'చింతనాత్మక సాహిత్యం' అన్నందుకు మిసిమి లోని ప్రతి వ్యాసమూ పాఠకుల్లో వివేచానత్మకమైన విమర్శనాత్మకమైన ఆలోచనను కలుగచేస్తుంది. పూజ్యులు ఆలపాటి రవీంద్రనాథ్ గారి సంపాదకత్వంలో వెలువడిన ప్రథమ సంచిక నుంచి, అన్నపరెడ్డివారి సంపాదకత్వం వరకు 'మిసిమి' మాస పత్రికకు ఇది వర్తించినా, విషయ విస్తృతి రీత్యా ప్రస్తుత జూన్, 2010 సంచిక నుంచి మిసిమి మరింత పసిమి ఛాయతో ప్రకాశిస్తోంది. వల్లభనేని అశ్వినీ కుమార్ గారి ఆవాస సంపాదకత్వంలో వెలువడిన ఈ సంచిక పరిమాణంలోనే కాక ప్రమాణాలలో సైతం ఉత్తమ అభిరుచులను పెంపొందించే విధంగా తీర్చి దిద్దబడింది.
చిత్ర కళకు ఎప్పుడూ ఉచిత స్థానం ఇస్తూ గొప్ప చిత్రకారుల మంచి చిత్రాలను అట్టలమీద ముద్రిస్తూ, ఆయా చిత్రకారుల పరిచయంతో ఒక వ్యాసం ఇవ్వడం పరిపాటిగా వస్తున్నదే. ఈ సారి ప్రముఖ జానపద చిత్రకారుడు,జూన్ తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖచే జీవితకాల ప్రతిభాసాఫల్య పురస్కారాన్ని అందుకోనున్న కాపు రాజయ్యగారి చిత్రాలు ముఖపత్రాన్ని( బతుకమ్మ పండుగ ), రెండు నాలుగు అట్టల్నీ (తాన తందానా, మాతృత్వం ) అలంకరించాయి. వీటితో పాటు, లోపలి పేజీలలో కూడా తెలుపు-నలుపు చిత్రాలను ముద్రించడం ఈ సంచిక నుంచి ఆరంభమైన మరో విషయం. చక్కని రేఖతో ఈ చిత్రాలను గీసిన చిత్రకారుడు ఎవరో, (పేరు ఎక్కడా లేదు ) అభినందనీయుడు. అలాగే మూడవ అట్టమీద డి. గోవిందరాజుల చిత్రం ' పల్లె పడుచు' అలరిస్తుంది. చిత్రకళావనిలో తిరుగురాయుడై ధారి ప్రక్కన దర్శనమిచ్చిన ఎనిమిది దశాబ్దాల చిత్రకళారత్నాన్నినిత్యమూ బ్రతుకు చీకటిలోమునకలై మసలే మనకు ఏరి చూపిన ఆశ్వినికుమార్ మిసిమి సంపాదకత్వాన్ని స్వీకరించడం ముదావహం.
కాపు రాజయ్యగారి పరిచయ వ్యాసాన్ని కాండ్రేగుల నాగేశ్వర రావు రాశారు. 'జనపదాల కాపు'గా ఆయనను చిత్రిస్తూ, " తెలంగాణా జీవన స్రవంతిని, శ్రామైక జీవన సౌందర్యాన్ని తన రేఖలతో, రంగులతో సజీవం చేసిన మెతుకు సీమ చిత్రకారుడు'' అనడం సముచితం. ' తెలుగు బొమ్మల బ్రహ్మ'గా ప్రముఖ కళావిమర్శకులు ఏ.ఎస్. రామన్ గారిచే కీర్తింపబడిన రాజయ్యగారి చిత్రాలకు నకాషీ చిత్రకారుల సాంప్రదాయిక శైలి అక్షరాభ్యాసం చేయించిందనీ, ఆయన చిత్రిత వస్తువులన్నీ గ్రామీణ జీవితంనుంచీ, పండగలూ,కర్మకాండలూ, గ్రామ దేవతలూ, వివిధ వృత్తుల, కులాల వారి నిత్య జీవితం మొదలైన అంశాలనుంచి స్వీకరింపబడినవంటారు.
కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీతల పరిచయ వ్యాసాలను ఎప్పటినుంచో ధారావాహికగా ఇస్తోంది, మిసిమి. ఈ నెల మనోజ్ దాస్ గారి పరిచయాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ సలహాదారులు డా.జె. లక్ష్మిరెడ్డి చేశారు. ఇదివరలో మానవీయ అంశాలకే అధిక ప్రాధాన్యముండే పత్రికలో వివిధ విభిన్న అంశాలతో కొత్త శీర్షికలను ప్రవేశ పెట్టిన అశ్విని కుమార్ గారిని అభినందించి తీరాలి. కళారంగం, పుస్తక పరిచయం ( ఊర్లు పేర్లు పేజీల విషయాలు చెప్పే కేవల సమీక్షలా కాదు), ఆత్మకథ, సంస్కృతి, కవి, గత కాలమ్, నాగరకత, కథాసాహిత్యం, మేధావులు అనేవి కొత్త శీర్షికలు.
'కళారంగం' లో అబ్బూరి గోపాల కృష్ణగారు 'తెలుగు నాటక రంగ చరిత్ర' వ్యాసంలో ' నాటక రచన, ప్రదర్శన లలో తెలుగు వారు సాధించినది బహుస్వల్పమని సోదాహరణంగా వివరిస్తూ, అభిరుచి రాహిత్యం తెలుగు నాటక ప్రగతికి పెద్ద ఆటంకంగా పరిణమించింది అంటారు. ధార్వాడ నాటకాల ప్రభావం వల్ల ' ఆధునిక తెలుగు నాటక రంగం' ఆవిర్భవించలేదంటూ, అంతకు ముందున్న యక్షగానం కొంతవరకు దోహద పడిందంటారు. అప్పట్లో కావ్య భాషలో సంభాషణలు పలకడంలో ఇబ్బందిని అధిగమించడానికి నాటి నటులు కృతక శైలిని అనుసరించారానీ అంటారు. ఇతర భాషాసంపర్కం కేవలం పై మెరుగుగానే తెలుగు భాష పొందగలిగిన కారణంగా ఆధునిక తెలుగు సారస్వతం ఎదగవలసిన స్థాయికి ఎదగలేదనడం మంచి పరిశీలనే అయినా పాక్షిక సత్యం. ఆధునిక తెలుగు నాటకం ఎదగకపోయినా, ఇతర ప్రక్రియలు తెలుగులో బాగానే ఎదిగాయి, నాటక రంగం విషయానికొస్తే, ప్రయోగాశీలకమైన అనవసర ఆర్భాటాలతో తెలుగు నాటకం కునారిల్లుతోందన్న విషయాన్ని విస్మరించారు.
నటరాజ రామకృష్ణ ' నా కళా జీవితం - నాగపూరు' అనే వ్యాసంలో, తన జీవితంలో ఒక శకలాన్ని అత్యంత ఆర్ద్రతతో చిత్రీకరించారు. అదే ఆయీ వృత్తాంతం. నిండు జీవితాన్ని నాట్య కళకే అంకితం చేసి అజ్ఞాతంగా పండుటాకులా రాలిపోయిన ఒక వృద్ధ కళాకారిణి వేదనాభరిత యదార్ధ జీవన గాథ తప్పకుండ చదవాల్సిన వ్యాసం. ఆ రోజుల్లో ప్రజా కళలకు, శాస్త్రీయ కళలకు ఉన్న తేడా గురించి పడిన ఆలోచనే తన భావి జీవితానికి, పరిశోధనకు ఉపకరించయంటారు, నండూరి. ' భారతీయ సంస్కృతి-సత్యాసత్యాలు' ఎరుక పరుస్తూ, బి.ఎస్.ఎల్. హనుమంతరావు, ప్రాక్పశ్చిమాది భేద రహితంగా మానవులందరూ ఒకటే కనుక, జాతి జాతికీ ప్రత్యేక సంస్కృతి ఉండనవసరం లేదంటారు - చాలా... ... పరిణామ క్రమాన్ని కోరుకునే అంశమిది. భౌతిక పరిసరాల సవాలుకు మానవ మేధాశక్తి సృజన సామర్ధ్యం చెప్పగల సమాధానాల ఫలితమే సంస్కృతి అంటూ, సంస్కృతికి మంచి నిర్వచనం ఇచ్చారు. ఆధ్యాత్మికత భారతీయ సంస్కృతికి పునాది అనీ, కేవలం ప్రాపంచికమైన పునాదులు గల పాశ్చాత్య నాగరకత కంటే భిన్నమైనదనీ ఆంగ్లేయులే సూత్రీకరించారంటూ, ఏమైనా భారతీయతలో నశించి పోతున్న ఆధ్యాత్మికతను పునరుద్ధరించి పాశ్చ్యాత్యులే మనలో జాతీయ భావాన్ని పురికొల్పారంటారు. ప్రాక్పశ్చిమ సంస్కృతీ భేదం మధ్య యుగాలలో లేనిదనీ, ఇటీవలనే పుట్టిన భావమనీ చెబుతూ, ప్రాక్పశ్చిమ సంస్కృతులే కాదు, క్రైస్తవ ముస్లిం సంస్కృతులు గాని, ఆంగ్లో అమెరికన్ సంస్కృతులు , ఆ మాటకొస్తే అన్ని సంస్కృతులు సాంకర్య జనితాలేనంటూ, ఏ సంస్కృతుల్లోనూ లేని సహనశీల శాంతి ప్రియత్వాలూ, సనాతన అప్రియత్వాల సమ్మేలనమే మానవ జాతి ఉమ్మడి సంస్కృతికి దోహదపడుతున్దంటారు. చాలా సునిశితమైన వివేచనా- ధారంగా ఈ వ్యాసం లోని విషయం రూపొందిన్దన్నది నిర్వివాదం. నేటికీ హిందువులు చెట్లను,పుట్లను, జంతువులను, వినాయకుని వంటినరమృగాలను పూజించడం అసమంజసమంటారు. అయితే, ఇలా అనుకోవడమే జీవజాలాల మనుగడకు అవరోధమై, పర్యావరణ సమ స్థితికి కారణ మవుతోందని గుర్తించాలి.
మరో గొప్ప కథావ్యాసం ' నాగరకత' శీర్షికన ఇచ్చిన ' మేల్కొలుపు'. చిత్రకారుడు కూడా కావడం వల్ల రచయిత వ్యాసాన్ని కవితాత్మకంగా మలచారు. మనిషి ప్రకృతికి అనుగుణంగా నడచుకోవడంలోని, మానవ సహజ లేకితనాలు, దంబాలకు దూరంగా ఉండడంలోని, కలల్లో విహరించే కుటిలత్వాల, అనవసర వాచాలత్వాలకు దూరంగా ఉండడంలోని, సర్వ సుఖాలను గుమ్మరించుకునే అధికారానికి దూరంగా ఉండడంలోని, ఒక్క మాటలో చెప్పాలంటే, నాగరకతకు దూరంగా ఉండడంలోని పరమార్ధాన్ని నొక్కి చెప్పిన సత్యం - మనిషి తనను తాను తెలుసుకుని మేల్కోవటం! నాగరీక వక్ర వేషాలూ,అవినీతి మయమైన జీవన విధానం వదలి ధర్మ మార్గంలో బ్రతుకుని పండించుకుంటూ మానసికానందాన్ని పొందగలగడం - ' ఆత్మ సాక్షాత్కారం'! కథన శైలిలో నడచిన ఆలోచానాత్మక విశ్లేషణను పటనయోగ్యంగా అందించిన రచయిత సంపాదకులు వల్లభనేని ఆశ్వినికుమార్ గారే!
' గత కాలమ్ ' శీర్షికలో 'సైగల్ గానం చరిత్రలో రికార్డైన అద్భుత అధ్యాయం'గా వ్యవస్థాపక సంపాదకులు ఆలపాటి రవీంద్రనాథ్ గారి పాత వ్యాసాన్ని ఇచ్చారు. ఈ వ్యాసం ఎప్పుడు, ఏ సందర్భంలో వచ్చిందో వివరమిస్తే బావుండేది. అటువంటి వివరమిచ్చిన 1-2-70న విశాఖలో శ్రీశ్రీకి జరిగిన సన్మానం సందర్భంగా ప్రచురించిన సావనీర్లోని రాచకొండ విశ్వనాథ శాస్త్రి వ్యాసం ' మహాకవి', శ్రీశ్రీ తన శక్తినంతా ధర్మపక్షం నెగ్గ డానికే మహాకవిగా, మహామనీషిగా వినియోగించారంటారు. 'మేధావులు' శీర్షికలో మానవెంద్రనాథ్ రాయ్ ఆలోచనలు నేటికీ అక్కరకు వస్తాయని సరిశెట్టి ఇన్నయ్య, కీ.శే. బూదరాజు రాధాకృష్ణ గార్ల వ్యాసం నిరూపించింది. ' పుస్తక సమీక్ష'లో డా.ద్వానా సంపాదకత్వంలో వెలువడిన అపూర్వ గ్రంథం ' మా నాన్న గారు'ను తల్లావజ్ఝాల పతంజలి శాస్త్రి సమీక్షించారు.
కొత్త వ్యాసాలతో అలరించే మిసిమి పాత కవితలను ఇవ్వడం బావుండలేదు. ఎమ్.వి.ఆర్. ఆంగ్ల కవితకు అనువాదాన్ని ఆరుద్ర స్వదస్తూరిలో చూడడం ఓ పులకరింత. 'శ్రీపాద పురస్కారం' అందుకున్న తనికెళ్ళ భరణి చదివి వినిపించిన శ్రీపాద వారి వీలునామా లాంటి ఉత్తరం హృదయాన్ని కదిలిస్తుంది.
సంపాదక హృదయాన్ని ఆవిష్కరిస్తూ, సంపాదకులు అంటారిలా - '' ఏ జాతికైనా సంస్కృతే ప్రాణ నాడి. ఆ నాడీ స్పందనే జన జీవితంలో జవసత్త్వాలను నింపుతుంది. ఆ సంస్కృతీ విశిష్టతే జాతికొక ఔన్నత్యాన్ని, ప్రత్యేక గుర్తింపును సమకూరుస్తుంది.'' ఈ లక్ష్యసిద్ధి కోసం బాధ్యతాయుతమైన ఒక పత్రిక ఎలా ఉండాలో అలా, చక్కని వ్యాసాలను, శీర్షికలను జాగ్రత్తగా ఎంపిక చేసి అందిస్తున్న సంపాదకులు అస్వినీకుమార్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఇంతలో మా ఇంటికి అమ్మ కోసం ఒకావిడొచ్చింది. ఆవిడ మాటల మధ్యలో వాళ్ళబ్బాయి గుంటూరులో ఇంజినీరింగ్ చదువుతున్నాడనీ, అక్కడ స్నేహాల పేరుతో నెలరోజుల నుంచీ ఇంటికి కూడా రావటంలేదనీ, ఏమి స్నేహాలో, ఏంపాడో నాగ సుందరమ్మా! అంటూ గోడు వెళ్ళబోసుకుంది. హ్మ్. స్నేహమంటే నాకైతే తెలియలేదు చాలా కాలం వరకు. కానీ ఎలా ఉండ కూడదో మటుకు ఒక్కసారి మా నాన్న గారు పోయినప్పుడు తెలిసొచ్చింది.
ఆశ్చర్యం... స్నేహమంటే నమ్మకం పోయి, బతకటమెందుకో తెలియని స్థితిలో, ఇంకో అరగంట ఆలశ్యమైతే నేనూ, అమ్మా ఆత్మహత్య చేసుకునే వాళ్ళం, ఏర్పాట్లు పూర్తి చూసుకున్నాం కూడా. ఏ స్నేహాలైతే మా నాన్నను మింగేశాయో అదే స్నేహం మళ్ళా మాకు కొత్త జీవితాన్ని, కాదు కాదు... అసలు జీవితమంటే తెలియజెప్పింది.
Conditional friendship, which leads to productivity and achievement, is million times better than unconditional and mindless friendship, which leads to nothing అంటూ brain shattering words తో మా జీవితాన్ని మార్చేసిన ఆ స్నేహానికి ఇవాళ Friendship day సందర్భంగా, మా స్నేహావిర్భావాన్ని మరొక్కసారి గుర్తుచేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
THIS IS MY SALUTE to my Master of Friendship...
*** *** ***
మా నాన్న గారు చనిపోయి పది రోజులు కావస్తోంది. అమ్మ ఇంకా ఆ షాక్ నుంఛి కోలుకోలేదు. వచ్చిన వాళ్ళు మమ్మల్ని తిట్టటమో, లేకపోతే విపరీతమైన సానుభూతిని చూపటమో. అంతే. మాకూ ఆత్మహత్య చేసుకుంటే సరిపోతుందని అనిపిస్తున్న సమయం. విపరీతమైన మానసిక వత్తిడిలో ఉన్నాను. ఇల్లు ఖాళీ చేసేసి ఉన్నవన్నీ అమ్ముకుని వెళ్ళాల్సిన పరిస్థితి. మా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఉన్నవాళ్ళంతా ముఖం చాటేశారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని సమయం.
నేనప్పుడు డిగ్రీ లో ఉన్నాను. అంత వరకూ అలా సరదాగా కాలేజ్ కి వెళ్ళిరావటం, ఫ్రెండ్స్ తో షికార్లు కొట్టి రావటం, అలా అలా రోజులు వెళ్ళబుచ్చుతూ, కలలు కంటూ మహదానందం అంటే ఏంటో ఒక ఉదాహరణలా ఉండేవాణ్ణి. మా జీవితంలో పెద్ద కుదుపు. నమ్మిన స్నేహితుల చేతిలో మొసపోవటం వల్ల మా నాన్న ఆత్మహత్య చేసుకోవటం, లేని అప్పులు నెత్తిన పడటం, బంధువులంతా ముఖం చాటేయటం... రక్తం మరిగేలా చేసే ఙ్ఞాపకం అది. ఎదుటివారిని ఏమీ చేయలేని నిస్సహాయత.
"కొన్ని కోరికలు తీరాలన్నప్పుడు తీరవు. తీరా అవి నెరవేర్చుకొన గలిగే సమయం వచ్చే సరికి మనకి వాటి మీద ఆసక్తి పోతుంది. ఇదే మానవ జీవితం."
చాలా తేలిగ్గా అందరూ చెప్పే మాటలు అవి.
*** *** ***
సాయంత్రం నేనూ అమ్మా కూచుని ఉన్నాం. అమ్మ కళ్ళలో నిర్వేదం. నాకు పిచ్చి ఎక్కేలా అనిపిస్తూంది. ఇంతలో గేటు చప్పుడైంది. ఆ మధ్యే పరిచయం ఐన మా సీనియర్ ఒకతను తలుపు దగ్గర ఆగాడు. రానా వద్దా అన్నట్టు కాదు. నేను వస్తున్నాను. అన్నట్టు. తప్పదన్నట్టు నేను లేచి వెళ్ళి లోపలకి రమ్మన్నాను. లోపలకి వచ్చాడు.
అమ్మ లోపలికి వెళ్ళింది. మంచి నీళ్ళు తేవటానికి. ఏంటన్నట్టు చూశాను. "పది రోజుల్నించీ చూస్తున్నాను. నువ్వు కాలేజికి రావటంలేదు. I miss your bike yaar..." నవ్వుతూ అన్నాడు.
నాకు చిర్రెత్తుకొచ్చింది. తమాయించుకున్నాను. ఈ కొన్నాళ్ళలో ఎన్ని సార్లో అలా అనిపించినా అలాగే తమాయించుకున్నాను. విషయం తెలియదేమో అని చెప్పబోయాను. "Hmm. I know it bro. You oughtta move on." నేనలాగే చూస్తున్నాను. అమ్మ వచ్చి మంచినీళ్ళు అందించింది. మంచినీళ్ళు తాగుతూ అన్నాడు, "What d'yoo wann fromme. I don' go wid those bloody pitiful words. ఎన్నైనా, ఎన్ని చెప్పినా మీ నాన్నగారు తిరిగి రారు. ఇలాగే ఎంతకాలం కూచుంటావ్? ఏదోకటి చెయ్యాలి కదా. నాతో రా." నేను కదలలేదు. అమ్మ ఆశ్చర్యంతో చూస్తూంది. నా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు మా పరిస్థితి చూసి ఒక్కళ్ళూ రాలేదు. ఇతనేమో ఈ మధ్యే పరిచయం అయ్యాడు. అమ్మకి ఎవరో కూడా తెలీదు.
"కాసేపు ధనా ని నాతో పంపండి." అమ్మ కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నాడు. అమ్మమాట్లాడలేదు. తనే నావైపు తిరిగి రమ్మన్నట్టు చేయిజాపాడు. నేను ఇక మాట్లాడకుండా కదిలాను.
*** *** ***
ఒక అరగంట తర్వాత నేను ఇంటికి వచ్చాను. కానీ ఇందాకనలా కాదు. చాలా రెజువెనేట్ అయ్యాను. సానుభూతి వల్ల ఏమీ రాదు. కానీ జనానికి అదే కావాలి. కష్టం ఎవరికైనా వస్తుంది. అది నాకే వచ్చింది. నాకన్నాఎదుటివాళ్ళ కష్టాలు చాలా చిన్నవి అనుకోటం ఫూలిష్‍నెస్. అసలు కష్టం గురించి ఆలోచించటమే మానేస్తే? అసలు కష్టాన్ని లెక్కచేయకపోతే? అసలేదైనా పట్టనట్టుండగలిగితే?
నాన్న చనిపోయారు. ఆస్తులు పోయాయి. అప్పుల్లో ఇరుక్కున్నాం. అంతే. ఇంతకన్నా ఏమైంది? That's a fact. I can't change it. కానీ ఒకటి మాత్రం నేను చేయగలను. ఇక ముందు జరిగేదంతా నా చేతుల్లోనే ఉంటుంది. దాన్ని నాకిష్టమొచ్చినట్టు మల్చుకోగలను. అమ్మా, నేనూ ఉన్నాం. ఇంతకు ముందులా ఉండలేకపోవచ్చు. కానీ వేరే రకంగానైనా ఉండగలం కదా.
*** *** ***
"If you say yes to anything, it will be yours."
The Fountainhead లోని హీరో dialogue.
మరి నేనూ అంతే . ఈ ప్రపంచానికీ, ఈ లోకానికీ, "Yesss!" అందుకే ఈ ప్రపంచం నాదే. దేనికైనా భయ పడుతూ కూచుంటే అది మనకి మరణం తో సమానం అని వివేకానంద చెప్పారు. సో, "నో టు ఫియర్. ఎస్ టు ది లైఫ్." అదే నేను ఆలోచించింది. ఏం జరుగుతుందో అని భయపడటం వల్లే, మాకు ఆ డిప్రెషన్. అదే ఏది జరిగినా నాకు తెలిసే జరుగుతుంది. I can decide, and implement the forth-coming events of my life. అనుకున్నాను. It's all in my hands.
*** *** ***
మర్నాడే గుంటూరుకి మారాం. ఆ ఫ్రెండ్ మాకు ఇల్లు మారటంలో సాయపడ్డాడు. ఇక వెళ్తాడనగా అమ్మ, "చాలా థాంక్స్ బాబూ!" అంది. "ధనాతో బైక్ మీద తిరగాలంటే తను తొందరగా కోలుకోవాలి. అందుకే వచ్చాను. It's just for my sake. Not to help you." పెద్దగా నవ్వాడు.
అతను వెళ్ళిపోయాక అమ్మ అంది. "ఈ కుర్రాడు చిత్రంగా ఉన్నాడు. దేనికైనా నవ్వుతున్నాడు. ఒకరకమైన హుషారుగా ఉంది అతను ఉంటే. నిజమే కదా. మనం అక్కడే అలాగేఉంటే మాత్రం జరిగినవన్నీ తీరిపోతాయా? ఒక్కపూటలో ఎంత మార్పు? నువ్వు నీ ఆలోచనలన్నీ చదువు మీదే పెట్టు. కావాల్సినవన్నీ నేనెలాగో చూస్తాను. ఇంతకుముందు లానే ఉందాం. ఏమీ జరగనట్టే."
ఆ తర్వాత ఆ ఫ్రెండ్ అంటే అమ్మకి ఇష్టం పెరిగిపోయింది. చాలా అభిమానంగా చూస్తుందిప్పటికీ. అనుకున్నది అనుకున్నట్టు చెయ్యటం తప్ప, అనవసరపు ఆలోచనలు చేయటం వృధా అన్న తన మాటలు నాకిప్పటికీ వేదవాక్కే. అందుకే తనని నేను మాస్టర్జీ అంటాను. మా ఇద్దరి పుట్టినరోజే కాదు ఆలోచనా విధానం కూడా ఒకటే. అలా మొదలైన మా స్నేహం చాలా చిత్రంగా ఉంటుంది. రకరకాలైన ఎడ్వెంచర్స్ చేశాం. తనకి బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం. అలా మేము ఎన్నోసార్లు బైక్ మీద తిరిగాం. ఒక్కోటీ ఒక్కో కథ. ఎన్నెన్నో అనుభవాలు.
*** *** ***
ఆల్రెడీ చదివేశాము కదా అని కొంత మంది అనుకోవచ్చు.
ఇంతకీ నేను చెప్పొచేదేంటంటే అద్దెచ్చా...
ఫోనులో వచ్చే మెసేజులో, కొటేషన్లు చెప్పుకునేదో స్నేహం కాదు. అలాగే స్నేహాలన్నీ మంచివని కాదు.
Friendship is ruthlessly innocent and pure, and it is also without any guilt. కానీ, ఈ ఇష్యాలన్నీ మనుషుల్లోనే ఉన్నాయి. ఏది తీసుకోవాలో మన చేతుల్లోనే ఉంది. కొంత మందిని చూసి స్నేహాన్ని అవమానించ కండి.
వెయ్యి మంది తెప్పు చేసినా వెయ్యినొక్క వ్యక్తైనా ఒప్పు చేసే probability ఎప్పుడూ ఉంటుంది, so don't lose hope mate. That's the essential thing అంటూ చెప్పే నా నేస్తుడు గీతాచార్య కి... I have no more words to say.
Also, I request you all to wish... You know... :-)
a
VERY HAPPY FRIENDSHIP DAY TO YOU ALL
B & G మొదటి అతిథి రచయిత్రి శ్రీమతి మాల గారికి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన కానుక ఈ విరుల స్వరమాలిక. ఈ పాటకు సంగీతాన్నిచ్సింది మలక్పేట్ రౌడీ ఉరఫ్ భరద్వాజ.. రచన శ్రీమతి సీతాలక్ష్మి (భరద్వాజ్ తల్లిగారు) ఇక ముద్దు ముద్దుగా పాడింది అనఘ (భరద్వాజ కూతురు ) .. ఇంతమంచి బహుమతి ఇవ్వడానికి కృషి చేసిన వీరు ముగ్గురికి ధన్యవాదాలు.
మల్లెమాల గంధమా వెన్నెలమ్మ నేస్తమా
రెల్లుపూల జల్లే కానుకమ్మ ఈ రోజు
మల్లెమాల గంధమా వెన్నెలమ్మ నేస్తమా
అందుకో అందుకో శుభాకాంక్షలు
ప్రేమమూర్తివైన పారిజాత పుష్పమా
స్నేహశీలీవైన సన్నజాజి చెలువమా
ప్రేమమూర్తివైన పారిజాత పుష్పమా
అందుకో అందుకో శుభాకాంక్షలు
రెల్లుపూల జల్లే కానుకమ్మ ఈ రోజు
మల్లెమాల గంధమా వెన్నెలమ్మ నేస్తమా
అందుకో అందుకో శుభాకాంక్షలు
మంచితనమే రూపమైన మందారమా
అక్షరాల రూపమైన విరులదామమా
మంచితనమే రూపమైన మందారమా
అక్షరాల రూపమైన విరులదామమా
అందుకో అందుకో శుభాకాంక్షలు
మల్లెమాల గంధమా వెన్నెలమ్మ నేస్తమా
రెల్లుపూల జల్లే కానుకమ్మ ఈ రోజు
మల్లెమాల గంధమా వెన్నెలమ్మ నేస్తమా
అందుకో అందుకో శుబాకాంక్షలు.
రచన : డా. సీతాలక్ష్మి
గానం : అనఘ
సంగీతం : భరద్వాజ
I gave him the 15 choice of mine. Letz see some more time for their list, and how comparable mine will be...
1. Sunil Gavaskar
Greatest Opener. Only Indian player that can be a sure shot for the All time world XI. Can anybody bat against jockers like Brett Lee, let alone those pace quartet without a helmet?
2. Virender Sehwag
Game changer, best in the world now
3. Rahul Dravid
Who else at no. 3?
4. Sachin Tendulkar
Irreplaceable. Must be the no. 4 not only in any all time XI, but also the all time world XI
5. Gundappa Vishwanath (VVS Laxman)
I prefer Vishy for his sexy Square cut, but can not omit VVS
6. Vinoo Mankad
Traditionally India is fed with atleast 2 spinners, also, we need 3 quickies when playing abroad. So, if the spinner can bat a bit? Thatz right, hez more than just a spinner apart from stunningly defencive and also scoring opener too). I could have placed Sourav Ganguly, had it not for this logic. What a pity that India's all time great captain can not command a place in the all time XI!
7. Mahendra Dhoni (Farukh Engineer) (Probably VC) (WK)
I like Farookh Engineer, but Mahi could be a deputy for Kapil do dil do
8. Kapil Dev (C)
Can any one bring better?
9. Anil Kumble (VC)
Hahaha. He too is a captaincy material, greatest spinner, and match winner country produced, and could bat a bit. Most of the Indian teams did not bat deep, but this one with Srinath too, can be worth watching
10. Javegal Srinath
Kapil might have been feel blesed if he be there a decade ago and
11. Mohammed Nissar [Irresistible choice] (Some one world class, but I can not find anybody worth a place in an All time XI. May be Zaheer Khan)
I'l try for the All time world XI later...