వినగానే శ్రీవైష్ణవుల గుండెలుప్పొంగుతాయి.
భగవద్రామానుజుల వారి తిరు నక్షత్రమిది.
అసలు రామానుజ దాసన్ ఏమిటి? మనమేమన్నా ఆయనకు దాసులమా? అని చిన్నప్పుడనుకునే వాడిని. మరీ ట్రెడిషనల్ వ్యవహారం మన వాళ్ళదంతా... ఈ బొట్లూ, శిఖలూ, ఏంటీ గోల అనుకున్నా కూడా. సరే ఇవన్నీ వదిలేద్దాం. ఏదైనా విషయం నాకు సమ్పూర్ణంగా అవగతమైతే తప్ప నేనా విషయాన్ని ఎక్కువ పట్టించుకోను. అసలు పాటించను.
రామానుజుల వారి గురించి నాకు సంపూర్తిగా అవగతమయ్యేదాకా, వారిని గురించి ఒక గొప్ప వ్యక్తి ద్వారా తెలుసుకునే దాకా నాకా ఆలోచన కలుగ లేదు. ఎందుకాయనను నేను తెలుసుకోలేక పోయానా అని. ఆయనలోని అసలు గొప్పతనం గురించి.
ఇంతకీ నాకు అర్థమయ్యింది ఏమిటి? ఆయన నుంచీ నేను నేర్చుకున్నది ఏమిటి?
ఇంతకీ నాకు అర్థమయ్యింది ఏమిటి? ఆయన నుంచీ నేను నేర్చుకున్నది ఏమిటి?
1. తప్పు చేస్తే, చెప్పితే, వారు ఎంత పెద్దలైనా ఎదిరించి అయినా సరే సత్యాన్ని నిర్ధారితం చెయ్యాలి.
2. నిరంతర సత్యాన్వేషణలో మునిగి ఉండాలి. ఏ విషయమైనా సమ్పూర్తిగా అవగతం చేసుకోవలసినది మనమే. మనని వేరొకరు ఉద్ధరించరు. మనలను ఉద్ధరించుకోవలసినది మనమే.
3. అంతిమ సత్యం కొరకు ఎంతటి త్యాగమైనా చేయాలి. మనకు తెలిసిన ఉపయుక్తమైన సత్యాన్ని (సత్యమే ఉపయుక్తమైనది :-)) నలుగురికీ పంచాలి. తిరు మంత్రార్థాన్ని నలుగురికీ పంచిన ఉదాహరణ.
4. అడియేన్ రామానుజ దాసన్ = అన్వేషించు, సాధించు, ఆచరించు. (నిరంతరం సత్యాన్వేషణలో నిమగ్నమయి, సత్యాన్ని సాధించి ఆచరణలో పెట్టటం). వీటి గురించి మరింత వివరంగా ఎప్పుడైనా ఏక్ నిరంజన్! బ్లాగులో చూద్దాము.
As far as I know, He is the greatest Rationalist.
కేవలం ఒక మతాచార్యుడే కాదాయన. సంఘ సమ్స్కర్త. అన్యులని ఇతరులు దూరం పెట్టిన వారికి ఆలయ ప్రవేశార్హత కల్పించిన ఘనత ఆయనది. సమ్ప్రదాయాలను పాటిస్తూనే ఆధునికతను అందిపుచ్చుకోవాలని తెలియజెప్పిన మహోన్నతుడాయన. సామర్థ్యముంటే, పాండిత్యముంటే, ప్రతిభ ఉంటే, వారు ఎవరైనా, ఎంత చిన్న వారైనా గౌరవార్హులే అని తన జీవితంలో ఎన్నో మార్లు తెలియజెప్పిన భగవద్రామానుజుల వారికి వన్దనాలతో...
అడియేన్ రామానుజ దాసన్!
అన్వేషిస్తాను, సాధిస్తాను, ఆచరిస్తాను.