ఓ ఫైన్ సాయంత్రం (ఎంతేశారంటే నేను సమాధానం చెప్పను) సుజాత గారి అవుడియాను బట్టీ మొదలైన మా పేట్రియాటిక్ బ్లాగు ఇవాళ్టితో అనగా కోటప్పకొండ కథతో నాలుగు వేల కొట్టుడు కొట్టింది. అసలు ఈ ఐడియా సుజాతగారిదండీ. టైటిలు కూడా సుజాత గారే పెట్టారండీ. :-D
మా ఊరి గురించి మొదలెట్టుకున్న మా చిన్న బ్లాగు సక్సెస్ గురించి నాకైతే ఎప్పుడూ అనుమానం లేదు. మొదటి కారణం... దీన్లో సుజాత గారి హస్తముండటం. రెండో కారణం... మా ఊరి గొప్పతనం. మేమెక్కడా మిగిలిన కైఫియ్యత్తులలా కాకుండా మావైన కాంట్రాస్టింగ్ స్టైల్స్ ని ఫాలో అవుతూ వ్రాయటం. సరే మా డప్పా ఎందుకులే కానీ ఇప్పుడు, నాలుగు వేల హిట్స్ అన్నది ఇప్పటి బ్లాగ్ standards లో పెద్ద లెక్కలోకి రావు కానీ, ఇలాంటి బ్లాగులు మాత్రం ఇలా ఇన్ని హిట్స్ సాధించాయంటే అది గొప్ప విషయమే. దాదాపూ ప్రతీ టపా కూడా ఇరవై పైన వ్యాఖ్యలే కాకుండా, ఐదొందలదాకా హిట్స్ ని కూడా సాధించింది.
ఈ మధ్య దురదృష్టం కొద్దీ నేను వ్రాసిన టపాలు డిలీట్ అయినా, వేణూ శ్రీకాంత్ గారి పేట్రియాటిజం వల్ల ఒకటీ, ప్రియ ఇంటెరెస్ట్ వల్ల మరొకటీ, దొరికాయి. అసలు వ్యాఖ్యలయితే పూర్తిగా పోయాయనే అనుకున్నా గానీ, ధన మొత్తానికీ అన్నిటినీ సాధించాడు. టైమ్ చూసుకుని అన్నిటినీ రీపోస్ట్ చేసుకోవాలి ఓల్డ్ డేట్లతో.
ఈ సందర్భంగా మా బ్లాగునాదరించిన అందరికీ (జనానికి నచ్చందే ఇన్నాళ్ళు నిలువదు కదా. అప్పుడే ఎనిమిది నెలలు గడిచాయి. ఒక వైజాగు బ్లాగరు కూడా మా బ్లాగుకి టపా పంపగా... ఆరుగురు నేస్తాలు ఫాలో అవుతున్నారు. ఈ సందర్భంగా మా (మన) పేట్రియాట్లందరికీ శుభాకాంక్షలు. అలుపెరుంగక... అన్న రీతిలో మేమింకా ముందుకు పోతా ఉండాలని మాకు విషెస్ చెప్పమని కోరుకుంటూ..., ముందు మరిన్ని మంచి కబుర్లు చెపుతామని హామీ ఇస్తూ, మాకెవరైనా పెద్దలను దిష్టి తీయమని కూడా అడుగుతున్నాం ;-)
సెలవ్,
గీతాచార్య
P. S. : We are here with no history. But We are here to create history. అదీ నేను మొదలు పెట్టిన కొత్తల్లో వ్రాసుకున్న ఎందుకింత పేట్రియాటిజమనే టపాలోని వాక్యం. (కాపీ రైట్ నాదే). అదేదో నిజమైనట్లుంది...? :-)
ThankQ one and all.