చాలా కాలం క్రితం, అంటే నేను బ్లాగుల్లోకి వచ్చిన కొత్తల్లో రాసినదిది. ఇందాకన ఏదో వెతుకుతుంటే ఇది కనబడ్డది. కాస్త విషయం ఉన్నదే కదా... నవ్వుకుంటారు అని ఇక్కడ పెట్టేస్తున్నా. నిన్నేదో ఎదిపించానని కంప్లైంట్ వచ్చింది. :D
మరీ అంత ఆదరగోట్టేది కాదు కానీ, సరదా ఐన విషయమే. ఒక లైటర్ సటైర్.
తమ్ముడు: అన్నయ్యా ఎంగేజ్మెంట్ అంటే ఏమిటి?
అన్న: అంటే పెళ్ళికి నిశ్చితార్ధం.
తమ్ముడు: మరి ఈ మధ్య పెళ్ళిళ్ళ కన్నా ఎంగేజ్మెంట్ లని ఎందుకు వైభోగంగా చేస్తున్నారు?
అన్న: డబ్బున్నవాళ్ళు అలా చేసుకుంటారు.
తమ్ముడు: కాదన్నయ్యా! ఈ మధ్య అందరూ ఎంగేజ్మెంట్ ఘనం గా చేసుకుంటున్నారు. international celebrities కూడా పెళ్లి కన్నా ఎంగేజ్మెంట్ కే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు.
అన్న: అయితే ఇప్పుడు ఏమి చేద్దాం?
తమ్ముడు: ఏమి చేస్తాం? అయినా ఏదో కారణం లేకుండా అలా చేయరు.
పది రోజుల తర్వాత...
తమ్ముడు: అన్నా కనుక్కున్నావా?
అన్న: ఏం కనుక్కోవాలి?
తమ్ముడు: అదే ఎంగేజ్మెంట్ ల గురించి.
అన్న: సరే పరిశోధన చేసి చెబుతా.
తమ్ముడు: తమ చిత్తం. సెలవు ఇప్పించండి.
అన్న: సెలవెందుకు?
తమ్ముడు: అదే నేను వెళ్తాను.
అన్న: సరే పో!
ఆరు రోజుల తర్వాత...
అన్న: వెంకటేశు ఈ మధ్య ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిలనే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడుట. అందుకే ఎటూ పెళ్లి గ్రాండ్ గా చేయలేము కదా! ఎంగేజ్మెంట్ అయినా గ్రాండ్ గా చేసి ఈ ముచ్చటైన తీర్చుకుందామని.
తమ్ముడు: అన్నగారి బుద్ధి కుశలతకి జోహార్లు.
అన్న: డమ్మీ - హార్డువేర్ ఇంజినీయర్ కి ఆశీస్సులు. ఇంక గవించేయ్.
వెంకటేశు అనగా సినేమాల్లో వెంకటేశు.