BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

నాకు బాగా ఇష్టమైన శాస్త్రవేత్త... మేడం క్యూరీ ఇలా ఉంటారన్నమాట.

కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి పొందినప్పటి ఫొటో ఇది. తొలిసారిగా రెండు నోబెళ్ళు పొందిన వ్యక్తి. లేడీస్ ఫస్ట్ అన్నట్లు ఆవిడే సాధించి చూపారు. అటు కెమిస్ట్రీలో, ఇటు ఫిజిక్స్ లో.

ఆవిడ గురించి చిన్నప్పుడు తెలుగు పాఠాల్లో బాగానే చదువుకుని ఉంటాము. గొప్ప శాస్త్రఙ్ఞురాలు. సైన్సుకే తన జీవితాన్ని అంకితం చేసి, పరిశోధనాలయంలోనే తన జీవితాన్ని ముగించిన శాస్త్ర ప్రేమికురాలు.


పియెరీ క్యూరీ. ఆమేతో కలసి పని చేసి, నోబెల్ పొందిన ఆమె జీవిత భాగస్వామి.
రేడియం, ఇంకా రేడియో యాక్టివ్ మూలకాల గురించిన పరిశోధనలకు గానూ ఇద్దరూ, హెన్రి బెకెరెల్ తో కలసి నోబెల్ అందుకున్నారు.

వీరి పిల్లలూ నో బెల్ కొట్టినవారే. కూతురూ, అల్లుడూనూ.

వారి ఫొటోలివిగో...






జోలియెట్                                                      ఫ్రెడెరిక్--->







ఇదీ నోబెల్ ఫ్యామిలీ. The greatest physicist family. ఈ జంట కూతురు కూడా పేరున్న భౌతిక శాస్త్రవేత్త. న్యూక్లియర్ ఫిజిక్స్ లో ప్రొఫెసర్.
***   ***   ***

ఎలెక్ట్రాన్ను కనుగొన్న జే జే థాంసన్ సంతకం చూస్తారా? వీరి సుపుత్రులు కూడా నోబెల్ అందుకున్న ఘనులే. పైగా అటు గణిత, ఇటు భౌతిక శాస్త్రంలో ఇద్దరూ కేంబ్రిజ్ లో గోల్డెన్ డబుల్ సాధించారు కూడా. అంటే కేంబ్రిజ్ ని ఇద్దరూ కనీసం అర్ధ శతాబ్దం ఏలేశారన్నమాట. తర్టీ ఇయర్స్ ఇన్ రీసెర్చ్ . :D




థాంసను వారి చేవ్రాలు.








థాంసను వారి పండిత పుత్రులు. తండ్రీ, కొడుకూ ఇద్దరూ పండితులే మరి.

జీపీ థాంసను ఎలెక్ట్రాన్ డైఫ్రాక్షన్ మీద పనిజేశారు. వేరొకరితో కలసి నోబెల్ పొందారు.






 ఆయన క్లింటన్ డేవిసన్. వారినీ ఓసారి దర్శిద్దాం.











***   ***   ***
 
The Romantic physicist, and the greatest advocate of physics, and also the greatest teacher of physics... (The most standard graduate level text book on physics was written by him... namely The Feynmann Lectures on Physics)

ఫేన్మను వారి సంతకంతో సహా...







He wrote so many popular level, as well as standard books, and his semi autobiography books like Surely you are joking Mr. Feynmann are still International level best sellers.



***   ***   ***


ఇవండీ ఇప్పటికి. మరోసారి మరి కొందరు ప్రముఖుల గురించి చూద్దాము. అంత వరకూ సెలవ్

గీతాచార్య

Posted by గీతాచార్య Mar 17, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!