ఐడియా ఏమిటంటే బ్లాగుల్లో వచ్చిన కొన్ని కొన్ని మంచి టపాల్ని, కవితల్నీ ఎంపిక చేసి, వాటిన VSAX పద్ధతి ద్వారా eBook గా మార్చిపరిచయం, సమీక్ష, విశ్లేషణ చేస్తూ, డౌన్లోడ్ కోసం పెట్టాలనేది.
కొన్ని, మంచి అన్న మాటలున్నాయే... అబ్బ! చాలా చెడ్డవి. వాటిని ఏ శ్టాండర్డ్స్ ప్రకారం ఎన్నుకోవాలి? ;-)
ఒక్క విషయం చెప్పి, నా సమీక్ష మొదలెడతాను. సుజ్జి గారి కవితలనున్నింటిని ఎంపిక చేసి, eBook గా మార్చి, B&G ద్వారా మరోసారి గుర్తుచేద్దామని గీతాచార్య పర్మిషన్ సంపాదించాక నాకు చేసిన మెయిల్ లో ఇద్దరం ఎవరికి వాళ్ళంగా పిక్ చేద్దాము. వాటిని ఇద్దరమూ, ఎవరికి వాళ్ళంగా రాసి కలిపి అందిద్దాము అని.
ఆశ్చర్యమేమిటంటే, ఎంపిక చేసుకున్న పదకొండూ, ఇద్దరమూ, ఒకరికి తెలియకుండా ఒకరం ఎంపిక చేసినవే. :-) ఒక్కటి కూడా మార్పు లేదు. ఆ వదిలేయబడ్డ ఒక్కటీ సమానమే. కారణాలూ దాదాపూ ఒకటే. ఆ కవిత కి వ్యాఖ్యగా గీతాచార్య రాసిన మాటలే దానికి కారణం.
ఇక సమీక్ష...
I CAN ONLY SAY THAT I FEEL EXTREMELY PROUD TO BE SELECTED TO WRITE A FEW WORDS ABOUT THIS ONE.
ఇంతకన్నా ఒక్క మాట ఎక్కువ చెప్పినా, that would be a great offence to the poetess. Its an insult for her.
A review is a sort of defense as to why read a book. This work needs no defense. Simply,
THE DEFENSE RESTS NOW.
మీకుగా మీరే మరోసారి (ఎందుకంటే కొంతమందైనా చదివే ఉంటారు. కాకపోతే ఒక్కఛోటే అన్నీ ఉంటాయనేది ఇక్కడ ఇలా అందించటానికి కారణం) చదివి, కాదు కాదు, అనుభవించి చూడండి. అలా అని రివ్యూలు అవసరంలేదా అంటారా..., కొన్ని కొన్ని సార్లు కేవలం మనకోసం రాసుకునేందుకు, మరోసారి ఆ ప్రపంచంలో విహరించటానికి అవసరం. But Sujji's books needs no such thing. సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోండి. చదివేసెయ్యండి.
కొసమెరుపు:
B&G లోగోని మరీ అలా పెట్టినందుకు గీతాచార్య అబ్జెక్ట్ చేశారు. దానికి నా సమాధానం... That you picked her work to present, and that too as first in the series. అదే మీకా అర్హతనందించింది.
నా మాటలు నిజమో కాదో మీరే నిర్ణయిస్తారు చదివాక.
ప్రియ అయ్యంగార్
P. S. ఈ కవితలకి సమాధానం/ఎల్స్టెన్షన్/ వ్యతిరేకంగా మరో రెండు మూడు చిన్న కవితలున్నాయి. వాటిని నా బ్లాగులో అందించేందుకు అనుమతి లభించింది. Wait and see...
ఇక్కడ నుంచీ డౌన్లోడ్ చేసుకోండి
మౌనం - Straight from the Heart